Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (మొదటి భాగం)

Amerigo Bonasera న్యూయార్క్ లో క్రిమినల్ కేసుల్ని విచారించే కోర్ట్ రూం లో కూర్చొని ఉన్నాడు.అతను వేచి చూసిన సమయం వచ్చింది.అవును ఇప్పుడు దుర్మార్గులైన ఆ యువకులకు...తన కుమార్తె ను ఘోరంగా హింసించి ఆమెని ఆసుపత్రి మంచం ఎక్కేలా చేసిన వారిద్దరికి శిక్ష పడబోతున్నది.అలా అనుకొంటూ ఉండగానే...జడ్జి లోపలికి వచ్చాడు.చాలా నెమ్మదిగా ..ఒక గంభీరతని కలిగి ఉన్నప్పటికి అతని ముఖం లో ఏదో ఓ false sense గోచరించింది Bonasera కి...!

" చాలా అమానవీయంగా ప్రవర్తించారు...మీ చేష్టల పట్ల సిగ్గు గా లేదూ..." జడ్జి ఆ ఇద్దరు యువకుల వైపు కోపంగా చూస్తూ అన్నాడు.ఆ ఇద్దరూ భయ భక్తులు గల వారిలా వారి తలలు వేలాడేసుకుని కిందకి చూస్తూ మాటలు రానివారిలా నటిస్తున్నారు.

" సరే...కొంత నయం...ఆ అమ్మాయిని sexual  గా molest చేయలేదు.కొట్టి గాయపరిచారు.లేకపోతే 20 ఏళ్ళ పాటు జైలు కి పంపేవాడిని మీ ఇద్దరిని.మీ మీద ఇంతవరకు ఏ కేసులు లేవు.క్లీన్ రికార్డ్ ఉంది.కనక ఈ సారికి క్షమించి ఏమీ శిక్ష ని వెయ్యడం లేదు.వెళ్ళండి"

జడ్జి మాటలు విన్న  ఆ యువకుల తల్లిదండ్రుల ముఖాల్లో ఒక్క సారిగా సంతోషం వెల్లివిరిసింది. సరే...ఆ ఇద్దరూ ఇక చెప్పనవసరం లేదు.విజయ గర్వం తో Bonasera వేపు చూసి ఓ నవ్వు నవ్వారు.Bonasera కి ఆవేశం..ఉక్రోషం పెల్లుబికింది.ఇన్నాళ్ళపాటు అమెరికా యొక్క Law and Order  ని తను ఎంతో నమ్మాడు.ఎన్నో ఆశల్తో ఎక్కడో ఇటలీ నుంచి ఇక్కడికి వచ్చి ఎంతో సంపాదించాడు కూడా..! చివరికి...ఏమిటి...తన కూతురిని బొక్కలిరిగేలా కొట్టిన ఆ ఇద్దరు వెధవలు ..న్యాయస్థానం లో కూడా గెలుస్తారా...వెంటనే ఒక గన్ కొనుగోలు చేసి ఈ త్రాష్టుల్ని కాల్చిపారెయ్యాలి అనుకున్నాడు.

" ఒరేయ్ ..నాలాగా మీరు ఏడిచే రోజు వస్తుందిరా.." అని కోర్ట్ గది బయట వాళ్ళమీదకురి కాడు.అంతలోనే అక్కడున్నవాళ్ళు ఎటువాళ్ళని అటు తోసివేశారు.

చివరికి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు Bonasera ..! "ఏది ఏమైనా కాని నాకు న్యాయం జరగాలంటే నేను ఒకరి దగ్గరికి వెళ్ళవలసిందే.దాని మూల్యం ఏమైనా కానీ..ఆ వ్యక్తిని నేను కలవవలసిందే..అతను ఎవరో కాదు..God Father  గా పిలువబడే Don Vito Corleone..!!!

******************

లాస్ ఏంజల్స్ లోని ఒక ఖరీదైన హోటల్ అది.దాని లో మధుర గాయకునిగా హాలీవుడ్ లో పేరు పొందిన Johnny Fontanne  ...ఏవొ ఊహించుకుంటూ ...తన రెండవ భార్య  Margot Ashton ఇక్కడికి రాగానే ..దాని తాట తీయాలి ...అనుకుంటూ సాధారణ వ్యక్తి లానే ఫుల్లుగా తాగుతున్నాడు.Margot పేరు పొందిన నటి.అందగత్తె.మిలియన్ ల మంది ఆమె కోసం సినిమా హాళ్ళకి వస్తుంటారు.తాను మంచి గాయకుని గా ఉచ్చ దశలో ఉన్నప్పుడు మొదటి భార్యని..పిల్లల్ని వదిలి ఈమె ని చేసుకున్నాడు.ఇప్పుడు అవకాశాలపరంగా తాను వెనుకబడ్డాడు.కనీసం ఇప్పుడు తనని మనిషిలా కూడా చూడ్డం లేదు ఈ టక్కరిది..! దీన్ని ఈ రోజు విరగదీయాలి అనుకుంటూ మందు కొడుతున్నాడు.

అంతలోనే రానే వచ్చింది.

" Where the hell were you ..?"  అడిగాడు Johnny.

"Out Fucking..!"   తాగి ఉన్నాడుగదాని ఎకసెక్కెంగా అన్నది ఆమె.

Johnny కి కాలి పోయింది.ఒక్క సారిగా ఆమె ని తోసేసి కడుపు మీద..చెంపల మీద ..ఎక్కడ అందితే అక్కడ పిల్లవాడిలా కొట్టసాగాడు. మరీ గట్టిగా కాకుండా..!

పైకి లేచాడు.Margot మాత్రం అలాగే ఫ్లోర్ మీద వెల్లకిలా పడుకొని తొడల వరకు వచ్చిన గౌను ని ఇంకా కొంచెం పైకి లాగి ..." నీకు కావలసింది ఇదేనా ..." అంటూ  రెండు కాళ్ళని ఎడం చేస్తూ  రెచ్చగొట్టింది.

మరింత ఎకసెక్కం చేస్తూ అన్నది."ఏయ్ జానీ....నీకు ఏదీ చేతగాదు.నన్ను బయట కొట్టడం చేత కాదు.అక్కడ మంచం మీదా చేతకాదు.అంతా పిల్లగాని యవ్వారమే"

జానీ కి ఇంకా కడుపు రగిలింది.ఇంతలోనే ఆమె లేచి బెడ్ రూం వెళ్ళి తలుపు వేసుకున్నది.

ఈ హాలీవుడ్ మహారణ్యం లో తాను మళ్ళీ వెలగాలన్నా...ఇలాంటి వాళ్ళందరి ని అదుపులో పెట్టుకోవలన్నా తాను మళ్ళీ సక్సస్ కావాలి.హాలీవుడ్ తన కోసం పరితపించాలి.

నన్ను ఆ దిశగా నడిపించగలిగిన వాడు..తన శక్తి తో యుక్తి తో దేనినైనా సాధించగలిగినవాడు. అవును అది తన గాడ్ ఫాదర్ ...Vito Corleone .

(వచ్చే భాగం లో మళ్ళీ కలుద్దాం..) ---KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (2 వ భాగం)

Nazorine చాలా ఆందోళనలో ఉన్నాడారోజు.అతని Bakery లో తయారయ్యే రొట్టెల్లాగే మట్టసంగా ఉంటాడతను.పిండి..అదంతా అంటుకొని ఉందేమో మహా చిరాకు పడిపోతున్నాడు. ఇటు భార్య Filomina మీద..అటు కుమార్తె Katherine మీద.

అసలు కారణం ఎవరంటే Enzo అనే యువకుడు.అమెరికన్లు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో ఆ యువకుణ్ణి ఇటలీ దగ్గర నుంచి పట్టుకొచ్చి యుద్ధఖైదీ గా అమెరికా జైల్లో పారేశారు.దాంట్లో భాగం గానే ఈ Nazorine కి సంబందించిన Bakery లో వర్కర్ గా పనిచేస్తున్నాడు.

ఈ యువకుడు Nazorine కుమార్తె Katherine తో ప్రేమలో పడ్డాడు.ఆ అమ్మాయి కూడా అంతే.పీకల్లోతు ప్రేమ లో పడింది అతనితో..!

" ఏదో ..సాటి ఇటలీ వాడివని నీకు పని ఇస్తే...నా కుటుంబానికే ఎసరు పెడతావా..?" అంటూ చిర్రుబుర్రు లాడిపోతున్నాడు.పాపం ..ఆ కుర్రవానిది కూడా జాలిగొలిపే పరిస్థితే..!

"Padrone.. I swear by The Holy Virgin ...I have never taken advantage of your kindness...I love your daughter with all respect..మీరు గాని పెళ్ళికి ఒప్పుకోకపోతే ...నా శిక్ష ముగిసిన తరువాత వెంటనే ఇటలి లోని నా గ్రామం కి వెళ్ళిపోతాను.నా పరిస్థితి మీకు తెలుసుగదా..మళ్ళీ నా జన్మలో నేను ఈ అమెరికా రాలేను.." అంటూ ప్రాధేయపడ్డాడు.

Nazorine కుమార్తె కూడా వంత పలికింది." అతనితో ఇటలీ వెళ్ళిపోవడానికి నేనూ తయారుగా ఉన్నాను" అని.

దీనికి తోడు Nazorine భార్య Filomina కూడా ఆ నవ జంట కే ఓటు వేస్తోంది." ఆ కుర్రవాడు చెప్పిన దానిలో వ్యతిరేకించడానికి ఏముంది..మన లాగానే తనూ ఇటలీ నుంచే వచ్చాడు.భార్యని చక్కగా చూసుకోగల హృదయం ఉన్నవాడు.అతనికి అమెరికా పౌరసత్వం వచ్చేలా చూస్తే ఇద్దరూ కలసి ఈ Bakery ని నడిపే పనిలో సాయంగా ఉంటారు గదా.." అంటూ సపోర్ట్ చేసింది.

"అమెరికన్ ప్రభుత్వం అతగాడిని ఇక్కడికి ఖైదీ గా తీసుకొచ్చింది.అంత ఈజీ కాదు పౌరసత్వం రావడం...సరే..నా తిప్పలేవో నే పడతానులే "  సముదాయించాడు Nazorine.

ఎలాగో అలా వాళ్ళ పెళ్ళి చేసెయ్యాలనే నిర్ణయానికి వచ్చేశాడు ఆ తండ్రి.దానికి కారణాలు లేకపోలేదు.ఒకవేళ తను కాదు అంటే ...ఇద్దరూ కలిసి ఇటలి కి పారిపోయినా పోతారు..అదింకా అవమానం.మళ్ళీ పైగా దానికి భార్య కూడా సపోర్ట్ గా ఉంది. గుడ్డిలో మెల్లలా తనకీ ఈ Bakery లో పనిచేయడానికి ఓ కార్మికుడు తేర గా దొరుకుతాడు. ఇవన్నీ ఆలోచించిన తరువాత అతని పౌరసత్వం గురించి ప్రయత్నించడానికి తన చిరకాలమిత్రుడు Don Vito Corleone ని కలిసి తీరాలని నిశ్చయించుకున్నాడు.

* * * * * *

అక్కడ అంతా ఎటు చూసినా కోలాహలంగా ఉంది.నవ వధూ వరులు చక్కగా పూలతో అలంకరింపబడిన ప్లాట్ఫాం మీద ఆసీనులయి ఉన్నారు.పెళ్ళికొచ్చిన వారంతా ఎవరి సందడిలో వారున్నారు.కొంతమంది నృత్యగానాలలో తేలుతున్నారు.ఇంకొంతమంది విస్తారంగా పారుతున్న మద్య ప్రవాహం లో మునిగి తేలుతున్నారు.మరి ఆ దేదీప్యమానమైన భవంతి లో గల ఆ ఉద్యానవనం లో జరుగుతున్నది ఎవరి పెళ్ళని..? గాడ్ ఫాదర్ అని ఎంతో మంది తో పిలుచుకోబడే Don Vito Corleone యొక్క కుమార్తె Constanzia పెళ్ళిసందడి.ఆమె ముద్దు పేరు Connie.నిజం చెప్పాలంటే ఈ సందడి అంతా పాతకాలపు ఇటలి దేశ పద్దతిలోనే జరుగుతున్నది తప్ప అమెరికా పద్దతి లో కాదు. వరుని విషయం లో తన మాటని మన్నించిన తండ్రి మాటకి విలువ ఇవ్వాలనే ఉద్దేశ్యం తో దీనికి ఆమె ఒప్పుకున్నది.

అది 1945 ఆగస్టు నెల.యుద్ధం ముగిసి అమెరికా ప్రపంచశక్తి గా ముందుకు రాబోతున్న తరుణమది.

Vito Corleone తన పాత స్నేహితుల్ని అందరిని ఆహ్వానించాడు.దానిలో పేదవాళ్ళు ఉన్నారు...ధనికులు ఉన్నారు..శక్తిమంతులు ఉన్నారు..సామాన్యులు ఉన్నారు.అందరినీ ఒకేలా చూడగలగడమే Don యొక్క వ్యక్తిత్వం. అలా వచ్చిన ఆహ్వానితుల్లో Amerigo Bonasera,Johnny fontanne,Nazorine లు కూడా ఉన్నారు.ఇటాలియన్ సాంప్రదాయం లో పెళ్ళి జరిగే రోజున ఆ ఇంటి పెద్ద ఎవరి కోరికనూ తిరస్కరించడు.అది ఒక రాయబడని శాసనం.

Don Vito Corleone కి ఈ అమ్మాయి కాక ముగ్గురు కుమారులు. Santino (Sunny) పెద్దవాడు. Fredo రెండవవాడు.ఇక చిన్న కొడుకు పేరు Michael. Sunny కొంచెం దుందుడుకు మనిషి.ఆవేశాన్ని వెంటనే ప్రదర్శిస్తాడు.. అయితే తండ్రి లో ఉన్న ఆ Personal magnetism గాని Intelligence గాని ఇతని లో చాలా తక్కువ.కాబట్టి భవిష్యత్తులో  తన Family business ని ఇతను ఏ విధంగా నిర్వహించగలడో అని సందేహిస్తుంటాడు.

రోడ్డు వారగా ఉన్న మాల్ దగ్గరకి ఓ నల్లని చెవర్లెట్ సెడాన్ కారు వచ్చి ఆగింది. దానిలోనుంచి కొందరు వ్యక్తులు దిగి ఆగివున్న కార్ల నెంబర్లను బుక్ లో నోట్ చేసుకుంటున్నారు. Sunny ఈ విషయాన్ని తండ్రి కి తెలిపాడు.బహుశా పోలిస్ శాఖ వారు కావచ్చునని ..!

ఆవేశపడుతున్న అతణ్ణి చూసి డాన్ అన్నాడు." ప్రతిదాన్ని సీరియస్ గా తీసుకోకు...ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు.. అయినా అది రోడ్డుకదా.."

ఈ విషయం డాన్ కి ముందే తెలుసు ..కనుకనే చాలా మంది మిత్రులు కార్ల నెంబర్లు  ఫేక్ వి తగిలించుకుని వచ్చేలా ఏర్పాటు చేశాడు.అయితే ఇది సన్నీ కి చెప్పడు.కోపంగా ఆ కార్ వద్దకి వెళ్ళిన సన్నీ కి FBI వాళ్ళు తమ కార్డ్ లని చూపిస్తారు.వస్తూ వస్తూ ఆ కారు మీద పడేలా ఉమ్మి వేసి తిరిగి వస్తాడు.అయితే డాన్ దాన్ని హర్షించడు.

He had long ago learned society imposes insults that must be borne,comforted by knowledge that in this world there comes a time when most humble of men,if he keeps his eyes open,can take his revenge on the most powerful.

పెళ్ళి కోలాహలం లో బ్యాండు వాళ్ళు తారాస్థాయికి వెళుతున్నారు.వాయిద్యకారులు తమ టాలెంట్ నంతా చూపిస్తున్నారు.పెళ్ళికొడుకు Carlo Rizzi  ...వధువు కి వస్తున్న Cash gifts లు చూస్తూ ఆనందం గా ఫీలవుతున్నాడు.అవును ఒక Royal Family లోకి వెళుతున్నాడిప్పుడు తను.ఇవన్నీ తనకి ఒక లెక్కా..చిన్నగా నవ్వుకున్నాడు.

(వచ్చే భాగం లో కలుసుకుందాము )
                                 ------KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (మూడవ భాగం)

సరే..అతిథులంతా వచ్చారు కదా..విందు కూడా మొదలవబోతోంది రండి అంటూ కుమారుల కి సైగ చేసి ముందుకు కదిలాడు Don Coeleone .పెళ్ళి కొడుకు Carlo Rizzi  అతని గూర్చి చెప్పాలంటే  He is a half -breed,born of a Sicilian father and North Italian mother  from whom he had inherited his blond hair and blue eyes. నెవడా లో అతని తల్లి దండ్రులు నివసిస్తారు.Sonny తో ఇతనికి న్యూయార్క్ లో పరిచయమవుతుంది.ఆ తర్వాత అతని సోదరి Connie తో ప్రేమ లో పడటం...ఆ తరవాత ఇలా పెళ్ళికి దారి తీయడం జరిగింది.

Carlo Rizzi తో తన కుమార్తె కి పెళ్ళి చేయడానికి ముందు డాన్ అతని గూర్చి వేగుల ద్వారా విషయాలన్ని కనుక్కుంటాడు.ఏదో కుర్రచేష్టల ద్వారా ఒక చిన్నకేసులో చిక్కుకోవడం తప్ప అతని గూర్చి వ్యతిరేకంగా రిపోర్ట్ ఏం రాలేదు.కాబట్టి వాళ్ళ ప్రేమ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు డాన్.పైగా నెవడా లో కూడా Gambling business లోకి ప్రవేశించాలనే ఆసక్తి డాన్ కి ఉన్నది.

సరే...ఈ పెళ్ళిలో తోటి పెళ్ళికూతురు (The maid of honour) ఒకామె ఉంటుంది.పేరు Lucy Mancini .ఈమె Connie కి క్లాస్మేట్ కూడా..!Sonny తో ఈమె కి పెళ్ళి హడావిడిలోని కలివిడిలో జతకుదురుతుంది.అంటే...Flirting లాంటిది.అతనికి పెళ్ళయి ముగ్గురు ముగ్గురు పిల్లలున్న విషయం ఆమెకి తెలుసు.Sonny యొక్క బయటి పురాణాలు ఆ నోటా ఈ నోటా విని ఈమె కూడా ఒకసారికి Try చేయాలని చూస్తుంది. ఎవరో ఎందుకు...ఇతని భార్యే ఓ సారి lighter mood లో ఉన్నప్పుడు ఈ Lucy తో అంటుంది.

"Sonny ఎవరితో పోయినా నాకు ఆ వనిత మీద..అసూయ కంటే జాలి కలుగుతుంది.ఎందుకంటే ఆ రాత్రికి ఆమె కి ఎంత అవాలో అంత అవుతుంది..తెల్లారి నడవటం కూడా కష్టమే..ఆమె కోసం నేను చర్చ్ కి వెళ్ళి ఓ Candle వెలిగించడం చేస్తాను." అంటూ పరిహాసం చేస్తుంది.ఈ Lucy ఆ మాటలతో  పరవశించి అతగాడి తో ఓసారి ప్రయత్నించాలని అనుకొంటుంది.అది ఫలించి ..మొత్తానికి ఒక దూరం గా ఉన్న గదిలో వీళ్ళు కలుసుకొని తమ కార్యక్రమం లో నిమగ్నమై ఉంటారు.

అయితే వీళ్ళు ..ఈ విధంగా వెళుతున్నప్పుడు .. Tom Hagen చూస్తాడు.ఇతని పూర్తి పేరు Thomas Hagen.ఈ వ్యక్తి ఎవరు అంటే Don కి Consigliere..!అంటే ప్రధాన సలహాదారు ఇంకా డాన్ కి కార్యనిర్వహణ లో కుడి భుజం లాంటి  వాడు.ఇతని లాయర్ కూడా..!

Tom Hagen తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణిస్తారు.Sunny కి క్లాస్ మేట్ అయిన ఇతను వారి ఇంటిలోనే ఒక మనిషి లా పెరుగుతాడు.అయినప్పటికి డాన్ అతని పేరు ని ఏ రూపేణా కూడా మార్చడు.ఆ విధంగా చేయడం అంటే అతని తల్లి దండ్రులను అవమానించడమేనని...డాన్ భావిస్తాడు.అతని విచక్షణ కి అతని కుమారులు కూడా ఆశ్చర్యపోతారు.

డాన్ చిన్న కుమారుడు Michael ..! New Hampshire లో డార్ట్ మవుత్  బిజినెస్ కాలెజ్ లో చదువుతుంటాడు.తన సోదరి పెళ్ళికి తన గర్ల్ ఫ్రెండ్ Kay Adams తో సహా వచ్చాడు.ఆమె ని ఇక్కడ తన కుటుంబానికి పరిచయం చేయడం అతని ఉద్దేశ్యం.అలాగే పూర్తిగా అమెరికన్ తరహా లో ఉండే ఆమెకి తమ ఇటాలియన్ కుటుంబాల్లోని పద్దతులు తెలియాలనేది కూడా అతని ఆకాంక్ష.

Sunny యవ్వారం గురించి డాన్ కి  చెప్పాలా వద్దా అని యోచించి Tom  మిన్నకుండిపోతాడు.అయితే  Tom గది లోనికి వెళ్ళి అక్కడున్న ఓ విశాలమైన టేబుల్ ముందు కుర్చీ లో కుర్చుంటాడు డాన్.తన చేతి లో నున్న ఓ లిస్ట్ ని డాన్ కి అందజేస్తాడు Tom..! దానిలో ఎవరెవరు అతడిని కలవాలనుకుంటున్నారో వారి పేర్లు ఉంటాయి.డాన్ ఆ పేర్లన్నిటిని ఓ మారు పరికించి " ఈ Bonasera ని మాత్రం చివరికి పంపు" అంటాడు.

Nazorine పిలిచి లోపలికి వెళ్ళి డాన్ ని కలవ వలసిందిగా కోరతాడు Tom..!

గది లోనికి వెళ్ళగానే Don Corleone లేచి వచ్చి Nazorine ని సాదరంగా ఆలింగనం చేసుకుంటాడు.చిన్నప్పుడు ఇద్దరూ ఇటలీ లో ఆటలాడుకునే వయసునుంచి మిత్రులు.ఇప్పటికీ ఈ అమెరికా కి వచ్చి ఇన్నేళ్ళయినా ప్రతి ఈష్టర్ పండుగ కి స్పెషల్ గా రొట్టెలు తయారు చేసి తన బాల్య మిత్రుడైన Don Corleone కి ప్రేమ పూర్వకంగా పంపుతుంటాడు.ఎప్పుడూ ఏ ఫలమూ ఆశించలేదు అతను.అయితే ఓ సారి మటుకు యుద్ధం రోజుల్లో OPA Sugar coupons ని బ్లాక్ లో ఇప్పించమని కోరాడు. అంతే..!

డాన్ తన మిత్రునికి De Nobili సిగార్ ఆఫర్ చేసి...కొద్ది గా Yellow strega మద్యాన్ని ఓ గ్లాస్ లో పోసి తీసుకోమన్నట్లుగా  చెయి ఊపాడు.కాసేపు ఉభయకుశలోపరి అయిన తరువాత ...అప్పుడు డాన్ అడిగాడు." మిత్రమా..చెప్పు..ఏం చేయగలను నీకోసం" అని..!

తన కుమార్తె Enzo అనే యువకుణ్ణి ప్రేమించడం..అతగాడికి ఇప్పుడు అమెరికా పౌరసత్వం కావలసి రావడం ...ఇదంతా పూస గుచ్చినట్లుగా Nazorine చెప్పాడు.

"My friend..put all your worries aside..!తప్పక నీ కోరిక నెరవేరుతుంది.అయితే నువు ఒక పని చెయ్యి...ఓ పిటిషన్ ని మొత్తం వివరాలన్ని ఉన్నది..చక్కగా రాసి Congressman of the district కి ఇవ్వు.దాన్ని ఎలా రాయాలో నా మనుషులు నీకు చెబుతారు.అప్పుడు ఒక Bill ని Propose  చేయడం జరుగుతుంది.. ఆ తరువాత వాటిని ఎలా నడిపించాలో నేను చూసుకుంటాను.సరేనా...మొత్తం ఓ రెండు వేల డాలర్ల దాకా ఖర్చు అవుతుంది.."  అంటూ చెబుతాడు డాన్.

Nazorine పైకి లేచి డబ్బులు తీసి ఇవ్వబోతాడు.వెంటనే డాన్ అతన్ని వారించి " నువు నాకు డబ్బులు ఏమీ ఇవ్వనవసరం లేదు.మిత్రమా ..ఆనందం గా నువు ఇంటికి వెళ్ళు..అదే నాకు కావలసింది"  అంటాడు.

ఒక్కసారిగా Nazorine కన్నీళ్ళపర్యంతమవుతాడు. అతన్ని గుమ్మం దాకా సాగనంపి డాన్ వీడ్కోలు చెబుతాడు.

Tom Haegan అలాగే చూస్తుండి పోతాడు.ఆ తర్వాత అంటాడు." ఈ పనికి ఈ సారి ఎవరిని నియమించను..?"

"ప్రక్క జిల్లా లో ఉన్న ఓ Jew కి అప్పగించు.యుద్ధం జరిగే రోజుల్లో అడ్రెస్ లు మారడం సహజం కదా...ఆ పద్ధతి ఫాలో అవు..అలాగే వాషింగ్టన్ లోని మన మనుషులని ఈ విషయం లో అలర్ట్ చేయి..అవసరమైతే అదనంగా కొంతమందిని సిద్ధంగా ఉంచు..ఇంకొకటి ఆ కాంగ్రెస్ మేన్ Luteco ని ఉన్నాడుగదా.అతడిని తప్పించి ఈ కేసులో Fisher ని నియోగించు.." అంటూ కొన్ని సూచనలు చేశాడు Don Vito Corleone..!

"సరే..అలాగే.." నోట్ చేసుకుంటాడు Tom.. !

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము)

                    ---KVVS Murthy  

     Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (నాల్గవ భాగం)

Nazorine వెళ్ళిపొయిన తర్వాత లోపలకి అనుమతింపబడిన మరోవ్యక్తి Anthony Coppola.రైల్వే  శాఖ లోరోజువారి శ్రామికునిగా పనిచేసేవాడు అతని తండ్రి.Don Corleone  కూడా అతని యవ్వనకాలం లో అదేపని చేశాడు కొంతకాలం .ఆ విధంగా Anthony తండ్రి ,Don ఒకే వృత్తిలో నున్న మిత్రులుగా ఉండేవారు.ఆ తండ్రి చనిపోయాడు.ప్రస్తుతం Anthony ఒక చిన్న వ్యాపారం అంటే  Pizzeria  లాంటిది పెట్టుకోవాలని అనుకొంటున్నాడు.అతనికి అప్పు ఎక్కడా దొరకలేదు.ప్రయత్నించుదామని డాన్ దగ్గరకి వచ్చాడు.

లోపలకి వచ్చిన Anthony ని కుశలప్రశ్నలు వేసి సంగతి ఏమిటని అడుగుతాడు Don.

" నేను ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవాలని అనుకొంటున్నా.తమరు ఒక 500 డాలర్లు గనక ఋణం ఇస్తే నాకు ఉపయోగకరంగా ఉంటుంది.బ్యాంకు లో కూడా నాకు అప్పు దొరకలేదు" అంటాడు Anthony ,ఎంతో అణకువగా..!

డాన్ తన జేబులొ చేయి పెట్టి తడుముతాడు. అంతా కలిపి 400 డాలర్ల దాకా కూడుతుంది. "ఇందా..ఇవి తీసుకో.." అని ఇస్తాడు.ప్రక్కనున్న Tom ని పిలిచి "నీ జేబులో ఒక వంద డాలర్లు ఉంటే ఇవ్వు నాకు...రేపు బ్యాంకు లో డ్రా చేసినాక నీకు ఇస్తాను" అంటాడు.

Tom ఇవ్వబోతుండగా Anthony నిరాకరిస్తాడు."నా గురించి Don మీ దగ్గర అప్పు తీసుకోవడమేమిటి...నాకు ఈ 400 డాలర్లు చాలు" అని ఉబ్బితబ్బిబ్బు అవుతాడు.

" నన్ను క్షమించండి...మీకు ఇబ్బంది కలిగించాను"

"లేదు Anthony ..ఈ పెళ్ళిఖర్చుల్లో ..పడిపోయి ,సమయానికి జేబులో కూడా డబ్బులు లేకుండా అయిపోయాయి." అంటాడు Don చిరునవ్వుతో..!

Anthony కి తెలుసు Don ఎంతటి ధనవంతుడనేది..అమెరికా లోని ప్రముఖ శ్రీమంతులలో అతను ఒకడు..కాని ఒక్కోసారి సమయానికి ఎలాంటి వారి దగ్గరకూడా ధనం అందుబాటులో ఉండదుకదా..!

ఇక్కడ... Tom ఒకటి అర్ధం చేసుకుంటాడు Don Corleone  నుంచి..!అదేమిటంటే Generosity అనేదాన్ని ఎవరికి వారు వ్యక్తిగతం గాని చూపాలి తప్ప మరో రకంగా కాదు అని..!

Anthony వెళ్ళిపోయినతరవాత ఆ తరువాత సందర్శన కోసం ఎవరున్నారు అని అడుగుతాడు డాన్.

"Luca Brasi పేరు అయితే మీకిచ్చిన లిస్ట్ లో లేదు కాని మిమ్మల్ని ఓసారి కలిసి పెళ్ళి సంధర్భంగా తెచ్చిన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు." అన్నాడు Tom.

"అది..ఇప్పుడే అవసరమంటావా "

" మీ ఇష్టం...మీరు ఎలా చెబితే అలా.."

 లిప్తపాటు యోచించి " సరే...రమ్మను" అంటాడు డాన్.

లోపలకి  ప్రవేశించిన Luca Brasi ని సాదరంగా ఆహ్వానిస్తాడు డాన్.ఒక రాజు తన ప్రధాన యోధుల్లో ఒకరికి ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడతాడో అంత మర్యాదగా అతనితో సంభాషిస్తాడు. Luca Brasi ఎక్కడ ఉంటే అక్కడ ప్రమాదఘంటికలు మోగుతాయి. అతని Presence ఎక్కడ ఉన్న చూసేవారికి ఏదో భయం కలుగుతున్నట్లు ఉంటుంది.Don యొక్క Power Structure లో Luca ఒక ముఖ్యమైన వ్యక్తి.చరిత్రాత్మకమైన "Olive oil war " లో అతని పాత్ర గణనీయమైనది. రెండు  వారాల సమయం లో ...ఆరుగురు వ్యక్తుల్ని ఒంటి చేత్తో వెంటాడి ..ఏ మాత్రం అనుమానం రాకుండా పరలోకానికి పంపించిన వాడు ఈ Luca Brasi. జనానికి గాని...దేవుడి కి గాని..ఎవరికీ భయపడే రకం కాదు.Don తనని నాశనం చేయాలనుకున్న ఇతర పోటీదారులతో చేసిన పోరాటమే ఈ ఆలివ్ ఆయిల్ వార్.అది 15 ఏళ్ళ క్రితం నాటి మాట.ఆ కధ అంతా ముందు ముందు వస్తుంది..అప్పుడు చూద్దాం.

ఈ Luca Brasi ని పెళ్ళి లో చూసిన Kay Adams అడుగుతుంది Michael ని."ఎవరితను" అని.ఈ విష్యాలు కొన్ని చెప్పి ఆపుజేస్తాడతను.

"ఏమిటి ..మీ తండ్రి గారిని Gangsters కాల్చి చంపాలని ప్రయత్నించారా..?" అంటుంది ఆమె.

"అవును..చాలా ఏళ్ళ క్రితం నాటిమాట అది. మా తండ్రి గారి కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలివ్ ఆయిల్ బిజినెస్ ని దెబ్బ తీయాలని కొంతమంది శత్రువులు ప్రయత్నించారు. ఆ టైం లో జరిగిన చాలా విషయాలు నాకు ఇప్పటికీ తెలియవు.కొన్ని అలా రహస్యంగానే ఉండిపోయాయి.దానిలో Luca Brasi లాంటి వారు కూడా ఒక భాగం.."


(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము)      ----KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (అయిదవ భాగం)

సరే...Luca brasi,Don Corleone లు అవీ ఇవీ...మాట్లాడుకున్నాక చివరిలో తను తెచ్చిన పెళ్ళి బహుమానాన్ని డాన్ చేతిలో పెడతాడు.తప్పనిసరిగా అది అక్కడకివచ్చిన అతిథులందరు తెచ్చినదానికంటే విలువైనదై ఉంటుందని Tom ఊహించుతాడు.ఎందుకంటే డాన్ పట్ల Luca brasi కి ఉండే Loyalty అలాంటిది.Luca వంటి ఒక Tough person ని డాన్ ఏ విధంగా Control చేస్తుంటాడు అనేది చాలామందికి ఒక ప్రశ్న  లానే మిగిలిపోతుంది.

Luca వెళ్ళేటప్పుడు మర్యాదపూర్వకంగా Don Corleone చేతిని ముద్దుపెట్టుకొని నిష్క్రమిస్తాడు.
ఆ తరువాత ఎవరున్నారు అన్నట్లుగా Tom వేపు చూస్తాడు డాన్.

"ఇక Amerigo Bonasera ఒక్కడే మిగిలాడు.పంపించమంటారా .." అడుగుతాడు Tom .

"పంపించు..ఆ ..దానికి ముందు ఒక మాట..నా పెద్ద కుమారుడు Sunny ని కూడా రమ్మని చెప్పు.అతను కొన్ని విషయాలు కొన్ని సంఘటనలనుంచి నేర్చుకోవాలి"   అంటాడు డాన్.

Tom అక్కడ తోట లోకి వెళ్ళి మూల మూలలా వెదుకుతాడు.ఓ కార్నర్ లో కూర్చొని ఉన్న డాన్ చిన్న కుమారుడు Michael ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ Kay Adams కనిపిస్తారు.వాళ్ళు కూడా సన్నీ కనబడలేదని చెబుతారు.అప్పుడు తడుతుంది..అయితే ఆ Maid of honour తో ఆ పని లోనే ఉన్నాడేమోనని అనుమానమొచ్చి stairs ఎక్కి ఒక రూం దగ్గరకి వెళ్ళి తలుపు ని టకటక  కొడతాడు.

సందేహం లేదు లోపలే ఉన్నడని భావించి " Don నిన్ను వెంటనే రమ్మంటున్నారు.. ఏదో ముఖ్యమైన విషయమట " అని చెబుతాడు.

"వచ్చేస్తున్నా..నువ్వు నడుస్తుండు"

ఈ లోపులో Lucy తుడుచుకొని వెళ్ళిపోతుంది.సన్నీ కూడా అక్కణ్ణుంచి అమాయక పక్షి లా నిష్క్రమిస్తాడు.

***************
Amerigo Bonasera డాన్ ఉన్న గది లోపలకి అడుగుపెట్టేసరికి విశాలమైన టేబుల్ ముందు కూర్చొని Don కిటికి లోనుంచి దూరంగా చూస్తున్నాడు.వచ్చిన అతిథి ని ఆలింగనం చేసుకోవడం గాని..షేక్ హేండ్ ఇవ్వడం గాని చేయలేదు ఈ సారి. "విషయం చెప్పు" అన్నట్లుగా చూశాడు డాన్.

అయితే Bonasera చాలా తెలివిగా తన సంభాషణని ప్రారంభించాడు.

" నా కుమార్తె ...అంటే మీ భార్య ని తన God Mother గా భావించే నా ఏకైక కుమార్తె ఈ పెళ్ళికి రాలేకపోయినందుకు చాలా బాధ పడుతోంది.ఆమె ప్రస్తుతం ఆసుపత్రి మంచం మీద ఉన్నది." అంటూ అసలు సంగతిని ఓపెన్ చేశాడు.

" మీతో కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి నేను"

" They are my right arms..  వాళ్ళనుంచి నువ్వు ఏదీ ఇక్కడ దాచిపెట్టనవసరం లేదు.చెప్పేదేదో చెప్పు." కాస్త కటువుగానే అన్నాడు Don.

కనీసం అతను తనను గౌరవంగా గాడ్ ఫాదర్ అని కూడా సంభొదించలేదు.అతని మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు డాన్.

" అమెరికా లో ఉన్నాను కనుక ఈ దేశపద్ధతి లోనే నా కుమార్తె ని పెంచాను.నేను అమెరికా ని నమ్మాను.నాకు ఈ దేశం సౌభాగ్యాన్ని ఇచ్చింది.నా కుమార్తె కి ఒక మంచి తండ్రి లా స్వేచ్చా స్వాతంత్ర్యాలనిచ్చాను.అయితే అదే సమయం లో ఇటలీ మూలాలు కలిగిన ఓ కేథలిక్ కుటుంబం యొక్క గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా నేర్పించాను.ఒకరోజు ఆమె తన Boy friend తో కలిసి అతని కోరిక మేరకు బయటికి వెళ్ళింది.అంతకు ముందే ఆ కుర్రవాడు మరో కుర్రవాడిని కూడా ఈమె కి తెలియకుండా పిలిచాడు అక్కడకి.ఆ ఇద్దరూ కలిసి నా కుమార్తె కి విస్కీ ని తాగించారు.ఆ పిమ్మట వాళ్ళు ఈ అమ్మాయిని శృంగారం లో ఫాల్గోమని వొత్తిడి చేశారు.దానికి నా కుమార్తె అంగీకరించలేదు.ఆ కోపం లో వాళ్ళిద్దరూ ఈ అమ్మాయిని తీవ్రంగా కొట్టి గాయపరిచారు.ప్రస్తుతం మాట్లాడే స్థితి లో కూడా లేదు.ఆసుపత్రిలో ఉన్నది." చెప్పాడు Bonasera

బాధాకరమే అన్నట్లు ఒకసారి డాన్  తల కిందికి వొంచి ..ఆ తర్వాత Bonasera వేపు చూస్తూ అడిగాడు." ఆ తరువాత ఏమయింది" అని.

" నేను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను.ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశపెట్టారు.జడ్జి వాళ్ళకి శిక్ష విధించినట్లే విధించి వాళ్ళ రికార్డ్ క్లీన్ గా ఉందని చెప్పి ఆ శిక్షని సస్పెండ్ చేసిపారేశాడు.బయటకి వస్తూ వాళ్ళు నావేపు చూసి పరిహాసంగా వెక్కిరించారు.నేను ఫూల్ ని అయ్యాను.అప్పుడు నిర్ణయించుకున్నాను న్యాయం కోసం నేను గాడ్ ఫాదర్ దగ్గరకి వెళ్ళవలసిందేనని.."  వివరించాడు Bonasera.

" మంచిది ..ఒక ప్రశ్న అడుగుతాను..చెప్పు...నువ్వు పోలీసుల దగ్గరకి కాకుండా ముందు నా దగ్గరకి రావాలి అని ఎందుకు అనుకోలేకపోయావు.." డాన్ అడిగాడు.

అస్పష్టంగా ఏదో గొణిగాడు Bonasera.

" అయితే ఇప్పుడు నానుంచి ఏమి కోరుతున్నావు.."

డాన్ చెవి దగ్గర గా వచ్చి గుసగుస గా ఏదో చెప్పాడు  Bonasera.

" లేదు..ఆ పని నేను చేయను.." అన్నాడు డాన్.

" ఎంత అడిగితే అంత డబ్బిస్తాను..."

ఆ మాటలు విన్న Tom కి బాగా కోపం వచ్చింది.అయితే అదుపు చేసుకున్నాడు.Sunny మాత్రం చేతులు కట్టుకొని నిలబడి గమనిస్తున్నాడు.

Don కుర్చీ లోనుంచి పైకి లేచాడు.

"Bonasera.. మనం ఇద్దరం ఎన్నాళ్ళగానో ఒకరికి ఒకరం తెలుసు..అవునా..? మరి ఎప్పుడైనా నా సలహా కోసమో ..ఇంకో దానికోసమో వచ్చావా..నాకైతే జ్ఞాపకం లేదు.నా భార్య నీ కుమార్తె కి God Mother వంటిదని  చెప్పావు..సంతోషం ..కాని ఏ రోజునైనా నీ ఇంటికి మమ్మల్ని పిలిచి ఓ కాఫీ ఇచ్చావా..ఏమో నాకైతే జ్ఞాపకం లేదు.Let us be frank.You spurned my friendship.You feared to be in my debt." వ్యంగ్యంగా     అన్నాడు Don Corleone.

Bonasera ఏదో సమాధానం చెప్పబోయాడు.

" Listen.. Don't speak..!  అమెరికా అంటే పెద్ద భూతల స్వర్గం అనుకున్నావు కదూ..నువ్వు ఎలా ఉన్నా ఆనందం గా గడిచిపోతుందనుకున్నావు..అవునా.. ఇక్కడ ఎవరి అవసరం పడదులే అనుకున్నావ్.. నీ బిజినెస్ నీకున్నది..ఎవరితో పనేమిటి అని నీ ధీమా అంతే గదా..చివరికి ఇప్పుడు ఏమి జరిగింది ..You never armed yourself with true friends.. ఈ ప్రపంచం నువ్వు అనుకున్నంత తిన్నగా ఉండదు. పోలీసులు ..చట్టం..కోర్టులు ఇవన్నీ నీకు తెలిసినవే గదా..నీకు డాన్ తో పని ఏముంది..అక్కడికే వెళ్ళు I am not the sort of person who don't value friendship  "  తీవ్రంగా అన్నాడు Don.

మళ్ళీ డాన్ అన్నాడు. " ఇప్పుడు నా దగ్గరకి వచ్చి Justice ఇమ్మని అడుగుతున్నావు.అదీ ఒక మర్యాద లేని స్వరం తో అడుగుతున్నావు.You don't offer your friendship ...you came on this wedding day and asked me to do a murder....?"  ఎగతాళి చేస్తున్నట్లుగా అన్నాడు.

Bonasera అసహాయత తో ఒక్కసారిగా రోదించాడు." ఒక మంచి పౌరునిగా ఉండాలనుకున్నాను..అది తప్పా..నా కుమార్తె ఓ మంచి అమెరికా పౌరురాలిగా ఉండాలని ఆశించాను..తప్పా.." అంటూ విలపించసాగాడు.

" Well spoken.Fine.You nothing to complain about.The judge ruled.America has ruled.The boys are high spirited-one a powerful politician's son"  డాన్ గంభీరంగా అన్నాడు.

"I ask you justice" దీనంగా అన్నాడు Bonasera.

" The court gave you justice"

" They gave justice to them..!not me..!"

" Then what is your justice"

" An eye for an eye"

" Your daughter is not dead..! mind it..!" ఇలా వాళ్ళిద్దరి మధ్య మాటలు నడిచాయి.

" లాయర్ల మీద..కోర్ట్ ల మీద ఎంతో ఖర్చు చేశావ్..అప్పులు తీసుకొని వడ్డీలు కడుతున్నావ్..అదే నువ్వు మొదటి గా నా దగ్గరకి వచ్చినట్లయితే నా పర్సు నీ పర్సు అయ్యేది.నీ శత్రువులు నా శత్రువులు అయ్యేవారు.నన్ను నమ్ము...వాళ్ళు నీ జోలికి మళ్ళీ రావాలంటేనే భయపడేవారు. సరే...ఇక నువ్వు వెళ్ళు వాళ్ళకి ఏ శిక్ష వెయ్యాలో ఇక నేను నిర్ణయిస్తా..ఈ ఫేవర్ ఎవరి తరఫున చేస్తున్నానో తెలుసా ..నా భార్య తరపున..ఎందుకంటే నీ కుమార్తె కి ఆమె గాడ్ మదర్ కనుక.." చెప్పాడు డాన్.

Bonasera నిష్క్రమించిన తరువాత Tom ని పిలిచి ఈ విధంగా Instructions ఇస్తాడు.

" ఈ పనిని Clemenza  కి అప్పగించు.రక్తాలు కారి చచ్చేటట్లు చేయొద్దుగాని...కొన్ని రోజులు ఆసుపత్రి లో ఉండే విధంగా ఆ ఇద్దరిని ఉతకమను.మరీ రక్తం మరిగిన జంతువులని పంపించవద్దు."


(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము)   ---KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ఆరవ భాగం)

తోటలో అంతా కోలాహలంగా అనిపించడంతో కిటికీ లోనుంచి చూశారు Don Corleone,Santino,Tom ఎవరా అనుకుంటూ..!అది ఎవరో కాదు ఇంతకీ ..! Johny Fontanne ..హాలీవుడ్ లో సింగర్ గా ఉర్రూతలూపినవాడు..అశేష అభిమానులను తన గాత్రమాధుర్యం చేత ఓలలూపినవాడు..కాకపోతే ఇప్పుడు కాస్తా ప్రభ తగ్గింది.దానికీ కొన్ని కారణాలు ఉన్నాయి.డాన్ కి ప్రియమైన God son అతను.ఆయన్ని కూడా ఈయన అంతా అనురక్తి తోనూ గౌరవిస్తాడు.

"మీకెంతో ప్రీతిపాత్రుడైన God son ,అదే Johny Fontanne వచ్చినట్లున్నాడు.జనాలంతా నానా హంగామా చేస్తున్నారు...ఆనందం తో..! పిలవమంటారా..?" అడిగాడు Tom.

" లేదు..లేదు..ఎంతైనా సినిమా మనిషి కదా..కానివ్వు..జనాలు కూడా అతనితో కాసేపు వినోదంగా గడపనీ.." సరదాగా అన్నాడు Don.

" బహుశా ఏదో సమస్యలో ఉండి ఉంటాడు"

" సరే..ఏదైనా ఉండనీ ..తన గాడ్ ఫాదర్ దగ్గరకి కాకుంటే ఇంకెక్కడికి వస్తాడు చెప్పు"

అవతల తోటలో ఆ కోలాహలం అలాగే కొనసాగుతోంది.పెళ్ళికూతురు Connie కూడా Johny ని చూడగానే ఆనందం లో లేచి అతడిని కౌగలించుకొని స్వాగతం పలికింది.ఆమె భర్తకి అదే పెళ్ళికొడుకు కి కూడా పరిచయం చేసింది.

జనాలని తోసుకొని Nino Valentini ముందుకు వచ్చి అడిగాడు."ఏయ్ Johny ఈ శుభ సంధర్భం లో మన ఇద్దరం పాటలు పాడి దుమ్ము రేపాలి.చూసుకుందామా ..మన సత్తా.."

" ఊ..కానీ..ఆలశ్యం దేనికి" అంటూ Johny ఒక పాత ఇటాలియన్ ప్రణయగీతాన్ని మంచి ఊపుతో అందుకున్నాడు.Nino ఓ వేపు మాండలిన్ వాయించుతూనే మరోవేపు వంత పాడటం మొదలుపెట్టాడు.వారితో పాటు చుట్టూ ఉన్న జనాలు కూడా ...డ్యాన్స్ వేస్తూ ఉత్సాహంగా పాటకి తమ గొంతుల్ని కలుపుతున్నారు.దుమ్మురేగే సందడి.

అన్నట్టు ఈ Nino ఎవరో కాదు.Johny కి చిన్ననాటి నేస్తం ఇంకా క్లాస్ మేట్ కూడ..!Johny హాలీవుడ్ లో మంచి ఉచ్చదశ లో ఉన్నప్పుడు తనకి పాడే చాన్సులు ఇప్పించవలసిందిగా కోరేవాడు Nino. మరి ఎందుచేతనో అది జరగలేదు.ఇక  మనకి సినిమా యోగం లేదులే అనిచెప్పి శుబ్ర్హంగా ట్రక్ డ్రైవర్ గా పనికి కుదిరిపోయాడు.ఎప్పుడైనా వారాంతాల్లో తన కుతి తీర్చుకోవడానికి ఎవరైనా పిలిస్తే వెళ్ళి తన Band తో కలిసి పాటల కచేరి చేసి వస్తుంటాడు.

ఇలా మంచి ఊపులో అంతా ఆనందగీతాలు పాడుతుండగా వెనక నుంచి Don Corleone గొంతు వినిపించింది.

" Johny ఎంతో దూరం నుంచి మన కోసం వచ్చాడు కదా..పాట వెంట పాట పాడించుకొని అతణ్ణి అలసి పోయేట్లు చేస్తున్నారు గాని.. అతని గొంతు ఒక్కరైనా తడిపారా.." అని అనగానే..చుట్టూ ఉన్న వాళ్ళంతా నా గ్లాస్ అంటే నా గ్లాస్ తీసుకో అని ముందుకు చాపుతూ గోల చేశారు.

" సరే..పదా.." అంటూ డాన్ వాళ్ళందర్నీ ఎలాగో సర్దుబాటు చేసి Johny ని ఇంట్లోకి తీసుకెళ్ళాడు.Yellow Strega ని ఓ గ్లాస్ లో పోసి అతనికిచ్చాడు.తనూ ఒకటి తీసుకున్నాడు.కూర్చొని విశేషాలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

" నేను నా భార్య,పిల్లల్ని విడిచిపెట్టినతరువాత ఒక అయిదు సార్లు అయినా మీకు కాల్ చేసి ఉంటాను.ఏదో పనిలో ఉన్నారంటూ Tom చెప్పేవాడు.నాకు తెలుసు మీకు అది ఇష్టం ఉండదని" గ్లాస్ లోని ద్రవాన్ని కొద్దిగా సిప్ చేసి అన్నాడు Johny.

" నీ కుటుంబాన్ని విడిచిపెట్టి ఆ స్టార్ వెంటబడి ఆమెని చేసుకున్నావు.దాని విషయం లో నేనేమి సలహా ఇవ్వగలను.. నీ పిల్లల్ని తండ్రి లేని వారిగా చేశావు.నీ భార్య Ginny ని కూడా అసంతృప్తికి గురి చేశావు.ఇలాంటివి నాకు ఇబ్బంది కలిగించేవే నీ విషయంలో..నువ్వు ఏమైనా చెప్పు..సమర్ధించలేను.." Don కాస్తా బాధ గానే అన్నాడు.

"God father..మీరు చెప్పింది నిజమే..ఇప్పుడు నాకు బుద్ది వచ్చింది.కాని ఏం ప్రయోజనం..నా భార్య Ginny దగ్గరకి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్ళగలను..? పిల్లల పట్ల నాకెంతో ప్రేమ ఉంది.కాని ఎటూ కాని స్థితి లో పడ్డాను."

" ఏయ్ ..Johny నీ మొదటి భార్య కి డైవర్స్ ఇచ్చివుండవచ్చుగాక..కాని ఆమె దగ్గరకి వెళ్ళడానికి నీకు అడ్డు ఏముంటుంది.పిల్లల కోసమైనా తరచుగా వెళ్ళవచ్చుగదా "

" Oh..God father ..మీకు ఎలా చెప్పాలి..వీళ్ళు అమెరికన్ స్త్రీలు..మీ పాత తరం కి చెందిన కేథలిక్ విశ్వాసాలున్న ఇటాలియన్ ఆడవాళ్ళు అనుకుంటున్నారా.. ఆ కధ వేరు..చాలా తేడా ఉంది" నవ్వుతూ అన్నాడు Johny.

" నీ భార్యా పిల్లల్ని కాదని ఆ సినిమా స్టార్ Margot ని చేసుకున్నావు గదా..ఆమె తో నీ కొచ్చిన సమస్యలు ఏమిటి"  డాన్ అడిగాడు.

"ఏమని చెప్పను...అన్నీ సమస్యలే...నా జేబులో చిల్లర ఎలా ఖర్చు చేస్తుంటానో ..ఆమె తన శరీరాన్ని అలా వాడుతుంది.సినిమా లో మేకప్ మేన్ మంచి మేకప్ చేస్తే అతనికో చాన్స్ ఇస్తుంది మంచం ఎక్కడానికి..అలాగే కెమేరా మన్ ..ఇంకా డైరక్టర్...వాడూ..వీడూ అని ఏం లేదు.ఎవరు తనకి చక్కగా ఉపయోగపడితే వారికి తలా ఒక చాన్స్ ఇస్తుంది.ఇక నేనెందుకు..నా మనోభావాలని కేర్ చేయనపుడు..?ఇక్కడకి వచ్చేముందు కూడా చిన్న గొడవ జరిగింది.తను ప్రస్తుతం ఓ సినిమా లో చేస్తున్నది.అందుకే డామేజీ అవుతుందని మొఖం మీద గట్టిగా కొట్టలేకపోయాను.అది కూడా దానికి జోక్ గా ఉంది" Johny వెళ్ళగక్కాడు తన గాధని.

"You took the woman of your boss.What nonsense.You left your family ..your children without father,to marry a whore and you weep because they don't welcome back.ఇక మీదట వీలైనత ఎక్కువగా నీ భార్యా పిల్లలతో గడుపు..సరే..Ginny నిన్ను పక్క లోకి రానివ్వకపోయినా ..కనీసం ఆ ఇంటిలో ఒక దూరపు అథితి లాగా నైనా ఉండు. A man who is not a father to his children can never be a real man". డాన్ ఒక స్నేహ స్వరం తో చెప్పాడు.

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాం)   --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ఏడవ భాగం)

" అన్ని అలా వుండనీ...నీ విషయం చెప్పు..ఎందుకని హాలీవుడ్ సినీ ప్రపంచం లో నువు వెనకబడిపోయావు.." డాన్ అడిగాడు.

" ఇక నేను గతం లో లాగా పాడలేను గాడ్ ఫాదర్...ఎందుకో నా గొంతు కూడా సహకరించడం లేదు.డాక్టర్లు కూడా ఏం చెప్పలేకపోతున్నారు.గంటల కొద్దీ రిహార్సల్స్ చేయగలిగేవాణ్ణి..ఇప్పుడు ఎందుకో శక్తి తగ్గుతోంది..అలా కాదని చెప్పి నటన లోకి గాని ..నిర్మాణం లోకి గాని వెళదాం అని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు.John Woltz అని ఒక పెద్ద స్టూడియో యజమాని ఒకడున్నాడు.వాడు నాకు అడ్డుపడుతున్నాడు" Johny  చెప్పాడు.

"వాడు ..నీకెందుకు అడ్డుపడుతున్నాడు..ఏమిటసలు గొడవ..?"

"ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు పాడమన్నా అందరికీ నేను లిబరల్ గా పాడుతుంటాను.. అది మీకు తెలుసు కదా.. ఓసారి ఏదో కమ్మ్యునిస్టు ఆర్గనైజేషన్ వాళ్ళు పాడమంటే ఓ పాట పాడాను.అప్పటి నుంచి నన్ను "కమ్మీ" గా ముద్రవేసి కక్ష సాధిస్తున్నాడు.అంతేగాక సిని ప్రపంచం లో స్థానం లేకుండా చేయాలని చూస్తున్నాడు.వాడి తో లింక్ ఉన్న ఓ అమ్మాయి తో ఒక రాత్రి గడిపాను...అదికూడా వాడికి కడుపుమంట"

" అయితే మాత్రం...నువ్వు ఎందుకు భయపడిపోవాలి..నువ్వు ఏం నేర్చుకున్నావు నానుంచి..ఇదేనా..?By Christ in heaven  ..నేను చెబుతున్నా..హాలివుడ్ కి మళ్ళీ వెళ్ళు..నటన లోకి వెళ్ళు..Start acting like a man ఆ Pezzonovante(*) నీకు ఎందుకు చాన్స్ ఇవ్వడో చూస్తాను " డాన్ మాటలకి Johny,Tom లు ఇద్దరు అలా చూస్తుండిపోయారు.

Johny ఏదో చెప్పబోతుండగా చేతి తో ఆగమన్నట్లు సైగ చేసి తను చెప్పడం మొదలుపెట్టాడు.

" చూడు ..Johny ..ఇంకొకటి..నువ్వు నన్ను ఎంతో గౌరవిస్తావు..You are my God son..o.kay!But what about your friends..? నీ చిన్ననాటి మిత్రుడు Nino  ఉన్నాడు.అతనికి కనీసం ఒక చిన్న చాన్స్ ఇప్పించావా నువ్వు హాలీవుడ్ లో వెలుగుతున్నప్పుడు..? అధమపక్షం ఏ సినిమాలో నో ..ఏ చిన్న పాత్ర కైనా అతణ్ణి రికమండ్ చేశావా..?ఎందుకు..ఎందుచేత నీ వల్ల కాలేదు ? ప్రస్తుతం అతను ఓ ట్రక్ డ్రైవర్ గా కాలం గడుపుతున్నాడు.అదే సమయం లో వారాంతాల్లో ఎవరైనా పిలిస్తే తన Band తో వెళ్ళి పాటలు పాడి వస్తుంటాడు..కాని అతను ఎప్పుడు నీ గురించి పల్లెత్తు మాట అనలేదు..తెలుసా"

" Oh..God father ..సినిమా లో చాన్స్ ఇప్పించాలన్నా అతనికి సరైన టాలెంట్ ఉండాలిగదా..అదీ సమయం  కూడా కుదరాలి" సముదాయింపుగా అన్నాడు Johny .

"ఓహో...అలాగా ..నీకు ట్రక్ నడపడం రాదు. అది నాకు తెలుసు.. కాని నీకు ఒక ట్రక్ డ్రైవర్ గా ఉద్యోగం ఇప్పించమంటావా నన్ను..మనసు ఉంటే మార్గం అదే దొరుకుతుంది.If you had build up a wall of friendships..you wound not have to asked me help now సరే..ఇక నువ్వు హాలీవుడ్ లో కి వెళ్ళు ..సక్సస్ అవుతావు మళ్ళీ.."

" ఆ John Woltz మామూలు మనిషి కాదు..అమెరికా ప్రెసిడెంట్ కి కూడా వార్ సినిమాలు తీసే విషయం లో ADVICE ఇచ్చే కమిటీ లో అతను ఒక సభ్యుడు..వాడు నన్ను మళ్ళీ పైకి రానిస్తాడనే నమ్మకం లేదు..." విచారంగా అన్నాడు Johny.

" నువ్వు కొన్ని రోజులు నా యింట్లో ఉండు..చక్కగా తిను..చక్కగా నిద్ర పో..కాస్త విశ్రాంతి తీసుకో ..నా మాటల్ని వింటూ నాతో Company గా ఉండు..అప్పుడు అర్ధం అవుతుంది..ప్రపంచం అంటే ఏమిటో.."

" That guy is a personal freind of J. Edgar Hooven" Johny నొక్కి చెప్పాడు.

"కావచ్చు..But he is a business man..!O.kay..! I will make him an offer ,he can't refuse" డాన్ చెప్పాడు నిమ్మళంగా.

"కొన్ని రోజుల్లోనే John Woltz సినిమా మొదలవ్వ బోతున్నది.అదే ..దానిలోనుంచే నన్ను తీసివేసింది.."

" ప్రస్తుతానికి ఆ సంగతులన్నీ మర్చిపో...అదిగో అంతా ఆ పార్టీ లో నీ కోసం వెయిట్ చేస్తున్నట్లున్నది..ఫో ..వెళ్ళి ఎంజాయ్ చెయ్యి.. " అంటూ Johny ని బయటకి పంపించివేశాడు.

" మీరు తరువాత చూడవలసింది Solozzo ని.అతనికి ఈ వారం లో అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు." గుర్తు చేశాడు Tom.

" అవన్నీ ఈ పెళ్ళి హడావిడి అయిపోయిన తరువాత చూస్తాను."

"Solozzo తో మాట్లాడటానికి ముందు ..మొత్తం Family తో ఒక మాట సంప్రదించితే బాగుంటుందేమో.." ఇక్కడ Family అంటే అర్ధం ఇతర ముఖ్య అనుచరులు అని.

" బాగా గుర్తు చేశావు" డాన్ మెచ్చుకోలుగా  అన్నాడు.

" ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ..ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది.మీ వద్ద Consigliere గా పనిచేసిన Genco Abbandando కాన్సర్ తో బాధపడుతూన్నాడు గదా..అతను ఈ రాత్రి కి మరణించే అవకాశం ఉందని చెప్పారు.అతని కుటుంబ సభ్యులని అక్కడకి రమ్మని కబురుపెట్టాను"

"Good..మంచి పనిచేశావు..Fred ని కారు నడపడానికి రమ్మను.ఆసుపత్రికి కలిసే వెళదాం.. అన్నట్లు కొత్త దంపతులు ఎప్పుడు వెళుతున్నారు "

""కొద్దిసేపట్లోనే ..Cake కోసే కార్యక్రమం అయిపోయిన తరువాత ..!అల్లుడు గారికి Family నుంచి ఏదైనా Gift ఇచ్చే ఆలోచన ఉన్నదా..?"

" అతను కుటుంబం తో మంచిగా జీవించడానికి అన్ని ఏర్పాట్లు చేయండి..అయితే Family కి ఉన్న బిజినెస్ లు గురించి అతనికి తెలియవలసిన అవసరం లేదు.నా కుమారులతో కూడా ఈ సంగతి చెప్పు.."

"సెనేటర్ కాల్ చేశాడు.FBI వాళ్ళు కార్ల నెంబర్లని నోట్ చేసుకున్న విషయమై తన విచారాన్ని తెలిపాడు.అన్నట్లు ఒక గిఫ్ట్ కూడా పంపించాడు."

Luca Brasi గాని,ఆ ఏరియా సెనేటర్ గాని ఇలాంటి వాళ్ళందరూ గాడ్ ఫాదర్ Power structure లో ముఖ్యమైన వ్యక్తులు.

Johny Fontanne ని ఈ ఇంట్లో చూసి ఆశ్చర్యపోతుంది Kay Adams .అదే విషయం Michael తో అంటుంది.

"ఏమిటి..మీ కుటుంబానికి  Johny వంటి పాపులర్ సినిమా మనిషి తెలుసా..నాకు చెప్పలేదేమిటి."

"అది ఒక పెద్ద కధ..ఎనిమిది ఏళ్ళ నాటి మాట.Johny మంచి సింగర్ గా వెలుగుతున్న రోజుల్లో ..ఒక Band leader కాంట్రాక్ట్ కింద ఉండేవాడు.ఎన్ని రికార్డులు అమ్ముడయినా ..ఎంత లాభం వచ్చినా ఒక్క పైసా కూడా అదనంగా ఇచ్చేవాడు కాదు. Johny గాడ్ ఫాదర్ ని హెల్ప్ చేయమని కోరాడు. ఆ కాంట్రక్టర్ ని గాడ్ ఫాదర్ ఎంత బ్రతిమలాడినా అగ్రిమెంట్ నుంచి విడుదల చేయడానికి సమ్మతించలేదు.చివరికి పదివేల డాలర్లు ఇస్తానన్నా ఒప్పుకోలేదు.ఆ కాంట్రాక్టర్ ఇరవై వేల డాలర్లకి ఇస్తే ఆలోచిస్తానన్నాడు.ఆ తెల్లారి Don Corleone ఒక కారు లో అతని ఇంటి ముందు దిగాడు.వెంట Luca Brasi  ఇంకా Genco Abbandando ఉన్నారు.పిస్టల్ ని ఆ కాంట్రక్టర్ కణతలకి గురిపెట్టి అన్నాడు డాన్." నీ ముందు పదివేల డాలర్లకి గాను డాక్యుమెంట్స్ ఉన్నాయి.సంతకం చెయ్యి..లేదా నీ మెదడు బయటికి వచ్చి దాని మీద సంతకం చేస్తుంది.రెండే నిమిషాలు ... అంతే... ఆ తరువాత జరిగిందంతా పెద్ద చరిత్ర..Johny Fontaanne అనబడే ప్రఖ్యాత గాయకుడు అమెరికా లో సృష్టించిన సెన్సేషన్ అందరికీ తెలిసిందే.."

" మై గాడ్...అలాంటి పరుల కోసం సాహసించే ఒక వ్యక్తి తండ్రి అయినందుకు నీకు అసూయగా లేదూ"  అంది Kay ఆశ్చర్యంగా..!



 (మిగతాది వచ్చే భాగం లో చూద్దాం)  ---KVVS Murthy



Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ఎనిమిదవ భాగం)

పెళ్ళికి వచ్చిన వారంతా ఆ చివరి తంతు..అదే ఆ వెడ్డింగ్ కేక్ ని కోయడం,తినడం అదంతా కానిచ్చారు.Don Corleone వారందరికీ వీడ్కోలు ఇచ్చి...తన కారులో వచ్చి కూర్చున్నాడు ఆసుపత్రి లో మరణశయ్య పై ఉన్న Genco Abbandando ని సందర్శించడానికి..!Fredo  కారు నడుపుతున్నాడు.Johnny,Michael,Sunny వీరంతా కూడా డాన్ తో పాటు కారులో కూర్చున్నారు.

వెళుతూ మాట్లాడుకుంటున్నారు.

"Michael.. నీ చదువు అయిపోయినతరువాత నా దగ్గర కొన్ని ప్రణాళికలున్నాయి..నీకు నచ్చితే ఆ లైన్ లో వెళ్ళవచ్చు..ఏమంటావు.."

తండ్రి మాటకి ఏమి బదులివ్వకుండా అలాగే వింటూ ఉండిపోయాడు అతను.

ఇంతలో మరో కుమారుడు Sunny నవ్వుతూ అన్నాడు." Pop.. ఈ సినీ కళాకారుడు Johnny బాధపడుతున్నాడు.ఆ John Woltz మీ మాట వింటాడా లేదా అని.."

"ఏయ్ ..Johnny అవన్నీ మర్చిపో...Tom ని ఆ పని మీదనే ఉంచాను.ఏది ఎలా కదపాలో నాకు తెలుసు..నేనెప్పుడైనా నీకు empty promises చేశానా..? "  అన్నాడు Don.

" అబ్బే..క్షమించండి..నా ఉద్దేశ్యం అది కాదు.వాడు చాలా Tough మనిషి.అదే మీరు అంటూ ఉంటారే..ఆ భాషలో చెప్పాలంటే He is a real .90 caliber pezzovanante ..!" అన్నాడు Johnny.

సరే..ఆసుపత్రి వచ్చింది..పద.."

అంతా దిగి లోపలకి వెళ్ళారు.అప్పటికే అక్కడ Genco భార్య,కుమార్తెలు వచ్చి వున్నారు.Don ని చూసి Genco భార్య కన్నీరు మున్నీరయింది.

"Oh..what a saint you are..to come here on your daughter's wedding day.. ఎంతో బిజీ గా ఉండే పెళ్ళిరోజున మీరిక్కడికి వచ్చారా.." అంటూ Don ని కౌగలించుకుంది.

" 25 ఏళ్ళు గా నాకు కుడి భుజం గా ఉన్న నా మిత్రునికి ఆ మాత్రం గౌరవం ఇవ్వవద్దా.." అన్నాడు డాన్.

అంతలోనే అక్కడికి వచ్చాడు డాక్టర్.

" ఇంతమంది ఒకేసారి లోపలికి వెళితే ఎలా..అవతల పేషంట్ పరిస్థితి సీరియస్ గా ఉంది గదా.." అన్నాడతను.

" అదే నేనూ చెబుతున్నాను.. ఈ పరిస్థితి లో మీరు మాత్రం చేయగలిగేది ఏముంది అక్కడ.మంచి అయినా ..చెడు అయినా ఇక చూసుకోవలసినదంతా మేమే కదా .." అన్నాడు డాన్.

ఇంతలో ఒక నర్స్ వచ్చి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళింది.మంచం లో ఒక అస్థిపంజరం లా పడిఉన్నాడు Genco.అందర్నీ చూసి లేవాలని ప్రయత్నించి తనవల్ల కాక దిండుకి చేరగిలపడ్డాడు.ఆరిపోయే దీపం లోని వెలుతురు లా ఉన్నాడతను.

" My freind..నా కుమారులని నీవద్ద కి తీసుకొచ్చాను..ఇదిగో చూడు ..మన Johnny కూడా వచ్చాడు.మమ్మల్ని కళ్ళు విప్పి చూడు.."  విపరీతమైన జ్వరం లో ఉన్న Genco ఆ మాటలు విని మూతబడుతున్న కళ్ళని బలవంతంగా తెరిచాడు.కొద్దిగా రొప్పుతున్నాడు.

తనపక్కనున్న కుర్చీలో కూర్చోమని డాన్ కి సైగ చేశాడు.వెళ్ళి కూర్చోగానే Don చేతిని ఆప్యంగా పట్టుకున్నాడు Genco.

" Genco..మళ్ళీ నువ్వు మంచిగా అవాలి..కోలుకోవాలి.. నువ్వు ..నేను ఇద్దరం కలిసి మళ్ళి ఇటలీ లోని ..ఆ మారు మూల పల్లె కి ..అదే మన గ్రామానికి ..వెళ్ళిపోవాలి.అదే విధంగా అప్పటిలాగా నే...మన తల్లీ తండ్రులు..తిరుగాడిన ..ఆ నేలలో ఆడుకోవాలి .." ప్రేమ నిండిన స్వరం తో అన్నాడు Don.

Genco కంటిలో కన్నీటి తెర..!

"నా శరీరాన్ని ఎవరో కాల్చుతున్నట్లుగా అనిపిస్తోంది మిత్రమా..నా ప్రతి అణువుని ఏవో పురుగులు తొలుస్తున్నట్లుగా బాధ కలుగుతున్నది.ఈ నరకం నుంచి నన్ను తప్పించవా...నువ్వు God Father వి గదా.నీ ప్రతి కదలిక లోనూ ఏదో తెలియని శక్తి ఉంటుంది ..ఏ Strings ని ఎలా Pull చేయాలో నీకు తెలుసు.." సన్నగా కంపించుతున్న స్వరం లోనుంచి అన్నాడు Genco.

"మిత్రమా...నాకే గనక ఆ శక్తి ఉంటే ..నీ కంటే నాకు ఎక్కువ ఎవరు..!అయితే ఒకటి నీ ఆత్మ రక్షింపబడటానికి ప్రతి రాత్రి దైవ ప్రార్ధనలు చేయిస్తాను.అలాంటప్పుడు నీవు నరకం లోకి ఎలా తోయబడతావు.."

"నా చివరి ఘడియలు ఇలా నీ సమక్షం లోనే కానివ్వు.ఏదీ నీ చెయ్యి.అలాగే నన్ను పట్టుకో.ఏమో ..ఆ దేవుడు కూడా మనల్ని చూసి భయపడతాడేమో..ఎన్నిసార్లు మనం అలా విజయం సాధించలేదు..We will outwit that bastard as we've outwitted others.."

అలాగే Don Corleone అతని చేతి ని పట్టుకొని ఉండిపోయాడు.కొంతసేపటికి Genco ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది.అతని ప్రాణం Don  లోకి గాని లాగేసుకున్నాడా అనిపిస్తుంది ఆ దృశ్యాన్ని చూసినవారికి..!

(మిగతాది వచ్చేభాగం లో చూద్దాం) ---KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (తొమ్మిదవ భాగం)

Genco Abbandando ఆసుపత్రిలో మరణించాడుగదా..ఆ కాన్సర్ వల్ల..అందువల్ల Consigliere గా Don Corleone వద్ద Tom Hagen పూర్తి స్థాయిలో నియమించబడ్డాడు.ఇక్కడ ఈ Consigliere అనే పోస్ట్ గురించి కొంత చెప్పుకోవాలి మనం.

సిసిలియన్ సంప్రదాయం ప్రకారం ప్రతి Don ఒక Consigliere ని కలిగిఉంటాడు.తన యొక్క అధికారబలాన్ని ఈ వ్యక్తి ద్వారా ప్రవహింపజేస్తుంటాడు. ఇతను తిరుగులేని Loyalty ని కలిగినవాడైఉంటాడు.Don చేసే ప్రతి పని ఇతనికి తెలుస్తుంది.మరయితే అతను నమ్మకద్రోహిగా మారి డాన్ కి అపకారం చేయవచ్చుగదా..అనే అనుమానం రావచ్చు.ఇటాలియన్ చరిత్రలో ఎప్పుడూ Consigliere వెన్నుపోటు దారునిగా మారలేదు అంటాడు మేరియో ప్యూజో.ఎందుకంటే ప్రతి జాతి కి తనదైన ఒక రీతి ఉన్నట్లుగానే వారికి Omerta అనే ఒక సంప్రదాయం ఉన్నది.అది వారి మూలుగ లోనే ఉందని వారి భావన.

Omerta అంటే ఒక్క మాటలో చెప్పాలంటే Code of silence .రహస్యాలని కాపాడడం,అవసరమైతే ఆ క్రమం లో ప్రాణాలకి వెరవకుండా నిలబడడం.ఇటలీ నుంచి అమెరికా వచ్చి న్యూయార్క్ లో స్థిరపడిన అనేక ప్రధానమైన కుటుంబాలు అక్కడి  ఆర్ధిక ,రాజకీయ వ్యవహారాలను శాసిస్తుంటాయి.తమదైన Organised muscle footing తో ఈ పనులు చేస్తుంటారు.దాని నే మాఫియా గా పిలుస్తారు.Gambling,unions,prostitution, films,Drugs ఒక్కటేమిటి  ఇలా ధనం సంపాదించగల ప్రతిరంగాన్ని తమ ఆధిపత్యం లో పెట్టుకుంటారు. దేశాన్ని కొన్ని ఏరియాలుగా ,మళ్ళీ ప్రధాన నగరాల్లో ప్రత్యేక తరగతులుగా విభంజించుకొని ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరు  ఆధిపత్యం చలాయిస్తుంటారు.

దీనిలో ఓ అయిదారు కుటుంబాలు న్యూయార్క్ లో ఉంటాయి.అవి అన్ని ఇటలీ నుంచి వచ్చినవే...పంచుకొనే విషయాల్లో గొడవలు వచ్చి ఒకానొక సమయం లో వీళ్ళు పెద్ద యుద్ధాలనే సృష్టిస్తారు.కొన్ని వారాలపాటు తుపాకులతో కాల్చుకొని చచ్చిపోవడం కూడా జరుగుతుంది.అయితే అలాంటి సమయం లో మన God Father రంగం లోకి దిగి శాంతి ప్రతిపాదనలు చేసి ..మనం ఇలా కొట్టుకు చావడం వల్ల ఎవరికి ఒరిగేదేమిటి ..అందరికీ నష్టమే...కనుక ఒకరి ఏరియాలోకి ఒకరు రాకుండా..అవసరమున్నచోట ఒకరికి ఒకరం సహకరించుకుంటూ పోతేనే మనం అందరం వృద్ది చెందుతాము..మన భవిష్యత్ తరాలు మన దూరదృష్టిని అనుభవిస్తాయి... అని బోధ చేసి  అందరి మధ్యలో సమన్వయం సాధిస్తాడు. దానినే గ్రేట్ వార్ గా నవల లో అక్కడక్కడ చెప్పబడుతుంది. సరే...ఇదంతా ముందు వస్తుంది అప్పుడు చూద్దాం..!

ఆ..ఎక్కడున్నాం..Consigliere దగ్గర కదూ.ఆ పోస్ట్ లో ఉన్నవానికి రాజకీయ ,ఆర్దిక బలాలు తన డాన్ వల్ల పుష్కలంగా లభిస్తాయి.కాబట్టి Traiter గా మారితే ఒరిగేదేమీ ఉండదు  చావు తప్ప..కనుకనే ఆ పని ఎవరూ చేయరు.Italiyan కాని వారిని ఎంతమాత్రం మాఫియా ఫేమిలీ లు తమ Consigliere గా నియమించుకోవు.ఒకరకంగా చెప్పాలంటే God Father దానికి వ్యతిరేకంగా వెళ్ళి Tom Hagen ని ఆ పోస్ట్ లో నియమించుకున్నాడు.అందుకనే మిగతా మాఫియా ఫేమిలీ లు వీళ్ళని Irish Gang అని పరిహాసంగా పిలుస్తుంటారు.

మళ్ళీ ఇంకొకటి Don తన కార్యాన్ని కొన్ని అంచెలుగా చేస్తాడు.ఇది కూడా మాఫియా పద్దతుల్లో ఒక కార్య విధానం.ఉదాహరణగా ఒకటి చెప్పుకుందాం.Amerigo Bonasera  కుమార్తె పై దాడి చేసిన యువకుల పై ఎలాంటి చర్య తీసుకోవాలో డాన్ చెబుతాడు Tom Hagen కి తన గది లో ఒంటరిగా ఉన్నప్పుడు.అక్కడ ఎవరూ విట్నెస్ ఉండరు.అలాగే Tom తాను ఒంటరిగా ఉన్న సమయం లో తన గది లోకి Clemenza ని పిలిచి దాడికి సంబందించిన వివరాలు చెబుతాడు. మళ్ళీ Clemenza తన దగ్గర పనిచేసే Paulie Gato ని విట్నెస్ లేని సమయం లో దానికి సంబందించిన ఆదేశాలిస్తాడు. అంటే ఇప్పుడు కార్యరంగం లో కి దిగి దాడిచేయడానికి ఉద్యుక్తుడయ్యేది ఈ Paulie Gato అన్నమాట.ఫీల్డ్ లోకి ఎంతమంది మనుషులు అవసరం అనేది లెక్క వేసుకొని ఇతను రంగం లోకి దిగుతాడు.

అంటే ఇప్పుడు చూడండి..అసలు ఈ దాడి ఎవరు ఎందుకు చేయించుతున్నారు అనేది ఈ చేసే వాడికి కూడ తెలియదు.ఒకవేళ ఈ లింక్ లో ఏ లింక్ అయినా మోసానికి గనక దిగితే ఆ లింక్ ని భౌతికంగా తీసి వేస్తారు. ఇలాంటి నక్క జిత్తుల్లో ఆరితేరినవారు గనకనే ప్రతి వారు అలర్ట్ గా ఉండి ఎవరి పని వారు చేసి వారికి ముట్టేదాన్ని తీసుకుంటారు.ఫేమిలీ కి లాయల్ గా ఉన్నత కాలం అతని జరుగుబాటుకి ఏమీ లోటు ఉండదు. ఈ దాడి చేయబోయె Paulie Gato పేరు మీద అప్పుడే ఓ మెడికల్ సర్టిఫికేట్ కూడా తయారయిపోయి ఉంది. అతను ఓ మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకొంటున్నట్లుగా..! పోలిస్ కేసు అయితే దాన్ని ప్రొడ్యూస్ చేస్తారన్నమాట.

సరే ఇప్పుడు Paulie Gato ఒక బార్ లో బీరు తాగుతు వేచి చూస్తున్నాడు.ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఇక్కడకి సాయంత్రం నుంచి రాత్రి దాకా మందు కొట్టడానికి వస్తుంటారు. రెకి నిర్వహించి వాళ్ళ విషయాలు తెలుసుకున్నాడు.ఒక రకంగా చెప్పాలంటే ఇది ఓ QUICK JOB. కొంచెం టైం తీసుకొని స్కెచ్ వేస్తే అది ఇంకా పక్కాగా ఉంటుంది.కాని తప్పదు Clemenza చెప్పాడుకదా.

కాసేపయినతర్వాత వెనక్కితిరిగిచూస్తే వాళ్ళు బీరు తాగుతూ ఆ బార్ గర్ల్ తో నవ్వుతూ ముచ్చట్లు పెడుతున్నారు. ఒకడి పేరు జెర్రి,ఇంకోడి పేరు కెవిన్.తను చూడనట్లే నటిస్తూ వాళ్ళ మాటల్ని వింటున్నాడు."మాతో కారు లో రావొచ్చుగా ఇప్పుడు.." అని ఒకడు అంటూ ఉండగా "ఏయ్..జెర్రి..ఒకమ్మాయి ఆసుపత్రి పాలయింది..ఏం నాకు తెలియదా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా" అంటూ ఆ అమ్మాయి అతడిని ఆటపట్టిస్తున్నట్లుగా అంది.ఆహా..ఇక Confirm అనుకున్నాడు Paulie Gato.

వాళ్ళిద్దరు తాగేసినతర్వాత బయటికి వచ్చి వాహనం ఎక్కబోతుండగా కవ్వించినట్టుగా ..ఒక మాట అన్నాడు Pauli వాళ్ళవైపు చూస్తూ..! మరి ఏం అనిపించిందో గాని వాళ్ళిద్దరూ Paulie వేపు దూసుకు వచ్చారు ..అంతే మెరుపు వేగం తో Paulie తన చేతికి అప్పటికే తొడుక్కున్న Brass knucles తో జెర్రి ముక్కు మీద బలంగా ఒక్క గుద్దు గుద్దాడు.రక్తం కార్తుండగా ఆ కుర్రాడు దబుక్కున కిందపడ్డాడు.ఇంకో కుర్రాడు కెవిన్ గట్టిగా అరవబోతుండగా వాడి రెండు చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకున్నాడు..వెంటనే ఆ క్రీనీడలో నక్కిన Paulie మనుషులు వాళ్ళు ఇద్దరిని బలవంతంగా తమ కారులో తోశారు.మరీ చావకుండా Police mug shots లాంటివి బలంగా ఇచ్చి కుమ్మేశారు.కొన్ని రోజులు ఆసుపత్రి లో ఉండటం ఖాయం అనుకున్నాక వాళ్ళిద్దరిని ఓ రోడ్డు వారగా డంప్ చేసిపారేశారు.ఆ కారు ని అక్కడే వదిలేశారు.అది ఒక దొంగిలింపబడిన కారు.నెంబర్ కూడా నకీలీదే.అయినా ఇలాంటి Black Chevy Sedan కార్లు కొన్ని వేలు వుంటాయి ఈ న్యూయార్క్ మహా నగరంలో..!

(మిగతాది తరువాత భాగం లో చూద్దాము) ---KVVS Murthy    



Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (పదవ భాగం)

Tom Hagen లాస్ ఏంజల్స్ లో ఒక హోటల్ లో దిగాడు.Don అప్పగించాడు కదా Johnny వ్యవహారాన్ని సెటిల్ చేయమని.అందుకని ఆ బడా మూవీ దిగ్గజాన్ని అదే John Woltz ని కలవడానికి వచ్చాడు.Bill Goff అనే వ్యక్తి ద్వారా అపాయింట్మెంట్ ఉదయం పది గంటలకి కలిసేటట్లు తీసుకుంటాడు.ఈ Bill Goff సినీ పర్శ్రమలో ఒక యూనియన్ లీడర్.Don Corleone యొక్క మాటకి విలువనిచ్చే మనిషి కూడా.ఇతను డాన్ ద్వారా అనేక ఇతరవిషయాల్లో సహాయం పొందినవాడే.ఇతనిద్వారా అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేయించింది ఎవరో కాదు డాన్ నే.దానిలోని ఆంతర్యం ఏమంటే అవసరమైతే కార్మికుల నుంచి సమ్మే వంటి సమస్యలు సృష్టించగలమనే సంకేతం పంపించడం కోసమన్నమాట.

అంటే Don  పరిధి న్యూయార్క్ దాటి హాలీవుడ్ లో కూడా ఉన్నదని Tom గ్రహిస్తాడు.నిజం చెప్పాలంటే ..Don యొక్క అధికారవిస్తృతి తనకి కూడా పూర్తిగా తెలియదు.ఇప్పుడిప్పుడేగా Consigliere పదవి లోకి వచ్చింది.

John Woltz ఆఫీసుకి వెళ్ళిన తర్వాత ఒక అరగంట లేటుగా లోనికి రమ్మని Tom కి పిలుపువచ్చింది.అయితే ఈ సినీ దిగ్గజం గురించి వచ్చేముందు కొంత స్టడీ చేసే బయలుదేరాడు.తన పదవయేట ఖాళీ బీరుసీసాలు లాంటివి అమ్ముకునేవాడు. నలభైవ ఏట గార్మంట్ బిజినెస్ లో సక్సెస్ అయి సినిమా నిర్మాణం లోకి అడుగుపెట్టి అక్కడా బాగా సక్సెస్ అయ్యాడు.సొంత స్టూడియో కట్టాడు.హీరో హీరోయిన్ ల ఇంకా ఇతర టెక్నీషియన్ల జాతకాలు మార్చకలిగే స్థాయికి చేరుకున్నాడు.

అతని కుమార్తె ఒక English Lord ని,కుమారుడు ఓ Italian Princess ని వివాహమాడారు.తను అమెరికా ప్రెసిడెంట్ కి వార్ సినిమాలు నిర్మించే విషయంలో ఉన్న కమిటి లో ఓ సభ్యుడు.ప్రస్తుతం తన భార్య గా ఉన్నావిడ గతం లో సినిమా స్టార్ గా వెలిగిన ఓ అందగత్తె.నటనకీ వీడ్కోలు చెప్పిందామె.

John Woltz కి ఈ మధ్యలో రేసు గుర్రాల పిచ్చి పట్టుకున్నది.Khartoum అనే ఓ అందమైన,బలమైన గుర్రాన్ని ఆరు లక్షల డాలర్లు పెట్టి కొన్నాడు. లోపలకి వెళ్ళబోతున్న తరుణం లో అక్కడనుంచి బయటకి వస్తూ ఓ తల్లి కూతురు లా ఉన్నారు..ఎదురొచ్చారు.బహుశా సినిమా చాన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లుంది తన కూతురికి. కూతురుకి ఏదో సూచనలు ఇస్తోంది.బహుశా ఈ అమ్మాయిని రాత్రికి ఈ సినీ దిగ్గజం దగ్గరకి పంపించడానికి సన్నాహం చేస్తున్నట్లున్నది.అందుకేనా Johnny లాంటి వాళ్ళు ఈ సినీ ప్రపంచంలో సక్సెస్ కావడానికి అంత తహ తహ లాడుతుంటారు అనిపించింది.

లోపలికి వెళ్ళగానే మర్యాద గా రిసీవ్ చేసుకున్నాడు.పరిచయాలు గట్రా అయిన తర్వాత Tom అన్నాడు.

" నాకు క్లయింట్ గా ఉన్న మిత్రునికి ఓ సహాయం చేస్తారేమోనని వచ్చాను."

"దానివల్ల నాకేమిటి ప్రయోజనం" అన్నాడు John Woltz.

"మీకు ఎలాంటి లేబర్ యూనియన్ సమస్యలు వచ్చినా నా క్లయింట్ మీకు సహాయం చేయగలడు.ఏ పనిని అతను ఇతరులనుంచి అయాచితంగా పొందడు."

John Woltz కి కొద్దిగా మండింది.

"ఏం..దందాగిరి చూపిస్తున్నారా..నేను చాలా చూశాను" కోపంగానే అన్నాడు.

"ఆ పని చేసిపెట్టినందువల్ల మీకు ఏమీ నష్టం ఉండదు"

"You guinea mafia gumbas...నీకు తెలుసా అమెరికా అధ్యక్షుడు నా స్నేహితుడు"

Tom ఎంతమాత్రం ఆవేశపడకుండా స్థిరంగా ఉన్నాడు.సంప్రదింపులు జరిపేటప్పుడు అలా ఆవేశరహితంగా ఉండడం  అనేది Don నుంచి నేర్చుకున్నాడు."First,Reason with people అనేది ఆయన విధానం.అవి అన్ని విఫలమైనప్పుడు మాత్రమే మిగతా ప్రత్యమ్నాయాలు వెదుకుతాడతను.కాబట్టే ఈ నిర్మాత చేసే ఈసడింపులు ,బెదిరింపులు తనని కానట్లుగా నిర్లక్ష్యం చేస్తూ మాట్లాడుతున్నాడు.

Don Corleone తన ఆఫీసులో చేసే కొన్ని పంచాయితీలు చూస్తుంటాడు.రెండు వర్గాలవారిని సమన్వయం చేసే దిశగా ఎంతో ఓర్పుతో మాట్లాడుతుంటాడు.అవతల వారు చేసే అవమానకరమైన కామెంట్లని సైతం అతను లక్ష్యపెట్టడు.తనకి తెలిసీ ఒక విషయం లో ఎనిమిది గంటలపాటు అలాగే కూర్చొని నెగోషియేషన్స్ నడిపిన Don చివరకి చేతులెత్తేశాడు."ఇక ఈ  వ్యక్తిని  తనకి ఇష్టం వచ్చినట్లు చేసుకోమను...నేనైతే ఒప్పించలేను.." అని లేచిపోయాడు.

ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ వ్యక్తి ఓ షాపులో కూర్చొని ఉండగా ఏదో గొడవ జరిగి అనుకుంటా హత్య చేయబడతాడు.ఆ  విధంగా ఉంటుంది Don యొక్క శైలి.

" నా మిత్రుడు సినిమా బిజినెస్ లోకి రావాలనుకొంటున్నాడు.పెట్టుబడి పెట్టడానికి కూడా తయారుగా ఉన్నాడు.ఓ సారి మాటల సందర్భం లో అన్నాడు"

Tom అలా అనడం తో ఆ సినీ దిగ్గజం ఒక్కసారిగా కొద్దిగా మెత్తబడిపోయాడు.అనునయంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.

"మనం మధ్యానం మాయింట్లో భోజనం చేస్తూ మాట్లాడుకుందాం.ఇవన్నీ..సరేనా..!మీ హోటల్ కి మా కారు వచ్చి పికప్ చేసుకుంటుంది." అన్నాడు John Woltz.

అతను చెప్పిన విధంగానే కారు పంపించాడు.ఇల్లు ఇంద్ర భవనం లా ఉంది.లోపలికి వెళ్ళగానే మార్టిని మద్యాన్ని గ్లాసు లో పోసి Tom కి ఇచ్చాడు John Woltz.

" భోజనం చేయడానికి ముందు కాసేపు అలా వెళ్ళి మాట్లాడుకుందాం ..పదా..నేనీ మధ్య మతి పోయేంత  గుర్రాన్ని కొన్నాను.అసలు అలాంటి గుర్రం ఆ రోజుల్లో రష్యా జార్ చక్రవర్తులకు కూడా ఉండి ఉండదు.అమెరికా లో బలమైన,అందమైన అశ్వజాతి ని పెంపొందించే కార్యక్రమాన్ని మొదలుపెడతాను." గర్వంగా చెప్పాడు John Woltz.

నిజంగా నే అతను చెప్పినదానిలో అతిశయోక్తి లేదనిపించింది.ఆ గుర్రాన్ని చూసిన తర్వాత..! ప్రేమ తో ఆ గుర్రాన్ని తట్టి "Khartoum" అని రెండు సార్లు పిలిచాడు.అది కూడా అతని భాషలో ఉన్న ప్రేమని అర్ధం చేసుకున్నట్లుగా మొహాన్ని చిన్నగా ఊపింది.

మళ్ళీ అతనే అన్నాడు." బహుశా మా నాయనమ్మనో,అమ్మమ్మనో ఏ  Cossack జాతికి చెందినవాడో చెరిచిఉంటాడు.లేకపోతే నాకు ఈ గుర్రాల పిచ్చి ఎందుకు వస్తుంది..అదిగో అటుచూడు..దాని శిశ్నాన్ని చూశావా...అలాంటిదిగనక నాకు ఉంటే అదిరిపోతుందిగదూ.."

అట్లా ఆ యవారాలన్నీ అయిపోయాక భోజనం చేయడానికి ఉపక్రమించారు.John Woltz ఇంట్లో ఉన్న ఇద్దరు బట్లర్లు వడ్డించసాగారు.

" అన్ని పాత్రలకి నటీనటుల్ని ఎన్నుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు తీసే సినిమాలో ఆ Johnny కి ఎలాంటి పాత్రని నేను ఇవ్వలేను.ఆ ఒక్కటి తప్ప ఇంకా ఏమి అడిగినా నేను రెడీ" అన్నాడు John Woltz.

దొంగ నాకొడకా ఈ మాత్రం దానికి ఎందుకు పిలిచావురా లంచ్ కి అనుకున్నాడు Tom లోలోపల.

"అంటే నా మిత్రుడు నీకు సహాయపడలేడని అనుకుంటున్నావా"

"అబ్బా..Tom నువ్వు నన్ను సరిగా అర్ధం చేసుకోవడం లేదు.వాడు నాకు చేసిన ద్రోహం మాములుది కాదు.నేను ఎంతో ధనాన్ని వెచ్చించి గుర్రం లాగా మేపిన ఓ మంచి హీరోయిన్ ని అదే Margot Ashton ని వాడు ఎగరేసుకుపోయాడు.దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా పెద్ద స్టార్ అవుతుందని.."

ఇలాంటి వ్యవహారాలన్ని వ్యక్తిగతమైనవి గదా..బిజినెస్ కి దానికి ఎందుకు ముడిపెట్టి ఆలోచిస్తున్నాడు ఇతను అనిపించింది. Don Corleone ప్రపంచం లో ఇలాంటి వాటిని బిజినెస్ తో లింక్ పెట్టి చూడరు.వ్యక్తిగత ఎమోషన్స్ వేరు...దానికి బిజినెస్ ని కలపకూడదు అనేది డాన్ విధానం.సరే...కుటుంబపరమైన గౌరవం తో ముడిపడిన విషయాల సంగతి వేరు.

"ఒక ఫేవర్ చేయడానికి నిరాకరించినవారిని ..ఇంకో ఫేవర్ God Father అడగడు" అన్నాడు Tom.

" I am sorry.. The answer is still NO"  తెగేసి చెప్పాడు ఆ మూవీ మొగల్.

(మిగతాది తరువాత భాగం లో చూద్దాం)  --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (పదకొండవ భాగం)


సినీ దిగ్గజం John Woltz ని కలిసిన తరవాత Tom వెనుదిరిగి న్యూయార్క్ కి వస్తాడు.అతను ఇప్పుడు Virgil Sollozzo కోరిక మేరకు గాడ్ ఫాదర్ త మీటింగ్ కి సన్నాహాలు చేస్తున్నాడు.శుక్రవారం పూర్తి సాయంత్రాన్ని కేటాయించవలసిందిగా Solozzo విజ్ఞప్తి చేశాడు.ఎందుకంటే తన బిజినెస్ డీల్ కి సంబందించిన విషయాలన్నీ డాన్ కి వివరంగా చెప్పవచ్చునని..!

John Woltz తో జరిగిన సంభాషణ తాలుకు వివరాల్ని వచ్చిన వెంటనే డాన్ కి తెలిపాడు.ఎంత అతిశయం తో ..బెదిరించే విధానం లో ఎలా అతను మాట్లాడాడో కళ్ళకి కట్టినట్లు చెప్పాడు.తను అక్కడున్నప్పుడే ఓ తల్లీ కూతుళ్ళు అక్కడికి రావడం  అవన్నీ..!

"Infamita " అన్నాడు డాన్ అవన్నీ విని.

" తనకి గల పరిచయాల్ని బట్టిగాని..ధనం బట్టిగాని John Woltz చాలా మొండిగా మాట్లాడాడు.."

" Does that man have real balls..? " అడిగాడు డాన్,ఏం జరిగినా తట్టుకునే దమ్ము,ధైర్యం అతనికి నిజంగా ఉన్నాయా అనే అర్ధం లో అలా అడుగుతాడు ఆయన.అచ్చంగా అనువాదం చేసి చెప్పాలంటే వాడికంత పిచ్చలున్నాయా అని ముతక భాషలో అంటాం చూడండి అలా..!

"మీరనేది అతను ఒక Sicilian లాంటి వాడేనా..అని కదూ..? హ్మ్మ్ ...లేదనే చెప్పాలి"

Tom ని దగ్గరకి పిలిచి కొన్ని చేయవలసిన పనుల గూర్చి చెవిలో చెబుతాడు.ఇక Johnny Fontanne సమస్య తీరిపోయినట్లే అని నవ్వుకుంటాడు TOM.

 ఆ తర్వాత ఇంటికి వచ్చిన కాసేపటికి ఓ ఫోన్ వచ్చింది.అది Amerigo Bonasera గొంతు.ఆనందం తో  ఉబ్బితబ్బు అవుతున్నాడతను."  God Father ..నా కుమార్తె కి జరిగిన అన్యాయానికి తగిన విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పారు.నా Life long friendship ని ఆయనకి ఆఫర్ చేస్తున్నాను" అనాడు Bonasera.

" సరే..మంచిది..గాడ్ ఫాదర్ కి మీ మాటల్ని అందజేస్తాను.." అన్నాడు Tom.

మరికొంతసేపు తరవాత ఇంకో ఫోన్ వచ్చింది.ఈసారి చేసింది John Woltz .అతని గొంతు కోపం తో మండి పోతోంది."  You fucking bastards..I will have you all in jail for a hundred years.I will get Johnny's  balls cut off..you guinea fuck ...ఇంత పనికి తెగిస్తార్రా.." అంటూ పరమ బూతులు తిడుతున్నాడు John Woltz.

" I am not guinea ..I am Irish- German "  అని నవ్వి ఫోన్ పెట్టేశాడు Tom.

ఆ సినీ దిగ్గజానికి అంత కోపం ఎందుకొచ్చింది అనుకొంటున్నారా..కారణం సహేతుకమే..అతడు ప్రేమతో ఆరులక్షల డాలర్లు పోసి కొనుక్కున్న గుర్రాన్ని,అదే KHORTOUM ని ..దాని తలనరికి అతడి గుమ్మం ముందు పెడితే మండదూ..! ఇక ఏం చేయాలో అర్ధం గాక ఆ గుర్రానికి ఏదో అనారోగ్యం వచ్చి కాలం చేసినట్లుగా ప్రచారం చేసుకున్నాడు.

(మిగాది వచ్చే భాగం లో చూద్దాం)  --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (పన్నెండవ భాగం)

ఆ సాయంత్రం డాన్ ఇంటికి వెళ్ళి Solozzo విషయాలు చర్చించాడు Tom." రేపు  మిమ్మల్ని కలుసుకోనున్నాడు Solozzo ..అతను వచ్చేది ఎందుకంటే ఒక బిజినెస్ డీల్ మాట్లాడటానికి.అతను Narcotics వ్యాపారం లోకి దిగబోతున్నాడు.ఇప్పటికే అతనికి టర్కీ లో Poppy ని పండించే క్షేత్రాలున్నాయి.హెరాయిన్ గా ఆ పంటని మార్చడానికి సిసిలి లో ఒక కార్యస్థానం ఉంది.అక్కడినుంచి అమెరికా కి సరుకు దిగడానికి ..ఇంకా వ్యాపారానికి మిమ్మల్ని సహాయం అడుగుతున్నాడు."

Tom అన్న మాటల్ని విని అడిగాడు Don." అంటే మనం ఎలాంటి సహాయం చేయాలట"

"ఏవైనా న్యాయపరమైన చిక్కులు ఏర్పడితే  జడ్జి లని ప్రభావితం చేయడం...ఇంకా కొంత మంది ముఖ్యమైన పొలిటీషియన్లని  దువ్వడం లాంటివి.అంతేకాదు..రెండు మిలియన్ డాలర్  ల ఫైనాన్స్ అడుగుతున్నాడు..వడ్డీతో తిరిగి ఇస్తాడట."

డాన్ సిగార్ తాగుతూ వింటున్నాడు.ఓసారి పెద్ద కొడుకు Sonny వేపు చూసాడు అభిప్రాయం ఏమిటన్నట్లుగా..!

" Protection  ఇంకా Finance విషయం లో మనం చూసుకుంటే బాగానే ఉంటుంది" అన్నాడతను.

"Tom..చెప్పు నీ అభిప్రాయం ఏమిటి...అఫ్ కోర్స్ నువ్వు ఏకీభవించకుండానూ ఉండవచ్చు..నీకు ఆ హక్కు ఉంది" డాన్ అన్నాడు.

" మనం ఈ అవకాశం తీసుకోకపోతే ,మరొకరు తీసుకొంటారు.ముఖ్యంగా Tattaglia ఫేమిలీ వాళ్ళు దీన్ని విడిచిపెట్టరు.ఇప్పటికె Solozzo వారిని సంప్రదించినట్లుగా ఓ వార్త వుంది.Narcotics బిజినెస్ లో లాభాలు ఊహించనంతగా ఉంటాయి.సరే...దానికి తగిన రిస్క్ లూ ఉంటాయి. గేంబ్లింగ్ లాంటి రంగాల్లో మనం ఇప్పటికే బలంగా ఉన్నాం..రాబోయే రోజులు నార్కోటిక్స్ వేనని నా నమ్మకం" Tom చెప్పాడు.

"రేపు ఉదయం ఎన్ని గంటలకి వస్తున్నాడు తను" డాన్ అడిగాడు.

"పది గంటలకి"

" Sonny నువ్వుకూడా ఉండు ఆ సమయానికి.ఎంతసేపు దానివెంట..దీని వెంట పడటానికి ఏ సమయమూ చాలడం లేదు నీకు...వ్యవహార జ్ఞానం నేర్చుకో..." మందలించాడు డాన్.

ఆ మరుసటి రోజు Solozzo వచ్చాడు.ఉభయకుశలోపరి అయినతరువాత అసలు విషయం లోకి వచ్చారు అంతా.

Solozzo చెప్పు..నన్ను మాత్రమే ఎందుకు కలవాలనుకున్నావు ఈ విషయం లో.." డాన్ అడిగాడు.

" మీరు నాకు కొన్ని సాయాలు చేయాలి.Narcotics బిజినెస్ లో నష్టమంటూ ఉండదు.సిసిలీ నుంచి ప్రాసెస్ అయి వచ్చే సరుకుకి అమెరికా లో మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలి. లీగల్ పరమైన సమస్యలు వస్తే గనక మీకు తెలిసిన జడ్జ్ ల ద్వారా మాకు సహాయం చేయాలి.మీకు చాలామంది పొలిటీషియన్లు.. జడ్జ్ లు బాగా తెలుసు కనక మీ మిత్రుల ద్వారా మమ్మల్ని ఆదుకోవాలి.అలాగే రెండు లక్షల డాలర్లు ఫైనాన్స్ చేయవలసిందిగా కోరుతున్నాను.ఒక్క సంవత్సరం లో మీ షేర్ మూడు నుంచి నాలుగు లక్షల డాలర్లు వస్తుంది.మీ డబ్బుని వడ్డీ తో సహా ఏడాది లో ఇచ్చేస్తాను.అంతేకాదు మీ వాటా ప్రతి సంవత్సరానికి పెరుగుతూనే ఉంటుంది. " Solozzo వివరించాడు.

" నా మిత్రులలో అనేకమంది జడ్జ్ లు...పొలిటీషియన్ లు ఉన్నమాట వాస్తవం.కాని వాళ్ళంతా ఈ నార్కోటిక్స్ లాంటి బిజినెస్ కి సహకరించరు.అంతేకాదు అది మా స్నేహానికి కూడా  విఘాతం కలిగిస్తుంది.." అన్నాడు డాన్.

"మీ  పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నారా...Tattaglia ఫేమిలీ ఆ విషయం లో పూర్తి గ్యారంటీ ఇస్తుంది."

వెంటనే Sonny ఆ మాటకి స్పందించాడు. " అంటే వడ్డీ లేని పెట్టుబడి విషయం లోనా..వారు గ్యారంటీ ఇచ్చేది..? " అంటూ.

ఆ మాటకి డాన్ తన కొడుకు వైపు కొద్దిగా సీరియస్ గా చూశాడు.

" Solozzo ..అందరి తండ్రుల్లాగే ..నా పిల్లలకీ నేను ఎక్కువ చనువిచ్చి పాడుచేశానేమొ అనిపిస్తోంది.పెద్దవాళ్ళు మాటాడుతున్నప్పుడు ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలియడం లేదు.Sorry to disappoint you.. నీ కోరికని మన్నించలేకపోతున్నందుకు" అంటూ Solozzo కి వీడ్కోలు ఇచ్చి పంపించివేశాడు.

అతను వెళ్ళిపోయినాక Sonny కి చీవాట్లు పెట్టాడు డాన్.

" Sonny...నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు.. ఇతరులతో వ్యవహారం మాట్లాడుతున్నప్పుడు మన Family అంతా ఒకే మాట మీద ఉంది అనే సందేశాన్ని ఇవ్వాలి.తప్ప మన అభిప్రాయాల్లో split ఉంది అని అనిపించకూడదు.Sonny..let not anyone outside the family know what you are thinking.Pay attention to business " డాన్ ఒక కొత్త పాఠం చెబుతున్నట్లుగా అన్నాడు.

 Anisette నిండిన గ్లాసుని ఒక్కమాటు సిప్ చేసి డాన్ Tom తో అన్నాడు" Luca brasi కి వెంటనే కబురు చెయ్యి"

(మిగతాది తరువాత భాగం లో చూద్దాం)   --KVVS Murthy
( సంక్షిప్తకుని మాట:Solozzo గురించి వర్ణించేటపుడు Mario Puzo ఒక హీరోని వర్ణించినట్లే ఉంటుంది.జనరల్ గా మనం హీరోని కీర్తిస్తాం..అదేసమయంలో ధీటుగా ఉండే విలన్ ని ఎందుకో అంతగా ప్రశంసించబుద్దిగాదు.కాని కొన్నిసార్లు ఇంగ్లీష్ రచయితలు చిన్న పాత్రని కూడా ఒక్కోసారి మరపురాని విధంగా తీర్చిదిద్దుతారు.అలాంటి వాటిల్లో ఇది ఒకటి.Solozzo గూర్చి ఇలా రాస్తాడు ప్యూజో.   Solozzo was a powerfully built,medium-sized man of dark complexion.He had a scimitar of a nose and cruel black eyes.He also had an impressive dignity.Hagen thought he had never seen a more dangerous-looking man except for Luca brasi.He had never seen such

force in one man ,not even in Don. If the Don ever asks me if this man has balls,I would have to answer yes,Hagen thought.)


 Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (పదమూడవ భాగం)

Johnny Fontanne మొత్తానికి John Woltz తీసే సినిమాలో నటుడిగా స్థానం సంపాదించాడు...గాడ్ ఫాదర్ కి ఈ విషయం లో కృతజ్ఞతలు చెప్పడానికి ఫోన్ చేశాడు.Tom ఫోన్ ఎత్తాడు.

"డాన్ కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించాలనుకుంటున్నా..నా సినిమా షూటింగ్ బాగానే చదువుతోంది..గాడ్ ఫాదర్ కి నా థాంక్స్ చెప్పు" అన్నాడు Johnny.

"చాలా సంతోషం...నీ కృతజ్ఞతల్ని అందజేస్తాను" జవాబిచ్చాడు Tom.

కాసేపాగినతర్వాత Don కుమార్తె Connie నుంచి ఫోన్ వచ్చింది.ఆమె ఎప్పుడు ఫోన్ చేసినా తన భర్త Carlo Rizzi పెట్టే బాధల గూర్చి ఏకరువు పెడుతుంది.సకల వ్యసనాలకి బానిస అయి Connie ని కూడా కొట్టడం లాంటివి చేస్తుంటాడతను.ఆ విషయాలన్నీ చెప్పి మళ్ళీ తండ్రికి తెలియనివ్వకు...బాధపడతాడని అంటుంది ఆమె. మళ్ళీ ఈ సారి ఏం కంప్లైంట్ చేస్తుందో అనుకున్నాడు Tom.

అయితే ఆమె ఈసారి అవి ఏమి చెప్పలేదు కాని...రాబోయే క్రిస్మస్ కి తండ్రికి...సోదరులకి పంపబోయే పండుగ గిఫ్ట్ లు ఎలా ఉంటే బాగుంటుందో అడిగింది." నువ్వు ఏది పంపినా వాళ్ళకి ఆనందమే,నాకంటే ఆ విషయం లో బాగా ఆలోచించగలవు" అన్నాడు Tom.

ఇంకాసేపు ఆగిన తర్వాత Don రెండవ కొడుకు ..అదే డార్ట్ మౌథ్ కాలేజ్ లో చదువుతున్న Michael ఫోన్ చేశాడు.

"Pop ఇంట్లోనే ఉన్నారా...ఏదైనా పనిమీద బయటకి వెళ్ళారా.." అడిగాడు Michael.

" ఏం Michael అలా అడుగుతున్నావు..ఏదైనా అర్జంట్ పనా..?"

" నాతోపాటు ఈసారి ఆ అమ్మాయి Kay Adams ని కూడా తీసుకొస్తున్నాను.మన ఇంట్లో అందరికి క్రిస్మస్ సందర్భంగా పరిచయం చేసి పెళ్ళి ప్రపోజల్ తెద్దామని అనుకొంటున్నాను." అన్నాడు Michael.

"శుభాకాంక్షలు..!Don ఇంట్లోనే ఉంటారు.నో ప్రోబ్లం..రండి" చెప్పాడు Tom.

అలా ఫోన్ కాల్స్ అన్నీ మాట్లాడి బయటికి వచ్చాడు..వచ్చి ఇంటి బయట తన కారు లో ఎక్కబోతుండగా అకస్మాత్తుగా Solozzo ప్రత్యక్షమయ్యాడు.

" Tom..నీతో ప్రత్యేకంగా మాట్లాడాలి.ఓసారి కారెక్కు..నీకు వచ్చిన భయం ఏం లేదు..నాది హామీ" అన్నాడు Solozzo .తను మాట్లాడబోయేంతలో మరో ఇద్దరు అతని మనుషులు ప్రక్కకొచ్చి అతడిని కారులోకి త్రోశారు.

Dartmouth నుంచి నిజానికి Michael ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్  Kay Adams ఇద్దరూ న్యూయార్క్ కి వచ్చి ఓ హోటల్ లో ఉన్నారు నిన్ననే.మంచి సమయం లో ఇంటికి వెళ్ళి ఓ సర్ ప్రైజ్ ఇవ్వాలని Michael ఆలోచన.

"Mike..నాతో పెళ్ళి విషయాన్ని మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా ..వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో.." Kay Adams తాను కాల్చుతున్న సిగరెట్ ని ఆర్పుతూ అడిగింది.

" మాఇంట్లో అంతా నిన్ను చక్కగా ఆమోదిస్తారు..దాంట్లో ఎలాంటి సందేహం లేదు." అన్నాడు Michael.

సిటీ హాల్ లో జరిగే ఓ మామూలు సెర్మనీ లో పెళ్ళాడాలని Kay భావించింది.అయితే Michael మాత్రం తండ్రికి చెప్పిన తర్వాత తప్పక సమ్మతిస్తాడని నమ్మకం వ్యక్తం చేశాడు.

ఆ తర్వాత ఏవో మాట్లాడుకున్నారు.విశాలమైన ఆ బెడ్ మీద శృంగార లోకం లో తేలియాడారు.సాయంత్రం నుంచి దగ్గర లో ఉన్న ఓ థియేటర్ కి వెళ్ళి ..వచ్చేటప్పుడు డిన్నర్ చేశారు.హోటల్ లో కి అడుగుపెట్టారు.

" నేను రిసెప్షన్ దగ్గరకి వెళ్ళి తాళం తీసుకొస్తాను..ఈ లోపులో లాంజ్ లో ఉన్న న్యూస్ పేపర్ ని తీసుకురా" అన్నాడు Michael.

Kay పేపర్ స్టాండ్ దగ్గరకి వెళ్ళి అనాలోచితంగా మొదటి పేజి చూడగానే ఆమె వొళ్ళు జలదరించింది.వేగంగా వచ్చి ఆ పేపర్ ని Michael కి చూపించింది.ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది అతనిలో..!అసలు ఎవరు..ఈ పనికి తెగించింది..? ఆలోచనలు ఉవ్వెత్తున లేచాయి.

పేపర్ లో మొదటి పేజీ లో ఉన్న ఫోటో ..ఎవరిదో కాదు..తన తండ్రి  Don Vito Corleone  ది.అతను రక్తపు మడుగు లో పడి ఉన్న ఫోటో అది.

' Don Vito Corleone Shot, Bloody mob war feared ' హెడింగ్ లైన్లు అలా ఉన్నాయి ఆ వార్తకి. మళ్ళీ వార్తని ఓసారి ఆసాంతం చదివాడు.

"అదృష్టవశాత్తు మా నాన్నగారు చనిపోలేదు.The  bastards didn't kill him ..అయితే ఎవరు అతనిపై కాల్పులకి తెగించింది.." ఇపుడే వెళ్ళి వాళ్ళ అంతు చూడాలి అనిపిస్తోంది.కాని తమాయించుకొని గది లోపలకి అడుగుపెట్టారు ఇద్దరు.

ఆ సంఘటన ఎన్ని గంటలకి జరిగిందా అని చూస్తే పేపర్లో రాయడం సాయంత్రం  అయిదు గంటలకి అని ఉంది.అంటే తాను,తన ప్రేయసి సరిగ్గా శృంగార డోలికల్లో తేలుతున్న సమయమన్నమాట.ఒక్కసారిగా అది తలపుకి వచ్చి గిల్టీ గా ఫీలయి హృదయం ద్రవించింది.

" మనం వెంటనే ఆసుపత్రి కి వెళ్ళి మీ నాన్నగారిని చూద్దామా.." అంది Kay.

" మనం ఇపుడు జాగ్రత్తగా అడుగులు వెయ్యకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం...My old man is alive...but who knows what they do next ..అసలు ఇది ఎందుకు జరిగింది..దీనికి సంబందించి నేను కొన్ని కాల్స్ చేయాలి ముందు.." అలా చెబుతూనే Michael తన సోదరుడు Sonny కి ఫోన్ చేశాడు.

" Oh Jesus..where the hell are you  ఎక్కడున్నావు నువ్వు..నీకోసం మనుషుల్ని పంపించా ..నీకు క్షేమమే కదా.."  అన్నాడు Sonny అవతలనుంచి.

" న్యూయార్క్ లోనే ఉన్నాను.నాకే ప్రోబ్లం లేదు..పెద్దాయన కి ఎలా ఉంది..ఎవరు ఇంతకీ కాల్పులు జరిపింది... " Michael ఆందోళనగా అడిగాడు.

"ప్రాణానికేం ప్రమాదం లేదు...అయిదు బుల్లెట్లు కాల్చారు..అదృష్టవశాత్తు ప్రాణాపాయం లేదు.కొంత కాలం పాటు ఆసుపత్రి లో ఉండవలసి వస్తుంది.అంతే..నువ్వేం కంగారు పడకు..వెంటనే నువు బయల్దేరి రా.." Sonny చెప్పాడు.

" ముందు చెప్పు..ఎవరు ఆ వెధవలు "

" అన్నీ చెబుతాను..ముందు నువ్వు ఇక్కడికి రా తొందరగా..వాళ్ళ గురించి ఆలోచించకు..Luca brasi అందుబాటులోకి రాగానే వాళ్ళు మాంసపు ముద్దలు అవుతారు..ఆ తర్వాత మన వైపున చాలా గుర్రాలు ఉన్నాయి రంగం లోకి దిగడానికి...ఇది ఇంతటితో ఆగేది కాదు"  చెప్పాడు Sonny.

" Tom నేను ఇక్కడ ఉన్నట్లుగా నీకు చెప్పలేదా.."



" అతడిని కూడా కిడ్నాప్ చేశారు వాళ్ళు..అతని భార్య మన ఇంట్లో నే దిగులు ఉన్నది. "

Luca brasi ఇంకా Tom Hagen ఇద్దరూ కనబడకుండా పోవడం ఏమిటబ్బా ..వాళ్ళకి ఏం జరిగి ఉంటుంది అనే ఆలోచన తొలిచివేసింది Michael ని.


(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము) -- KVVS Murthy


   Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా(పద్నాల్గవ భాగం)

ఆరోజు సాయంత్రం.డాన్ కాల్పులకి గురయిన సాయంత్రం.మనం మాట్లాడుకొంటున్నది దాని గురించే-

సరిగ్గా సమయం పావుతక్కువ అయిదు అవుతున్నది.Don కారు నడిపే Paulie Gatto కి అనారోగ్యం అని చెప్పడం తో కుమారుడు Freddie ని డ్రైవ్ చేయమన్నాడు.ఒక్కోసారి అలా సాయంత్రం పూట బయటకి వచ్చి కొన్ని Fruits కొనుక్కొని వెళ్ళడం Don కి అలవాటు.అది కూడా ఈ మధ్య నుంచే..! Peaches,Oranges లాంటివి కొని ఓ పేపర్ పాకెట్ లో వేసుకొని రోడ్డుకి ఓ ప్రక్కనుంచి వస్తున్నాడు.రోడ్డు మలుపునుంచి ఇద్దరు వ్యక్తులు నల్లని Caps ని పెట్టుకొని ..ఓవర్ కోట్ లని ధరించి ఉన్నారు వాళ్ళు...బహుశా గుర్తించకుండా ఉండటానికేమో..!

ఎందుకనో వారి Movements చూడగానే డాన్ కి అనుమానం వచ్చింది.వడి వడిగా దాపునే ఉన్న కారు దగ్గరికి సాధ్యమైనంత వేగంగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు.వాళ్ళుకూడా Desperate అయినట్లున్నారు.వెంటనే పిస్టళ్ళు తీసి బుల్లెట్లు కురిపించారు డాన్ మీద.ఒక బుల్లెట్ వీపుకి తగిలింది.అంతే..ఒక పెద్ద సుత్తె తో మొదినట్లయి దభాలున క్రిందపడ్డాడు. డాన్ పిలుపులు వినబడి అప్పుడే కారుదిగిన Freddie పరిగెత్తుకుంటూ వచ్చాడు.ఈ లోపులోనే మరో మూడు బుల్లెట్లని  కురిపించారు వాళ్ళు.రక్తం బాగా కారి స్పృహ కోల్పోయాడు డాన్.Fredo తండ్రి పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.ఆ ఆగంతకులు తప్పించుకొని పారిపోయారు.

కాసేపటి లోనే పోలీసుల కారు వచ్చింది.రేడియో వాళ్ళు,మిగతా ప్రెస్ వాళ్ళు తదితరులు అంతా గుమికూడారు.ఫోటోల మీద ఫోటోలు తీస్తున్నారు.పోలీస్ ల్లో ఉన్న ఓ డిటెక్టివ్ John Philips వీరిద్దరిని చూసి వెంటనే గుర్తు పట్టాడు.ఆ పోలీస్ వ్యక్తి Don కి మిత్రుడు.ప్రతి ఏడు ఖరీదైన క్రిస్మస్ గిఫ్ట్ ని ఇతనికి ఇస్తుంటాడు.ఆయన Pay roll ఉన్న మనిషి.John Philips వెంటనే Freddie ని కారు ఎక్కించి ఇంటికి పంపించాడు.అలాగే అంబులెన్స్ ని పిలిపించి Don ని ఆసుపత్రి కి చేర్చారు పోలిస్ లు.

ఆ పోలిస్ డిటెక్టివ్ Sonny కి ఫోన్ చేశాడు.

"Sonny ..మీ నాన్నగారి ని ఎవరో ఆగంతకులు పిస్టల్ తో కాల్చారు.అయిదు బుల్లెట్లు తగిలాయి.అయితే శరీరం లో Vital parts మీద తగలలేదు.కాబట్టి ప్రాణాపాయం ఉండదని అనుకొంటున్నాను. రక్తం బాగానే పోయింది.వెంటనే ఆసుపత్రి లో చేర్చాము.నా నుంచి ఇంకా ఏమైనా సాయం కావాలా ..అంటే అక్కడ అదనంగా రక్షణ కల్పించడం లాంటివి.." అడిగాడు John Philips.

" మిత్రమా మీరు చేసిన పనికి ధన్యవాదాలు.రేపు ఖచ్చితంగా మాయింటికి వచ్చి మా గిఫ్ట్ ని మీరు స్వీకరించాలి..ఏమి అవసరం పడినా తర్వాత మీకు చెబుతాను..సరేనా.." అన్నాడు Sonny.

ప్రస్తుతం ఈ సమయం తనకి పరీక్షా సమయం వంటిది.Corleone Family కి ఎదురైన ఒక చాలెంజ్ ఇది.గత పది ఏళ్ళలో ఇలాంటిది లేదు. Sonny కి తెలుసు ఆతని అతి కోపమే తన యొక్క బలహీనత అని. Tom Hagen ఇంటికి ఫోన్ చేశాడు.అతని నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని అతని భార్య తెలిపింది.

ఇలాంటి విపత్కర పరిస్థితులని తన తండ్రి జీవితం లో  ఎన్నో సార్లు ఎదుర్కొని ఉన్నాడు. ఇటువంటి ఒక స్థితిలో ఆయనే గనక ఉంటే ఎలా React అయి ఉండేవాడో అని కాసేపు Sonny ఆలోచించాడు.

ఒక విషయం రూఢిగా చెప్పగలడు.దీని వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్ Solozzo అని..! కాని అతను ఒక్కడే డాన్ లాంటి శక్తి శాలి పై ఇలాంటి దాడికి తెగించలేడు. ఖచ్చితంగా ఇంకొక బలమైన మాఫియా ఫేమిలీ యొక్క అండ అతనికి ఉండి తీరాలి.అవును అది Tattaglia ఫేమిలి..ఇచ్చిన సపోర్ట్ !

ఇంతలోనే ఫోన్ రింగయింది.ఎత్తాడు Sonny.

"Is it Santino Corleone ..? ప్రశ్నించింది అవతలి కంఠం.

" అవును..."

" Tom ప్రస్తుతం మా ఆధీనం లోనే ఉన్నాడు.మేము ఒక ప్రపోజల్ చేసి అతని చేత పంపిస్తున్నాం.మూడుగంటల లోపులో అతన్ని రిలీజ్ చేస్తాం..జరిగింది ఏదో జరిగింది...Everybody has to be sensible now ..." ఆ వాయిస్ Solozzo మాదిరిగా ఉంది.

Sonny భార్య Sandra అడిగింది ఏమిటి విషయమని.జరిగిన విషయం చెప్పాడు..తను షాక్ అయింది..సముదాయించాడు అతను.

మళ్ళీ ఫోన్ రింగ్ అయింది.Sonny ఎత్తాడు.ఈసారి ఫోన్ చేసింది Clemenza.Corleone Family కి ఇతను ఒక పదాధికారి లాంటివాడు.

"Sonny..మీ నాన్న గారికి పై జరిగిన Attack గూర్చి తెలిసిందా..?" అంటూ ఆందోళనగా అడిగాడు అతను.Clemenza స్వరాన్ని బాగా గమనించాడు.అది Genuine గానే తోచింది.

"ప్రాణాపాయం లేదు..కంగారు పడకు Clemenza"

" థాంక్ గాడ్ ..Sonny ...నువ్వు ఇప్పుడు ధైర్యంగా ఉండవలసిన సమయం.."

" ఆ..Clemenza ..నువ్వు ఓ పని చేయాలి"

" చెప్పు Sonny ...ఆసుపత్రి దగ్గర..ఇంటిదగ్గర...యాభైమంది మనుషుల్ని గార్డ్స్ గా పంపించమంటావా..?"

"అదేం వద్దు..నువ్వు మా స్ట్రీట్ లోనే ఉన్న నాన్న గారి ఇంటిదగ్గరకి రా ..వచ్చేటప్పుడు ఆ Paulie Gatto ని కూడా ఇక్కడికి తీసుకురా..మర్చిపోకు"  చెప్పాడు Sonny.

ఆ మాట లోని సందేశాన్ని అర్ధం చేసుకున్నాడు Clemenza.

" అన్నట్టు Paulie  ఈ రోజు నాన్నగారి కార్ ని ఎందుకు డ్రైవ్ చేయలేదు.. ఎప్పుడూ అతనేగా డ్రైవ్ చేసేది..ఏమయింది మరి ఈ రోజు.." అడిగాడు Sonny.

" ఏదో జలుబు,తలనొప్పి అని చెప్పినట్టున్నాడు.."

" గత రెండు నెలల్లో ఎన్నిసార్లు ఈ కారణం చేత అతను పని లోకి రాలేదో చెప్పగలవా.."

" బహుశా మూడు లేదా నాలుగు సార్లు"

" సరే..నువ్వు వచ్చేప్పుడు ఎట్టి పరిస్థితుల్లో Paulie Gatto ని వెంట బెట్టుకురా..I don't care how sick he is .." ఫోన్ పెట్టేశాడు Sonny.

ఆ వీధి లోని ఎనిమిది ఇళ్ళు Don Corleone కి సంబందించినవే.ఒక పెద్ద మాల్ కూడా వారిదే ఉన్నదక్కడ.ఇంచుమించు ఆ పరిసరాల్లో అంతా డాన్ యొక్క మిత్రులు లేదా బంధువులు లేదా శ్రేయోభిలాషులకి సంబందించినవే. కనుక ఈ ప్రదేశమంతా వారికి సేఫ్ జోన్ లాంటిదే.

Sonny బయటికి వెడుతూ తన భార్య Sandra ని పిలిచాడు.

" నేను ప్రక్కనే ఉన్న మా నాన్న గారి ఇంటికి వెళుతున్నా..ఎవరైనా ఫోన్ చేస్తే ..బాగా ముఖ్యమైతేనే నాకు ,మనకున్న స్పెషల్ ఫోన్ నుంచి కాల్ చెయ్యి..Tom భార్య ఫోన్ చేస్తే అతను బిజినెస్ పని పై వెళ్ళాడు..కొన్ని గంటల్లో వస్తాడు అని చెప్పు..అన్నట్టు..మన ఇంటికి కొంతమంది మనుషులు గార్డ్స్ గా వస్తారు...ఏమీ ఆందోళన చెందకు.." అలా అని చెప్పి బయటకి నడిచాడు Sonny.

తండ్రి ఇంట్లోకి వెళ్ళాడు.అతని తల్లి వంట ఇంట్లో ఉన్నట్లుంది ..బయటకి వచ్చి పలకరించగానే..మాటలో మాటగా తండ్రికి జరిగిన ప్రమాదం గూర్చి తెలిపాడు.కాసేపు బాధపడి మళ్ళీ కుదుటపడింది. ఎందుకంటే పెళ్ళయినదగ్గరనుంచి డాన్ జీవితం ఆమె కి తెలుసు గనక.ఆసుపత్రి కి వెళ్ళడానికి తల్లిని పురమాయించాడు.

ఆ తర్వాత ఫోన్ తీసి రింగ్ చేశాడు Luca brasi కి..! నో ఆన్సర్..అనే వస్తోంది ఎంతసేపు.

అది ఫలించకపోవడం తో ఇంకో ఫోన్ చేశాడు...అది Tessio కి.ఇతను డాన్ పరివారం లోని ముఖ్యులలో ఒకడు..బ్రూక్లిన్ లో ఉంటాడు.

" Tessio ..నువ్వు ఓ పని చేయాలి..యాభై మంది నమ్మకస్తులైన మనుషుల్ని అక్కడ ఆసుపత్రి దగ్గరకి,లాంగ్ బీచ్ లోని ఇళ్ళ దగ్గరకి పంపించాలి.." చెప్పాడు Sonny.

"Clemenza కి చెప్పలేదా..అతను పంపించనన్నాడా.."

" ఇప్పుడు అతని మనుషుల్ని వినియోగించదలుచుకోలేదు.."

" Don't be hasty Sonny.. అతను నమ్మక ద్రోహం చేయడనే నమ్ముతున్నాను.."

" Tessio..నా జాగ్రత్తలో నేను ఉండాలిగదా..." స్థిరగా అన్నాడు Sonny.

సరే..అలాగయితే..! అయిదు నిమిషాల్లో నువ్వు అడిగినది చేస్తాను..మనుషుల్ని వెంటనే పంపిస్తున్నా.."  అని ఫోన్ పెట్టేశాడతను.


ఆ తర్వాత Sonny టెలిఫోన్ శాఖ లో పనిచేసే Ray Farell కి ఫోన్ చేశాడు.అతను Don యొక్క Pay roll ని మనిషే..!

" Farell..నువ్వు ఈ అర్ధరాత్రి లోపు ఒక పని చేయాలి.Clemenza ఇంకా Paulie Gatto గత కొన్ని రోజుల్లో ఎవరెవరికి ఫోన్ కాల్స్ చేసి మాట్లాడారో నాకు లిస్ట్ తయారు చేసి ఇవ్వాలి. "


Sonny చెప్పగానే సరే నన్నాడతను. వీల్ చైర్ లో కూలబడ్డాడు సన్నీ. ఒక గంటలో ఫేమిలీ అంతా సమావేశమౌతుంది. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి. ఆ Turk అదే ..Solozzo పక్కాగా ప్లాన్ చేశాడు.Tattaglia ఫేమిలీ సాయం తో..!ప్రస్తుతం ముందున్నది ఒకటే..Solozzo టెరంస్ కి ఒప్పుకోవడమా లేదా పూర్తి స్థాయి పోరాటానికి సిద్దపడటమా..?


అది సరే..ఇంతకీ డాన్ యొక్క కుడి భుజం Luca brasi ఏమయినట్టు..?

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము..) --KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (పదిహేనవ భాగం)

Solozzo డాన్ దగ్గర Consigliere గా పనిచేసే Tom Hagen ని కిడ్నాప్ చేశాడుకదా..ఆ కారులో ఎక్కించుకుని..! నిజానికి అతడిని చంపడం కూడా Solozza ఉద్దేశ్యం కాదు.డాన్ ఎలాగు చనిపోయి ఉంటాడు గదా ఆ కాల్పుల్లో...ఇక అతని కుమారుడైన Sonny తో బిజినెస్ డిల్ కుదుర్చుకోవాలనేది ఇతని ప్రణాళిక.సంధి కుదర్చడానికి గాను Tom ని ఉపయోగించుకోవాలనేది Solozza ఆలోచన.అలా ఆ కారుని ఎవరూ గుర్తు పట్టని ఓ ప్రదేశంలో ఆపి లోపలకి తీసుకువెళతారు.

"Narcotics అనేది రాబోయే కాలపు లాభదాయకమైన బిజినెస్.అది ఆ పాతకాలపు డాన్ కి అర్ధం కాలేదు.ఇప్పుడతనూ ఎలానూ లేడు.Sonny కి నాకు ,నువ్వు బిజినెస్ డీల్ కుదర్చాలి.దానివల్ల అందరకి బాగా డబ్బు వస్తుంది." అన్నాడు Solozzo.

Tom ని లోపలకి తీసుకువెళ్ళినవెంటనే మంచిగా కూర్చోబెట్టి ..Rye మద్యాన్ని ఆఫర్ చేస్తాడు.ఫ్రెండ్లీ గా నే ట్రీట్ చేస్తాడు..Tom ప్రాణం కొంత కుదుట పడుతుంది.హమ్మయా ప్రాణానికేం ఢోకా లేదని..!

"Sonny ఊరికే ఉంటాడని అనుకోవడం లేదు.నీవెంట తప్పకుండా పడతాడు.నేను చెప్పినా వింటాడా..ఏమో అనుమానమే.."  అన్నాడు Tom.

"అదేగనక అతని నిర్ణయమైతే మొత్తం Tattagliya ఫేమిలీ అంతా నన్ను సపోర్ట్  చేస్తుంది.అది పెద్ద పోరాటానికి దారి తీస్తుంది.దానివల్ల అందరం నష్టపోతాం...డాన్ మీద కాల్పులు జరిపినప్పుడు Freddie ని అక్కడే చంపి ఉండవచ్చు..కాని నేనే వద్దన్నాను.ఎందుకంటే నాకు వ్యక్తిగతమైన కక్ష ఏమీలేదు.ఇదంతా నా బిజినెస్ ముందుకు తీసుకువెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నమే.It's purely business ..not personal issue for me "

'ఓహో అయితే నన్ను hostage గా యీసుకొచ్చారే తప్ప,హాని చేయడానికి కాదన్నమాట ' అనేది Tom కి మరింత ధృవపడింది.ఆ భావం Confidence  ని పెంచింది.Solozzo అతని భావాన్ని అర్ధం చేస్కున్నట్లు చిన్నగా నవ్వాడు.

" సరే..నా వతు ప్రయత్నం నేను చేస్తాను" చెఫ్ఫాడు Tom.

" చూడు Tom ..I am a business man  ...అవసరం కి మించి రక్తపాతం చేయడం నాకు నచ్చదు.రక్తం ఖరీదు చాలా ఎక్కువ." సాలోచనగా అన్నాడు Solozzo.

ఇంతలోనే ఫోన్ రింగ్ అయింది.అతని అనుచరుడు మాట్లాడాడు.తర్వాత Solozzo దగ్గరకొచ్చి అతని చెవిలో ఏదో చెప్పాడు.అంతే..వెంటనే Solozzo మొహం లో రంగులు మారాయి.కోపంగా అనిపించింది అతని వాలకం.

" నీకు,నాకు Bad luck గానే తోస్తున్నది Tom...డాన్ కాల్పుల్లో చనిపోలేదట..చ..అయిదు బుల్లెట్లు ..అయినా బతికి బట్టకట్టాడంటే గట్టివాడే ఈ సిసిలియన్ " Solozzo చెప్పేవిధానం చూసి Tom కి కాళ్ళలో సన్నగా వణుకు వచ్చింది.కొంపదీసి కాల్చిపారేస్తాడా అని..!

*   *    *

Michael ఇంటికి వచ్చాడు.Guards అంతా కొత్త వ్యక్తుల్లా కనిపించారు.కార్లు కూడా చాలానే ఉన్నాయి.లోపలకి వెళ్ళేసరికి Tom భార్య Theressa కనిపించింది ముందు గదిలో ఉన్న సోఫా లో కూర్చొని.ఆమె ని విష్ చేసి చేశాడు..బాధలో ఉన్నట్లుగా అనిపించింది.ఆమె త్రాగుతున్న విస్కీని కంటిన్యూ చేయమని చెప్పి..లోపలకి వెళ్ళాడు.బొండం లా ఉండే Clemenza ఇంకా Tessio ఇద్దరూ Sonny తో చర్చల్లో ఉన్నారు.Paulie Gatto కూడా కనిపించాడు.Sonny ఒక పసుపు పేడ్ మీద పెన్సిల్ తో కొందరి పేర్లు రాస్తున్నాడు.మొత్తం ఏడు దాకా ఉన్నాయవి.Solozzo,Philip Tattagliya ఇలా ఉన్నాయి.

"ఎలా సాగుతున్నది వ్యవహారమంతా.." అడిగాడు Michael.

" నువ్వు..ఇంటివద్దనే ఉండాలి ఫోన్ కనిపెట్టుకుంటూ.." అన్నాడు Sonny.

" నాన్నగారికి ఎన్నోసార్లు నేను సహాయం చేశాను..వార్ లో ఓ సిపాయిగా కూడా పనిచేశాను.నన్ను చిన్నపిల్లాడిలా అనుకోవడం మానే నువ్వు.." అన్నాడు Michael తన సోదరునితో..!

"O.kay ..అలానే కానీ,ఇక్కడే ఉండి నా ప్లానింగ్ లో తోడ్పడు.."

 మళ్ళీ Sonny నే ఒక చిక్కుముడి విప్పుచూద్దాం అన్నట్లుగా ఓ మాట చెప్పాడు.

" చూడు..సోదరా నువ్వు ఎంత స్మార్ట్ గా ఆలోచిస్తావనేది నేను ఇపుడు చూస్తాను.నాన్నగారి మీద కాల్పులు జరపడానికి ఒక వ్యక్తి శత్రువుకి  సహాయపడ్డాడు. అతను Clemenza నా లేక Paulie Gatto నా ..ఆలోచించి నీ విచక్షణ తో చెప్పు.. ఆ..ఒకటి దాని ఆన్సర్ ఆల్రడీ నా దగ్గర ఉన్నది సుమా "

Michael అలాగే ఆలోచిస్తూ చివరికి చెప్పాడు " Sonny ..నా అంచనా ప్రకారం అది Paulie Gatto కావడానికే ఆస్కారం ఎక్కువ ఉంది.ఎందుకంటే Clemenza ఇప్పటికే ధనవంతుడు..నాన్నగారికి బాల్య స్నేహితుడు..అదీగాక ఫేమిలీ లో Caporegime పదవిలో ఉన్నాడు.అతను కుట్ర చేసినా ఇంతకన్నా పొందేది ఏముంది గనక.. ఇక Paulie విషయానికొస్తే యవ్వనంలో ఉన్నవాడు..ధనం సంపాదించాలని,ఇంకా శక్తిమంతుడు కావాలని ఇలాంటి ఆశలు అతనికి ఉన్నాయి.కుట్ర చేయడంవల్ల అతనికవి తొందరగా  లభించే అవకాశం ఉన్నది.  అఫ్కోర్స్ ...తనకి డాన్ నుంచి ఎప్పుడో జరిగిన ఓ చిన్న silly insult ని దృష్టిలో పెట్టుకొని కూడా Clemenza అయినా చేయవచ్చు..మానవ మనస్తత్వమే అలాంటిదిగదా..కాని ఏదైనా అను Clemenza కాదు అని గట్టిగా చెప్పగలను"

శభాష్ అన్నాడు Sonny అతని విశ్లేషణాశక్తికి. " కరెక్ట్ సన్నీ.. నువ్వు చెప్పింది నిజం..ఎందుకంటే టెలిఫోన్ శాఖ నుంచి తెప్పించుకున్న కాల్ లిస్ట్ ప్రకారం కూడా ఆ Paulie Gatto నే మన శత్రువు తో బాగా కాంటాక్ట్ లో ఉన్నట్లు తేలింది."

ఆ మాటలు విని Clemenza,Tessio లు హాయిగా ఫీలయ్యారు.ఈ మాటలు చెప్పుకునేప్పుడు Pualie ని బయట గదిలోకి పంపిస్తారు వినకుండా.

" నాన్నగారు..లేచేంత వరకు కొన్ని విషయాల్లో ఆగితే మంచిదేమో.." అన్నాడు Michael.

లేదు..లేదు..Tom కూడా ప్రమాదంలో ఉన్నట్లే అనిపిస్తోంది.డాన్ బ్రతికి ఉన్నట్లు వారికి తెలిసిపోయింది.కాబట్టి వాళ్ళ కదలికల పట్ల అప్రమత్తం గా ఉండాలి.." చెప్పాడు Sonny.

'Solozzo అసలు ఉద్దేశ్యం ఏమై ఉండవచ్చు ఈ తరుణం లో.."

" ఆ నార్కోటిక్స్ డీల్ ని చర్చించే సమయం లో నేను కొద్దిగా నోరు జారాను.దాంట్లో నాకు ఆసక్తి ఉన్నట్లు..పెద్దాయనకి లేనట్లు అతను అర్ధం చేసుకున్నాడు.కాబట్టే ఆయన అడ్డు తొలగించుకోవాలని చుశాడు.ఆతర్వాత నేను డీల్ కి ఒప్పుకుంటానని అతని ఉద్దేశ్యం.. "

" ఒకవేళ నాన్నగారు చనిపోయిఉన్నట్లయితే నీ మూవ్ ఏమై ఉండేది.."

" Solozzo ని చంపడమే తరువాయి..ఎంత కష్టం గాని..చివరికి Tattagliyas ప్రవేశించినా కేర్ చేసే పనే లేదు.."

"కాని నాన్నగారు అలా చేయరు..ఆ విధానం వేరుగా ఉంటుంది.." అన్నాడు Michael.

" నేను ఆయనలా ఆలోచించలేను..అయితే నా శైలి నాకు ఉన్నది.I made my bones when I was nineteen.ఆ ..Luca  ఎక్కడున్నాడో తెలిస్తే బాగుండును.."

"Is Luca that tough "

" He is in a class by himself"

బయటిగదిలో Theressa ఆనందంగా మాట్లాడినట్లు శబ్దం వినిపించింది.చూస్తే Tom..!అంతా అతన్ని చూసి ఆనందించారు.ఆ రాత్రి నాలుగు అయ్యెంతదాకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి.Solozzo తనకి ఏం చెప్పాడో అదంతా Sonny కి పూసగుచ్చినట్లు చెప్పాడు Tom. తను ప్రిపేర్ చేసిన లిస్ట్ ని Sonny టాం కి చూపెట్టాడు.

" సన్నీ..ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటున్నావ్ .. ఇది పూర్తిగా బిజినెస్ ఇష్యూనే తప్ప పర్సనల్ ఇష్యూ కాదు.డాన్ ఉన్నా ఇదే మాట చెప్పేవారు.Solozzo ఒక్కడే ఇక్కడ key. అతన్ని తొలగిస్తే చాలు లైన్ అంతా క్లియర్ అయిపోతుంది.Tattagliyas జోలికి వెళ్ళవలసిన ఏముంది ఇప్పుడు" Tom తన అభిప్రాయం వెలిబుచ్చాడు.

" అయితే..చెప్పు ..ఏం చేయాలని నీ ఆలోచన.." సన్నీ అన్నాడు

" మీ నాన్న గారు ..బాగయ్యేంతవరకు సంప్రదింపులు సాగించుదాం..Luca అంతర్ధానం కధ ఏమిటో ఇంకా మనకి అర్ధం కావడం లేదు"

" ఇప్పటికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నో ఆన్సర్ అనే వస్తోంది..అయినా Solozzo ని నేను డీల్ చేయలేనని ఎందుకు అనుకుంటున్నావు"

" Corleons చేయగలరు..నాకు తెలుసు.Clemenza,Tessio  లాంటి వాళ్ళు నీకు వందలమంది మనుష్యుల్ని అవసరమైతే సప్లయ్ చేయగలరు. కాని చివరకి మిగిలేది ఏమిటి..ఈస్ట్ కోస్ట్ లోని మన వ్యాపారాలు అన్నీ దెబ్బతింటాయి.మిగతా Mafia families అన్నీ  మనల్ని బ్లేం చేస్తాయి..ఆ దిశగా ఆలోచించు"

"ఒక వేళ డాన్ కే ప్రాణాపాయం కలిగితే నీ మూవ్ ఎలా ఉంటుంది చెప్పు"

" నా ఉద్దేశ్యం ఒకటే ..అప్పుడు Solozzo తో డీల్ చేసుకోవడమే మంచిది.మీ తండ్రి గారి personal influence గాని political contacts గాని లేని పక్షంలో మీ బలం సగానికి సగం పడిపొతుంది.మిగతా ఫేమిలీ లు కూడా అప్పుడు మీకు సహకరించవు. వాళ్ళు Tattagliyas వైపు మొగ్గు చూపుతారు...పెద్ద స్థాయి పోరాటాలు జరగకుండా చూసేందుకు.." Tom వివరించాడు.

" Tom ..ఏమీ అనుకోకు..నీ తండ్రి ని చంపినా నువ్వు ఇలానే స్పందిస్తావా..?"

" ఏమంటున్నావు సన్నీ..నీకు గాని ,Michael కి గాని Freddie కి గాని డాన్ ఏ విధంగా తండ్రి అవుతారో నాకు అంతకన్నా ఏ మాత్రం తక్కువ కాదు. నాకూ ఇప్పుడే వెళ్ళి Solozzo ని చంపాలని ఉంది." ఆవేశంగా అన్నాడు Tom.

ఇక నిర్ణయాత్మకంగా Sonny అన్నాడు...!

" Tom ..అపార్ధం చేసుకోకు..దాన్ని వదిలెయ్యి..! నువ్వు మన మాల్ లోపలనే ఉండి ఇక్కడ పర్యవేక్షణ చేస్తుండు..! ఆ..Mike..నువ్వు ఇంట్లోనే ఉండి ఫోన్ లు అటెండ్ చేస్తుండు..! ఆ..ఇక..Tessio ..నువ్వు నీ మనుషుల్ని కీలక ప్రదేశాల్లో నియమించి సమాచారం సేకరించు..కొంతమంది మనుషులని తయారుగా పెట్టి ఉంచు..! ఆ...Clemenza
 ..నువ్వు ముఖ్యంగా చేయవలసింది Paulie Gatto ని పైకి పంపించెయ్..అది సెటిల్ చేసిన తర్వాత నీ మనుషులని ఇక్కడకీ ..లాంగ్ బీచ్ దగ్గర కి గార్డ్స్ గా పంపించు.. అప్పుడు Tessio మనుషులు ఆసుపత్రి దగ్గరకి కాపలా గా వెళతారు..అర్ధమయంది కదూ.."

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము)-- KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా(పదహారవ భాగం)

Peter Clemenza కి ఆ రాత్రి బాగా నిద్రపట్టలేదు.Sonny Corleone చెప్పాడు గదా..Paulie Gatto ని execute చేయమని...!అతను తన దగ్గర పని చేస్తున్న కుర్రాడని కాదుగాని ఇంకో కారణంగా కూడా చంపడం బాధగానే ఉంది.ఎందుకంటే అతనూ సిసిలియన్ తల్లిదండ్రులకి పుట్టినవాడే..తమ కట్టుబాట్లు.. Omerta లాంటివి బాగా ఎరిగినవాడే.అయినా తను Family కి వ్యతిరేకంగా వెళ్ళి దుస్సాహసం చేశాడు.Don Corleone మీద కాల్పులు జరగాడానికి కారణమయ్యాడు..అంటే ఆ మేరకు శత్రువుకి సమాచారం అందించి Trechery కి పాల్పడ్డాడు.అది క్షమించరాని నేరం.ఇలాంటి వెన్నుపోటు వ్యవహారాన్ని Corleons తీవ్రంగా పరిగణిస్తారు.తను కూడా Paulie కి అడిగినప్పుడల్లా వెనుకా ముందు చూడకుండా ధన సహాయం చేస్తూనే ఉన్నాడు.ఇప్పుడు దురాశకి పోయి తన ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు.ఎవరైనా సరే నమ్మకద్రోహాన్ని చేసినవారు శిక్ష అనుభవించి తీరవలసిందే.అది భవిష్యత్తు లో ఇలాంటి వారికి కనువిప్పుగా ఉండాలి.

తనవద్దకి పనిలోకి తీసుకునేటప్పుడు కూడా అతన్ని అనేకరకాలుగా Test చేసి తీసుకోవడం జరిగింది.Button man గా తనకి చాలినంత ఆదాయం వస్తున్నా,అతనికి ఉన్న దురాశ వల్ల మధ్య మధ్యలో చిలక్కొట్టుళ్ళు కొడుతూనేవున్నాడు.అవి Family రూల్స్ కి విరుద్ధం.

గార్మెంట్ సెంటర్ లోని వసూళ్ళు గాని,ఆ బ్రూక్లిన్ స్లం ఏరియాల్లో ఉన్న పింగాణి  వస్తువుల్ని తయారుచేసే ఫేక్టరీ నుంచి గాని మూడువేల డాలర్లకి పైగానే ఇతనికి షేర్ వస్తుంది.ఏ కుటుంబ బాధ్యతలు లేని వానికి అవి సరిపోవా..కాని తొందరగా రిచ్ అయిపోవాలని ఆశ.అనగూడదుగాని ఆ విధంగా సాహసించడం కూడా గొప్పవాళ్ళ లక్షణాల్లో ఒకటే.. కాకపోతే కలిసిరాకపోతే తీరు వేరుగా ఉంటుంది అంతే..!

సరే..Solozzo కి ఫేమిలీ రహస్యాల్ని అమ్మిన Paulie Gatto ని పైకి పంపించే బాధ్యతని తన మీద పెట్టారు.చేయక తప్పదు మరి.తనకి ఈ పని లో సహాయకారిగా మరో ఫ్రెష్ వ్యక్తి కావాలి ఇప్పుడు.అతను నమ్మకస్తుడై ఉండాలి..పనిని చాకచక్యంగా ఉండాలి.ఎవరా అని ఆలోచిస్తే Rocco Lompane స్ఫురణకి వచ్చాడు.గతం లో ఓ ఆపరేషన్ లో తనకి సహకరించాడు.Family లో పనిచేసే చాన్స్ ఇవ్వవలసిందిగా ఎప్పటినుంచో కోరుతున్నాడు కూడా.ఈ పనిని మంచిగా చేస్తే గనక Paulie స్థానం లో ఇతణ్ణి తీసుకోవచ్చు.ఆ విధంగా ఆలోచించి Clemenza వెంటనే Rocco కి ఫోన్ చేశాడు.

" Rocco..నీతో పని ఉంది.తయారవు..లంచ్ చేసి రెండు గంటలకల్లా మా ఇంటికి వచ్చెయ్.. ఈ ఆపరేషన్ గనక మంచిగా పూర్తిచేస్తే Family లో నీకు చోటు లభిస్తుంది.."

O.kay, Clemenza ..అలాగే..తప్పకుండా వస్తాను"

ఆ తర్వాత Pauli Gatto కి ఫోన్ చేశాడు Clemenza.

" Paulie...నీ కారు తీసుకుని కరెక్ట్ గా మూడు గంటలకి మా ఇంటికి రా..ఒక అర్జంట్ పని మీద మనం బయటికి వెళ్ళాలి."

"సరే.." అన్నాడు Paulie.

ఈ లోపులో Clemenza కొంత రిహార్సల్ వేసుకున్నాడు.ఏ విధంగా తన హావ భావాలు ఉండాలి ..మాటలు ఉండాలి ..ఇలాంటివన్నమాట.ఎందుకంటే Paulie ని తక్కువ అంచనా వేయడానికి లేదు.ఏ మాత్రం అనుమానం వచ్చినా జాగ్రత్త పడతాడు.తను అతనితో మాట్లాడుతున్నప్పుడు మరీ ఫ్రెండ్లీ గానూ ఉండకూడదు అలా గని మరీ సీరియస్ గాను ఉండకూడదు..ఒక Absent minded irritation లో ఉన్నట్లు తన బిహేవియర్ ఉండాలి.

Paulie హత్య జరిగినతర్వాత అతని శవాన్ని పబ్లిక్ గా వదిలేయ్యాలి.Don పై కుట్ర చేసిన వారికి ఇదే గతి పడుతుంది అని మిగతా Traitors కి అర్ధం కావాలి.అదే సమయం లో Solozzo కి కూడా అర్ధం కావాలి Don Corleone ఫేమిలీ చేతకానివారు కారని,అవసరమైన సమయం లో స్పందించగలరని..! దానికి ఈ శవమే సాక్షి అని..!

చెప్పినట్లుగానే రెండు గంటలకి Rocco వచ్చాడు.తాము ఏ విధమైన పాత్రల్ని పోషించాలి ..ఎలా పని పూర్తి చేయాలి అనేదాన్ని విపులంగా Clemenza వివరించాడు.తన ఇంట్లోని డెన్ లోకి వెళ్ళి ఓ మంచి పిష్టల్ని తీసి Rocco కి ఇచ్చాడు.

" దీన్ని ఉపయోగించు..నీకు అనువుగా ఉంటుంది.Paulie ని కాల్చిన వెంటనే ఈ ఆయుధాన్ని ఆ కారులోనే పారెయ్యాలి..అర్ధమైందా..ఆ తర్వాత నువ్వు నీ కుటుంబాన్ని తీసుకొని ఫ్లోరిడా కి వెకేషన్ వెళిపో..ఫేమిలీ కి సంబందించిన హోటల్ మియామి బీచ్ లో ఉంటుంది..అక్కడ రిలాక్స్ అవ్వు..డబ్బుని నేను పంపిస్తాను.." చెప్పాడు Clemenza.

ఇంతలోనే Clemenza భార్య వచ్చి Paulie Gatto బయట కారులో వెయిట్ చేస్తున్నట్లు చెప్పింది.వెంటనే ఇరువురు బయటికి వచ్చారు.Paulie చేసిన విష్ కి ప్రతి గా తల ఊపుతూనే టైం చూసుకున్నాడు Clemenza.లేటేమిటి అన్నట్లుగా ..!

Rocco వెళ్ళి కారులో ముందు సీటులో కూర్చున్నాడు.

"ఏయ్..Rocco..నువ్వు అక్కడ కూర్చుంటే నాకు రియర్ వ్యూ సరిగా కనబడటం లేదు.తక్కువ ఉన్నావా మనిషివి" అన్నాడు Clemenza.

వెంటనే అతను వచ్చి వెనుక సీటులో Clemenza పక్కన కూర్చున్నాడు.

"Pauli..నువు కారు తోలు..ఈ Sonny తిన్నగా ఉండనివ్వటం లేదు.ఫుల్ స్కేల్ వార్ జరిగేట్టు ఉంది.దాని కోసం Mattressess వేయడానికి అపార్ట్మెంట్ లు చూడాలి.పద..నీకు తెలిసినవి ఏమైనా వుంటే చూపించు.. " అన్నాడు Clemenza

Mafia Families మధ్య ఎప్పుడైనా వార్ జరిగితే దానిలో ఉండే సైనికులు ఇళ్ళలో కాకుండా కొన్ని రహస్య ప్రదేశాల్లో పడుకోవడం చేస్తుంటారు.అలాంటి ఇళ్ళలో వేసే పరుపులనే మేట్రసెస్ అంటారు.ఇపుడు మిష అది..! ఆ మాట వినగానే Paulie కళ్ళలో వెలుతురు కనిపించింది.అంటే ఈ సీక్రెట్ ని కూడా Solozzo కి అమ్మి సొమ్ము జేసుకుందామనేమో..!

"సరే..నేను కొన్ని చూపిస్తాను" చెప్పాడు Paulie.

"మరి పోనీ..లేటెందుకు" అన్నాడు Clemenza.

వాషింగ్టన్ హైట్స్ సెక్షన్ లోనుంచి ముందుకుపోతే వచ్చే అర్థర్ అవెన్యూ అది..అక్కడ ఆపాడు కారుని .

"మీరిద్దరూ ..ఇక్కడే ఉండండి..నేను వెళ్ళి చూసి వస్తా.." అని చెప్పి ఆ లోనికి వెళ్ళిపోయాడు Clemenza అక్కడ ఓ హోటల్ కనిపిస్తే తాపీ గా అవి ఇవీ తిని తీరిగ్గా వెనక్కి తిరిగి వచ్చాడు.

" Paulie ..ఇప్పుడే Sonny ఫోన్ లో చెప్పాడు.. మనం అర్జంట్ గా లాంగ్ బీచ్ కి వెళ్ళలట..పద.."  తోందరపెట్టాడు Clemenza.

ముగ్గురు కారు ఎక్కారు.అందరూ నిశ్శబ్దం గా ఉన్నారు.కారు మాత్రం అలా దూసుకు పోతూ వుంది. సరిగ్గా పొలిమేరల్లొకి రాగానే అక్కడ పొదలున్నవి గమనించి Clemenza అన్నాడు.

"Paulie ...ఇక్కడ కారు కొద్దిగా ఆపు.. నేను పాస్ పోసుకోవాలి " అని..!అట్లా మాటి మాటికి పోయడం అతనికి అలవాటే గనక Paulie యధాలాపంగా కారు ఆపాడు.Clemenza ఆ పని కానిచ్చి కారు లో కూర్చున్నాడు.

"Go ahead " అన్నాడు Clemenza.

కారు ని ముందుకి కదిలించబోతున్నాడు Paulie. ఆ తర్వాత సరిగ్గ ఒక్క నిమిషం లో "భం" అని పిష్టల్ గర్జన కారుని కుదిపివేసింది.బుల్లెట్లు Paulie కపాలం లోకి దూసుకుపోయి చిద్రం చేశాయి.రక్తం,ఎముకల ముక్కలు తన డ్రెస్ పై
పడకుండా ఒక్కసారి అలా వెనక్కి వంగి మళ్ళీ మామూలుగా కూర్చున్నాడు Clemenza.స్టీరింగ్ వీల్ మీద Paulie తల వాలిపోయింది.

Rocco,Clemenza ఇద్దరూ కారు దిగారు.

" ఆ పిష్టల్ ని ఆ కారులో పారెయ్ " అన్నాడు  Clemenza.


అంతకుముందు ఆ దగ్గరలోనే దాచిఉంచిన ఇంకో కారులో ఇద్దరూ ఎక్కేశారు.రయ్..మంటూ ఆ కారు దూసుకుపోతోంది.

( మిగతాది వచ్చే భాగం లో చూద్దాము) --KVVS Murthy  

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (పదిహేడవ భాగం)

ఆ రోజు డాన్ పై కాల్పులు జరిపిన ముందు రోజు రాత్రి-Luca Brasi ఒక నైట్ క్లబ్ లో కూర్చొని ఉన్నాడు.అప్పుడప్పుడు అలా వచ్చి ఆ Tattagliya ఫేమిలీ కి సంబందించిన ఆ ప్రదేశం లో జాలీ గా గడిపి వెళుతుంటాడు.అంటే మందు పుచ్చుకోవడం..ఎవరైనా మంచి అమ్మాయిలు కనబడితే కాలక్షేపం చేయడం చేయడం ..మళ్ళీ తన నివాసానికి వెళ్ళిపోవడం.డాన్ కూడా అలా వెళ్ళి రావడానికి ఆమోదం తెలిపాడు..ఎందుకంటే జరిగే రకరకాల విషయాలు కూడా తెలుస్తుంటాయని. Tattagliya ఫేమిలి కి ఇలాంటి హోటళ్ళు ఆ ఏరియాలో చాలానే ఉన్నాయి.ఒకసారి ఆ క్లబ్ లోనే Bruno Tattagliya కలిసినపుడు అన్నాడు.

" Luca.. నీ లాంటివాడు మా ఫేమిలీ బిజినెస్ లో బాగా హెల్ప్ అవుతారు.మేము ఇంకా కొత్త రంగాల్లోకి వెళుతున్నాం..Physical strength ఉన్న నీ లాంటి వ్యక్తి దాంట్లో బాగా అవసరం.మాతో కలవకూడదూ.." అని..!

" నేను ఇప్పుడు మాత్రం మీకు ఏమి వ్యతిరేకంగా చేస్తున్నాను.మన మధ్య అది అలానే ఉండనీ..నేను మీ దగ్గరకి వచ్చినా God Father కి హాని తలపెట్టడం అనేది మాత్రం నా వల్ల కానిపని.నేను గౌరవించే కొద్దిమందిలో ఆయన ఒకరు." అని మర్యాదగా తిరస్కరించాడు.

Bruno యువకుడు..తన తండ్రి గాని...ఆ Don Corleone గాని చేసే పాత తరం ఆలోచనలు ఇతగాడికి నచ్చవు.అందుకనే Drugs లోకి వెళుతున్నాడు Solozzo తో కలిసి..!

 ఆ..Luca ..ఒకమాట..!ఓ బిజినెస్ నీతో మాట్లాడాలని మా ఫ్రెండ్ ఒకడు బాగా కోరుతున్నాడు.విషయం నీకు నచ్చకపోతే వదిలేయవచ్చు. " అన్నాడు Bruno.

" నీ మిత్రుడు అంటున్నావుకదా..సరే కలుస్తానులే ..ఎక్కడ..ఎప్పుడు..అదిచెప్పు"

" తెల్లవారుజామున నాలుగు గంటలకి  ఇక్కడ ఇదే క్లబ్ కి వచ్చేయ్.."

అంటే తన అలవాట్లు బాగానే అర్ధం చేసుకున్నారన్నమాట.ఎందుకంటే తను ఎప్పుడు నిద్రలేచేది మధ్యానం మూడు లేదా నాలుగు గంటలకి.ఏ రోజూ సూర్యుడు పొడవనిదే నిద్రపోడు.తెల్లవారుజాము దాకా అలా ఆనంద లోకం లో గడపడమే అతని లెక్క.

"సరే..వస్తాలే" చెప్పాడు Luca.

ఆ తెల్లవారుగట్ల తన రూం లో బెడ్ కింద అరలో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ ని బయటికి తీసి ధరించాడు.అలాగే పూర్తిగా undress అయి#Underwear# మీద  కూడ రక్షణ కవచాన్ని వేసుకున్నాడు.ఫేమిలీ తరపున తనకి ఇచ్చిన చాలా విలువైన పిస్టల్ ని జాకెట్ లో పెట్టుకున్నాడు.అలా ఏ యుద్ధసన్నివేశం ఎదురైనా ఫేస్ చేయడానికి పూర్తి సన్నద్ధత తో ఆ హోటల్ కి వచ్చాడు.బయట గాని లోన గాని క్లీన్ చేసే వాళ్ళు ఎవరూ  లేరు.లోనికి వెళ్ళడం తోనే Bruno వచ్చి  బార్ దగ్గరకి తీసుకెళ్ళాడు Lucaని.

బార్ కి ఇవతల ఉన్న ఎత్తైన స్టూల్ మీద Luca కూర్చుంటే...లోపలకని Bruno కూర్చున్నాడు.ఒక గ్లాస్ లో డ్రింక్ పోసి తీసుకో అన్నట్లు ముందుకు జరిపాడు." లేదు..నేను ఇప్పుడేమీ తీసుకోను" అన్నాడు Luca.

ఈ డీల్ గూర్చి గాడ్ ఫాదర్ కి చెప్పాలని అనుకున్నాడు Luca.కాని డాన్ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడడు.సరే..సమాచారం ఈ మీటింగ్ అయిన తరువాత చెబుదామని అనుకుంటాడు.

అంతలోనే ఓ కార్నర్ లోనుంచి Solozzo వచ్చాడు.

" నేను తెలుసా నీకు" నవ్వుతూ అన్నాడు Solozzo.తెలుసు అన్నట్లు తలాడించాడు Luca.ఆహా ఎలుకలు కలుగు లో నుంచి వస్తున్నాయి బయటికి ఇప్పుడిప్పుడే  అనుకున్నాడు.

" ఇది చాలా పెద్ద బిజినెస్ ..ఆదాయం ఊహించనంతగా ఉంటుంది." అన్నాడు Solozzo.

" డాన్ కి చెప్పవచ్చుగదా.." అన్నాడు Luca.

" అక్కడ నీకు ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వడం లేదు కదా..నాతో ఎందుకు కలవకూడదు..నీ లాంటి వాళ్ళు మాకవసరం.."

సరే..చాలు..అంతేనా చెప్పేది ఇంకా ఏమైనా ఉందా.."


" ఒక రోజు టైం తీసుకో ..ఆలోచించు"

అలా అంటూనే Solozzo చేతులు ఫ్రీ గా ఊపుతున్నట్లు చాచాడు..దాన్ని Luca పట్టించుకోకుండా Bruno అంతకుముందు ఆఫర్ చేసిన సిగరెట్ ని వెలిగించుకోవడానికి ..అతని చేతితో వెలిగిస్తున్న లైటర్ వేపు మొహం
తిప్పాడు.అంతే ఒక మేజిక్ జరిగినట్లు జరిగింది.వెంటనే ఆ లైటర్ని కిందికి విడిచి Bruno బలంగా Luca యొక్క అవతలి చేతిని శక్తికొద్దీ అదిమిపట్టుకున్నాడు.ఇవతల Solozzo మరో చేతిని కదలకుండా నొక్కి పట్టాడు.అయినా ఆ ఇద్దరూ చాలడం లేదు అతని కింద..అలా రెసిస్ట్ చేస్తున్నాడు Luca.అసలైన మృత్యుపాశం వెనకనుంచి వచ్చిన మరో రెండు చేతుల్లో ఉన్నది. అవి Luca మెడ చుట్టూ ఆ వైర్ ని బిగించి కాసేపు అల్లగే నొక్కి పట్టివుంచింది.Lucaలోని పూర్తి ప్రతిఘటన ఆగిపోయింది అనుకున్నాక అలా వదులు చేశారు ..! అతని కళ్ళు బయటకి పొడుచుకొని
వచ్చాయి.Luca శవం కింద పడినాక చెప్పాడు Solozzo " ఈ శవం కనిపించకుండా జాగ్రత్త తీసుకో ..ఎప్పుడు ఏది ఎలా తెలియాలో అలా తెలుస్తుంది" ..!
(మిగతాది వచ్చే భాగంలో చూద్దాం) --KVVS Murthy    

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (పద్దెనిమిదవ భాగం)

Don పై కాల్పులు జరిపిన మరుసటి దినం చాలా బిజీగా అయిపోయింది Corleone family మొత్తానికి..!ఒ వేపు Tom Hagen మధ్యవర్తుల కోసం ప్రయత్నిస్తున్నాడు Solozzo తో డీల్ మాట్లాడటానికి.ఉన్నట్లుండి Solozzo ఎవరికంట పడకుండా మసలుతున్నాడిపుడు...అపుడు ..చర్చలని చెప్పి..!

Tattaglia family కి చెందిన కీలక వ్యక్తులందరూ ముందు జాగ్రత్తగా ఎవరికీ కనిపించకుండా పనులు చక్కబెట్టుకుంటున్నారు.ఎటునుంచి ఏమి ముంచుకొస్తుందోనని..!Clemenza కి Pauli Gatto పని ఒప్పజెప్పారు.అది జరిగిపోయింది.Tessio కి Luca Brasi ని వెతికే బాధ్యతని చెప్పారు.Sonny కూడా ఎందుకనో Luca నమ్మకద్రోహిగా మారతాడని నమ్మడంలేదు.అయితే ఏదో జరగరానిది జరిగిందని మాత్రం శంకిస్తున్నాడు.

Don భార్య Maria ..ఆయన ఉన్న ఆసుపత్రికి దగ్గరలోనే ఉంటూ బాగోగులు చూస్తున్నది.అల్లుడు Carlo Rizzi తాను ఏదైనా సహాయం చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలిపాడు.అయితే Sonny కి బావమైదిని ఈ వ్యవహారాల్లో వాడుకోవడం ఇష్టం లేదు.అందుకనే' Manhattan లో ఉన్న Bookmaking బిజినెస్ ని నువ్వు జాగ్రత్తగా..చుసుకో చాలు..' అని చెప్పేశాడతనికి.

Freddie  కూడా Don మీద జరిగిన attempt వల్ల షాక్ అయి ఆసుపత్రి లో బెడ్ మీద నే ఉన్నాడు.

ఉన్నట్లుండి ఫోన్ రింగ్ అవడం తో Michael వెళ్ళి ఎత్తాడు.

అవతల వైపు నుంచి Johnny Fontanne ..!

" ఇప్పుడు గాడ్ ఫాదర్ కి ఎలా ఉంది ..నేను చూడటానికి వస్తున్నాను" అన్నాడతను.

" లేదు..కంగారు పడకు..బాగానే ఉంది..నువ్వు రావడం వల్ల అనవసరమైన పబ్లిసిటీ వస్తుంది మీడియాలో..అది Don కి ఇబ్బంది కలిగించే విషయంగా ఉంటుంది..నువ్వు ఫోన్ చేసినట్లు ఆయనకి చెబుతాను..సరేనా.."

"Mike...నువ్వు చెప్పింది కరక్టే....అర్ధమైంది" అని చెప్పి పెట్టేశాడు Johnny.ఈ ప్రపంచం లో పబ్లిసిటీ ఆశించకుండా తనపనిని చేసుకుపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది Don Corleone ఒక్కడేనని Johnny కి బాగా తెలుసు.

ఆ తర్వాత మరో కాల్ వచ్చింది.ఈసారి Kay Adams ..! Michael యొక్క గర్ల్ ఫ్రెండ్..!

" మీ నాన్నగారి ఆరోగ్యం ఎలాఉంది.. ఆసుపత్రికి రావాలనుకుంటున్నా" అంది ఆమె.

" ఏయ్ Kay..ఇపుడు అలాంటి పనేమీ చేయకు ..నువ్వు గనక అక్కడికివస్తే Daily News పేపర్ లో రకరకాల వార్తలు వస్తాయి.అవి మీ పేరెంట్స్ కి తెలిస్తే బాధపడతారు.Girl from old yankee family mixed up with the son of big mafia chief ...అని Daily News లో వస్తే How would your parents like that..? "  అడిగాడు Michael.

" Hey..My parents never read that news paper"  హాస్యంగా చెప్పింది Kay.

"సరే..తొందరలోనే కలుద్దాం"

" అది ఎప్పుడు"

" How about tonight..అయితే ఒకటి ఎవరితోనూ ఈ మాట చెప్పకు"

" అలాగే..Can I do any Christmas shopping for you " అడిగింది ఆమె.

"ఇప్పుడేమీ వద్దు..Just be ready "

" నేను ఎపుడు రెడీగానే ఉంటానుగదా.."

" That's why I love my girl "

ఆ విధంగా సల్లాపోక్తులు ముగిశాయి.ఇవతల కి వచ్చాడు.

" Clemenza.. అతని పని అయినట్లేనా" Sonny అడుగుతున్నాడు.

" అతను నీకు కనిపించడు ..నాది హామీ" నవ్వుతూ బదులు చెప్పాడు Clemenza.

Michael కి ముందు అర్ధం కాలేదు.. ఆ తర్వాత వెలిగింది Paulie గురించి అని.

"Tom..ఆ విషయం..అదే Solozzo తో చర్చలు ..ఎంతదాకా వచ్చాయి" అడిగాడు Sonny.

"ఎందుకనో అతను మళ్ళీ వెనకడుగు వేస్తున్నాడు...మొహం చాటేస్తున్నాడు..బహుశా మన Button men కి చిక్కుతానని అనుమానిస్తున్నాడేమో.."

"నువ్వు Solozzo ని తక్కువ అంచనా వేయకు ..Tom..He is a smart guy ...వాడు అనుకున్నది అనుకున్నట్లుగా చాలా విషయాల్లో చేయగలుగుతున్నాడు..అది మనం ఒప్పుకొనితీరాలి"

"రేపు కూడా కొన్ని వర్గాల ద్వారా ప్రయత్నిస్తాను..అతణ్ణి Contact కావడానికి..."

"అన్నట్లు నాన్నగారు ..ఇపుడు మాట్లాడగలిగే స్థితి లో ఉన్నారా.."

" లేదు..మరో రెండు మూడు రోజులు పట్టవచ్చు.."

Sonny తర్వాత Tessio వేపు తిరిగి చెప్పాడు." నీ మనుషులతో వాడి ఆనుపానులను కనిపెట్టమని చెప్పు..ఏ మాత్రం చాన్స్ దొరిగినా వాడి ని ఫినిష్ చేయవచ్చు"

" Solozzo చాలా తెలివిగా కనిపిస్తున్నాడు.చర్చలకి రాకుండా ఈ మధ్య కాలాన్ని అతను మిగతా Families సపోర్ట్ కోసం ప్రయత్నిస్తున్నాడని నా అనుమానం" Tom చెప్పాడు.

ఇద్దరు దళపతులు ..Clemenza,Tessio అసహనంగా ఎదురు చూస్తున్నారు.ఒక్కమాట..ఊ..అంటే కొండని పిండి కొట్టడానికైనా వెనుకాడరు వాళ్ళు..తమ Button men తో రంగం లోకి దిగిపోతారంతే..!ఏదో ఒకటి తెమల్చండి అన్నట్లుంది వారికి..!

"Luca Brasi గురించి ఏమైనా తెలిసిందా " Tessio ని అడిగాడు Sonny.

"లేదు..Sonny..బహుశా ఇతణ్ణి గాని  ఆ Solozzo లోబరుచుకున్నాడా అనిపిస్తోంది" చెప్పాడు Tessio.

"నాకూ  అదే అనుమానం ..ఎందుకంటే నన్ను కిడ్నాప్ చేసిన ఆ రోజున కూడా Solozza ఎందుకనో Luca brasi గురించి పెద్దగా వర్రీ అయినట్లు కనబళ్ళేదు.." అన్నాడు Tom.

"Christ...I hope Luca isn't fighting against us..how you guys figure it out.. " అడిగాడు Sonny.

" కాలం కలిసిరాకపోతే ఎవరైనా ద్రోహులుగా మారవచ్చు..ఏం చెప్పగలం..ఆ Paulie  Gatto గాడు అలా మారతాడని అనుకున్నామా..?అయితే ఒకటి..Luca brasi కి మీ నాన్నగారంటే చాలా అభిమానం..ఇంచుమించు ఒక దేవుని మాదిరిగా గౌరవిస్తాడు.Don కూడా తాను ఎవరిముందైనా నెర్వస్ గా ఫీలవుతాడు అంటే అది ఒక్క Luca ముందే.." తన అభిప్రాయాన్ని చెప్పాడు Clemenza.


" ఆ Solozzo..జిత్తులమారి నక్క..ఏదైనా ఆశ చూపించాడా..ఏమో " Tessio  సందేహించాడు.

"Paulie Gatto హత్యగావించబడినట్లు ఈ పాటికి Solozzo కి తెలిసి ఉంటుంది గదా..అతని రియాక్షన్ ఎలా ఉంటుందంటావు.." Clemenza తో అన్నాడు Sonny.

" Corleons are not fools అని అర్ధం అయి ఉంటుంది.తాను ఇంకా  బ్రతికి ఉండటం అతని లక్ లా భావిస్తాడేమో.."

" ఏమంటున్నావు Clemenza..!Solozzo చాలా తెలివిగా కదులుతున్నాడు..తన ప్రణళికనీ అమలుచేస్తున్నాడు.. అంతదాకా ఎందుకు..Don మీద కాల్పులు జరపడానికి కొన్ని రోజులు ముందు వాడు నాన్నగారి దినచర్య మీద రెకీ నిర్వహించాడు తన మనుషులతోటి.. దానిలో భాగంగానే Paulie Gatto ని వాడు కొన్నాడు.ఆ తర్వాత పర్యవసానాలు నీకు తెలుసు...వాడి ఖర్మగాలి ఆ షూటర్లు పనికిమాలినవాళ్ళు గావడం చేతనో లేదా నాన్నగారు వేగంగా తప్పించుకోవడం వల్లనో బ్రతికిపోయాడాయన.లేకపోయినట్లైతే ,వాడి స్థితి ఈ రోజున మహారాజ యోగంలా ఉండేది..Don't underrate him ,Clemenza  "ఉన్నదిఉన్నట్లుగా బద్దలు కొట్టాడు Sonny.

అంతలోనే అక్కడికి వచ్చిన Spaghetti ని అంతా ఆరగించారు.

"Solozzo ..టచ్ లో లేకుండా పోయాడు అంటే ..మిగతా Families తో ఏవైనా సంప్రదింపులు చేస్తున్నాడేమో.." Michael అన్నాడు.

"  Luca తో గాని కలిసి వెళ్ళాడా..ఏమో" Sonny అభిప్రాయం అది.

"ఏది ఏమైనా..మిగతా  Mafia Families అన్నిటినీ ఇప్పుడు ఢీ కొట్టడం అంత తెలివైన పనికాదు.Political ఇంకా Trade connections ని ఎక్కడ వదిలి ఎక్కడ పట్టుకోవాలో అది మీ నాన్నగారే బాగా చేయగలరు.కొద్ది రోజులు ఓపిక పడదాం.." Tom చెప్పాడు.

" ఆ..Tessio నీ మనుషులు ఆసుపత్రిని బాగా కవర్ చేస్తున్నారా" అడిగాడు Sonny.





" సందేహం అఖర్లేదు...Outside and inside.. ,Right around the clock "

ఆ తర్వాత Michael చెప్పాడు Sonny తో.." ఈ రాత్రికి నాకు ఊర్లోకి వెళ్ళే పని ఉంది"




"ఎందుకు" Sonny అడిగాడు.

" ఆసుపత్రికి వెళ్ళి నాన్నగారిని చూడటం,ఇంకా అమ్మని ని,Connie ని పరామర్శించడం..అలా కొన్ని ఉన్నాయిలే"


 Kay Adams విషయం చెప్పకుండా దాటేశాడు Michael. తండ్రి లాగానే అతనూ అసలు విషయం ఎప్పుడూ చెప్పడు.


ఇలా మాట్లాడుకొంటుండగా ..కిచెన్ వేపునుంచి కలకలం వినిపించింది.బయటకి వచ్చి చూశారు.అక్కడ పడివున్న బుల్లెట్ ప్రూఫ్ ని ,చచ్చిపోయిన చేపని ఓ Vest లో చుట్టి ఉన్నదన్నమాట..తీసి పరిశీలించారు.అది ఎవరిదో
కాదు...Luca Brasi కి చెందిన బుల్లెట్ ప్రూఫ్..!

" మరి ఆ చచ్చిన చేపని దీనితో పాటు ఎందుకు పంపినట్లు" అడిగాడు Michael.

" ఇది ఒక Sicilian Message.అంటే Luca brasi శవం సముద్రం లో చేపల తో కలిసిఉన్నదని భావం.Luca ని హత్య చేశామని Solozzo మనకి ఈ సంకేతం ద్వారా తెలియజేశాడు " చెప్పాడు Tom Hagen.


(మిగతాది వచ్చేభాగం లో చెప్పుకుందాం) ---KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (పంధొమ్మిదవ భాగం)

Michael తను చెప్పినట్టుగానే Kay Adams బస చేసిన హోటల్ కి బయలుదేరాడు.తన కుటుంబం గురించి ఏ హాస్య పూరిత సంఘటనలతోనో,చిన్న కధల రూపం లోనో Kay తో చెప్పాడుతప్ప పూర్తిగా ఎపుడూ చెప్పలేదు.అలా అని అతను ఆమెని ప్రేమించలేదని కాదు,కాని అనువు  అయిన సమయం తనకి దొరకలేదు.అదీగాక Family business కి ఆమె వాతావరణం పూర్తిగా కొత్త.ఆమె కుటుంబీకులు ఎలా స్పందిస్తారో తకకి తెలియదు.

ఈ Solozzo అనేవాడు తమ Family కి పెద్ద కొరకరాని కొయ్యలా తయారయ్యాడు.అతని కదలికలు ఎపుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి.నిజం చెప్పాలంటే గత పదేళ్ళలో ఇలాంటి సవాలు తమకి ఎదురు కాలేదు.

తనకి నచ్చనిది ఏమంటే ఈ యుద్ధంలో తనని అసలు యుద్ధరంగానికి వాడుకోకుండా ఫోన్ కాల్స్ అటెండ్ చేయమని Sonny చెప్పడం..!

గత అనేక ఏళ్ళుగా తమ తండ్రి Don Corleone ఈ ప్రపంచం నుండి పొందిన గౌరవానికి,ఆయన చేసిన శక్తి ప్రకటనకి ..బహుశా ఆయన చెల్లించిన మూల్యమా ఈ Solozzo రూపం లో ఎదురైన కాల్పుల ఘటన అనిపించింది.

హోటల్ లో Kay Adams ఇంకా Michael డిన్నర్ చేశారు.ఆ తరువాత రూం లోకి వచ్చారు.మాట్లాడుకొంటున్నారు.

"Mike..పేపర్లలో వచ్చినదంతా నిజమా..మీ నాన్నగారికి అలా జరగడం బాధాకరం"  అంది Kay.

" ఏమో...నేనూ అనుకోవడంలేదు.." పూర్తిగా నిజం చెప్పాలా..వద్దా అని అలా ఆగిపోయాడు Michael.

" మీ నాన్నగారిని చూడటానికి ఎప్పుడు వెళుతున్నావు.."

" విజిటింగ్ వేళలు రాత్రి ఎనిమిదిన్నరకి ముగుస్తాయి.ఆయన పూర్తిగా మాట్లాడేశక్తి లో ఉన్నారా అంటే చెప్పలేను..కాని వెళ్ళిరావాలి"

Kay లేచి డ్రింక్స్ కలిపి ఒక గ్లాసు Michael కి ఇచ్చింది.మరి ఒకటి తను తీసుకొని అతని ఒడిలో కూర్చుంది.అలా మాట్లాడుకుంటూ ఉన్నారు.Michael చెయ్యి ఆమె తొడల మీద నిమురుతుండగా ఆమెకి లోపల అంతా తేమ గా అవుతున్న అనుభూతి కలిగింది.ఇద్దరి పెదాలు..ఆ తర్వాత దేహాలు పెనవేసుకుపోగా ఆ బెడ్ మీద అలా వాలిపోయారు.శృంగార లోకం లోనుంచి బయటికొచ్చారు కాసేపటి తర్వాత..!

" ఏమిటి ..దుస్తులు కూడా విప్పకుండా పనికానిచ్చావు..మీ సైనికుల పరిభాషలో దీన్నే Quickie అంటారా.." నవ్వుతూ అన్నది Kay.

"అవును..ఏం బాగాలేదా "

"Not bad " అన్నదామె..!

ఒక్కసారిగా చేతికున్న వాచ్ చూసుకున్నాడు Michael.పదిన్నర కావస్తున్నది.మైగాడ్ అని వెంటనే బాత్ రూం కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు...తల దువ్వుకున్నాడు.

"మన వివాహం ఎప్పుడు జరుగుతుంది" అన్నది Kay.

"నువ్వు ఎప్పుడు అంటే అప్పుడే.. ఈ Solozzo వ్యవహారం కూడా కొంత సద్దుమణగాలి. అయితే ఒకటి..ఈ లోగా నాగురించి మీ పేరేంట్స్ కి కూడా చక్కగా వివరించు.."

" అంటే..ఏమని చెప్పమంటావేం.."

" నువ్వు ఒక అందమైన ,ధైర్యశాలి అయిన ఓ ఇటాలియన్ యువకుణ్ణి ప్రేమించానని చెప్పు..అతనికి డార్ట్ మౌత్ కాలేజ్ లో మంచి మార్కులు వచ్చాయని..కష్టజీవి అని,నిజాయితీగల వ్యక్తి అని  చెప్పు..రెండవ ప్రపంచయుద్ధం లో సైనికునిగా దేశానికి సేవలందించాడని.చెప్పు..అతని తండ్రి ఒక మాఫియా చీఫ్ అని..చెడ్డవారిని శిక్షిస్తూ ఉంటాడని..అప్పడప్పుడు ప్రభుత్వ అధికారులకు తన పనిలో తోడ్పడటానికి లంచాలు ఇస్తుంటాడని.. కాని అవి ఏమి అతని కుమారునిపై ప్రభావం చూపవని..ఇలా చెప్పుకుంటూ వెళ్ళు..సరేనా.." అన్నాడు Michael.

" అయితే మనం మళ్ళీ ఎపుడు కలిసేది.."

" ఈ క్రిస్మస్ సెలవులు కాగానే ..డార్ట్ మౌత్ కాలేజ్ లో కలుద్దాం.." అన్నాడు అతను.

" ఓ.కె." అని ఆమె వీడ్కోలు పలికింది.వాళ ఇద్దరిలో ఎవరికీ తెలియదు మళ్ళీ మూడు సంవత్సరాలవరకు తాము కలుసుకోలేమని...!

* * *

Michael ఆసుపత్రి ఆవరణ లో దిగేసరికి అంతా నిర్మానుష్యంగా వుంది.ఆసుపత్రి బయట గాని,లోపల గాని ఎవరి జాడ లేదు.పోలిస్ డిటెక్టివ్ లు గాని ,Tessio మనుషులు గాని..ఇంకా సెక్యూరిటీ కి నియమించినవాళ్ళు ఎవరూ కనబడలేదు. తండ్రి ఉన్న రూం నెంబర్ అతనికి తెలుసు.ఎలివేటర్ ద్వారా నాలుగో ఫ్లోర్ కి వెళ్ళాడు.ఎవరు తనని అడ్డుకుండానికి రాలేదు. ఎంత అరక్షితంగా ఉంది ఈ ప్రదేశం..అదీ తన తండ్రి ఉన్న ఈ స్థితిలో..! మనసు ఏదో కీడు శంకించింది.

అదే హాల్ లో నర్స్ ఉన్న రూం కి వెళ్ళాడు.

" ఏమిటి..అంతా నిర్మానుష్యంగా ఉంది..పోలీసులు గాని..ఇంకా మిగతా వాళ్ళు గాని కనిపించడం లేదేం..అసలు ఏమి జరుగుతున్నదిక్కడ.." ఆందోళనగా అడిగాడు Michael.

" పది నిమిషాలక్రితమే..పోలీస్ అదికారులు వచ్చారు.విజిటర్స్ తాకిడి ఎక్కువగా ఉందని ..అందర్ని వెళ్ళిపొమ్మని చెప్పారు.ఇక్కడున్న డిటెక్టివ్  లకి కూడా పై అధికారులనుంచి కాల్ రావడం తో ఇందాకనే వెళ్ళిపోయారు.." చెప్పింది ఆ నర్స్.

" మా తండ్రి గురించి పేపర్ల లో చదివారుగదా ..ఆయనకి రక్షణ అవసరం..మీరు ఒక హెల్ప్ చేయాలి.అది మీకు కూడా మంచిది.ఇక్కడనుంచి ఆయన్ని వేరే రూం కి మార్చుదాం.." అన్నాడు Michael.

ముందు వ్యతిరేకించినా తర్వాత పరిస్థితి అర్ధం అయి ఆమె సహకరించింది.ఇద్దరు కలిసి ఆ బెడ్ తో సహా డాన్ ని చివరిలో ఉన్న ఓ రూం లోకి మార్చారు.ఈ లోపులో Michael వెంటనే Sonny కి ఫోన్ చేశాడు.

" Sonny ..ఇక్కడ పరిస్థితి..ఆసుపత్రిలో ఆందోళనకరంగా ఉంది.నాన్నగారి దగ్గర ఏ రక్షక సిబ్బంది లేరు.మన వాళ్ళు కూడా లేరు.పోలీస్ లు బయటకి వెళ్ళమన్నారట.." అన్నాడు Michael.

" అర్ధమైంది..నువ్వేమికంగారుపడకు..కొన్ని నిమిషాల్లో మనవాళ్ళు అక్కడ ఉంటారు..సరైన సమయానికి నువ్వు వెళ్ళావు..మంచిదైంది..ఇది ఆ Solozzo యొక్క మూవ్ అయినా ఆశ్చర్యం లేదు.బ్లడీ టర్క్..నువ్వు భయపడకు..సరేనా.." అన్నాడు Sonny.

బెడ్ మీద నుంచి తండ్రి స్వరం మెల్లిగా ..మగత లో ఉన్నట్లుగా వినిపించింది.

"Michael..నువ్వేనా..ఏం జరుగుతోందిక్కడ " అన్నాడాయన.

" నాన్నగారు..ఏమి కంగారు పడవద్దు..మిమ్మల్ని వేరే గది లోకి మార్చాము.ఎవరు మీ పేరు పెట్టి పిల్చినా దానికి రెస్పాండ్ కావద్దు.ఎవరో వ్యక్తులు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు" అన్నాడు Michael.

" చంపడానికి వస్తున్నారా..కొత్తేమున్నది..నా పన్నెండవ ఏటనుంచి ఎవరో ఒకరు నన్ను చంపడానికి ప్రయత్నిస్తూనేఉన్నారు కదా.." బలహీన స్వరం తో అన్నాడు డాన్.

(మిగతాది వచ్చేభాగం లో చూద్దాం)-- KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ఇరవై వ భాగం)

ఆ ఆసుపత్రి చిన్నగా ఉంటుంది.ప్రైవేట్ గా నిర్వహించబడేది.లోనికి రావాలంటే ప్రధానమైన గేటు ఒకటే ఉంటుంది.పైన కిటికీ లోనుంచి అంతా ఓ మారు కలియజూశాడు Michael..! ఆ తర్వాత క్రిందకి దిగి వచ్చాడు.ఆసుపత్రికి ముందర ఉన్న సైడ్ వాక్  మీద గల ఓ దీపపు స్థంబం దగ్గర నిలబడ్డాడు.అసలే డిసెంబర్ మాసపు చలి.ఆసుపత్రికి ముందు ఉన్న స్థలం లో ఆంబులెన్స్ కని కేటాయించబడింది గాని ఆ వాహనం మాత్రం లేదు.

9 వ అవెన్యూ నుంచి ఈ వైపే ఓ వ్యక్తి వడివడిగా వస్తున్నాడు.అతని చేతిలో ఏదో బ్యాగ్ ఉంది.దగ్గరగా వచ్చాడు.చూసినట్టే ఉంది గాని గుర్తుకు రావడం లేదు Michael కి.

" మీరు Don Corleone కుమారుడు Michael కదూ..?నేను Enzo ని..ఆ రొట్టెల వ్యాపారి Nazorine యొక్క అల్లుణ్ణి..నాకు అమెరికా లో ఉండటానికి పర్మిట్ కోసం మీ నాన్నగారు ఎంతో సహాయం చేశారు ఆ రోజున...! ఆయనకి నా Respects చెల్లించడానికి వచ్చాను.ఇప్పటికే బాగా రాత్రి అయినట్టుంది..ఆసుపత్రిలోకి నన్ను అనుమతిస్తారా.." అడిగాడు అతనే తనని పరిచయం చేసుకుంటూ..!

" ఓ..అవును..ఇప్పుడు గుర్తుకు వచ్చావు..చాలా కృతజ్ఞతలు ..ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు.ఈ టైం లో లోపలకి వద్దులే..నువ్వు వచ్చినట్లు మా తండ్రికి చెబుతాను..సరేనా" అన్నాడు Michael.

"ఎందుకని అలా అంటున్నారు..?"

" పోలీసులు విజిటర్స్ ని ఎక్కువగా అనుమతించడం లేదు.సాధ్యమైనంత త్వరగా నువుకూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో..మళ్ళీ నీకేదైనా ఇబ్బంది రావచ్చు..ఇతరత్రా కూడా కొన్ని సమస్యలున్నాయిలే.."

" గాడ్ ఫాదర్ నా కోసం ఒక ఫేవర్ చేశారు.ఆయనకి ఆ మేరకు ఋణపడిఉన్నాను. ..నేను కూడా ఓ చిన్న సాయం చేయకపోతే ఎలా.. నన్ను కూడా మీతో ఉండనివ్వండి.." చెప్పాడు Enzo.

" సరే..ఉండు...నీ యిష్టం"  అని Michael ఒక సిగరెట్ ని Enzo కి ఇచ్చాడు.ఇద్దరూ అలా పొగత్రాగుతూ మాట్లాడుకుంటున్నారు.అంతలో ఓ నల్లని కారు వచ్చి ఆగింది.చాలా దగ్గరగా వచ్చి కాసేపు ఆగి..మళ్ళీ కాసింత ముందుకు వెళ్ళిపోయింది.ఎవరో తమ ఇద్దరిని చూసి ఆ విధంగా ముందుకు వెళ్ళారా అనిపించింది.Enzo కొద్దిగా కంపించినట్లయ్యాడు.విచిత్రంగా తను స్టెడీ గా ఉన్నాడు.ఓ పది నిమిషాల వ్యవధిలో మరోకారు వచ్చింది.అది పోలీస్ కారు.దాని వెనుక ఇంకో రెండు వాహనాలు వచ్చాయి.వాటిలోనూ పోలీస్ సిబ్బంది,డిటెక్టివ్ లు ఉన్నారు.అంతా దిగారు.Michael ముందుకు నడిచాడు.

వాళ్ళలో ఒకతను Police Captain అనుకుంటా ..కోపంగా Michael వేపు చూస్తూ అన్నాడు.

" ఏయ్..ఎవరు మీరంతా..ఏం పని ఇక్కడ..అందర్నీ లాకప్ చేసిపారేస్తాను.."

" Captain ..అతను Don Corleone కుమారుడు.వాళ్ళ తండ్రిని చూడ్డానికి వచ్చినట్లున్నాడు."  అన్నాడు డిటెక్టివ్ ఫిలిప్స్.అతను Corleone Family కి అనుసంధానింపడిన వ్యక్తి..!

" ఆసుపత్రి లో ఉండాల్సిన గార్డ్స్ అంతా ఏమయ్యారు...వాళ్ళనెందుకు వెళ్ళిపొమ్మన్నారు.." అడిగాడు Michael ఆ Police Captain ని.

"నువ్వెవడివి...నాకు చెప్పడానికి..అయిన గేంగ్ స్టర్స్ ఎంతమంది చస్తే నాకేమిటి.. అసలు ఖాతరు చెయ్యను..అసలు ఈ టైం లో విజిటర్స్ రాకూడదు...నువ్వెందుకున్నావ్ ఇక్కడ.." రెచ్చిపోతూ హుంకరించాడు అతను.

" ఇక్కడ్ గార్డ్స్ ని నియమించేతవరకు నేను కదలను.." Michael అన్నాడు.

"Phil..lock him up" అరిచాడు Captain.

" అతను క్లీన్ గా ఉన్నాడు..ఏ కేసులూ లేవు..అమెరికా తరపున వార్ లో ఫాల్గొన్న రికార్డ్ ఉన్నది... మళ్ళీ అనవసరంగా గొడవ అవుతుందేమో.." అన్నాడు డిటెక్టివ్ Phil..!

"Solozzo ఎంత ఇచ్చాడు నీకు..మా తండ్రిని చంపే ప్లాన్ లో భాగగా.." అడిగాడు Michael ...!

అంతే..Police Captain కి కోపం నషాళానికి అంటింది.

" ఏ..వీణ్ణి వదలకుండా పట్టుకొండి.." మిగతా సిబ్బందిని ఆదేశించాడు Captain.వెంటనే చెరొక రెక్కని విరిచి పట్టుకున్నారు.

ఫేడీల్మని బలం కొద్దీ Michael దవడ మీద ఒక గుద్దు గుద్దేడు Captain.కపాలం లో బ్లాస్ట్ అయిన అనుభూతి కలిగింది Michael కి..!వెంటనే రక్తం పడింది..కొన్ని పళ్ళు కూడ రాలి నోట్లో కొచ్చినయి.ఇంకో గుద్దు గుద్దబోతుండగా ఆ ప్రక్కనున్న డిటెక్టివ్ Phil  ఆపుజేసి పక్కకి తీసాడు Captain ని." ఇంకా..ఎందుకు అతనికి బాగానే తగిలింది కదా.." అంటూ..!

" ఏయ్..Phil..నేను వాడిని కొట్టలేదు..వాడే పోలీస్ అధికారి పై తిరగబడ్డాడు...అప్పుడు వాడికి తగిలాయి..అలా గుర్తుంచుకో ..అర్ధమయిందా.." Captain హుంకరించాడు.

ఇలా సంఘటన జరుగుతుండగా ..మరి కొన్ని కార్లు ..అక్కడికి దూసుకొచ్చాయి.అవి Sonny పంపినవి అని అర్ధమయింది.దానిలోనుంచి Clemenza కోసం పనిచేసే లాయర్ దిగాడు.మిగిలిన కార్ల లోనుంచి సాయుధులైన ప్రైవేట్ డిటెక్టివ్ లు దిగారు.

ఆ లాయర్ Police Captain దగ్గరకొచ్చి మర్యాదగా చెప్పాడు.

" Corleone Family ఈ ప్రైవేట్ డిటెక్టివ్ లని హైర్ కి తీసుకుంది.ఈ ఆసుపత్రి లో డాన్ కి రక్షణ కల్పించడానికి..!వీళ్ళని అరెస్ట్ చేసినా లేదా వెళ్ళిపొమ్మని చెప్పినా ,రేపు మీరు కోర్ట్ కి వచ్చి సమాధానం చెప్పవలసి ఉంటుంది" అని.

ఆ లాయర్ Michael దగ్గరకి వచ్చి అన్నాడు " ఈ సంఘటన కి సంబందించి ఎవరిమీదనైనా ఆరోపణ చేయదలుచుకున్నారా.."

"లేదు..నేనే స్లిప్ అయి కింద పడ్డాను..ఎవరి ప్రమేయం లేదు.." చెప్పాడు Michael.

ఆ తర్వాత కొద్దిసేపటికి Michael స్పృహ కోల్పోయాడు.అతణ్ణి ఆసుపత్రి లో చేర్చారు.ఆ  మరుసటి రోజు Tom ఇంకా Clemenza పికప్ చేసుకోవడానికి వచ్చారు.కారు లో ప్రయాణిస్తూ మాట్లాడుకుంటున్నారు.

" నిన్న నాకు మత్తు ఇచ్చినట్లున్నారు డాక్టర్లు " Michael అడిగాడు.

" అవును..దవడ లో చిక్కుపడ్డ పళ్ళ ముక్కల్ని తీయడానికి  చిన్న ఆపరేషన్ చేశారులే.. " Tom అన్నాడు.అవును తడుముకుంటే నాలుగు పళ్ళు మిస్ ఐనట్లు అనిపించింది.ఎడమ దవడ కూడా కొంత స్థాన బ్ర్హ్మశం చెందినట్లు తోచింది.

" అయితే ఇంకా గతరాత్రి విశేషాలు ఏమిటి.."

" ఆ Phil  ..అనే పోలిస్ డిటెక్టివ్ ఉన్నాడే అతను మన మనిషే..అతను ఇచ్చిన సమాచారం ప్రకారం Solozzo ఆ Police Captain ని వశపరుచుకున్నాడు..పెద్ద మొత్తం లో డబ్బుముట్టజెప్పి..!డ్రగ్ ఆపరేషన్ లో కూడా షేర్ ఇస్తున్నట్లు తెలిసింది.వాడు ఆసుపత్రికి వచ్చి ఆ టైం లో రచ్చ చెయ్యడం వెనుక కూడా కుట్ర ఉన్నది...అయితే అది ఫలించలేదనుకో.." Tom అన్నాడు.

"నాకు జరిగిన దాని గురించి పేపర్లలో వచ్చిందా.." అడిగాడు Michael .

" అదేం లేదు.."

" ఆ Police Captain పేరేమిటి.."

" McCluskey అంటారు..! ఆ ఇంకొకటి..Luca brasi ని అంతమొందించిన కుట్రలో ఉన్న Bruno Tattaglia ని ఈ రోజు ఉదయం నాలుగు గంటలకి లేపేయడం జరిగింది.." చెప్పాడు Tom.

" ఎందుకు..కొంతకాలం ఓపిక పడదాం అన్నాడు కదా Sonny ..?"

నిన్న ఆసుపత్రి దగ్గర జరిగిన సంఘటన తర్వాత..Sonny కొంతమంది Button men ని న్యూయార్క్,న్యూజెర్సి నగరాలలోకి వదిలాడు..దానిలో భాగం గానే Bruno మట్టికరిచాడు.ఇంకా పెద్దగా కాకుండా నువు మాట్లాడు.."

" పొద్దున ఇంకా సమావేశాలు ఏమైనా జరిగాయా.."

"Solozzo ఇపుడు టచ్ లోకి వచ్చాడు..ఓ మధ్యవర్తి ద్వారా మెసేజ్ చేశాడు..నెగోషియేషన్స్ జరపడానికి సుముఖంగా ఉన్నాడట..Bruno Tattgliya చావడం తో వాడికి మన సీరియస్నెస్ అర్ధం అయింది..అతను చాలా తక్కువ అంచనా తో గేం ఆడదామని చూశాడు..ఆ మరొకటి..Luca brasi ని మీ తండ్రి పై దాడి జరిగిన ముందురోజునే నైట్ క్లబ్ లో చంపినట్లు కన్ ఫర్మ్ అయింది.."

 " బహుశా అతను రక్షణ లేని స్థితి లో ఉండగా పట్టుకొని ఉంటారు.." Michael అన్నాడు.

(మిగతాది వచ్చేభాగం లో చూద్దాం) --KVVS Murthy


Mario Puzoనవల The God Father సంక్షిప్తంగా(ఇరవై ఒకటవ భాగం)

Clemenza,Tom Hagen,Michael ముగ్గురూ లాన్ బీచ్ లో ఉన్న నివాసం లోకి అడుగుబెట్టారు.Michael స్కాచ్ మూత తీసి కొంచెం గల్ప్ చేశాడు.దవడ బాధ కి కొంత ఉపశమనం లా ఉంటుందని..!Sonny సోదరుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు.

" మధ్యవర్తుల ద్వారా కబురువచ్చింది మళ్ళీ..మీటింగ్ నిమిత్తం.." Sonny చెప్పాడు.

" మరి నువ్వు ఏమన్నావు.." Tom అడిగాడు.

" నాకేమిటి తొందర..బయట వందమంది Button men తయారుగా ఉన్నారు.Solozzo ఏ మాత్రం తోకాడించినా ..వాడు చచ్చాడనే అర్ధం"

"వాళ్ళ్ ప్రపోజల్స్ ఏమిటి.."

Michael ని చర్చల నిమిత్తం పంపించమని చెబుతున్నారు.అప్పుడు వాళ్ళ ప్రపోజల్స్ చెబుతారట..Michael రక్షణకి వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు.Solozzo అలాంటిదేమి మనల్ని అడగలేదు.ఎందుకంటే అతనికి తెలుసు..అతను పరిధి దాటి ప్రవర్తించాడని..! వాళ్ళ మనుషులు వచ్చి Mike ని పికప్ చేసుకుంటారట.ఇప్పటి దాకా Place ని వెల్లడించలేదు." చెప్పాడు Sonny.

మరి Tattagliya ల విష్యమేమిటి..?"

వాళ్ళు Solozzo తోనే వెళతారు.Bruno Tattagliya హత్య ని వాళ్ళు Luca brasi హత్య తో సరిపోయినట్లుగా భావిస్తున్నారు"

"వాళ్ళు ఏం చెబుతారో విందాం"

"ఈసారి చర్చల్లో Solozzo ని మనకి అప్పగించమని మెసేజ్ ఇస్తాను ..లేకపోతే పూర్తి స్థాయి పోరాటమే.."

"అది అందరకీ అరిష్టమే" Tom అన్నాడు.

"అలాంటప్పుడు సింపుల్..Solozzo ని నాకు అప్పగించడమే వాళ్ళు చేయవలసిందే.." Sonny  అన్నాడు.

"Police Captain అదే..ఆ McClusky ఇపుడు Solozzo తో ఉన్నాడు.డబ్బు తీసుకున్నాడు భారీగా..అంతేకాదు డ్రగ్ రాకెట్ లో కూడా అతనికి షేర్ ఉన్నట్లు తెలుస్తున్నది.బహుశా చర్చలు జరిగేటపుడు ఇతను కూడా సివిల్ డ్రస్ లో రావచ్చు.మీరు McClusky ని చంపినట్లయితే న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మంట్ లో పెద్ద కలకలం రేగుతుంది.పేపర్లు,చర్చ్ లు..మీకు వ్యతిరేకంగా కోడై కూయవచ్చు. డిపార్ట్ మెంట్ కూడా సీరియస్ గా తీసుకోవచ్చు.." Tom తన అభిప్రాయాన్ని తెలిపాడు.

అన్నీ తాపీగా వింటూ సిగార్లు కాలుస్తున్నారు Tessio,Clemenza లు..!

" నాన్నగారిని ఆసుపత్రి నుంచి తీసుకు రావచ్చా.." Michael అడిగాడు.

" లేదు..ఇంకా కొన్ని రోజులు పడుతుంది.." Tom జాబిచ్చాడు.

"Solozzo మరో చాన్స్ తీసుకునే అవకాశం ఇవ్వకూడదు.." Sonny అన్నాడు.

"మరి ఆ McClusky విషయం ఏం చేద్దామని.."

Tom అడిగిన ప్రశ్నకి Sonny చిరునవ్వుతో Michael వంక చూశాడు.

" అవును..అతడిని మట్టుబెట్టడం extream step అనే చెప్పాలి.కాని కొన్ని సార్లు వాటిని కూడా జస్టిఫై చేయవచ్చు.McClusky ఏమీ నిజాయితీ నిండిన పోలీస్ అధికారి కాదు.అతను ఒక డ్రగ్ రాకెట్ తో చేయికలిపాడు.మన పే రోల్ లో ఉన్న పత్రికా విలేకరులందరకీ అతని అవినీతి భాగోతాన్ని వివరించే సాక్ష్యాల్ని ఇవ్వండి.ఆ విధంగా కధనాలు బయటకి వచ్చినపుడు ప్రజల్లోనూ,డిపార్ట్ మెంట్ లోనూ అతని మీద సానుభూతి లేకుండా పోతుంది.అతడిని పైకి పంపినా ..వేడి పెద్దగా లేవదు.ఒకవేళ అలాంటిది ఏదైనా కలిగినా చల్లారుతుంది కొద్ది కాలంలో..!" వివరించాడు Michael.

" ఆ ..చెప్పు Mike .." అన్నాడు Sonny.

" రెండూ రోజుల తర్వాత మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పండి.ఆ స్థలం ఏదో ముందుగానే మనం కనిపెట్టాలి.అది పబ్లిక్ ప్లేస్ లా ఉండాలి.అపార్ట్ మెంట్ లా ఉండకూడదు.ఒక రెస్టారెంట్  లో గాని బార్ లో గాని ..సరిగా డిన్నర్ సమయానికి మీటింగ్ జరగాలి.వాళ్ళు వెదికినపుడు నా వద్ద ఆయుధం ఉండకూడదు.అయితే మీటింగ్ మధ్యలో నాకు గన్ అందుబాటు లోకి రావాలి.అప్పుడు వాళ్ళిద్దరిని నేను చూసుకుంటాను." చెప్పాడు Michael.

Tessio,Clemenza లు ఆశ్చర్యచకితులై చూశారు.Tom మాత్రం కొంచెం వరీ అయినట్లు కనిపించాడు.

ఉన్నట్లుండి Sonny గట్టిగా నవ్వడం ప్రారంభించాడు.

"ఎందుకు నవ్వుతున్నావు..ఆపుముందు.." అన్నాడు Michael.

"అబ్బే ఏం లేదు..పరిస్థితులు ఎటునుంచి ఎటు వెళుతున్నాయో చూశావా..? అందుకే నవ్వు వచ్చిందిలే"

"నీకు భార్య పిల్లలు ఉన్నారు.ఫేమిలీ బిజినెస్ ని చూసుకోవలసిన బాధ్యత నీమీద ఉన్నది.కనుక ఈ రిస్క్ నేను తీసుకోవడమే మంచిది.." చెప్పాడు Michael.

" సరే ..కారణాలు..ఏవైనా గానీ,నువ్వు ఇది చేయగలవు..కానివ్వు" భరోసా గా అన్నాడు Sonny.

" పోనీ ..బయట మనిషిని ఎవరినైనా నియోగిస్తే....ముఖ్యంగా ఎవరికీ తెలియని ఓ కొత్త మనిషిని" Tom అన్నాడు.

" ఇలాంటి పనికి కొత్తవాడా...వాళ్ళు మహా ముదుర్లు...ప్రపంచ కప్ పోటీలకి చంటి పిల్లాణ్ణి పంపినట్లు ఉంటుంది.." చెప్పాడు Tessio.

"No...It has to be Mike,for a millian reasons ..! ఇది Mike చేస్తాడు..నాకు నమ్మకం ఉంది.Clemenza,Tessio ..మీరిద్దరూ మీటింగ్ జరిగే స్థలాన్ని కనిపెట్టండి.అక్కడ ఏ ప్లేస్ లో గన్ ఉంచాలో ప్లాన్ చేయండి.దాని బారెల్ చిన్నగా ఉండాలి.అయితే శక్తి గలదై ఉండాలి.బయటి వాడు దాన్ని కనిపెట్టని రీతి లో ఉండాలి.ఆ Mike.. నువ్వు వాళ్ళపై కాల్పులు జరిపిన తర్వాత గన్ ని అక్కడే పారేయ్..ఆ బారెల్ కి,ట్రిగ్గర్ కి స్పెషల్ టేప్ ఉంటుంది వేలిముద్రలు పడకుండా.. ఆ తర్వాత ఎలా డీల్ చేయాలనేది నేను చూసుకుంటాను.. witnesses ని మనం తయారు చేసుకోవచ్చు..నువ్వు కాల్పులు జరిపి బయటి రాగానే కారు బయట రెడీ గా ఉంటుంది.కొంత కాలం పాటు ఎవరికీ కనబడకుండా దూరంగా వెళ్ళిపో..నీ గర్ల్ ఫ్రెండ్ కి నీ గూర్చిన సందేశాన్ని నేను పంపిస్తాను.." Sonny వివరించాడు.

ఒక రకమైన ఉద్విగ్నత తన శరీరాన్ని కమ్మివేస్తున్నట్లుగా అనిపించింది Michail కి ..ఆ ప్లాన్ వినగానే..!

" నా గర్ల్ ఫ్రెండ్ కి ఎప్పుడేమి చెప్పాలో నాకు తెలుసు...అవన్నీ ఇప్పుడెందుకు ..ఏ విషయం లో ఎలా ఉండాలో నాకు తెలుసు .." అన్నాడు Michael.రహస్య సందేశం అర్ధం అయినట్లుగా అన్నదమ్ములిద్దరు నర్మగర్భంగా నవ్వుకున్నారు.

" మంచిది...ఎవరు ఏమి చేయాలో అందరకీ స్పష్టమైంది గదా"  Tom Hagen అందరకీ డ్రింక్స్ ఇచ్చి చీర్స్ చెబుతున్నట్లుగా తన గ్లాస్ ని పైకి లేపి చెప్పాడు.

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాం) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ఇరవై రెండవ భాగం)

పోలీస్ కెప్టెన్ McCluskey తన కార్యాలయం లో టేబుల్ మీదనున్న బెట్టింగ్ స్లిప్స్ ని చూస్తున్నాడు.వాటిని Corleone కుటుంబానికి చెందిన Book makers నుంచి రైడింగ్ పార్టీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు.అవి డీకోడ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు.ఎవరైతే రేపు బెట్టింగ్ లో గెలవబోతారో వాళ్ళ స్లిప్స్ ని ఈ రాత్రి కే Book makers కొనేస్తారు.ఇది ఒక రకమైన జూదం.

గోడ గడియారం లో టైం చూశాడు.Solozzo తో పాటు ఆ రెస్టారెంట్ లో మీటింగ్ కి వెళ్ళాలి కదా..అని గుర్తుకొచ్చింది.సివిల్ డ్రెస్ తీసి వేసుకున్నాడు.McCluskey తండ్రి కూడా పోలీస్ శాఖ లోనే Sergent గా పనిచేసేవాడు.తన చిన్నతనం లో తండ్రితో పాటు సాయంకాలాల్లో వివిధ షాపులకి వెళ్ళేవాడు.అక్కడ ఉన్న షాపు యజమానులు అయిదు,పది డాలర్లు తన చేతిలో పెట్టేవాళ్ళు.అంటే డైరెక్ట్ గా లంచం అడగకుండా ఇదో ఏర్పాటు అన్నమాట.తన జేబులు ఫుల్ అయిపోయేవి.ఇంటికి వచ్చినాక ఆ డబ్బుల్ని తండ్రికి ఇచ్చేసేవాడు.వాటిని తన పేరు మీద ఒక అకౌంట్ తెరిచి దాంట్లో సేవ్ చేసేవాడాయన.

అయితే ఇప్పుడు తాను పోలీస్ శాఖ లో అనుసరించే పద్ధతి వేరు.అతని బీట్ పరిధి లో ఉన్న వ్యాపారస్థులకు ఏ ఇబ్బంది ఇతరులనుంచి రాకుండా చూస్తుంటాడు.అందుకుగాను ప్రతి నెల వాళ్ళు ముడుపులు ఇస్తుంటారు.Book making బిజినెస్ కి ప్రొటెక్షన్ ఇచ్చినందుకు కూడా మంచి మొత్తమే గిట్టుబాటు అవుతుంది.కాబట్టి హాయిగా జీవితం అలా వెళ్ళిపోతున్నది.నలుగురు సంతానాన్ని మంచి కాలేజీ ల్లో చదివిస్తున్నాడు.Corleone ఫేమిలీ ని వదిలి Solozzo తో కలవడానికి కారణం అనూహ్యమైన మొత్తాన్ని పొందడమే..! అంతేగాక వారాంతాల్లో ..ప్రత్యేక దినాల్లో Bruno Tattagliya కి చెందిన హోటల్ సకల మర్యాదలు తనకి కల్పిస్తుంది.

కనుకనే ఆ రోజు రాత్రి ఆసుపత్రి దగ్గరకి Solozzo కబురు చేయగానే వచ్చి వాలాడు.తీసుకున్నదానికి న్యాయం చేయాలిగదా...!

కొన్నిసార్లు ఐర్ లాండ్ లో ఉన్న దగ్గర బంధువులకి డబ్బు సాయం చేశాడు.జస్ట్ ఒక తమాషా కోసం.తను,తన భార్య అక్కడికి వెళ్ళినప్పుడు రాచమర్యాదలు చేశారు.మరి ధన మహిమ అంటే అదేగదా..!

*  *  *

Tom Hagen అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేశాడు.Michel వాళ్ళ మీద దాడి చేసిన తర్వాత ఇటలీ లో ఓ భాగమైన సిసిలీ కి ప్రవాసం వెళ్ళిపోవడానికి..!అంటే ఆ వేడి సద్దుమణిగే వరకు..!ఒక False passport,Seaman's card,ఇటలీ కి వెళ్ళే ఓడ లో ఒక బెర్త్ రిజర్వ్ చేయడం ..అన్ని పూర్తిచేశాడు.కొంతమంది మనుషులు సిసిలీ లోని ఓ గ్రామీణ ప్రాంతం లో Michael ఉండటానికి ఏర్పాట్లు అవీ చేశారు.స్థానికంగా ఉండే ఒక డాన్..అతని పేరు Tomassio సహకారం తో చేశారు.

సరే..రెస్టారెంట్ లో దాడి చేసిన వెంటనే బయటికి వచ్చి నిర్ణీతప్రాంతంలో ఉంచిన కార్ లో ఎలా పారిపోవాలో వివరిస్తాడు Sonny.దానికి డ్రైవర్ గా Tessio ఉంటాడన్నమాట.ఏ మాత్రం అనుకున్న ప్లాన్ తిరగబడినా గట్టిగా అరువు.. అప్పుడు చేరువ లో నున్న మనవాళ్ళు వచ్చేస్తారు అని చెబుతాడు సోదరునికి..!

ఎందుకైనా మంచిదని Clemenza దగ్గర ఓ రోజంతా ఆ చిన్న గన్ ..అంటే "పాయింట్ 22" అంటారు దాన్ని..ఎలా ఉపయోగించాలో ప్రాక్టీస్ చేస్తాడు Michael.

Clemenza తన అనుభవాల్లోంచి కొన్ని సలహాలు ఇస్తాడతనికి..!

" నువు కాల్చిన వెంటనే ,నీ చుట్టు ప్రక్కల ఉన్నవారి వైపు కూడ చూడవద్దు.ముఖ్యంగా వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూడవద్దు.ఎందుకంటే ఇటువంటి సంఘటన జరిగిన వెంటనే ..జనాలు చూసి షాక్ అవుతారు.ఎంతమాత్రం నిన్ను పట్టుకోవాలని అనుకోరు.నీ చేతి లో ఆయుధం ఉందని అనుకుంటారు.కనుక పని అయినవెంటనే నీ చేతిలోనుంచి..అలవోకగా గన్ ని జారవిడిచేయ్ అక్కడనే.వేగంగా నడుచుకుంటూ బయటికి వచ్చి సిద్ధంగా ఉన్న మన కారు ఎక్కేసెయ్.ఏ మాత్రం పరిగెట్టవద్దు..అలాని మరీ మెల్లిగానూ నడవద్దు...మనం ఊహించిన దానికంటే ఇలాంటి విషయాలు చాలా ఈజీగా జరిగి పోతాయి." చెప్పాడు Clemenza.

ఆ ఈవిధంగా ఈ శిక్షణ అదీ అయినాక లాంగ్ బీచ్ లోని Mall కి వస్తారు.అదేగదా Don Corleone ఫేమిలీ యొక్క హెడ్ క్వార్టర్స్.Sonny లోపల సోఫాలో కునుకు తీస్తున్నాడు.వీరిని చూసి మేల్కొంటాడు.

" ఆ Solozzo ఇంకా..ఆ మీటింగ్ ప్లేస్ గురించి మనకి కాల్ చేయలేదు.సమయం దగ్గర పడుతోంది.మనం గన్ ని కూడ ముందుగా లోపలకి చేర్చాలి గదా.." అన్నాడుSonny.

"సరే..గన్ ని నాతో పాటు తీసుకు వెళతా..వాళ్ళు చెక్ చేసినపుడు దొరికితే తీసుకుంటే తీసుకోనీ..దానివల్ల ప్రమాదం ఏముంది." ప్రశ్నించాడు Michael.

" లేదు..లేదు..ఇక చాన్స్ లు తీసుకునే పనే లేదు.We have to hit them at any cost ..ఆ Clemenza నీకు అన్నీ వివరించాడు గదా.."

" ఒక్కసారి కాదు..అనేక మార్లు.."

" నీ దవడ నొప్పి ఎలా ఉంది.."

" అలానే ఉంది..డ్రగ్ ఇచ్చారు గదా..కొద్దిగా తిమ్మిరిగా ఉంది" విస్కీ ని నోట్లో పోసుకుంటూ అన్నాడు Michael.



అంతలోనే Tom వచ్చాడు.ఇంతలో Solozzo నుంచి కూడా ఫోన్ వచ్చింది.Sonny ఎత్తాడు.అవతల చెప్పింది శ్రద్ధగా విన్నాడు.

" ఇపుడు Solzzo చెప్పిన ప్రకారం ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకి మీటింగ్ జరుగుతుంది.Jack Dempsey's bar లో
 ఫిక్స్ చేశారు.అతనితో పాటు ఆ పోలీస్ అధికారి McCluskey కూడా వస్తున్నాడు.అయితే Solozzo ఇటాలియన్ భాషలో మాట్లాడుతాడు Mike తో..సరే..మనవాడికి వచ్చుగదా.. ఆ..ఇంకోటి వాళే వచ్చి పికప్ చేసుకుంటారట " చెప్పాడు Sonny.

" Mike  మళ్ళీ తిరిగి వచ్చేంతదాకా ఆ నెగోషియేటర్ మనతోనే ఉంటాడుగదా..గ్యారంటీ కోసం.." Tom అడిగాడు.



" దానికేం భయం లేదు.వాళ్ళ మనిషి నా యింటివద్దనే ఉన్నాడు.నా కాల్ వెళితే తప్ప మనవాళ్ళు అతణ్ణీ విడిచిపెట్టరు.." Clemenza వివరించాడు.

అయితే ఇప్పటికిప్పుడు ఆ మీటింగ్ జరిగే రెస్టారెంట్ ని ఎలా కనిపెట్టడం.." Sonny సందేహించాడు.


" పోలీస్ డిటెక్టివ్ Philips కి కాల్ చేయ్..అతనికి తెలుస్తుంది.." Tom అన్నాడు.

సరేనని కాల్ చేసాడు.ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యింది.




" ఆ..Tom ..తెలిసింది.అది Bronx లో ఉన్న Luna azure కి దగ్గర లో ఉంటుందట."

" మనకి మంచి Pefect place.సమస్య లేదయితే. అది మరీ పెద్దది కాదు..చిన్నది కాదు..ఎక్కువగా Families వస్తుంటారు.. ప్రైవేట్ గా మాట్లాడుకోవడానికి" Tessio అన్నాడు.


(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ఇరవై మూడవ భాగం)

వెంటనే Tessio ఇంకో పని చేశాడు...ఒక చిన్న Map  లాంటిది వేసి ఆ ప్రదేశం లో ఎక్కడ గన్ పెట్టాలి...ఎక్కడ కారు ఆపాలి..ఎటునుంచి ఎంట్రెన్స్ ఉంటుంది..అదంతా స్కెచ్ వేసి చూపుతూ మళ్ళీ అన్నాడు.

" సరే...ఆ టాయిలెట్ లు పాత తరానివి కాబట్టి వాటర్ కంటైనర్ కి ,గోడకి మధ్యన గన్ పెడతాము.Mike..నువు ఎక్కువ చాన్స్ లు తీసుకోవద్దు..రెండే రెండు బుల్లెట్లు తల మీద దింపెయ్..అంతే..చాలు..బయటికి వచ్చేయ్.. ఇప్పుడే నేను గన్ ని రెస్టారెంట్ లో పెట్టేస్తాను It's done.." చెప్పాడు Clemenza.

" O.kay....Everybody get rolling.. నేను ఇంట్లో అమ్మతో కూడా చెప్పేస్తాను..నువు ఓ సంవత్సరం పాటు కనిపించవని..అలాగే నీ గర్ల్ ఫ్రెండ్ కి కబురు పంపిస్తాను..." Sonny చెప్పాడు.

"మళ్ళీ నేను ప్రవాసం నుంచి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది" ప్రశ్నించాడు Michael.

" అన్నీ అనుకూలిస్తే ఇంకా తొందరగానే వచ్చే ఏర్పాటు చేస్తాడు డాన్.జనాల్ని,పోలీస్ డిపార్ట్ మెంట్ ని పేపర్లలో వచ్చే కధనాల ద్వారా నమ్మించడం...మానసిక గాయాలు మానడం..ఇంకా కొన్ని సమయానుకూలతలు..వీటన్నిటి పై ఆధారపడి ఉంటుంది.ఏం కంగారు పడకు..సాధ్యమైనంత త్వరగానే నువు తిరిగి వస్తావు" Tom వివరించాడు.

" చదువు పేరుతో మూడేళ్ళు ఇంటికి దూరమయ్యాను.మరి ఇంకో మూడేళ్ళపాటు దూరం చేయకుండా ఉంటే చాలు..Do your best .. అన్నాడు Michael.

" నీ BROAKEN JAW ని మరీ గుర్తు పెట్టుకోకు..ఆ సమయం లో..McCluskey is a stupid man! It was business not personal  " చెప్పాడు Tom.

" Tom..మరోలా భావించకు...మనం తినే ప్రతి ముక్క,రోజూ ప్రతి ఒక్కరం పర్సనల్ గానే తింటున్నాం..పర్సనల్ కానిది ఏముంది..డాన్ నుంచి నాకర్ధమయింది ఒకటే.....ఆయనకి చెందిన మనిషి పై ఒక పిడుగు పడినా ఆయన పర్సనల్ గానే తీసుకుంటాడు..నేను మెరైన్స్ లోకి వెళ్ళినా.. నా భవిష్యత్ ని Vision చేసినా ఆయన అదంతా పర్సనల్ గానే చేశాడు.Solozzo ని మాత్రం నేను పర్సనల్ గానే తీసుకుంటున్నాను ఇప్పుడు...తప్పదు...! మమ్మల్ని ఏ రోజు ఒక్కసారి కూడా తండ్రిగా ఆయన చేయి చేసుకున్నది లేదు ...ఆయన ఎంతమందిని ఎంతమందిని మట్టుబెట్టాడు..లేదా మరణించడానికి కారకుడయ్యాడో నాకైతే తెలియదు..నువ్వు చెప్పగలవా..." Michael ప్రశ్నించాడు.

" Mike..మీ నాన్నగారి నుంచి నువు నేర్చుకోవలసింది ఒకటి ఉంది..అదేమిటో తెలుసా..మనసులో ఉన్న ప్రతిదాన్ని బయటకి వెల్లడించకపోవడం..డాన్ కొన్ని విషయాలు చేస్తాడు..అవి మళ్ళీ ఎవరి తో ఆయన చర్చించడు..కొన్ని చేసేది మర్చిపోవడానికే...అది అర్ధం చేసుకుంటే మీ తండ్రిని అర్ధం చేసుకున్నట్లే.." Tom నింపాదిగా అన్నాడు.

*  *   *

Michael ని ఓ కార్ లో వచ్చిన Solozzo ,McCluskey ఇద్దరు పికప్ చేసుకుంటారు.ముందు డ్రైవర్ ద్వారా పిలిపిస్తారు.లొనికి వెళ్ళగానే కారు లో వీరు ఇద్దరు ఉంటారు.

" వచ్చినందుకు సంతోషం Mike..ప్రతి ఒక్కటి మనసు విప్పి మాట్లాడుకుందాం..ఈ విధంగా పరిస్థితులు అవుతాయని నేనసలు ఊహించలేదు..." Solozzo చేయి చాచి షేక్ హేండ్ ఇస్తూ అన్నాడు.Michael ప్రతి గా కొద్దిగా నవ్వాడు.

"భలేవాడివే..Michael చాలా పరిణితి ఉన్న వ్యక్తి..." McCluskey అలా చెబుతూనే Michael మీదికి కొద్దిగా ఒరిగి గన్ లాంటిది ఏమైనా ఉందా అని తడిమాడు.

కారు తోలుతున్న డ్రైవర్ పెదాలపై దరహాసరేఖ మెరిసింది.

మొత్తానికి అలా వచ్చి ఆ ఇటాలియన్ రెస్టారెంట్ వద్దనే ఉడిపోయాడు.

ఓ రౌండ్ టేబుల్ ముందు ముగ్గురు కూర్చున్నారు.కొద్ది దూరం లో ఉన్న టేబుల్ ముందు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొంటున్నారు.బహుశా వాళ్ళు Solozzo పెట్టిన మనుషులైనా ఆశ్చర్యం లేదు.

" మీరు మాట్లాడుతూ వుండండి..నేను ఈ లోపులో ఏవైనా తింటూ ఉంటాను.." చెప్పాడు McCluskey.

" ఇక్కడ Veal ని ఇంకా  Spaghetti ని Try చెయి..బాగుంటుంది.." Solozzo అన్నాడు.

"నిజంగానా.."

" అవును..న్యూయార్క్ లో ఉన్న బెస్ట్ ఇటాలియన్ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది..నువ్వు లాగిస్తూ ఉండు..మేము మాట్లాడుకుంటాము..ఆ ..ఇంకోటి..నేను ఇటాలియన్ భాషలో మాట్లాడుతాను..Michael తో.. ! నువ్వు ఏమీ అన్యధా భావించవద్దు..నా మాతృభాషలోనే కొన్ని విషయాల్ని చక్కగా నేను వ్యక్తం చేయగలను ఇంగ్లీష్ లో కంటే..."

Solozzo కోరికని మన్నిస్తూ " ఏయ్..దానిదేముంది..అలాగేకానివ్వు" అన్నాడు McCluskey.

ఇక Michael తో చెప్పడం ప్రారంభించాడు Solozzo..!

" Mike.. మీ తండ్రి గారిపై నాకు వ్యక్తిగత ద్వేషం లేదు.నా బిజినెస్ ని ముందుకు కొనిపోవడానికే తప్పనిసరై నేను కొన్ని చేయవలసి వచ్చింది.ఆయన పాత తరానికి చెందిన మనిషి.ఈ రోజుల్లో డ్రగ్ బిజినెస్ కి ఉన్న ప్రాధాన్యత ని ఆయన గుర్తించలేకపోయాడు.జరిగినదేదో జరిగింది.నాకు న్యూయార్క్ లోని మిగతా (mafia) families సపోర్ట్ ఉంది.నేను మిమ్మల్ని కోరుతున్నది ఒకటే..నా దారిలోకి ఎంటరై బిజినెస్ ని దెబ్బకొట్టవద్దని మాత్రం కోరుతున్నాను.."

" పూర్తిగా చెప్పు Solozzo..మా తండ్రి గారి పై మళ్ళీ అటెంప్ట్  చేవని నమ్మకం ఏముంది...." అడిగాడు Michael.

"I swear on my children ..Mike,ఇక ఎంత మాత్రం అలాంటి పని చేయను...నన్ను నమ్ము"

Solozzo మేకవన్నెపులి.ఎంతమాత్రం నమ్మడానికి లేదు.బాగా తెలుసు Mike కి..కొద్దిగా అసహనంగా కుర్చీలో అటు ఇటు కదిలాడు అతను.

"ఏమిటి" ప్రశ్నించాడు Solozzo

"తీసుకున్న Wine అంతా నేరుగా బ్లాడర్ లోకి వెళ్ళినట్టుంది.బాత్ రూం కి వెళ్ళి రావాలి "  చెప్పాడు Michael.

వెంటనే Solozzo కి అనుమానం వచ్చి , Michael ఏమైనా గన్ దాచాడేమోనని తొడలమీద చేయి వేసి వెదకబోయాడు.

"లేదు..లేదు..నేను కారులో చెక్ చేశాను..అతని దగ్గర ఆయుధం లేదు " McCluskey అన్నాడు.

"మరి ఎక్కువసేపు ఉండకు మరి" Michael తో అన్నాడు Solozzo.

Michael లేచి బాత్ రూం వేపు నడిచాడు.లఘుశంక తీర్చుకున్నాక ..టాయిలెట్ కంటైనర్ వెనక ఉన్న చిన్న గన్ ని తీసి తన Waist band లో పెట్టుకున్నాడు.కోటు కి  కిందనున్న బటన్స్ పెట్టుకున్నాడు.వచ్చి యధా విధిగా కూర్చున్నాడు.

" సరే..ఇక చెప్పు" అన్నాడు Michael.కూర్చున్నాక పొట్టభాగం దాక టేబుల్ మరుగునే ఉన్నది.Solozzo ఏమేమో వాగుతున్నాడు.ఇప్పుడవేమీ Michael కి అర్ధం కావడం లేదు.అంతా Gibberish గా అనిపిస్తున్నద్.ఇంతలో..వెయిటర్ రావడం ..Solozzo అతని వేపుకి తిరిగి ఏదో చెప్పబోతున్నాడు..అంతే..ఒక్క క్షణం లో ..Michael యాక్షన్ లోకి దిగిపోయాడు...ఎడమ చేతితో టేబుల్ ని వెనక్కి నెట్టి ..కుడి చేతి  లోని గన్ తో Solozzo తలపై ఒక్కసారిగా రెండు బుల్లెట్లు దింపాడు..అతని కళ్ళలోని జ్యొతులు ఆరిపోవడం స్పష్టంగా గమనించాడు.McCluskey ఒక్కసారిగా హతాశుడై అలానే చూస్తుండిపోయాడు.అంటే Michael లొంగి పోవడం గాని,లేదా పారిపోవడం గాని చేస్తాడని అతను ఊహిస్తున్నాడు.

Michael అతని వేపు చూసి చిన్నగా నవ్వుతూ ..ఇదే అదునుగా..McCluskey గొంతుకి గురి పెట్టి ..ధన్ మని ఒక బుల్లెట్ దింపాడు.దెబ్బకి కిందబడి ..గొంతుకి ఏదో అడ్డుపడ్డట్లు దగ్గాడు.అంతే..ఆలశ్యం చేయకుండా ఇంకో బుల్లెట్ ని సరిగ్గా కపాలం లో దింపాడు.ఇద్దరి మెదళ్ళు బయటకి వచ్చి భీకరంగా ఉన్నాయి.

దూరంగా చూస్తున్న మనుషులు అలానే ఉండిపోయారు.Michael గన్ తన చేతి లోనుంచి జారిపోయిందా అన్నంత సహజంగా అక్కడ పారవేశాడు.వెయిటర్ కూడా దూరంగా చూస్తూ స్థాణువైపోయాడు.బయటకి వేగంగా నడిచి వచ్చి Tessio కారు లో కూర్చున్నాడు.ఒక ఇరవై నిమిషాల్లో ఇటలీ దిశ గా సాగిపోయే ఓ ఓడ లో ఎక్కి కూర్చున్నాడు Michael.దేదీప్యమానమైన న్యూయార్క్ నగరం..ఆ రేయిలో..మండుతోన్న దీపశిఖ లా గోచరిస్తోంది..తనకి..సముద్ర జలాల్లో ఓడ కదులుతూ దూరమవుతున్నకొద్దీ..!

(మిగతాది వచ్చేభాగం లో చూద్దాం) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ఇరవై నాల్గవ భాగం) (BOOK-2 Started)

Michael ఆ రెస్టారెంట్ లో Solozzo ని,Police Captain ని మట్టుబెట్టిన తర్వాత ఇటలీకి వెళ్ళే ఓడ లో ఎక్కేసి ప్రవాసం వెళ్ళిపోతాడు.ఆ సాయంత్రం మిగతా అయిది మాఫియా ఫేమిలీలు Corleons కి చెందిన ఇద్దరు మనుషుల్ని చంపివేయడం చేస్తారు.హంతకుణ్ణి అప్పగించవలసిందిగా డిమాండ్ చేస్తారు.అది తమకి సంబంధం లేని అంశమని Corleons అంటారు.ఆ తర్వాత ప్రసిద్ది వహించిన 1946 మాఫియా అంతర్యుద్ధం చోటు చేసుకుంటుంది. అలా చెబుతూ Book-1 ముగుస్తుంది.ఇక అదే దానిలో Book-2 లోకి ప్రవేశిద్దాం.

Johnny Fontane చేయి ఊపుతూ 'ఇపుడేమి వద్దు ..అని హోటల్ లోని సహాయకునిగా ఉన్న వ్యక్తి కి చెప్పగా ..తల ఒక్కసారి అలా మర్యాదగా బౌ చేసి వెళ్ళిపోయాడు.ఆ హోటల్ లోని అద్దాల గది నుంచి ..పసిఫిక్ మహా సముద్రం రమ్యంగా ..కనిపిస్తున్నది.

విశాలమైన ఆ గది లో తనతో పాటు గా  Sharon Moore అనే యువతి ఉన్నది.సినిమాల్లో ప్రయత్నించడానికి వచ్చి,John Woltz కి చెందిన సెట్స్ దగ్గర ఆమె కలిసింది.తన కోరిక పై ఇపుడు ఈ హోటల్ కి వచ్చింది.

ఒకప్పటి సంగతేమో గాని..ఈ మధ్య కాలం లో యువతులతో గడిపింది,ముఖ్యంగా ఇలా,చాలా తక్కువ...! తన గొంతు ఫేడవుట్ అయినాక ఎందుకో తనకీ ఆసక్తి తగ్గింది...జనాలకి తనమీద తగ్గినట్లు...!అతనికి ..ఒకామె లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనేతప్ప ..ప్రతి ఒక్కరితో నిద్రించాలని అనుకోడు.ఇప్పుడు తనకి 35 ఏళ్ళు దాటినవి.రెండవ భార్య కీ విడాకులు ఇవ్వబోతున్నాడు.ఒకప్పటి యవ్వనుడు కాదుగదా..!

ఆ గది లో మంచి..ఆహారం..మద్యం...అన్నీ అమర్చి ఉన్నాయి.Champagne,Rye,Scotch అట్లా ..!Johnny కొన్ని డ్రింక్స్ కలిపి Sharon కి ఇచ్చాడు .తను కొద్దిగా తక్కువగానే తీసుకొంటున్నాడు.Johnny లో ఉన్న ఓ సుగుణం ఏమంటే ఆడవాళ్ళతో సాధ్యమైనంత సేవాగుణం తో ప్రవర్తిస్తాడు తప్ప.. కఠిన వైఖరి తో వెళ్ళడు.

డిన్నర్ కార్యక్రమాలు కూడా ముగిసిన తర్వాత ప్రక్కనే ఆనుకుని ఉన్న బెడ్ రూం లోకి వెళ్ళారు.Ella Fitgerald పాడిన ఓ రికార్డ్ ని పెట్టాడు.

" ఇప్పుడు ..ఆ పాట ఎందుకు..నువు సింగర్ వే కదా..నా కోసం ఒక పాట పాడవచ్చుగదా.." సరదా గా అంది Sharon.

" యూత్ లో ఉన్నప్పుడు ఆమ్మాయిలని ఆకర్షించడానికి వద్దన్నా పాడేవాడిని.ఈ కాలం లో ఎందుకో నా గొంతు నాకే నమ్మకం కలిగించడం లేదు."

ప్రొఫెషనల్స్ సాంకేతికత మీద ఎంతలా ఆధారపడతారో చెప్పడం ఇష్టం లేక అలా అన్నాడు Johnny.

"ఎందుకని"

"నా వాయిస్ కొంచెం దెబ్బతిన్నదిలే.."

" ఇపుడు నువు నటిస్తున్న John Woltz సినిమా లో నీ పాత్ర బాగుందని అంటున్నారు..నిజమేనా.."

"JUST A TOKEN OF PAYMENT.."దాటవేశాడు అతను.

 బ్రాంది మళ్ళీ  కొద్దిగా పోసి  ఇచ్చాడు ..!దాన్ని పక్కనున్న బల్ల మీద పెట్టి ఒక కోచ్ లో కూర్చుంది ఆమె. ఆమె నోటికి ఒక సిగరెట్ అందించి..లైటర్ తో వెలిగించాడు.తను ప్రక్కనే కూర్చున్నాడు Johnny.

ఒకానొకప్పుడు హాలీవుడ్ లో తాను సింగర్ గా వెలిగిపోయే కాలం లో పరిస్థితికి..ఇప్పటికి.. తేడా ఉన్నది.తన శరీరం లోను మార్పు ఉన్నది..మనసు పరిణితి లోనూ మార్పు ఉన్నది. హాలీవుడ్ ప్రముఖులు తనతో అప్పుడప్పుడు అనేవాళ్ళు.." నా భార్య నీతో నిద్రించినందుకు excuse చేశానోయ్" అని..! అది గ్రేట్ కాంప్లిమెంట్ లా ఉండేది తనకి..!

Johnny అలా ఏదో మాట్లాడుతూనే Sharon  ఒడిలో చెయ్యి వేశాడు.క్రమేపి అది ఆమె stolkings వేపు మళ్ళి .. దాన్ని వదులు చేసింది.ఆమె తొడలో మధ్య భాగం లో అలా నిమరసాగాడు.అప్పటికే తేమదనం మొదలయినది.ఆమె శరీరం సిల్క్ వస్త్రం మాదిరిగా అనిపిస్తున్నది. సాధారణంగా ఇంకొకరు అయినట్లయితే ,తన అనుభవంలో సంగతి,..కవ్వించినట్లుగా మధ్యవేలికి తగిలేలా ముందుకి Thrusts లు ఇచ్చేవారు.వెంటనే తన నోటితో కప్పివేసి ముద్దులుపెట్టేవాడు.అయితే ఎందుకో గాని..Sharon మాత్రం వెనక్కి జరిగింది కొద్దిగా..!

కాసేపు అలానే అక్కడ అంటూ ఉండడాన్ని కొంతమంది బాగా ఆహ్వానించేవారు.అయితే కొంతమంది తీసేయ్మనేవాళ్ళు..మరి ఈమె యొక్క రియాక్షన్ ఏమిటో..తెలియదు.అలా అనుకొంటూఉండగా..

"Johnny ..ఇపుడు ఎందుకో నాకు బాగా లేదు.అసలు నీతో నేను ఇట్లా ఊహించుకోలేను.నాకు తెలుసు..నేను అనుకున్నదానికన్నా నువు మంచి వ్యక్తివి..నిన్ను నిరుత్సాపరుస్తున్నందుకు ఏమి అనుకోకు.." అంది Sharon.

ఆ మాటకి విలువ ఇస్తున్నట్లుగా..వెనక్కి తగ్గి ..చేయితీసివేశాడు..ఆమె దుస్తులని మంచిగా సదిరాడు.

" ఎందుకని..నాలో ఉత్సాహం రేపేది ఏమీ లేదా.." మామూలుగా అన్నాడు Johnny.

" నువు ఫేమస్ అయిన రోజుల్లో మేం అంతా చిన్నవాళ్ళం..నిన్ను ఒక సింగర్ గా ..ఆరాధించగలిగామేతప్పా..మేం పెరుగుతున్న కాలం తో పాటు నిన్ను సెక్సీ గా ఊహించుకోలేదు.బహుశా నువు ఒక సినిమా నటుడివి అయి ఉంటే..మా ఊహలు ఇంకోలా పోయేవేమో..బహుశా నువు వద్దన్నా నా పేంటిస్ ఇక్కడ విడిచేదాన్నేమో.."

ఆమె మాటల్లో నిజం ఉందనిపించింది.Johnny కూడా ప్రతి గా నవ్వాడు.ఏది ఏమైనా తన పరిచయం ఆమె కి మేలే చేస్తుంది.చాలా ఇంటిలిజెంట్ గర్ల్ అనిపించింది.అతనికి కోపం రాలేదు..!

" అన్యధా భావించకు Johnny నిన్ను కాదన్నందుకు.." చెప్పింది Sharon.ఆమె బుగ్గలపై చేతితో ఫరవాలేదన్నట్లు తాకాడు.

" It's nice..having an old fashioned date.." చిరునవ్వు తో చెప్పాడతను.

ఇంకొన్ని డ్రింక్స్ కలిపి ఆమెకి ఇచ్చాడు.తను తీసుకున్నాడు.ఒకరినొకరు ముద్దుపెట్టుకున్నారు.వెళ్ళబోతుండగా Johnny అన్నాడు." మళ్ళీ ఎప్పుడైనా డిన్నర్ కి పిలవమంటావా" అని..!

" ఎందుకు..నీ టైం వేస్ట్ చేసుకోవని నాకు బాగా తెలుసు..ఆ..ఇంకోటి..ఎప్పుడైనా ఫ్యూచర్ లో నా పిల్లలకి చెబుతాను.ద గ్రేట్ Johnny Fontane తో కలిసి ఒక గదిలో భోజనం చేశానని..అతను నన్ను ప్రయత్నించాడు అని..సరేనా.." నవ్వుతూ అన్నది.

" ఏయ్..అప్పుడు నువ్వు ఇంకోటి కూడా చెప్పాలి..ద గ్రేట్ Johnny ప్రయిత్నించినప్పటికీ..నేను అతనికి లోబడలేదని..ఆ గది లో మరే కార్యక్రమం జరగలేదని.."

" ఆ విషయం ఎవరికి చెప్పినా నమ్మరు గాక నమ్మరు"

ఎవరది నమ్మనిది..నాకు ఒక్క ఫోన్ చెయ్యి..వాళ్ళకి నేను సర్టిఫికెట్ ఇస్తా నీ గురించి.."  సరదా అన్నాడు.

" ఆ ..ఇంకోటి కూడా చెబుతాను..అతను నన్ను అవసరమైనంత గట్టిగా ప్రయిత్నించలేదని.." నవ్వుతూ చెప్పింది Sharon.

ఆ విధంగా ఆమె నిష్క్రమించింది.ఆ గది నుంచి..!

John Woltz నడిపే సినిమా వాళ్ళ పార్టీల్లో చాలామంది తగులుతారు తనకి.కాని ఒక human companionship కోసం అప్పుడప్పుడు ఇలాంటి వారితో ఉండడం అతనికి ఇష్టం.

అతని మొదటి భార్య Ginni ఇంకా ఇద్దరు కుమార్తెలని చూడాలనిపించి ..అక్కడకి వెళ్ళడానికి ఆమె కి ఫోన్ చేశాడు." Hi..Ginni..you busy tonight...అక్కడికి వద్దామనుకుంటున్నా..మిమ్మల్నంతా చూడ్డానికి.." చెప్పాడు తను.

" పిల్లలిద్దరు నిద్రిస్తున్నారు..ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు.." అందామె అవతల నుంచి.

" ఏం..లేదు..ఓసారి చూసి పోదామని..అంతే"

"అయితే..సరే..రావచ్చు"

Beverly hills లోని ఇంటిలో ఆమె వెయిట్ చేస్తూ ఉంది తనకోసం.She is a petty Italiyan girl..a next door girl..

ఆమె తో సంసారిక సుఖం పొందలేనని అతనికి తెలుసు.ఆమెకి కూడా అంతే.డైవర్స్ అయినప్పటికీ శత్రువుల్లా గాకుండా మిత్రులు గా మసలుకొంటుంటారు.

(మిగతాది వచ్చేభాగం లో చూద్దాం) KVVS Murthy


Mario Puzo నవల The God Father  సంక్షిప్తంగా (ఇరవై అయిదవ భాగం)

తమ వైవాహిక జీవితం పన్నెండేళ్ళు దిగ్విజయంగా సాగింది.ఇప్పుడు దాన్ని పునరుద్ధరించుకోవాలని Johnny కి లేదు..Ginni కి లేదు.సాధ్యమైనంత friendly గా ఉంటుంటారు.భార్య,బిడ్డలకి అవసరమైన దానికంటే ఎక్కువగానే...ధనాన్ని సమకూర్చాడు Johnny...ఆ కృతజ్ఞత కూడా ఉన్నదేమో ..ఎందుకనో Ginni కూడా మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు.జీవితం అలా వెళ్ళిపోవడం లోనే హాయిని పొందుతోది ఆ ఇద్దరాడపిల్లలతో..!

సరే..Ginni కాఫీ ఇచ్చింది.ఇంట్లో ఉన్న కుకీస్ తో పాటు కలిపి..!

" ఏమిటి..అలిసినట్లు కనబడుతున్నావు...ద గ్రేట్ Johnny కి ఈ రాత్రికి డేట్ ఎవరూ ఇవ్వలేదా.." మామూలుగా అడిగింది Ginni.

" అబద్దం ఎందుకు..ఒకమ్మాయి వచ్చింది.మధ్యలో వదిలేసి పోయింది...ఏమైనా మనసుకి హాయిగా ఉందిప్పుడు.." చెప్పాడతను.

" ఆమెపట్ల నీకు ఇంకా వ్యామోహం పెరగడానికి ఓ ట్రిక్ ప్లే చేసిందనుకుంటాను.."

"ఏమో..Ginni..ఇదివరకటి గొంతు పోయింది.యువతులు నా వెంట పడటం లేదు.వయసు తో పాటు Fat పెరుగుతోంది.మరో వైపు bald head వస్తున్నది .. ఏమిటో కొన్నాళ్ళు పోతే పిజ్జాలు అమ్ముకోవాలేమో నేను..లేకపోతే నిన్ను సినిమా ల్లోకి దింపాలి"

" పన్నెండేళ్ళు నన్ను చూశావు కదా..ఇంకా ఏమి ఉంది ఇపుడు కొత్తగా.." అందామె సూక్ష్మార్ధం లో.

" నిజం..ఇప్పటికీ నువు బావుంటావు.." సోఫా లో పడుకుంటూ అన్నాడు Johnny.

"అది సరే గాని.. ఇంతకీ నువు చేస్తున్న సినిమా ఎందాకా వచ్చింది"

" పూర్తి అయింది.కాలం కలిసి వస్తే ఆస్కార్ అవార్డ్ కూడా రావచ్చు.మళ్ళీ నా ప్రభ అప్పుడు పుంజుకుంటుంది.నాకేది వచ్చినా పిల్లలకీ ..నీకు ఇస్తుంటా గదా.."

" ఇప్పుడు మాకు బాగానే ఉంది.ఏమైందని"

"ఎందుకనో పిల్లల్ని,నిన్ను చూడాలని అనిపిస్తూఊంటుంది.ప్రతి శుక్రవారమో..వీకెండ్స్ లోనో వస్తుంటాను..నీకేమైనా అభ్యంతరమా.."

" నాకెందుకు అభ్యంతరం.. వారి తండ్రిగా తప్పక రావచ్చు..నేను కూడా ఇంకా పెళ్ళాడలేదుకదా ఎవరిని.. ఆ ఇంకోటి..గాడ్ ఫాదర్ కూడా ఫోన్ చేసి చెప్పారు అతని పిల్లలని చూసుకునే అవకాశం ఇమ్మని..He is such a sweet guy"

అంతలోనే కిచెన్ లోని ఫోన్ రింగ్ అయింది.ఆమె వెళ్ళి ఎత్తింది.

"Johnny..ఇక్కడ Tom Hagen ఫోన్ లో నిన్ను పిలుస్తున్నాడు."  అన్నది.

ఫోన్ రిసీవర్ తీసుకున్నాడు.అవతలనుంచి Tom కంఠం.

" Johnny..గాడ్ ఫాదర్ నన్ను ఓ పని మీద నిన్ను కలవమన్నారు.వస్తున్నాను.రేపు  రాత్రికి నువు ఖాళీ యేనా"

"భలేవాడివి Tom..తప్పకుండా..కలుద్దాం"

మళ్ళీ నేను అర్జంట్ గా వెళ్ళిపోవాలి.అర్ధమయిది గదూ.."
ఫోన్ డిస్కనెక్ట్ అయింది.

Tom ని ఎప్పుడూ అడుగుతుంటాడు తను..Hollywood broads తో మంచి పార్టీ ఏర్పాటు చేస్తాను..ఉండమని..!అతందంతా ఒక శైలి..ససేమిరా ఒప్పుకోకుండా వెళ్ళిపోతాడు.

" My God Father has some plans for me" చెప్పాడు Johnny ఆమె వేపు తిరిగి..!

"మళ్ళీ వెళ్ళడం ఎందుకు..ఇక్కడ గెస్ట్ హవుస్ లో పడుకో.." అంది Ginni.

"ఎందుకు..నీ బెడ్ రూం లో కూడదంటావా.."

నవ్వుతూ తిరస్కరించింది ఆమె.

సరేనని ఆ రాత్రికి గెస్ట్ హవుస్ లోనే నిద్రపోయాడు.

తెల్లారింది.తన ఇద్దరు కుమార్తెలు బ్రేక్ ఫాస్ట్ ఉన్న వీల్ చెయిర్ ని తోసుకుంటూ వచ్చారు.గుడ్మార్నింగ్ లు గట్రా అయ్యాక అవి ఇవి మాట్లాడాడు.ఆ పిల్లలతో ఇపుడు పిల్లో ఫైట్స్ చెయ్యడానికి గాని..గుర్రపు బండి ఆట ఆడటానికి గాని వాళ్ళేమీ చంటిపిల్లలు కాదుకదా..!బాగా పెరిగి పోయారు.ఈ మధ్య కాలంలో..!వారిని చూడగానే ఆనందమనిపించింది.ఆప్యాయంగా దగ్గరగా తీసుకున్నాడు.వాళ్ళ రూప లావణ్యాలు తీర్చి దిద్దుకుంటున్న కాలం ఇది.పిగ్టెయిల్స్,ఫ్రాక్స్ ల్లో ఇంకా మంచిగా అనిపించారు.Oh..Christ..! Pretty soon they will grow up..! Hollywood punks will be out for them..!

" Johnny..! వచ్చే సమయం అయింది కదా ఆ Tom.. త్వరగా తయారవు" అన్నది Ginni

" Ginny  ఇప్పుడు రెండవ భార్య కి విడాకులు ఇవ్వబోతున్నా..ఇక నేను ఫ్రీ బర్డ్ ని" అన్నాడు Johnny.

"క్రిస్మస్ రెండు వారాలున్నది..నీ కోసం కూడా ప్లాన్ చేయమంటావా" అడిగిందామె.

" అలాగే..తప్పకుండా.."

చక్కగా డ్రెస్ వేసుకొని కారులో కూర్చున్నాడు ..Tom కోసం ఎయిర్ పోర్ట్ కి వెళ్ళడం కోసం.ఇద్దరు కుమార్తెలు,Ginni అతడికి వీడ్లోలు ఇచ్చారు..!

(మిగతాది వచ్చేభాగంలో చూద్దాం)--KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ఇరవై ఆరవ భాగం)

Airport లో Tom Hagen ని పికప్ చేసుకున్నాడు Johnny.గాడ్ ఫాదర్ తో నేరుగా మాట్లాడాలి అనుకున్నప్పుడల్లా ఈ Tom ఎప్పుడూ మధ్యలో ఉంటాడు  ఓ ఆంటంకం లా...అని కొద్దిగా అసహనంగా ఫీలవుతుంటాడు Johnny.కొన్నిసార్లు ఫోన్ చేసినా గాడ్ ఫాదర్ బదులుగా Tom ఎత్తి ఆన్సర్ చేస్తాడు.

సరే..విశాలమైన ఆ రూం లో..బడలిక తీర్చుకున్నాక మాట్లాడుకోవడం ప్రారంభించారు.

" నీ గాడ్ ఫాదర్ ఒక విషయంలో నీకు సహాయపడటానికి నన్ను ఇక్కడకి పంపించాడు.." చెప్పాడు Tom.

"సినిమా పూర్తి అయిపోయింది.డైరెక్టర్ కూడా మంచివాడే.నా పాత్ర బాగా వచ్చింది.ప్రస్తుతం ఎడిటింగ్ దశలో ఉంది." తను నటిస్తున్న John Woltz సినిమా గూర్చి చెప్పాడు Johnny.

"ఆస్కార్ అవార్డ్ ..అవీ అంటారు గదా..అలాంటి దాని వల్ల ఉపయోగం ఉంటుందంటావా..ఒక నటుడి జీవితానికి.."

అయ్యో Tom..ఆస్కార్ అవార్డ్ వచ్చిందంటే అతనికి వచ్చే గుర్తింపు,తెర మీద ఇంకో పదేళ్ళ ఆయుషు పెరగడం లాంటిది.ఆర్టిస్ లకి అలాంటివి కొత్త ఉత్సాహన్ని ఇస్తాయి.ప్రస్తుతం నేను చేస్తున్న పాత్ర ..నాకు ఆస్కార్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను"

" గాడ్ ఫాదర్ ..నాకు చెప్పిన దాని ప్రకారం నీకు ఆస్కార్ రావడం కష్టం ఈసారి"

" ఏం చెబుతున్నావు..పిక్చర్ ఇంకా బిజినెసే కాలేదు.నాకు ఆస్కార్ రాదని ఎలా చెప్పగలవు.అలాని చెప్పి గాడ్ ఫాదర్ కి ఎలా తెలుసు.." ఒక్కసారిగా కన్నీళ్ళపర్యంతమయ్యాడు.

" Johnny నీ బాధ నేను అర్ధం చేసుకోగలను.గాడ్ ఫాదర్ ఒక్క మాట కూడా ఎప్పుడూ వృధాగా చెప్పడు.. ఆయన సమాచార వ్యవస్థ విస్తృతమైంది.కొన్ని నాకు కూడా తెలియదు.కాని నీ గురించి చాలా ఆలోచిస్తున్నాడు.నువ్వు ఓ సింగర్ గా ,ఓ నటుడిగా ఆలోచించడం మానెయ్.నువ్వు ఒక పెద్ద producerగా హాలీవుడ్ లో కాళ్ళూనుకోవాలి.ఒక కండ గలిగిన నిర్మాత గా నువ్వు ఎదగాలి." Tom చెప్పాడు.

ఆమాటలకి Johnny గట్టిగా నవ్వాడు.ఆ తర్వాత తన గ్లాసుని విస్కీ తో నింపుకొని రెండు మూడు గుటకలు వేశాడు.

"ఏమిటి Tom నువ్వు అంటున్నది..?నాకు ఆస్కార్ రాకపోతే నటుడిగా గుర్తింపు ఎలా వస్తుంది..ఎలా నేను కండని పుంజుకోగలను..ఎలాగు నాగొంతు ఇప్పటికే నాశనం అయింది.."

" నీకు తెలియని విషయం ఒకటి చెబుతున్నా విను..!ఆ John Woltz నీకు ఆస్కార్ రాకుండా చేయడానికి ఎన్ని కుయుక్తులు చేయాలో అన్నీ చేస్తున్నాడు...అన్ని రకాల వనరులని దాని కోసం ఉపయోగిస్తున్నాడు.ఆస్కార్ కమిటీ లోని సభ్యుల్ని నీకు వ్యతిరేకంగా ఓటేయమని ఇంఫ్లూఎన్స్ చేస్తున్నాడు."

" మై గాడ్..ఐతే చచ్చినట్లే.." నిరాశగా అన్నాడు Johnny.

" Johnny..మోతాదు మించి బాగా తాగడం వల్ల నీకు ఏ విధంగానూ హెల్ప్ అవదు.అది నీకెప్పటికి అర్ధం అవుతుంది.."

" పోతెపోనీ" కోపంగా తన చేతిలోని గ్లాసుని గోడకి విసిరి కొట్టాడు Johnny.

" సరే..నీ ఈ మాటని నేను వ్యక్తిగతంగా తీసుకోవడం లేదు.బిజినెస్ లో భాగంగా తీసుకుంటున్నాను" తమాయించుకున్నాడు Tom.

"ఓ..నన్ను క్షమించు Tom..ఏదో ఒత్తిడిలో ఉండి మాట తూలాను." ఆ మాటనిJohnny  సిన్సియర్ గానే అన్నట్లు తోచింది Tom కి..!

" ఎందుకని అలా ఫీలవుతున్నావు"

" నా వాయిస్ పోయి సింగర్ గా పడిపోయాను.అటు Ginni కి విడాకులిచ్చాక నా జీవితం అంతా చిన్నాభిన్నం గా మారింది.నా రికార్డులు అమ్ముడవడం లేదు.రెండవ భార్య తోనూ పొసగడం లేదు.నా గాడ్ ఫాదర్ తో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా ..ఆయన ఫోన్ ఎత్తడం లేదు.లోకం అంతా నామీద పగబట్టినట్లు అనిపిస్తోంది. చాలా చికాకుగా ఉంది..సరే..సరే..ఏదైతే అది కాని..ప్రామిస్ చేస్తున్నా..ఇక మీదట ఎప్పుడు నేను తాగను..మళ్ళీ నా గొంతు బాగుపడేదాకా ఇక దానిని ముట్టను" గట్టిగా తీర్మానించుకున్నట్లు అన్నాడుJohnny.

" అంతా చక్కబడుతుంది..బాధపడకు..Don Corleone ఎప్పుడూ ఒకరి మాట విని మరొకరిని ద్వేషించడు.అతని మనసుని మరల్చే శక్తి అతనికి మాత్రమే ఉన్నది.ఆయనకి నీ పట్ల గల వాత్సల్యం ఎప్పుడూ తగ్గదు.అలాగే ఉంటుందది." చెప్పాడు Tom.

" ఇప్పుడు నేను ఏం చేయాలని అంటున్నాడు గాడ్ ఫాదర్"

"Don అంతా ఆలోచించాడు.నీకోసం ఏం చేయాలో ఆ ప్రణాళిక నాకు చెప్పి పంపించాడు.అయితే ఇపుడు నీలో ఎంత దమ్ము ఉందో చూడాలని ..ఆయన నీకో పరీక్ష పెట్టబోతున్నాడు...నువ్వు ఇపుడు ఒక నిర్మాతగా ..నీ అంతట నీవు నిలదొక్కుకోవాలి.అదే ఆ పరీక్ష.."

" మరయితే ఆయన నాకు ఆస్కార్ ఎలా ఇప్పించగలడు..అది వస్తేనే నాకంటూ ఒక ప్రత్యేకత కలుగుతుంది.అది చాలా పనులకి ఉపయోగకరం"

" Don లో నమ్మకం ఉంచు.John Woltz కే అంత చేతనయినప్పుడు,నీ గాడ్ ఫాదర్ కి చేతకాకుండా పోతుందా..ఎవరిని ఏ కోణం లోనుంచి కంట్రోల్ చేయాలో Don కి బాగా తెలుసు,ఏ అంచెల ద్వారా ఎవ్ర్ని ఎలా ప్రభావితం చేయాలో కూడా ఆయనకి తెలుసు.ఆస్కార్ కమిటీ కావచ్చు,లేబర్ యూనియన్లు కావచ్చు ..ఎక్కడ బలం పనిచేస్తుంది..ఎక్కడ మాట పనిచేస్తుంది ..అవన్నీ బాగ్గ తెలుసును ఆయనకి..! ఆందోళన పడకు..నీకు ఆస్కార్ వచ్చినట్లే..ఇది నా మాటగా తీసుకో.." చెప్పాడు Tom

(మిగతాది తర్వాత భాగం లో చూద్దాం) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ఇరవై ఏడవ భాగం)

Johnny ఆమాటకి ఒక్కసారిగా సంతోషంగా ఫీలయ్యాడు.

Tom...బాగానే ఉందిగాని,నేను ప్రొడ్యూసర్ ని కావాలంటే ధనం బాగా కావలసి ఉంటుంది గదా..!కొన్ని మిలియన్ డాలర్లు కావాలి...పెట్టుబడికి..!" సందేహంగా అన్నాడు Johnny.

" అంతా అదే వస్తుంది,దాని గురించి వర్రీ గాకు.నీకు ఆస్కార్ వచ్చిన వెంటనే ఆ జోష్ లో మంచి టెక్నీషియన్లని,డైరెక్టర్స్ ని,నటీనటుల్ని ..వీళ్ళందర్నీ బుక్ చేస్కోవడం ప్రారంభించు..కనీసం నాలుగైదు సినిమాలకి సరిపడా ప్లాన్ చెయి..అర్ధమయిందా.."

"ఇప్పుడున్న స్థితిలో కనీసం ఇరవై మిలియన్ల డాలర్లు కావాలి వాటన్నిటికి.."

"నీకు డబ్బు అవసరం అయినప్పుడు నాకు ఓ కాల్ చెయ్యి.ఓ బ్యాంక్ చిరునామా నీకిస్తాను.అందరకి మల్లేనే అన్నీ జెన్యూన్ వివరాలతో ఆ బ్యాంకి కి లోన్ కోసం అప్లయ్ చెయి.అయితే నీకెంత కావాలో ఆ ఫిగర్స్ ,ఇంకా ప్లాన్స్ ముందు నాకు చెప్పాలి.అంతే నువు చెయ్యవలసింది.."

"ఇంకా..."

"డాన్ నిన్ను అడిగినపుడు కొన్ని విషయాలు చేయడానికి సిద్దపడి ఉండు.."

"చూడబోతే..ఇదేదో సీరియస్ వ్యవహారం లా ఉంది.ఒక్కసారి నేను డాన్ తో పర్సనల్ గా మాట్లాడవచ్చా.."

Tom నిజంగా ఆశ్చర్యపోయాడు.Johnny లో ఒక మంచి తెలివైన వ్యక్తి ఉన్నాడు.అతను ఈ కార్యం చేయగలడు.కాకపోతే అతనికి ఇంతకాలం సరైన అవకాశం రాలేదు..అంతే..!

" ఆ విధంగా ముందు సినిమాలు తీసి సంపాదించు.దానివల్ల ఆయనకీ ఆదాయం వస్తుంది.బ్యాంక్ కి లాభం ఉంటుంది.ఇది ఒక రకమైన బిజినెస్ డీల్.అయితే ఒకటి.డబ్బుని వృధా చేయకు.ఎంత నువ్వు డాన్ కి గాడ్సన్ వి అయినా ఇరవై మిలియన్లంటే మాటలు కాదుగదా..జాగ్రత్తగా వ్యవహరించు.." చెప్పాడు Tom .

"ఏం వర్రీ కాకు ..ఆ John Woltz లాంటి మూర్ఖుడే పెద్ద మూవీ మొగల్ కాగలిగినప్పుడు..ఇలాంటి అవకాశం రావాలే గాని ఎవరైనా పైకి వెళ్ళగలరు.." ఆత్మవిశ్వాసం తో చెప్పాడు Johnny.

"సరిగ్గ గాడ్ ఫాదర్ అభిప్రాయం కూడా అదే.."

"సరే..మరి నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర దింపెయ్.నేను చెప్పవలసింది మొత్తం చెప్పాను.ఇక రంగం లోకి దిగవలసింది నువ్వే.కాంట్రాక్ట్లు తీసుకోవడం మొదలెట్టు..నీకంటూ ఓ లాయర్ ని పెట్టుకో..లేబర్ ట్రబుల్స్ లాంటివి షూటింగ్ లప్పుడు నీకేమీ ఉండవు.కనుక కొంత మనీ సేవ్ అయినట్లే ..!" Tom చెప్పాడు.

" అన్నట్లు ..ఫోన్ లో గాడ్ ఫాదర్ ఎందుకని నాకు అందుబాటులోకి రావడం లేదు..ఈ మధ్యలో.."

" ఈ రోజుల్లో ఆయన ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడటం లేదు.ఆయన వాయిస్ రికార్డ్ కాబడటం ఆయనకి ఇష్టం లేదనుకుంటా...కొన్ని కారణాలు ఉన్నాయిలే.."

ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారిద్దరు.Tom కోరిక మీద అతను దూరంగా బయటనే ఆగిపోయాడు.పికప్ చేసుకునేటపుడు కూడా Johnny ని ఎయిర్పోర్ట్ బయటనే కలుసుకుంటాడు. మంతనాలు ఎవరితో జరిపేది పరులకి తెలియకుండా కొన్ని సీక్రెట్ ఏర్పాట్లు అవి.Tom కి Johnny మీద పూర్తి నమ్మకం  ఏర్పడింది.ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకుంటాడు..ఎందుకంటే దానికి తగిన గట్స్ ఉన్నవి..కనుకనే ప్రతి మలుపు లో తని జీవితంలో కష్టాలని ఎదుర్కోవడం సంభవిస్తున్నది.

(మిగతాది వచ్చేభాగం లో చూద్దాం) --KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ఇరవై ఎనిమిదవ భాగం)

Johnny ఎయిర్ పోర్ట్ దాకా వెళ్ళి దిగబెట్టాడు Tom hagen ని..!మళ్ళీ తిరిగి Ginni నివాసానికి వచ్చాడు.కొన్ని వారాలపాటు ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు.సినిమాకి సంబందించిన ప్రణాళికలు,పనులు అన్నిటిని ఇక్కడనుంచి నడిపించవచ్చునని అతని ఆలోచన.Ginni కూడాదానికి ఆమోదించింది.

అతను మంచి వయసులో ఉన్నపుడే రేడియోజాకీ గా,బేండ్ లీడర్ గా ,హాలీవుడ్ లో సింగర్ గా సక్సెస్ అయ్యాడు.ఇపుడు ఈ 35 దాటిన ప్రాయంలో ఆర్దికంగా కొంత దెబ్బతిన్నాడు.అయితే మరీ తను వృధా చేయలేదు ధనాన్ని..!డైవర్స్ అయినప్పుడు Ginni కి గాని,పిల్లలకి గాని ఇవ్వవలసినదానికంటే ఎక్కువగానే ఇచ్చాడు.ఆమె బంధువులకి,ఫ్రెండ్స్ కి కూడా బాగా హెల్ఫ్ చేశాడు.కొన్ని విషయాల్లో తన అతి ఉదారత తనకి శాపంగా పరిణమించిందేమో ..!

ఇప్పుడు తన గాడ్ ఫాదర్ ఒక బ్రహ్మాండమైన అవకాశం ఇవ్వబోతున్నాడు.ఆయన ఇచ్చే ధనం తో సినిమాలు తీసి మళ్ళీ మహారాజుగా వెలుగొందుతాడు.చచ్చీ చెడి సింగర్ గా సక్సెస్ అయినా,యాక్టర్ గా సక్సెస్ అయినా పెద్ద వచ్చేది ఏముంటుంది..?అదే ఒక కండగల నిర్మాత గా ఫీల్డ్ లో ఉంటే దానికి సాటి వచ్చేది ఏదీ ఉండదు.ప్రతి ఒక్కరూ తనచుట్టూ ఇష్టం ఉన్నా,లేకున్నా తిరగవలసిందే.అవును గాడ్ ఫాదర్ అండతో హాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి తన నిజమైన తడాఖా చూపించాలి.

Ginni కి కూడా చెప్పాడు ,Tom వచ్చిన కారణం ఏమిటనేది.ఆమె కూడా సంతోషించింది.అతని బెడ్ రూం మంచిగా సద్రింది.తన గదికి వెళ్ళేముందర ముద్దు పెట్టి వెళ్ళింది.తనకి తెలుసు..ఆమెతో మళ్ళీ సంసారం చేయడం తనకి కుదరని పని..ఆమెకి కూడా పెళ్ళిని పునరుద్ధరించుకోవాలని లేదు.అలా కలసి ఉన్నంతసేపు మంచిగా ఉండటమే ఇరువురు కోరుకునేది.తనకి కూడా పిల్లలతో ఉంటూ ఆనందించే అవకాశం ఉంటుంది.ఇదొక రకమైన తాత్కాలిక ఏర్పాటు.

ఒక నవలారచయితకి కాల్ చేశాడు.అలాగే డైరెక్టర్ కి,కెమేరామేన్ కి ఫోన్ చేశాడు.అంతా ఎరిగినవాళ్ళే.తను తీయబోయే సినిమా కి సిద్ధంగా ఉండాలని,కాంట్రాక్ట్ లమీద సంతకం చేసి అడ్వాన్స్ తీసుకోమని.అంతా అంగీకరించారు.

తర్వాత ఓ గమ్మత్తు పని చేశాడు.John Woltz కి ఫోన్ చేశాడు.తనకి అతని సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు.Johnnyతనకి ఇప్పుడు ఎందుకు కాల్ చేశాడో John Woltz భవిష్యత్తులో గ్రహిస్తాడు.ఆ Cunning call వెనుకనున్న అంతరార్ధం తెలిసి వాడు కుమిలి పోతాడు.మనిషిలోని కనీకనబడని మృగత్వం ఎంత హాయిగా ఫీలవుతుందో ఇలాంటి సమయాల్లో..!

అంతదాకా ఎందుకు..తనవల్ల ఎంతో సాయం పొందిన అమ్మాయిలు కూడా తను సింగర్ గా పడిపోయి దీనస్థితి లో ఉండగా తనని చూసినపుడు వారికళ్ళలో ఎంత ఆటవిక సంతృప్తి గోచరించిందో..! Ginni లో కూడా ఒకసారి లీలగా అలాంటి satisfaction కనిపించింది ..! కొన్ని క్షణాలు..ఆమె కళ్ళలో..!..మొదటిసారి తనదీనస్థితి ని చూసినపుడు...!

నిజంగా మనిషి లోపలి ప్రపంచం ఎంత కౄరమైనది..?

అయితే తను స్త్రీలనేమి ద్వేషించదలచుకోలేదు.ఎందుకంటే వారి అవసరం తనకి ఉంది.ఎంత ద్వేషించినా స్త్రీల పరిష్వాంగం లేకుండా తను బ్రతకడం కష్టమె.అయితే ఈసారి దీనునిగా కాదు.ఒక శక్తిమంతునిగా ,ఈ ప్రపంచాన్ని శాసించే ధనశక్తితో వారిని తన చుట్టూ తిప్పుకుంటాడు.హాలీవుడ్లోని ఓ కండగల నిర్మాతగా సాధ్యం కానిది ఏముంది..? ఎవరైనా అల్లాడుకుంటూ తిరగవలసిందే.

ఆలోచనలు ముసురుపడుతూ ఉండగా ,అంతలోనే Nino Valenti గుర్తుకొచ్చాడు.అతను బాల్య మిత్రుడు...ఇంకా హాలీవుడ్ సింగర్ కావాలని కలలు కంటూ,సాధ్యం కాక ట్రక్ డ్రైవర్ గా జీవితం గడుపుతున్నాడు.తన తీయబోయే సినిమాల్లో అతనికి కూడా అవకాశం ఇద్దామనిపించింది.పైగా ఈ పని చేయడం వల్ల గాడ్ ఫాదర్ కూడా సంతోషిస్తాడు.వెంటనే Sonny కి కాల్ చేసి Nino నెంబర్ ని తీసుకున్నాడు.

"Hey.. Nino..ఎలా ఉన్నావ్..నాతో పాటు సినిమాల్లో చేయడానికి వస్తావా..త్వరలొ కొన్ని సినిమాలు తీయబోతున్నా..నమ్మకస్తుడైన నీ లాంటి మనిషి ఒకడు కావాలి నాకు... " చెప్పాడు Johnny.

" అవతలినుంచి Nino కంఠం..కొద్దిగా మందులో ఉన్నట్లున్నాడు...మగతగా మాట్లాడుతున్నాడు.

" Hi,Johnny.. బ్రహ్మాండంగా ఉన్నాను.ప్రస్తుతం వారానికి 150 డాలర్లు ...ట్రక్ మీద పని తో నా జీవితం హాయిగా అలా వెళ్ళిపోతోంది..ఇప్పుడు అవన్నీ నాకెందుకు చెప్పు"

" Nino..నేను నవ్వులాటకి చెప్పడం లేదు.నీకు వారానికి 500 డాలర్లు ఇస్తాను.అంతేగాదు..అది ఇంకా పెరుగుతుంది కూడా..అప్పుడప్పుడు సినిమా అమ్మాయిలు కూడా నీకు కంపెనీ ఇస్తారు...ఇక మరి నీ ఇష్టం" ఊరిస్తున్నట్లుగా అన్నాడు Johnny.

"నిజంగానా"

" అవును..అప్పుడప్పుడు నాతో పార్టీలకి వచ్చినప్పుడు Band తో కలిసి పాటలు కూడా పాడవచ్చు.."

" మరీనన్ను ఫూల్ చేయకు Johnny "

" ఏయ్ స్టుపిడ్..ఇదంతా నిజం ..వేళాకోళం కాదు.రేపు ఉదయం న్యూయార్క్ లోని నా ఏజంట్ ని కలువు..నీకతను ఫ్లయిట్ టికెట్ తీసి యిస్తాడు..వచ్చిన వెంటనే నన్ను కలువు..కాంట్రాక్ట్ మీద సైన్ చేద్దువుగాని..అంతేకాదు,సంవత్సరం వేతనం అడ్వాన్స్ గా తీసుకో..అర్ధమవుతున్నదా.." ప్రశ్నించాడు Johnny.

కాసేపు నిశ్శబ్దం తాండవించింది..రెండు వేపులా..!

"Johnny..రేపే వస్తున్నా .." మత్తువదిలి పోతుండగా అన్నాడుNino.

" ఆ..Nino..ఒకటి గుర్తుపెట్టుకో..నువ్వు ఇక్కడ దేనితోనైనా పో..కాని నాకు సంబందించిన వాటిమీద చేయివేస్తే మటుకు ఫైర్ చేసి పారేస్తా.." నవ్వుతూ అన్నాడు Johnny.

ఆ రాత్రి హాయిగా నిద్రపట్టింది అతనికి..చాలానాళ్ళ తర్వాత..!!!

(మిగతాది వచ్చే భాగంలో చూద్దాము) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ఇరవై తొమ్మిదవ భాగం)

రికార్డింగ్ రూం లో ఉన్నారు Johnny Fontane ఇంకా Nino..!Johnny నిర్మించే సినిమాకి పాటల రికార్డింగ్ అన్నమాట అది.వాయిద్యకారులుగాని,మ్యూజిక్  కండక్టర్ గాని అంతా Johnny కి గతం లో స్నేహితులే,తాను సింగర్ గా ఎదుగుతోన్న కాలం లో వారి అందరి తో కలసి పనిచేశాడు.కనుకనే తన సినిమాకి వాళ్ళయితే అనుకూలంగా ఉంటుందని కుదుర్చుకున్నాడు.ఆ మ్యూజిక్ కండక్టర్ మంచి టాలెంట్ ఉన్నవాడు.తనకి తెలుసది.

Nino రికార్డింగ్ రూం లో ఓ పియానో ముందు కూర్చొని చేతికి వచ్చింది వాయిస్తూ ..గ్లాసులో ఉన్న విస్కీని మెల్లిమెల్లిగా లాగిస్తున్నాడు.

" ఏయ్..Nino ..ఈరోజు పాటని అదరగొట్టాలి నువు..మన ఇటాలియన్ జానపద గీతం...ఇద్దరం పాడతాం అనుకో"  Johnny అతని భుజం తడుతూ అన్నాడు.

'నీకెందుకు నేనున్నాగా' అన్నట్లు ఓ నవ్వు నవ్వాడు Nino.

" ఈ రోజు మంచిగా పాడు..నీకొక మంచి అమ్మాయిని చూపెడతా..ఓ.కే.నా" అన్నాదూ Johnny.

" అదే ఆ సినిమా నటి ..Lassie ...ఆమెని కుదర్చరాదు..నీకు పుణ్యముంటుంది" Nino బతిమాలుతున్నట్లు అన్నాడు.

ఆర్కెస్ట్రా అంతా సిద్ధమయింది.మ్యూజిక్ కండక్టర్ Eddie Niels ఇద్దర్నీ పిలిచాడు.పాడటానికి రెడీ అవమని..!

" అబ్బా..నా మాండలిన్ చేతిలో లేనిదే నేను పాడలేనురా బాబు"  Nino నిట్టూర్చాడు.

" దాన్ని ఇప్పుడు మర్చిపో..ఓ పని చెయ్యి..నీ చేతిలో ఉన్న ఆ మందు గ్లాసునే కాసేపు మాండలిన్ అనుకో"  Johnny సముదాయించాడు.

ఇద్దరూ కలిసి ఉత్సాహంగా ఆ సాంగ్ ని కంప్లీట్ చేశారు. Nino కే ఎక్కువ భాగం కేటాయించబడింది ఆ పాటలో...తన గొంతు బావుండలేదని చాలా కొద్దిగానే పాడాడు...అది డ్యూఎల్ సాంగ్ కదా ..!

"Johnny ..సాంగ్ చాలా బాగా వచ్చింది.నా దగ్గర కొన్ని ప్రత్యేకమైన ట్యూన్స్ ఉన్నాయి.నీతో ఆల్బం చేయాలని ఉంది...నీకు సమయం ఉన్నప్పుడు చెప్పు" అన్నాడు మ్యూజిక్ కండక్టర్ Eddie Niels.

" లేదు..లేదు..నాగొతు ఇంకా బాగుపడలేదు.నాకు తెలుస్తున్నదది.ఇవాళ పాడానా..ఓ నెల దాకా నేను పాడలేను...సరే..మిగతా రికార్డింగ్ కార్యక్రమం అంతా రేపు పూర్తి చేద్దామా" అడిగాడు Johnny.అలాగే అన్నాడతను.

Nino గ్లాస్ మీద గ్లాస్ లాగిస్తూనే ఉన్నాడు.ఈ స్థితి లో ఇద్దరం కలిసి Ginni ఇంటికి వెళ్ళి ఆమెని ఇబ్బంది పెట్టడం ఎందుకని..తన ఇంటికే Johnny ,Nino ని తీసుకువెళ్ళాడు.వెళ్ళగానే తలారా స్నానం చేశారు.

" Nino..మనం రాత్రి పదకొండు గంటలకి ఒక పెద్ద పార్టీకి వెళుతున్నాం.కాస్తా మందు తగ్గించు.ఓపిక ఉండాలా ..దేనికైనా..?ఆ జనాల ముందు మన తడాఖా చూపించే విధంగా ఉండాలి..అర్ధమయిందా" Johnny మందలించాడు సున్నితంగా..!

" ఏమిటి నీ గొంతు అలా మారింది" అడిగాడు Nino.

" ఇందాకనే పాట పాడా గదా..ఓ నెలరోజులదాకా మళ్ళీ అట్లానే కీచుగా ఉంటుంది.అదేగదా..నా సమస్య.." అన్నాడు Johnny.

" చూడు..ఇప్పుడు మనం వెళ్ళబోయే పార్టీకి ..గతకాలం లో ఓ వెలుగు  వెలిగిన నటిమణులు చాలామంది వస్తారు.వాళ్ళకి డబ్బు,పరపతి పుష్కలంగా ఉంటుంది.ఈ వయసులో వాళ్ళకి బాయ్ఫ్రెండ్స్ ఎవరవుతారు..బయటకి అందరిలా ఫ్రీ గా వెళ్ళనూ లేరు.అందుకే ఈ ఏర్పాటు...ఎవరైనా మంచి నటి నీకు తగిలిందే అనుకో..నీ జాతకమే మారిపోవచ్చు.." నవ్వుతూ అన్నాడు Johnny.

" మరీ నన్ను వేళాకోళం చేయకురా ...అన్నట్లు Deanna Dunn కి దగ్గరగా తీసుకెళ్ళు నన్ను...ఒకప్పుడు ఆమె సినిమాలు తెగ చూసేవాడిని..వీలవుతుందా.." అడిగాడు Nino.

" నువ్వు తెర మీద చూసినదానికి ,భిన్నంగా ఉంటాయిరా బయట విషయాలు..మరీ ఉత్సాహం వద్దు.." చెప్పాడు Johnny.

*  *  *
హాలీవుడ్ మూవీ స్టార్స్ లోన్లీ క్లబ్ సమావేశం ప్రతి శుక్రవారం John woltz కి ఉన్న ఓ విశాలమైన భవంతి లో జరుగుతుంది.సినిమా ప్రివ్యూ అనేపేరుతో పిలుస్తారు ముఖ్యంగా వయసు మళ్ళిన తారామణులని..ఇంకా సరైన బ్రేక్ రాక ఉత్సాహపడే యంగ్ హీరోలని.ఆ విధంగా ఈ యువ నటులు అలనాటి హీరోయిన్ లకి One night stand లని ఇస్తుంటారు.సరే..కొంతమంది పర్మనెంట్ బెడ్ పార్ట్నర్స్ గా కూడా కుదురుకోవచ్చు.అదే వేరే విషయం.ఆ విధంగా బ్రేక్ రాని యంగ్ హీరోలు వీరికి సేవలందించి సినిమా నిచ్చెనలో పైకి వెళ్ళాలని ఆశిస్తుంటారు.

అద్దలా భవంతి...దానిముందు గార్డెన్..ఆ రాత్రిలో తళుకుమంటున్న తారలు ..సందడిగా ఉంది పార్టీ అంతా.మొత్తం కలిసి ఓ వందమంది దాకా ఉండవచ్చునేమో..!

Nino ,Johnny ఇద్దరూ కలసి ఓ టేబుల్ దగ్గర కూర్చొని డ్రింక్స్ తాగుతున్నారు.అంతలో అటుగా అచ్చిన John Woltz యొక్క మేనేజర్ Johnny ని చూసి ఆశ్చర్యపోయాడు.

" హేయ్..Johnny..సర్ప్రైజింగ్ ..ఏమిటి నువ్విక్కడ.." ఆశ్చర్యంగా అడిగాడతను.

" ఏం లేదు.మా ఊరినుంచి ఈ మద్యనే ..మా కజిన్ ఒకతను వచ్చాడు.ఇదిగో ఇతనే..ఈ పార్టీ లో పరిచయం చేద్దామని తీసుకొచ్చాను"  అన్నాడు Johnny.

" చూస్తే..ఈ సీన్ కి కొత్తాడిలా ఉన్నాడు.మన తారామణులు నంజుకుంటారేమో..అది చూడు" Nino కేసి నవ్వుతూ చూసి అన్నాడతను.

అక్కడున్న నటీమణులు అందర్నీ ఒక్కొక్కళ్ళనే పరికిస్తున్నాడు Nino..దాంట్లో చాలామందిని వెండితెర మీద తాను చూసి ఉన్నాడు.చాలా పరిచయస్తుల్లా గోచరిస్తున్నారు.కాకపోతే తనే వారికి తెలియదు.ఆ వయసులో ఉన్న బిగువులు ఇపుడు కొంత సడలినట్లుగా ఉన్నాయి.ఎంత మేకప్ వేసినా తెలియదూ..!

వెనక నుంచి Deanna Dunn కంఠం వినిపించింది.ఆ స్వరం ఎక్కడున్నా గుర్తుపట్టగలడు Nino...అంతలా లోపల ఇంప్రింట్ అయిపోయింది.ఆమె సినిమా వస్తే తనకి ఆ రోజుల్లో ఓ పండగలా ఉండేది.ఎన్ని నిద్ర లేని రాత్రులో ఆ ధ్యాసలో..ఆమె ఆ రోజుల్లో పెద్ద స్టార్..ఆస్కార్ కూడా రెండుసార్లు వచ్చింది.ఆమె Johnny వేపు తిరిగి మాట్లాడుతూ అంటున్న మాటలు నివ్వెరపరిచాయి.ఎందుకంటే తెరమీద ఆమె ఆ మాటలు అనగా ఎప్పుడూ వినలేదు.

" Johnny..యూ బాస్టార్డ్..ఒక్కరాత్రి వచ్చివెళ్ళిపోయావు.ఏం..అంతలా బోరు కొట్టానా..మళ్ళీ కనిపించలేదే..నా సైకియాట్రిస్ట్ ని కలవవలసి వచ్చింది అనుమానం వచ్చి..తెలుసా.." అడిగింది Deanna Dunn.

" ఒక నెలలో చేయాల్సింది ..ఒక రోజులో చేశావు..ఇంకేముంది..మళ్ళీరావడానికి ..! ఆ అన్నట్లు ..నీకు నా కజిన్ ని పరిచయం చేస్తున్నా..ఇతని పేరు Nino.A strong Italiyan Boy ..ఇతనితో కలసి కాలక్షేపం చేయరాదు.అతనికి కూడా ఇక్కడ వాతావరణం తెలుస్తుంది" అంటూ Johnny,Nino ని ఆమెకి పరిచయం  చేశాడు.

" మీ వాడికి ప్రివ్యూలు చూసే అలవాటుందా.." అడిగిందామె.

" నువ్వు కొద్దిగా అలవాటు చేయరాదూ..పోయిందేముంది " అన్నాడు Johnny.

అలా Nino ని ఆ అలనాటి తార Deana Dunn కి కలిపేసి పక్కన ఎవరితోనో మాట్లాడటానికి వెళ్ళాడు Johnny.Nino అప్పటికే కొద్దిగా ఎక్కువ మోతాదు లోనే మందు పుచ్చుకున్నాడు.మళ్ళీ మరో గ్లాసు పట్టుకున్నాడు.ఆంగ్లో సాగ్జన్ బ్యూటికి పర్యాయపదంగా తీరైన ముఖ కవళికలు కలిగి ఉంది Deana Dunn.

"Johnny తర్వాతనే ఎవరైనా..అన్నట్లు నువ్వు తనూ ఒకే ఊరిలో పెరిగారా" మాటలు కలిపిందామె Nino తో..!

చిన్నప్పటినుంచి తమ అనుబంధం...చదువు..కెరీర్ ఇలాంటి విషయాలన్ని చెప్పుకొచ్చాడు Nino.ఇంతలో ప్రివ్యూ మొదలైంది.విశాలమైన హాలు లో ..ఒక్కొక్క కోచ్ లో ఇద్దరేసి చొప్పున కూర్చోవచ్చు.ఒక కార్నర్ లో ఉన్న కోచ్ లో ఆమె,ఇతను కూర్చున్నారు.ప్రధానమైన లైట్లు ఆర్పివేయడం వల్ల మసగ్గా అయింది వాతావరణం.ప్రివ్యూ చూస్తూ గ్లాస్ లోని ద్రవాన్ని సిప్ చేస్తున్నాడు Nino.

కాసేపయినతర్వాత తనకి మద్యలో ఏదో కదిల్నట్లనిపించింది. చూస్తే ఏముంది..Deana Dunn యొక్క చెయ్యి తన Private parts తో ఆడుకుంటూ ఉన్నది...అదేదో ఆమె సొమ్ములాగా..! కానిమ్మని తన డ్రింక్ మీదనే కాన్సంట్రేట్ చేశాడు.మళ్ళీ కాసేపయిన తర్వాత ఆమె లోపలి భాగాలకి తన చేయిని ఆనించి " ఎలా ఉంది అన్నట్లు" ఒక చూపు చూసింది.అంటే ఆ చూపుకి తాను పొంగి పోయి అద్భుతంగా ఉంది అని చెప్పాలేమో..! 'చీ..నీయబ్బా..కనీసం కొద్దిగా అయినా తనని ప్రిపేర్ అవమని ముందు  చెప్పాలా వద్దా.. దీని కంటికి నేను మగ లంజ లా కనిపిస్తున్నానా ఏమిటి..'అని ఎక్కడో కాలింది Ninoకి..!

" మరీ నటించకు..నీకు లోపల బాగా ఉందని నాకు తెలుసు " అంది Deana Dunn.

ఆ కాసేపటిలో ప్రివ్యూ అయిపోయింది.ఇంతలో ఎవరో ఓ నిర్మాత రావడం తో అతనితో మాట్లాడుతూ తనకి దూరంగా వెళ్ళిపోయింది.పీడా విరగడ అయిందనిపించింది Nino కి..!

అంతలోనే Johnny వచ్చాడు." ఏరా..మామా..ఎలా ఉంది Deana Dunn  తో నీ అనుభవం.." అంటూ అడిగాడు.

" ఏం చెప్పను..నా యింటి పక్కవాళ్ళు అడిగితే ఆమె నన్ను వాడుకుందని చెప్పాలి ..అదీ విషయం.." చెప్పాడు Nino.

"నిన్ను ఇంటికి పిలిచిందా..లేదా"

" నేను పెద్దగా కాన్సంట్రేట్ చేయలేదురా.."

" ఏం..ఎందుకని..ఆమెలాంటి వాళ్ళు నీ కెరీర్ కి చాలా హెల్ప్ అవుతారు ఫ్యూచర్ లో.."

" దానికంటే మా ఊర్లో అమ్మాయిలే బెటర్ రా బాబు.."

" నువ్వు మారవురా..నీవన్ని అవే పద్ధతులు..సరే కానీ..నా సినిమాల్లో పాడు చాలు..నీకేం సమస్య ఉండదులే.." సముదాయించాడు  Johnny.

" నీకన్నా నేనెపుడూ బెటర్ సింగర్ నే..అది మర్చిపోకు"

ఆ కాలి ఫోర్నియా చంద్రకాంతి లో అలా వారిద్దరూ మాట్లాడుకుంటూన్నారు.Nino కి టాలెంట్ ఉన్నా ఎందుకు వెనకబడిపోయి ఉన్నాడు అని ఆలోచిస్తే అతనితో వచ్చిన సమస్య ఇదే..ప్రతిదీ ఇన్సల్ట్ గా తీసుకుంటాడు.

(మిగతాది వచ్చేభాగం లో చూద్దాం)  --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ముప్ఫైవ భాగం)

Don Corleone పై కాల్పులు జరిగాయని ,ఆయన ఆసుపత్రిలోఉన్నాడని తెలియడంతో Johnny Fontane బాధపడ్డాడు.తన సినిమాలకి ఆయన ఫైనాన్స్ చేస్తానన్నాడుగదా..మరి వాటి విషయం ఏమవుతుందో అని కొంత ఆందోళన కూడా చెందాడు.Tom Hagen కి ఫోన్ చేసి అడిగాడు.'తాను గాడ్ ఫాదర్ ని చూడడానికి వస్తానని,అయితే Tom మాత్రం కొన్ని పరిస్థితుల రీత్య రాకుండా ఉండడమే మంచిదని సూచించాడు.తీయబొయే సినిమా కి ఇబ్బంది ఏమీ ఉండదని ,ముందు ఒక సినిమాని తీయడం ప్రారంభించు,ఒక మనిషితో దానికి సంబందించిన విషయమంతా చెప్పి పంపిస్తున్నానని అన్నాడు.

ప్రస్తుతం Nino కూడా సినిమా వాతావరణానికి అలవాటు పడిపోయాడు.అప్పుడప్పుడు కలిసి కూర్చొని అలా ఒక డ్రింక్ తీసుకుంటూ ఉంటారు.Nino రాగానే చెప్పాడు గాడ్ ఫాదర్ పై కాల్పులు జరిగిన ఉదంతాన్ని..Nino విచారించాడు.మళ్ళీ తేరుకొని అన్నాడు.గాడ్ ఫాదర్ గురించి ఒక విషయం చెప్పాడు.

" Johnny ..నేను ఒకానొక సమయం లో ఆ ట్రక్ డ్రైవింగ్ తో విసిగి పోయి తొందరగా డబ్బు సంపాదించాలన్న కోరికతో గాడ్ ఫాదర్ ని అడిగాను.నేను కూడా ఆయన సైన్యం లో ఓ మనిషిగా ఉంటానని..!అప్పుడాయన ఏమన్నాడో తెలుసా Your destiny is to be an artist ..! నువు రాకెట్ కార్యకలాపాల్లో రాణించలేవు సరికదా .. నిన్ను నా వాడివని నియమించినా.. నా మనిషి  చేతిలోనే ఏదో రోజు అర్ధాంతరంగా  చంపబడతావు.Each man has only one destiny"

Nino చెప్పిన ఆ విషయం విన్నాక Johnny కి ఆశ్చర్యం కలిగింది.Don యొక్క దూరదృష్టి కి హేట్సఫ్ అనిపించింది.అంటే అన్ని ఏళ్ళకి ముందే Nino ఏనాటికైనా హాలీవుడ్ లో రాణిస్తాడని ఊహించగలిగినందుకు.ఆ హెల్ప్ చేసేది ఇప్పుడు ఎవరో కాదు..తానే..! ఒకానొక సమయం లో మాటల సంధర్భం లో ఆయన తనతో అన్నాడు." నువ్వు హాలీవుడ్ లో వెలిగావు..ఏం ప్రయోజనం..నీ మిత్రులు Nino లాంటివాడికి ఏమైనా ఊతమిచ్చావా.." అని! Don Corleone ప్రత్యేకత అదే..!ఏదీ ఆర్డర్ వేసినట్లుగా చెప్పడు.కాని తనకి ఏదీ ఇష్టమో వేరే విధానం లో మనసు లో పడేట్టుగా చెబుతాడు.

Tom చెప్పినట్లుగా Johnny సినిమా పనుల్లో మునిగి పోయాడు.ముందు తను కబురెట్టిన నవలా రచయిత ఒక చక్కని కధ తీసుకొచ్చి ఇచ్చాడు.తనకి,Nino కి ఆ కదలోని రండు పాత్రలు అతికినట్లు సరిపోతాయి.Nino దైతే మరీనూ..!అతను నటించక్కర్లేదు..రోజువారీ జీవితాన్ని అక్కడ ప్రెజెంట్ చేస్తే చాలు.

Johnny ఒక ఎగ్జిక్యూటివ్ ని నియమించుకున్నాడు.తన పనుల్లో సాయం చేయడానికి.అతను ఒక మంచి సలహా ఇచ్చాడు.

" Johnny ..మనపనులు అన్నీ ఏ ఆటంకం లేకుండా సాగిపోవాలంటే ట్రేడ్ యూనియన్ వాళ్ళకి కనీసం 50 వేల డాలర్లు విరాళంగా ముట్టజెప్పాలి.లేకపోతే సినిమా మధ్యలో ఆటంకాలు కల్పిస్తారు.అది మన బడ్జెట్ మించి పోయేలా చేస్తుంది." అని..!

" సరే..దానికి సంబందించిన ప్రతినిధిని నా దగ్గరకి పంపించు..నేను మాట్లాడి సెటిల్ చేస్తాను" అన్నాడు Johnny.

చెప్పినట్లుగానే ఆ ప్రతినిధిని పంపించాడు.అతనెవరో కాదు.Bill Goff..!సరే..ఆల్రెడీ తెలిసినవాడే కదా అనుకున్నాడు Johnny.

"అదేమిటి నా మిత్రులు ఆ వ్యవహారమంతా నీతో మాట్లాడామని చెప్పారే..చెప్పలేదా నీకేమీ.."  అడిగాడు Johnny.

" నీ మిత్రులా..వాళ్ళెవరు.." ప్రశ్నించాడు Bill Goff.

" వాళ్ళెవరో నీకు బాగా తెలుసు..పేర్లు నేను చెప్పను" స్థిరంగా అన్నాడు Johnny.

" నీ మిత్రుడు కాల్పుల్లో గాయపడి ఆసుపత్రి మంచం మీద ఉన్నాడు.ఇపుడు అతని మాట ఈ పశ్చిమ తీరం లో నున్న ఈ నగరం దాకా ప్రతిధ్వనిస్తుందని అనుకొంటున్నావా.." నిర్లక్ష్యంగా అన్నాడు Bill Goff.

" సరే ..రెండు రోజులాగి కనిపించు..నువు అడిగిన సొమ్ము తీసుకెళుదువు గాని " అన్నాడు Johnny మరీ వాదించడం ఇష్టంలేక.

" సరే..మళ్ళీ కలుస్తాను.ఆ ...ఒకమాట..ఈ లోపులో న్యూయార్క్ లో ఉన్న నీ మిత్రులకి ఫోన్ చేయాలని ప్రయత్నించకు.దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు.." పోతూ ఒక ఉచిత సలహా పారేశాడతను.

నిజానికి న్యూయార్క్ కి ఫోన్ చేయడం ప్రయోజనం చేకూర్చింది.Tom Hagen కి కాల్ చేసి జరిగినదంతా చెప్పాడు Johnny.

" Johnny ..నువ్వు ఒక్క Dime కూడా ఆ బాస్టర్డ్ కి ఇవ్వకు.అది నీ గాడ్ ఫాదర్ యొక్క విలువ ని తగ్గిస్తుంది." Tom చెప్పాడు అవతలనుంచి.

"  ఒకసారి గాడ్ ఫాదర్ తో నేను మాట్లాడేదా.."

" ఇప్పుడు కుదరదు.నీకేం ఫర్లేదు.నీ పనుల్లో నువు ఉండు.నేను Sonny తో మాట్లాడి వ్యవహారమంతా సెటిల్ చేస్తాను.ఏదైనా మార్పు ఉంటే మళ్ళీ నీకు చెబుతాను..సరేనా.." చప్పాడు Tom.

సరే రెండు రోజులు వేచిచూద్దాం..అన్నట్లు ఆగాడు Johnny.అలా ఆగడమే అతనికి 50 వేల డాలర్లు మిగిలినట్లయ్యాయి.ఒక చిత్రమైన సంఘటన ఈ మధ్యలో జరిగింది. Bill Goff తన ఇంటిలో ఉండగా ఎవరో ఆగంతకులు వచ్చి స్పాట్ లో కాల్చి చంపారు.

Johnny కి వొళ్ళు జలదరించింది..!ఆ వార్త ని చదివినవెంటనే..!

అంటే గాడ్ ఫాదర్ యొక్క దెబ్బ అవసరమైతే హాలీవుడ్ లో కూడా ప్రతిధ్వనిస్తుందని మొదటిసారిగా అతనికి అర్ధమయింది.The real leader plays always low key అని ఎందుకన్నారో క్రమేపి అవగతం కావడం మొదలైంది అతనికి...!

(మిగతాది వచ్చేభాగం లో చూద్దాము) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ముఫై ఒకటవ భాగం)

వారాలు గడిచిపోతున్నాయి.స్క్రిప్ట్ ,కాస్టింగ్,ఇంకా ఇతర సినిమా పనులతో ..బిజీగా కాలం అలా వెళ్ళిపోతున్నది.Johnny తన గొంతు గురించి కూడా ఇప్పుడు ఆలోచించడం లేదు.ప్రస్తుతం గాడ్ ఫాదర్ ఆసుపత్రి లో ఉన్నాడుకదా..ఏమో..ఆస్కార్ అవార్డ్..వస్తుందో రాదో..ఏ శక్తులు ఎలా పనిచేస్తాయో ..అని దాని మీద పెద్దగా ఆశపెట్టుకోలేదు.అయితే ఒకటి John Woltz సినిమా లో తన పాత్ర బాగా వచ్చింది.అది అతను ఫీలయ్యాడు.

ఇంకో హేపీ న్యూస్ ఏమిటంటే ..తను తీయబోయే సినిమా కోసం Nino,తను కలిసి పాడిన పాట బాగా హిట్ అయింది.తను పాటలు పాడటం మానేసి ఇక ప్రొడ్యూసర్ గా స్థిరపడాలని అనుకున్నాడు.Nino పాటల్లో స్థిరపడవచ్చు.

జీవితం మళ్ళీ పట్టాలు ఎక్కుతున్నట్లుగా అనిపిస్తోంది.ఇప్పుడు వారానికి ఓసారి Ginni ఇంటికి వెళ్ళి డిన్నర్ చేస్తున్నాడు.పిల్లల్తో ఆమె తో కలిసి అలా బయట విహరిస్తున్నాడు.రెండవ భార్య ఎవరో మెక్సికన్ ని పట్టుకు వెళ్ళిపోయింది.ఒక రకంగా ఇప్పుడు బాచిలర్ లైఫ్ గడుపుతున్నాడు.పొగ,మద్యపానం లాంటివి దాదాపుగా గతం తో పోలిస్తే మానేశాడని చెప్పాలి.మిగతా అన్నీ వ్యవహారాల్లో కంట్రోల్ గా ఉంటున్నాడు.ఇపుడు ఒక క్రమశిక్షణాయుత వ్యక్తిగా,ఆర్టిస్ట్ గా పరిణామం చెందుతున్నాడు.

యధాలాపంగా ఆ సాయంత్రం Nino ఇంటికి వచ్చినప్పుడు అన్నాడు." నీ జీవితం లో ఇంత అందం గా ఎపుడు పాడలేదు.. పాట సూపర్ హిట్ అయిందిరా " అని..!

" అప్పుడప్పుడు ఎందుకో అలా కుదురుతుందిరా..ఏమో భవిష్యత్తులో అలా కుదుతుందో లేదో నేను చెప్పలేను.."

" అన్నట్టు రేపు రాత్రి ఆస్కార్ అవార్డ్ లకి సంబందించిన కార్యక్రమం ఉంది..నాతో పాటు రాకూడదూ.."

" నేనుందుకురా నీతో..నీ గర్ల్ ఫ్రెండ్ నో..నీ మాజీ భార్యల్లో ఎవరినైనా తీసుకువెళితే  బావుంటుంది గదా.. "

" ఒరే..మావా ..నాకు ఆస్కార్ రాకపోతే కనీసం నా బాధ తెలిసి ఓదార్చే ఏకైక వ్యక్తివి నీవేరా.."

Johnny లోని ఆవేదన ని అర్ధం చేసుకున్నాడు Nino.

" సరే..Johnny ..అలాగే..నీకంటే ఎక్కువ ఎవరు నాకు..!రేపు రాత్రి ఆ కార్యక్రమానికి నేను కూడా వస్తాను.అంతే కాదు ఒక్క చుక్క మందు కూడా ముట్టను రేపు..ఇది నీ కోసం నేను చేసే త్యాగం రా.. ఎందుకంటే నిన్ను సేఫ్ గా  అక్కడనుంచి తీసుకురావాలి గా నేను "

Academy Awards కార్యక్రమం జరుగుతున్న రాత్రి అది.అన్ని కేటగిరి లకి విజేతల్ని పిలుస్తున్నారు..వారు  వేదిక  ఎక్కుతుంటే మిన్నుముట్టే హర్షధ్వానాలు.Best male actor అంటూ ..కాసేపు ఆగి Johnny Fontanne అని అనౌన్స్ చేశారు.ఆనందం తో Johnny ఒక్కసారిగా మ్రాంపడిపోయాడు.Nino సంతోషానికి అవధి లేదు.లేచి డాన్స్ చేస్తూ గోల చేశాడు.ఇద్దరు సంతోషంగా చేతులు కలుపుకున్నారు.

ఇక ఆ తర్వాత జరిగింది అసలు విషయం.కార్యక్రమం పిమ్మట జరిగిన మందు  పార్టీ లో అంతా ఫుల్లు గా తాగారు.విచిత్రంగా వీరమందుబాబు అయిన Nino మాత్రం ఒక్క చుక్క కూడా తాగకుండా సమ్యమనం పాటించాడు.Best female actress గా ఎన్నికయిన తార,ఇంకా ఆమె స్నేహితులు Johnny దగ్గర కి వచ్చారు.ఇద్దరు బెస్ట్ యాక్టర్స్ తమ ముందు అన్ని విప్పి అసలు కార్యక్రమం చేయాలని పట్టుబట్టారు బెస్ట్ యేక్ట్రెస్ స్నేహితురాళ్ళు...!అదే ఈ రాత్రి తమకిచ్చే  వినోదం..! కొంత మంది ఆ బెస్ట్ యేక్ట్రస్ దుస్తులు విప్పగా,మరి కొంతమంది Johnny వలువలు లాగడానికి ప్రయత్నిస్తున్నారు. వెంటనే Nino రంగం లో దిగి వీరందరిని నెట్టివేసి ..తోసుకుంటూ Johnny తో పాటు బయటకి వచ్చేసి కారు ఎక్కి దాన్ని ముందుకు ఉరికించాడు.ఈ ప్రపంచం లో సక్సస్ వచ్చినా చికాకేరా బాబు..ఇదే సక్సస్ అయితే మాత్రం వద్దురా దేవుడా అనుకున్నాడు Nino..!

(మిగతాది వచ్చే భాగంలో చూద్దాము)  --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ముప్ఫై రెండవ భాగం)

Don కి వయసు పన్నెండేళ్ళు ఉన్నప్పటినుంచే ఒక పరిణితి చెందిన వ్యక్తిలా ప్రవర్తించేవాడు.మనిషి సగటు ఇటాలియన్ లాగే ఉండేవాడు చూపులకు..! అప్పటి రోం ఆధీనం లో ఉండే సిసిలీ లోని ఓ గ్రామం లో ..దాని పేరు Corleone , ఆ గ్రామం లో నివసించేవాడు.చూడటానికి ఆ ఊరు ఒక Moorish గ్రామం లా ఉంటుంది.అతని అసలు పేరు Vito Andolini.అతని తండ్రి పక్క గ్రామానికి చెందిన ఒక Mafia కుటుంబం చేతిలో హత్యకావించబడటం తో ..తల్లి అతడిని అమెరికా వెళ్ళే ఓ ఓడలో ఎక్కించి పంపించివేసింది.అక్కడ ఉంటే సాటి ఇటాలియన్ ల కుటుంబాల మధ్యన ఏదో ఓ పని చేసుకుంటూ బ్రతుకుతాడని..!

Don కి కూడా ఒక సెంటిమెంట్ ఉందని అనిపిస్తుంది.ఎందుకంటే అమెరికా వెళ్ళిన తర్వాత తన ఇంటి పేరుని Andolini అని కాకుండా తన స్వంత గ్రామమైన Corleone అనే పేరు కి మార్చుకుంటాడు. ఆ విధంగా తన ఊరి పేరుని అమెరికా చరిత్రలో మారుమోగేలా చేశాడని చెప్పవచ్చు.

ఆ రోజులు ...మొదటి ప్రపంచయుద్ధానికి చాలా ముందు రోజులు.సిసిలీ ప్రావిన్స్ లో గవర్నమెంట్ కంటే ఎక్కువ ప్రాబల్యం గలవి స్థానిక మాఫియా కుటుంబాలు.రాజధాని రోం నుంచి అదికారులు ఏ నిర్ణయం తీసుకున్నా ..స్థానిక మాఫియా చీఫ్ ల అనుమతి లేనిదే ఆ పనిని చేయలేరు.Vito తండ్రికి ,ప్రక్క గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఒకసారి ఏదో విషయం లో గొడవ జరిగింది.ఆ వ్యక్తి,ఆ సమస్యని ఆ గ్రామ మాఫియా చీఫ్ వద్దకి తీసుకెళ్ళాడు.అయితే ఆ చీఫ్ యొక్క అధికారాన్ని ధిక్కరించాడు తన తండ్రి.అంతేగాక మాఫియా చీఫ్ ని నలుగురు చూస్తుండగా జరిగిన వాగ్వివాదం లో చంపివేశాడు.తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు కనిపించినా..ఆ మాఫియా చీఫ్ సంబందీకులు ..అంతటితో ఊరుకోలేదు.కొన్ని రోజులయిన తర్వాత ..తన తండ్రిని చంపి రోడ్డు వార గా పారవేశారు.అతని శరీరం నిండా Lupera తో జల్లెడ పట్టినట్లుగా తూట్లు తూట్లుగా కాల్చి చంపారు.అంత్యక్రియలు ముగిశాయి.అతని కుమారుడు Vito ప్రాయానికి వచ్చివున్నాడని..కనుక భవిష్యత్ లో ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని భావించి ....ఇతడిని సైతం చంపడానికి ప్రణాళికలు వేయసాగారు. ఈ విష్యం తెలుసుకున్న Vito తల్లి ..కొడుకుని దగ్గర బంధువుల ఇళ్ళలో కొన్నాళ్ళు దాచింది.ఆ పిమ్మట ఇక్కడ ఉండటం ఎప్పటికైనా ప్రమాదమని తలచి..ఇటలీ నుంచి అమెరికా వెళ్ళే ఒక ఓడ లో అతణ్ణి ఎక్కించింది.ఆ ఓడలోనే Abbandando కుటుంబీకులతో పరిచయం ఏర్పడింది.ఆ కుటుంబం లోని కుర్రాడైన Genco తో స్నేహం కుదిరింది.భవిష్యత్ లో Don కి ఇతనే Consigliere గా వ్యవహరించాలనేది కాలం పన్నిన ఒక వ్యూహమేమో..!

న్యూయార్క్ లోని Hell's kitchen ఏరియా లో తొమ్మిదవ అవెన్యూ లో ..Abbandando కుటుంబీకులు పెట్టిన ఓ కిరాణా దుకాణం లో ఒక పనివాడి గా కుదురుకున్నాడు Vito.జీవితం అలా సాగిపోతూ ఉంది ..పద్దెనిమిదేళ్ళ ప్రాయం లో ఓ ఇటాలియన్ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు..వారికుటుంబం కూడా ప్రవాసం వచ్చినదే.ఆమె Maria  ఒక సగటు కేథలిక్ కుటుంబం నుంచి వచ్చిన మంచి గృహిణి..అంతకు మించి మంచి కుక్ కూడా..!

ఒక రెండు ఏళ్ళు గడిచాయి..మొదటి సంతానం ...Santino .అతడినే ముద్దుగా అంతా Sonny అంటారు.

సరే....Fanucci అనే అతను ఆ పొరుగునే నివసించేవాడు.అతని జోలికి ఎవరూ పోయేవారు కాదు.చూడటానికి భయంకరంగా ,మొరటుగా ఉంటాడు ..!అన్నీ చీకటి వ్యాపారాల్లో ఆరితేరినవాడు.ఆ పరిసరాల్లోని అన్ని దుకాణాలు అతనికి మామూళ్ళు చెల్లించవలసిందే.బ్లాక్ లో లాటరీలు నడిపే వాళ్ళు ,గేంబ్లింగ్ నడిపే వాళ్ళు అంతా ఇతనికి సొమ్ము ముట్టజెప్పవలసిందే.అయితే కొన్ని కుటుంబాలు ..ముఖ్యంగా ..మగపిల్లలు ఎక్కువగా ఉండి ..ఎదురు తిరిగే కుటుంబాలు ..వాళ్ళ జోలికి వీడు వెళ్ళేవాడు కాదు.ఎందుకంటే వాళ్ళు అమీ తుమీ తేల్చుకోవడానికి రెడీ అయ్యేవాళ్ళు.అదీ విషయం...!

వ్యాపారస్తులంతా కూడా ఏమిటంటే ..రోజూ ఎందుకు వీడితో గొడవ ..అని రాజీపడి మామూళ్ళు ఇచ్చేస్తుండేవారు.దాంట్లో Abbandando కుటుంబం కూడా ఒకటి.అయితే Genco మాత్రం తన తండ్రితో విభేదించేవాడు." వాడికేమిటి..మామూళ్ళు ఇచ్చేది..ఏం పీకుతాడు వాడు " అని ..!" నీకు తెలీదు లే ఊరుకోరా.." అనేవాడు తండ్రి.

Vito ఇదంతా గమనిస్తూ ఉండే వాడు.ఏమీ మాట్లాడకుండా అలా మౌనం గా ఉండేవాడు.అయితే అతని స్వభావమే అంత..అవసరమైతే తప్ప మాట్లాడడు.

ఇదిలా ఉండగా  ఒకరోజు జరిగిన సంఘటన మరింత ఆలోచనరేపింది. ఏమిటంటే ..ఆ వీధి లో  ఉండే ముగ్గురు యువకులకి ,ఈ Fanucci కి ఏదో గొడవ జరిగింది.ఎందుకో తెలీదు గాని దాంట్లో ఒకడు Fanucci మీద చాకు దూసి గాయపరిచాడు. ఆ చెవి నుంచి ఈ చెవి దాకా అర్ధ చంద్రాకారం గా తెగి ..బడ బడ రక్తం కారసాగింది.ఇక Fanucci ..సంగతి చూడాలి..ఒకటే పరుగు..తన దుస్తుల్ని గాయం కి అదిమి పట్టుకుంటూ...పారిపోవడం మొదలెట్టాడు.అయితే గాయం మరీ లోతుకి కాలేదు అందు చేత బతికిపోయాడు.ఒక వారం తర్వాత అనుకుంటాను...కత్తి తో గాయపరిచిన యువకుడు హత్య కాబడ్డాడు.దానితో ఆ చుట్టు ప్రక్కల వారికి అతనంటే మరింత మర్యాద పెరిగింది.సరే..మిగిలిన రెండు కుటుంబాల వాళ్ళు తమ బిడ్డలకి హాని జరగకుండా వాడికి ఎంతో కొంత ఇచ్చి రాజీ కుదుర్చుకున్నారు...కాబట్టి బతికిపోయారు అని పై మాటగా అందరూ అనుకున్నారు.

సరే..ఇది Vito కి సంబందించని విషయం.కొన్ని రోజుల్లో దాన్ని మర్చిపోయాడు.మొదటి ప్రపంచం యుద్ధం జరుగుతున్న రోజులవి. అమెరికా లో ఆలివ్ ఆయిల్ కి చాలా కొరత వచ్చింది.దీన్ని సొమ్ము చేసుకోవడానికి బ్లాక్ మార్కెటర్లు అంతా ప్రయత్నించారు.సఫలమయ్యారు కూడా. దాంట్లో Fanucci ఒకడు.Abandando లు  నిర్వహించే దుకాణం లో ఆలివ్ ఆయిల్ ని అమ్మడం లో షేర్ తీసుకున్నాడు Fanucci.అదంతా చూసుకోవడానికి తన బంధువు ని ఒకణ్ణి ఆ దుకాణం లో వర్కర్ గా నియమించాడ్తను.దాని వల్ల Vito ఉద్యోగం ఊడిపోయింది.

అయితే Genco మాత్రం బాధపడ్డాడు." మా నాన్న తప్పనిసరై ఆ వర్కర్ ని పెట్టుకున్నాడు.నీకు ఏ సాయం కావాలన్నా నన్నడుగు.." అన్నాడతను..! అనేకసార్లు తండ్రి కి తెలియకుండా ViTo కి ఆహార పదార్థాలు సప్లయ్ చేసేవాడు.అయితే పద్ధతి కాదు వద్దనేవాడు Vito..!Fanucci పట్ల ఏదో కోపం తనకి లోపల ఉండేది..తన ఉద్యోగం పోగొట్టినందుకు ..!కాని దాన్నలాగే తనలోనే ఉంచుకున్నాడు.....!

కుటుంబాన్ని పోషించుకావాలి ...తప్పదు కదా..! అందుకని Rail road  కోసం జరిగే పనుల్లోకి వెళ్ళి కూలి గా కుదురుకున్నాడు.అక్కడ పైన సూపర్వైజ్  చేసేవాళ్ళంతా ఐరిష్ ఇంకా అమెరికా వాళ్ళు.నోటికి వచ్చినట్లు తిట్టేవాళ్ళు.ఏ మాత్రం కోపం వచ్చినా అదే తంతు.Vito కి కోపం వచ్చేది.కాని అవన్నీ తనను కానట్లుగా భరించేవాడు.ఎంత తను ఇటాలియాన్ యాస లో మాట్లాడినా ఇంగ్లీష్ బాగానే అర్ధమవుతుంది..అది వారికి తెలియదేమో..!

ఓ రోజున సాయంత్రం పూట ఇంట్లో భోంచేస్తుండగా ఇంటి తలుపు ఎవరో కొట్టినట్లయింది.వెళ్ళి చూస్తే Peter Clemenza ..తన పొరుగు ఇటాలియాన్ కుర్రాడే..!

" ఏయ్ మావా..ఇదిగో..ఈ మూటని నీ దగ్గర భద్రంగా ఉంచు.మళ్ళీ వచ్చి తీసుకుంటా.." అంటూ వేగంగా వెళ్ళిపోయాడు.మొత్తానికి ఏదో కంగారులో ఉన్నాడు.తీసుకెళ్ళి లోపలపెట్టాడు Vito. ఓ రెండు రోజులు పోలిస్ స్టేషన్ లో గడిపి తిరిగివచ్చాడు Clemenza.Vito ఇంటికి వచ్చాడు.

" ఆ రోజున నేనిచ్చిన మూటని ఇస్తావా.." అనడగ్గానే దాన్ని తీసుకొచ్చి Clemenza ముందు పెట్టాడు.

" దీంట్లో ఏముందో చూడలేదా.." అడిగాడు Clemenza.లేదు అన్నట్లు తలాడించాడు Vito.కాసేపు మాట్లాడుకున్నాక ఇంట్లో ఉన్న వైన్ ని ఇద్దరూ తాగారు.Clemenza,Vito ల మధ్య ఓ స్నేహ వాతావరణం కుదిరింది.Clemenza మంచి మాటకారి.కధలల్లడం లో దిట్ట.అవి విని ఆనందించుతూ Vito కాలం గడుపుతుండేవాడు.అట్లా వారిరువురు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.Clemenza ఓ రోజు Vito భార్య ని అడిగాడు. " ఏం..అమ్మాయ్..ఫ్లోర్ మీద పరచడానికి తివాచీ ఏం లేదా..అయితే ఉండు నేను ఇప్పిస్తా..." అని Vito ని తనతో రమ్మని పురమాయించాడు.

ఒక మంచి పాలరాతి భవనం లోకి తీసుకెళ్ళాడు.ఉన్న తాళాన్ని లాఘవంగా తీశాడు Clemenza.ఓ పెద్ద కార్పెట్ పరిచి ఉంది హాల్ లోపల .." ఏయ్ ..Vito..నువ్వు అవతల వేపునుంచి కార్పెట్ ని చుట్టుకురా.." అని చెప్పి అటు ఇటు నలుదిక్కులా చూడసాగాడు Clemenza.కార్పెట్ చాలా పెద్దది.బరువుగా ఉంది.ఇద్దరూ రెండు భుజాల మీద మోయసాగారు.డోర్ బెల్ వినబడగానే..తన గన్ తో ..అలర్టయ్యాడు Clemenza.అప్పుడర్థమయింది Vito కి  తాము ఈ తివాచీ ని దొంగతనం చేస్తున్నామని.సరే..ఎట్లానో ..మొత్తానికి ఇంటికి చేర్చారు దాన్ని..Vito ముందర రూం లో చక్కగా ఆ కార్పెట్ సదిరి..ఇంకా మిగిలితే ఇంకో రెండు రూముల్లో సదిరేశాడు Clemenza..! ఆ కోసే సామాగ్రి అంతా అతని వద్ద ఎప్పుడూ రెడీగా ఉంటుంది.

Vito పని మళ్ళీ మొదటికి వచ్చింది.చేతిలో డబ్బులాడడం లేదు.ఉద్యోగం కూడా ఏమీ లేకుండా పోయింది.అప్పుడప్పుడు Genco ఏదో సాయం చేస్తున్నాడు.కాని అతని మీదనే..ఆధారపడటం బాగుండదు గదా..!

ఒకరోజు Clemenza ని కలిసినపుడు Tessio ని పరిచయం చేశాడు.అతనూ  ఓ ఇటాలియన్ యువకుడే.తాము ముగ్గురూ కలిసి ఓ గేంగ్ గా ఏర్పాటు కావాలాని Clemenza కోరాడు.ఏం లేదు..ఖరీదు గల సిల్క్ దుస్తుల్ని తీసుకువెళ్ళే గూడ్స్ లారీలని హైజాక్ చేయడం..వాటిని అమ్మి ధనం సంపాదించడం ..అది వారి ప్రణాళిక..! దాన్ని అమల్లో పెట్టనారంభించారు. Clemenza ట్రక్ లని ఆపి గన్ చూపించి డ్రైవర్లని వెళ్ళగొట్టేవాడు.అంత లోనే Tessio వచ్చి అతనికి సాయం చేసేవాడు.Vito ని ఎక్కువగా హైజాక్ కాబడిన ఆ ట్రక్ లని డ్రైవ్ చేయడానికి నియోగించేవారు. ఎందుకంటే డ్రైవ్ చేయడం లో Vito కి మంచి అనుభవం వుంది.Abbandando ల దుకాణం లో పనిచేసేటపుడు కూడా వారి ట్రక్ ని ఇతనే నడిపేవాడు.అదీగాక 1919 లో అమెరికా లో నైపుణ్యం గల డ్రైవర్ లకు మంచి గిరాకి ఉండేది.

అట్లా లూట్ చేసిన సిల్క్ దుస్తుల్ని ఇటాలియన్ హోల్ సేల్ వర్తకులకి అమ్మేసేవారు.ఇంకా మిగిలిన దుస్తుల్ని తమ పొరుగులో ఉండే పేద ఇటాలియన్ కుటుంబాలకి కారు చౌకగా అమ్మేసేవారు.ఆ కుటుంబాలు అంత చౌకగా తమ కుమార్తెలకు దుస్తులు కొనడం సాధ్యపడే విషయం కాదు.. కనుక వాళ్ళు పండుగ చేసుకునేవాళ్ళు.

Vito కి Clemenza ఇంకా Tessio ల యొక్క విధానం బాగా నచ్చింది.తనకి రావాలసిన వాటా ని వెంటనే ఇచ్చేసేవారు.అయితే ఈ పనిని ఇలా కాకుండా ,మొరటుగా కాకుండా ,ఇంకో పద్ధతి లో చేస్తే బావుంటుందేమో అనిపించేది.తన వాటా కింద 700 డాలర్లు గిట్టుబాటయ్యాయి.1919 లో ఆ మొత్తం మామూలు విషయం కాదు.

ఆ తెల్లారి నడుచుకుంటూ వీధిలో నుంచి వస్తున్నాడు Vito.

" ఏయ్ అబ్బాయ్..ఆగు" అని వినబడింది ఓ స్వరం.

తిరిగి చూస్తే ఎవరో కాదు Fanucci..!

" ఏమిటి..ఈ మధ్య నువ్వు ..మీ స్నేహితులు బాగా సంపాదిస్తున్నారట...నాకు తెలిసిందిలే..మా లాంటి పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి మరి...ఈ ఏరియా నాదని నీకు తెలుసుగా..." కృరమైన నవ్వుతో అన్నాడు Fanucci.

తన సహజధోరణిలో అలానే ఏం మాట్లాడకుండా వింటూ ఉండిపోయాడు Vito.

Fanucci ..ఉడకపోసినట్లుగా ..ఉఫ్ అని ఊదుకుంటూ తన జాకెట్ బటన్స్ ఊడదీశాడు.లోపల ఉన్న గన్ కనపడాలని..!

" మీ ముగ్గురు కలిసి ..ఒక్కొకళ్ళు మూడు వందల డాలర్ల చొప్పున నాకివ్వండి.నాకు జరిగిన అవమానాన్ని మర్చిపోతాను.మీ పనులకి కూడా నేను అడ్డురాను.." చెప్పాడు Fanucci.

Vito Corleone ఎందుకనో Fanucci వైపు చూసి చాలా ప్రశాంతంగా ఓ చిరునవ్వు  నవ్వాడు.ఏదో ఒక Chilling spirit ని దానివల్ల ఫీలయిన Fanucci ఒక్క క్షణం తత్తరపడి మళ్ళీ సర్దుకున్నాడు.ఓ ప్రమాదకరమైన నిర్ణయం తీసుకునేముందు తను ఆ విధమైన నవ్వు నవ్వుతానని కాలం గడుస్తున్నకొద్దీ Vito Corleone కి అర్ధమయింది.

(మిగతాది వచ్చేభాగం లో చూద్దాము)  KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ముప్ఫై మూడవ భాగం)

Vito మాట్లాడడం ప్రారంభించాడు.చాలా మర్యాద నిండిన కంఠం తో చాలా తార్కికమైన పదాలతో మాట్లాడటం ..Fanucci ని కూడా ఆశ్చర్యపరిచింది.

" నా ఇద్దరు మిత్రులతో సంప్రదించి మీకు ఇవ్వవలసింది ఇచ్చేస్తాను.ఏమైనా సమయానికి ఓ గాడ్ ఫాదర్ లా వచ్చి దిశానిర్దేశం చేశారు మాకు..అందుకు కృతజ్ఞతలు " అన్నాడు Vito.

" చాలా మంచిది.అలా చెయ్...మంచి కుర్రాడిలా కనిపిస్తున్నావ్..నీకేదైనా సాయం కావలిస్తే అడుగు..చేసిపెడతా.." చెప్పాడు Fanucci.

ఆవేశపడి మాట్లాడటం వల్ల జరిగే పరిణామాలు ఏమిటో తన తండ్రి జీవితమే Vito కి నేర్పించింది.దానికి అతను చెల్లించిన మూల్యం అతని ప్రాణం...!సరే..Clemenza,Tessio లని కలిసి జరిగిన విషయం చెప్పాడు.వాళ్ళు కూడా ఒక అనుమానం వ్యక్తం చేశారు.ఈ Fanucci ..ఈ మాత్రం డబ్బుతోనే సంతృప్తి పడతాడా ..ఇంకా మననుంచి పీల్చాలని చూస్తాడు"  అన్నారు వాళ్ళు.

సరే..తలా మూడువందలు వేసుకొని..ఆ మొత్తం ఇచ్చేద్దాం పట్టు.." అన్నాడు Clemenza.

Vito కి ఆశ్చర్యం కలిగింది.కాని బయటకి వ్యక్తం చేయలేదు.

" ముందు ఒకటి ఆలోచించండి.అసలు మనం ఎందుకు డబ్బులివ్వాలి..మన కోసం వాడు చేసింది ఏమిటి..నిజం చెప్పాలంటే వాడికంటే మనం బలవంతులం..ఇంకా మన దగ్గర గన్స్ కూడా ఉన్నాయి.." Vito ఆవేశరహితంగా అన్నాడు.

" ఎందుకంటే వాడికి కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి.Maranzalla సంబందించిన గేంగ్ తో వీడికి సంబంధాలున్నాయి.పోలీస్ లకి కూడా వీడు ఇంఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడు.." చెప్పాడు Clemenza.

ఈ సంభాషణ అంతా Vito ఇంట్లోనే జరుగుతోంది.భార్య ఎవరితోనో మాట్లాడుతూ బయట వీధిలో కూర్చుంది.అయినా ఆమెకి అర్ధమయ్యే ఇంగ్లీష్ బహు తక్కువ.ముగ్గ్రు మిత్రులు వైన్ సేవిస్తూ మాట్లాడుకుంటున్నారు.Vito కి ఒకటి అర్ధం అయింది.తన మెదడు ..ఎప్పుడూ లేనిది..ఈ రోజు ఎందుకో చాలా చురుకుగా పనిచేస్తోంది. Fanucci గురించి..ఒకసారి మళ్ళీ ఒకమారు ఆలోచించాడు.ఆరోజున ..అంటే..ఆ ముగ్గురు యువకులు దాడిచేసినపుడు ..వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన సీను గుర్తుకొచ్చింది.

సరే..ఆ ముగ్గురు యువకుల్లో ఒకడు మర్డర్ అయ్యాడు..కాని మిగతా ఇద్దర్నీ ఎందుకని చంపలేకపోయాడు..నిజంగా వాడికి మాఫియా తో కనెక్షన్ ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ పని చేయగలిగేవాడు.అంటే మిగతా ఇద్దరు యువకులు,మొదటి యువకుని హత్య జరిగిన తర్వాత ఎలర్ట్ అయ్యారు. ..అలా ఎలర్ట్ కావడం వల్ల వీడు వాళ్ళని ఏమీ పీకలేకపోయాడు. ఒక Brutal Force తోనూ... అవసరమైనప్పుడు కిరాయి గూండాల్ని ఉపయోగించుకుంటూ వాడు దాదాగిరి చలాయిస్తున్నాడన్నమాట...! నిజానికి వాడికి అందరూ భావిస్తున్నట్లు పెద్ద కనెక్షన్స్ ఏమీ లేవు అనిపించింది Vito కి...!

మంచో..చెడో..Vito కి గాఢమైన ఓ నమ్మకం ఉంది.ఏమిటంటే పుట్టిన ప్రతి మనిషికి ఒక తలరాత ఉంటుంది.దాన్ని ఎవరూ తప్పించలేరు.ఆ రోజు ..అంటే Fanucci ..అడ్డగించిన రోజునే తను వాడికి డబ్బులిచ్చేసి..ఏ కిరాణా దుకాణం లోనో వర్కర్ గా కుదురుకునేవాడు..జీవితం అలా సాగిపోయేది.కాని తన అలా చేయలేదు..ఎందుకని..అసలు ఈ Fanucci అనే వాడు తనకి అడ్డంగా ఎందుకు రావాలి..వీడిని ఎదుర్కోవడం ద్వారా తన జీవితం ఇంకో మలుపు తిరగబోతున్నదా.. తను ఒక Don కావాలనేది విధి యొక్క సంకల్పమేమో..!!!

(మిగతాది వచ్చేభాగం లో చూద్దాం) --KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ముప్ఫై నాల్గవ భాగం)

మొత్తానికి ముగ్గురూ కలిసి వైన్ బాటిల్ ని పూర్తి చేశారు.Vito ఆ తర్వాత అన్నాడు. " మీ కిష్టమైతే ..మీరిద్దరూ తలా రెండు వందల డాలర్లు నాకివ్వండి.నేని Fanucci కి ఇచ్చేస్తాను"

" అదెలా సాధ్యం..వాడు ప్రతి ఒక్కరినుంచి మూడువందల డాలర్లు కదా అడిగింది" Clemenza అనుమానంగా అడిగాడు.

" అదంతా నా కొదిలిపెట్టండి.నా తిప్పలేవో నేను పడతా..సరేనా.." అన్నాడు Vito. ఇది నిజమేనా అన్నట్లుగా చూశాడు Clemenza.

"ఎవరినైతే నేను ఫ్రెండ్స్ గా అంగీకరిస్తానో వారితో నేను అబద్ధమాడను.Fanucci మీకు రేపు కలిసినపుడు చెప్పండి.డబ్బులు నా వద్ద ఉన్నాయని..!అతనితో ఎలాంటి గొడవ పెట్టుకోవద్దు.అతనితో ఎలా మాటాడాలో అలా మాటాడి నేను ఒప్పిస్తా..అదంతా నాకు వదిలి నిశ్చింతగా ఉండండి" చెప్పాడు Vito.

" వాడు పెద్దమాయగాడు.అంత తొందరగా అంగీకరిస్తాడని నేను అనుకోను" Tessio అన్నాడు.!

" I will reason with him.. విషయాన్ని కూర్చొని చర్చిస్తాము." చెప్పాడు Vito.ఒక విషయం చాలా తీవ్ర మైన దిశగా వెళుతున్నపుడు ..అనవసరమైన రక్తపాతాన్ని నివారించడానికి అలాంటి తరుణోపాయాన్ని Vito Corleone తన జీవితం అంతా పాటించాడు.ఎంత అర్ధమయ్యేట్లు వివరించినా..ఇక వినకపోతే చివరి అస్త్రంగా హింస ని ప్రయోగిస్తాడు.సరే..ఆ సాయంత్రం Vito భార్య కి తెలిపాడు.పిల్లల్ని దూరంగా ఉన్న ఆ వీధి చివర తెలిసినవాళ్ళ ఇంట్లో ఉంచమని..!తను మళ్ళీ చెప్పేంతదాకా వాళ్ళని తీసుకురావద్దని...!అదేవిధంగా ఆమె ని ఇంటి గుమ్మం బయట కూర్చొని చూస్తుండమని..తను ఓ వ్యక్తి తో అవసరమైన కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉందని..ఇలా వివరంగా చెప్పాడు.

ఆమె మొహం లో కోపం..భయం..రెండూ ఒకేసారి కనిపించాయి.తీవ్రంగా Vito వేపు చూసింది.

" నీ కంటికి నేనెలా కనిపిస్తున్నాను.ఒక ఫూల్ లా అగుపిస్తున్నానా..?" అడిగాడు Vito.ఆమె మళ్ళీ ఎలాంటి ప్రశ్న తిరిగి వేయలేదు.కాని ఏదో ఒక ప్రమాదకరమైన మార్పుకి..అతను గురవుతున్నట్లు ఆమె అంచనా వేసింది.అది అతని ప్రాణానికి ముప్పు తెస్తుందా అనేది ఆమె భయం.అతనికేమైనా అయితే ఈ దేశం కాని దేశం లో తాను ..ఈ పిల్లలతో ..ఎన్ని బాధలకి లోనవ్వాలో అని ఆమె భయం కావచ్చు. ఎప్పుడూ నెమ్మెదిగా..వినమ్రంగా ..ఓ పద్ధతి ప్రకారం ఉండే ఈ మనిషి ఇట్లా పరిణామం చెందుతున్నాడేమిటి..అని ఆలోచిస్తున్నదామె..!

He is ready to start with his destiny..!

Vito Corleone నిర్ణయించుకున్నాడు.Fanucci ని ఏది ఏమైనా అంతమొందించితీరవలసిందే.  
 దానికతను పూర్తిగా అర్హుడు..!ఆ విధంగా చేసినందువల్ల తన మిత్రులు ఇచ్చిన నాలుగువందలు..తన మూడు వందలు..మొత్తం ఏడువందల డాలర్లు తనకి మిగులుతాయి.నిజం చెప్పాలంటే వాడి ప్రాణం అంతకూడా చేయదు.లేకపోతే తమవద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసే అధికారం వాడికి ఎవరిచ్చారు..?వాడు మా జీవితాలకి చేసిన సాయం ఏమైనా ఉందా..? ఇట్లా ఆలోచనలు సాగుతున్నాయి.

తనకి తెలుసు Fanucci ప్రమాదకరమైన వ్యక్తి.అతనికి అనేక కనెక్షన్స్ ఉండవచ్చుగాక..!పోలీస్ లూ తన వెంటపడవచ్చు..చివరిగా ఎలక్ట్రిక్ చైర్ లో కూర్చొని మరణించే శిక్ష పడినా పడవచ్చు...!కాని ఇప్పటికే ఓసారి తన జీవితం లో చావు అంచుదాకా వెళ్ళి తిరిగివచ్చాడు.అదీ పన్నెండేళ్ళ వయసులో ..ఆ సిసిలి నుంచి మృత్యుదేవత ని తప్పించుకొని ..ఒక సముద్రం దాటి ..ఈ దేశం కాని దేశం కి రాగలిగాడు.హాయిగా జీవితాన్ని ఇలా  సాగిస్తున్నాడు.అయితే తనకొక్కటి రూఢిగా అర్ధమవుతున్నది.

తాను కూడా సామాన్యుడిని కాను అనే ఎరుక అతనికిప్పుడు బలంగా కలుగుతున్నది.తన చుట్టూ ఉన్న జనాలందరికన్నా తాను చాలా తెలివైనవాడినని...అంతే కాదు ధైర్యవంతుడినని కూడా అతనికి అర్ధమసాగింది.

(తర్వాతది మిగతాభాగం లో చూద్దాము) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ముప్ఫై అయిదవ భాగం)

Fanucci తాను చెప్పిన ప్రకారం కరెక్ట్ గా తొమ్మిది గంటలకల్లా వచ్చాడు Vito Corleone ఇంటికి..!అథితి మర్యాదలు చేశాడు.కొద్దిగా వైన్ పోసివ్వగా తీసుకున్నాడు.అవి..ఇవీ..మాట్లాడిన తర్వాత తన పేంట్ జేబులో ఉన్న ఏడువందల డాలర్లు తీసి Fanucci చేతిలో పెట్టాడు.

"ముగ్గురివీ కలిపి తొమ్మిది వందల డాలర్లు ఉండాలిగదా..ఇదేమిటి రెండు వందలు తేడా కనిపిస్తున్నాయి" ప్రశ్నించాడతను.

" కొద్దిగా అనుకోకుండా ఖర్చులు వచ్చి పడ్డాయ్.. ఒక్క రెండు వారాల్లో మీకు సర్దేస్తాను...పనులు కూడా ఏమీ దొరకడం లేదీమధ్య.."మర్యాదగా చెప్పాడు Vito.

" సరే..సరే..అలానే కానీ..మర్చిపోకు..ఏవైనా పనులుంటే కబురు చేస్తాలే.. ఈ రాత్రి మంచిగా మర్యాద చేశావ్..ఉంటామరి..." అంటూ Fanucci లేచి వెళ్ళిపోయాడు.అతను తన ఇంటిముందు నుంచి ..ఆ వీధిలో..అలా వెళుతుండగా అక్కడున్న వారందరూ చూశారు.ఆ పదవ అవెన్యూ లో ఆ చివరికంటూ వెళ్ళి ,11 వ అవెన్యూ లోకి వెళ్ళే కార్నర్ ని దాటాడు Fanucci.

వెంటనే Vito తన ఇంటిమీది పై భాగం నుంచి ..అలా వెళ్ళి ..ఆ రూఫ్ ల మీది నుంచే..పాకుకుంటూ ..దగ్గర గా ..మరుగ్గా ఉండే మార్గం ని ఎంచుకున్నాడు.11 వ అవెన్యూ కి అది షార్ట్ కట్ రూట్ కూడా..!జనాలెవరూ రోడ్డు మీద లేరు.ఈ 11 వ అవెన్యూ లో ఎక్కువగా రకరకాల గిడ్డంగులు ఉంటాయి.ఇంకా ఆ యార్డ్ లో పనిచేసే శ్రామికులు ,చీప్ ప్రాస్టిట్యూట్స్ యొక్క నివాసాలు కూడా ఉంటాయి. ఆ మనుషులు ఈ అమాయకపు ఇటాలియన్ మహిళల్లాగా ఏ కబుర్లు చెప్పుకుంటూనో ,వీధి గుమ్మాల్లో కనిపించరు.ఏ బీరు షాపుల్లోనో కూర్చొని రావాల్సిన డబ్బులు గురించి వివాదపడుతుంటారు.అదొక లోకం.

Fanucci తన అపార్ట్ మెంట్ కి దగ్గరగా వచ్చాడు.Vito ..నెమ్మెదిగా ..జాగ్రత్తగా నడుచుకుంటూ ..వచ్చి అప్పటికే ఓ క్రీనీడలో అనువైన జాగా చూసుకొని పొంచిఉన్నాడు.తను సిసిలో ఉన్నప్పుడు..చిన్నతనం లో తండ్రి తో పాటు అడవికి  వేట కి వెళ్ళేవాడు.కాబట్టి గన్ కాల్చడం లో అతనికి అనుభవం ఉన్నది.ప్రస్తుతం తన దగ్గర ఉన్న గన్ Clemenza ఇచ్చినది..!

Fanucci దగ్గరకి వస్తున్నాడు...తన రూం లోకి వెళ్ళడానికి దారి తీసే తలుపు వద్దకి చేరుకున్నాడు.Vito ఒక్క క్షణం కూడా ఆలశ్యం చేయకుండా ..గన్ పొజిషిన్ లో పట్టుకొని ..ఒక్క బుల్లెట్ ని కాల్చాడు.అది వెళ్ళి వాడి పక్కటెముకల్లో తగిలినట్లుంది..ధడ్ మని కింద పడిపోయాడు.తుపాకి శబ్దం కొంత కిటికీ లోనుంచి బయటికి వెళ్ళగా..మిగతాది ..బిల్డింగ్ కంపించినట్లయింది.కిందపడిన Fanucci పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు.కాని తనవల్ల కావడం లేదు.భారంగా మూడు సార్లు మూలిగాడు.చాలా గమ్మత్తుగా అనిపించింది ఆ మూలుగు.వెంటనే రెండవ బుల్లెట్ పొట్ట భాగం లో కాల్చాడు.గట్టిగా అరవడానికి కూడా శక్తి లేక అలాగే ఉండిపోయాడు.ఇక సమయం వృధా చేయడం వేస్ట్ అని  మూడవ బుల్లెట్ సరిగ్గ తల మీద పేల్చాడు.మాంసపు కుప్పలా అయి కిందవాలిపోయాడు Fanucci అయిదు క్షణాల్లో..!

Vito వెంటనే ..అదే వెనుక భాగం నుంచి..ఎవరి కంటపడకుండా ..తన అపార్ట్ మెంట్ కి చేరుకున్నాడు.గన్ ని ఏ పార్ట్ కి ఆ పార్ట్ ఊడబీకి కనబడకుండా నాశనం చేశాడు.తను వేసుకున్న డ్రెస్ కూడా విప్పేసి కొత్తవి వేసుకున్నాడు.కిందికి వెళ్ళి భార్యాపిల్లల్ని తీసుకు వచ్చాడు.

విచిత్రంగా Fanucci చావుని పోలీస్ లు కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలేదు.ఇంకో గ్యాంగ్ స్టర్ చచ్చినందుకు పీడపోయినట్లు భావించారు.ఒకవేళ ఎవరైనా అడిగినా దానికి తగిన ఎలిబీ ని తను సిద్ధం చేసుకొని ఉంచుకున్నాడు.

ఎందుకో గాని Clemenza,Tessio లు దాదాపుగా మొహం చాటేస్తూ తిరుగుతున్నారు.అంత ఎక్కువగా రావడం లేదు.ఓరోజు అనుకోకుండా  వచ్చారు..అయితే వారి ప్రవర్తనలో ..తనపట్ల ఎందుకనో ఒక గౌరవం కనబరచడం కనిపించింది.సరే..ఇద్దరికీ ఇంట్లో ఉన్నవి ఏవో పెట్టాడు తిండానికి..!

" గేంబ్లింగ్ వ్యాపారస్తులు,మిగతా షాపుల వాళ్ళు ..ఇప్పుడెవరికీ మామూళ్ళు ఇవ్వడం లేదు.మనం వసూలు చేసులుకుంటే పోలా.."  అడిగాడు Clemenza.

Vito Corleone ఇద్దరి వేపు ఓసారి అలాచూసి ..ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.

"ఇపుడెవరున్నారని...మనం ఆ పనిని తీసుకుంటే బాగుంటుందిగా " Tessio అన్నాడు.

" ఆ పని లో నాకు ఆసక్తి లేదు.." చెప్పాడు Vito.

" ట్రక్కులు హైజాక్  చేసేటపుడు నీకొక గన్ ఇచ్చానుగదా...అది నాకు అవసరం..ఇస్తావా అది.." అడిగాడు Clemenza

   Vito మెల్లిగా పైకి లేచి తన జేబులో ఉన్న కొంత కరెన్సీ ని తీసి Clemenza చేతిలో పెట్టాడు.దాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తూ వెనక్కి తగ్గాడతను.

" నీవిచ్చిన ఆ గన్ ఎక్కడో పోయింది.దానికి బదులు ఇందా ఈ డబ్బులు తీసుకో" అన్నాడు Vito

ససేమిరా తీసుకోవడానికి ఒప్పుకోలేదు Clemenza.

Tessio,Clemenza లు ఇద్దరకీ తెలుసు.Fanucci చచ్చింది అతని చేతిలోనే అని..!కాని అందరూ బయటకి చెప్పకుండా అలా ఉండిపోయారు.

Now Vito Corleone treated as a man of respect..!

అయితే Fanucci లా తాను వ్యాపారస్తుల దగ్గరకి వెళ్ళి మామూళ్ళు వసూలు చేయదలుచుకోలేదు. ఒక రోజు ఆసక్తిదాయకమైన ఓ సంఘటన జరిగింది.

తన భార్య పొరుగునే ఉన్న ఓ ఇటాలియన్ వితంతువుని వెంటబెట్టుకొచ్చింది.ఆమెకి ఏదో సహాయం చేయాలని..! తను కొంత డబ్బులివ్వబోయాడు.ఆమె నిరాకరించింది.ఏమి కావాలి నీకు మరి అని ప్రశ్నించాడు.

" నేను ఒక పేద మహిళని.నా భర్త చాన్నాళ్ళ కింద మరణించాడు, ఉన్న ఇద్దరు పిల్లలు ఏదో ఇప్పుడే చేతికొస్తున్నారు..గార్మెంట్ షాప్ లో దుస్తులకి ఖాజాలు కుడుతూ నా కూతురు,ఒక షాపులో శ్రామికుని గా నా కొడుకు నాకు సాయం చేస్తున్నారు.ఉన్నట్లుండి మా యింటి యజమాని మమ్మల్ని ఇంటిలోనుంచి వెళ్ళిపొమ్మంటున్నాడు.మేము అద్దె కూడా మంచిగానే ఇస్తున్నాం.అయితే మా కుక్క రాత్రుళ్ళు బాగా మొరుగుతూ డిస్టర్బ్ చేస్తున్నదని మిగతా అద్దెకుండే వాళ్ళు చెప్పారట.సరే..అంచెప్పి ఆ కుక్కని కూడా మాకు తెలిసినవాళ్ళకి ఇచ్చేశాం.అయినా మా యింటి యజమాని.శాంతించడం లేదు..ఖాళీ చేయాల్సిందే అంటున్నాడు..నేను ఎక్కడికి పోగలను చెప్పండి..నా చిన్నతనం నుంచి పెరిగింది ఇక్కడే..తెలిసినవాళ్ళంతా ఇక్కడే ఉన్నారు..మా యింటి యాజమానితో ఓసారి మీరు మాట్లాడతారేమోనని మీ దగ్గరకి వచ్చాను.." అందామె.

సరే..తప్పకుండా ..మాట్లాడతాను.." చెప్పాడు Vito Corleone.

" ఆ మనిషి వింటాడంటారా.." అడింగిందామె అమాయకంగా.

" హ్మ్...అతని పేరు Signor Roberto కదూ..!తప్పకుండా వింటాడు.మంచిమనిషే.నువ్వేమీ కుంగిపోకు..ఆరోగ్యాన్ని కాపాడుకో..నీ పిల్లలకోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి.." అనునయిస్తూ చెప్పాడు Vito.

(మిగతాది  వచ్చేభాగం లో చూద్దాము) --KVVS Murthy  

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ముప్ఫై ఆరవ భాగం)

ఆ ఇంటి యజమాని Signor Roberto...నిజానికి అతనూ ఒకప్పుడు ఇటలీ నుంచి ఇక్కడికి వచ్చినవాడే...బాగా ధనం గడించిన తర్వాత ఒక అయిదు ఇళ్ళు దాకా కట్టించాడు.అద్దెలకిచ్చే ఉద్దేశ్యం తో..!అయితే ఇంటి అద్దెలకిచ్చే ప్రాధాన్యతని ,వాటిని బాగు చేయించడానికి ఇవ్వడు.మళ్ళీ పైగా ప్రతిరోజు సాయంత్రం ఓ రౌండ్ వేసి వాటిని ఎలా ఉన్నాయా అని చూసుకుంటూ ఉంటాడు.

Vito Corleone వీధిలో నుంచి వస్తుండగా ఆ Roberto కంటబడ్డాడు.  ఆ వితంతువు కి మాటిచ్చాడు గదా మాట్లాడతానని..గుర్తొచ్చి వెంటనే ఆపాడు.

"హలో..Roberto గారూ..ఓ చిన్నమాట " అంటూ..!

" ఏమిటి" అన్నట్లు చూశాడతను.ఇటలీ లో దక్షిణ ప్రాంతమైన సిసిలీ,నేపుల్స్ లాంటి ప్రాంతాలనుంచి వచ్చినవాళ్ళంటే Roberto కి చిన్నచూపు.వాళ్ళు తామంత నాగరికత కలిగిన వాళ్ళు కాదని ,మొరటు మనుషులని ఇతని అభిప్రాయం.ఏమిటబ్బా ఆపాడు కొంపదీసి బెదిరించి డబ్బులు వసూలు చేసే బాపతు కాదు గదా..లేదులే..దృఢంగా రైతుబిడ్డ లా కనిపిస్తున్నాడు.బందిపోటు వ్యవహారమేమీ కాదు...అని కాసేపు ఆగాడు.

" నా భార్య కి మిత్రురాలు..Signora Colombo  అని...ఆమె మీ యింట్లోనే అద్దెకి ఉంటోందిట..కుక్క ఏదో అరిచి డిస్టర్బ్ చేస్తున్నదని ..ఆమె ని ఇల్లు ఖాళీ చేయమని చెప్పారట గదా..!  ఏదో వితంతువు..ఇద్దరు పిల్లలు..అలా జీవిస్తోంది.మళ్ళీ తెలియని కొత్త చోటుకి ఎలా పోవాలా అని బాధపడుతున్నది.కొద్దిగా దయ చూపించకూడదూ ఆమె పట్ల..ఎంతైనా మీరూ ఒక ఇటాలియన్ కుటుంబం నుంచి వచ్చినవారేగదా..ఈ ఒక్క సాయం చేయరూ.." ఎంతో మర్యాదగా విన్నవించాడు Vito.

" అయితే నన్నేం చేయమంటావు..ఇప్పటికే మరో కుటుంబానికి మాటిచ్చేశాను ఇంట్లోకి రావడానికి..రేపో మాపో వచ్చేస్తారు ..పైగా ఇంకో 5 డాలర్లు అద్దె కూడా ఎక్కువ రాబోతున్నది..." ఎగాదిగా చూసి చెప్పాడు Roberto.

" చూడండి..మీరు పెంచిన 5 డాలర్లు అద్దెని 6 నెలలకి సరిపోను మీ చేతిలో పెడుతున్నాను.ఆమె ని మళ్ళీ ఎక్స్ ట్రా అడక్కండి.ఆ ..కుక్కని కూడా మీరు అనుమతించాలి వాళ్ళతో ఉంటానికి.." Vito 30 డాలర్లు అతని చేతిలో పెడుతూ అన్నాడు.

" నాకు ఆర్డర్ వేయడానికి నువ్వెవరు..ప్రవర్తన నేర్చుకో..అసలు మీ సిసిలీ జనాలతో మాట్లాడడమే పెద్ద పొరబాటు.." ఈసడింపుగా అన్నాడు Roberto .

Vito చేతుల్ని ఆశ్చర్యచకితుడైనట్లు ఊపుతూ అన్నాడు..!

" హయ్యో..భలేవారే...ఎందుకలా భావిస్తున్నారు..?నేను కేవలం ఒక రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను.అంతే..ఎవరి అవసరం ఎవరికి పడుతుందో ఈ ప్రపంచం లో ..ఎవరం చెప్పగలం..!ఈ డబ్బుల్ని మీదగ్గరే ఉంచండి.నిర్ణయం ఎప్పుడూ మీదే.మనమధ్య గొడవలొద్దు.మీకు చుట్టుపక్కల ఉన్నవాళ్ళని ఎంక్వైరీ చేసి చూడండి నా గురించి...మీకే తెలుస్తుంది నేనెలాంటివాడినో..!కృతజ్ఞత చూపించే విషయం లో నేను వెనక్కి వెళ్ళే మనిషిని కాను.." వివరించాడు Vito.

 తెల్లరే దాకా ఎందుకు..ఆ సాయంత్రమే Roberto తన అంతిమ నిర్ణయం తీసుకున్నాడు.వెంటనే Vito Corleone ఇంటికి పరుగు పరుగున వచ్చాడు.

" Vito గారు..నేను కొద్దిగా అపార్ధం చేసుకున్నాను మిమ్మల్ని..అన్యధా భావించకూడదు.ఇదిగో మీరిచ్చిన డబ్బు వెనక్కి తీసుకోండి.నా పొరుగున ఉన్నవాళ్ళని అడిగాను మీ గురించి..చాలా గొప్పగా చెప్పారు. ఆ వితంతువు..ఆమె  ఆ పోర్షన్ లోనే ఉంటుంది.ఖాళీ చేయాల్సిన అవసరమేం లేదు.అంతే కాదు ..ఆ కుక్క సైతం వారితోనే ఉండవచ్చు.అయినా ఆ వెధవ జనాలు కుక్క మీద కంప్లైంట్ చేస్తారటండి....పాపం నోరు లేని జంతువు గదా...!
ఆ అమ్మాయిని నేను ఇకమీదట ఖాళీ చేయమని అసలు చెప్పను... ఆ చుట్టుపక్కలవాళ్ళకి వాళ్ళకేమిటి నేను భయపడేది.. ఒక క్రైస్తవునిగా ఆ వితంతువు పట్ల కరుణ చూపవలసిన బాధ్యత నాకు కూడా ఉన్నది గదా.." అంటూ Roberto ఎక్కడిలేని ప్రేమని కుమ్మరించాడు.

Vito నవ్వుతూ మరి కొన్ని కేకుల్ని తెప్పించి అతని ప్లేట్లో పెట్టాడు తినేందుకు.వైన్ ని కూడా స్వీకరించిన తర్వాత బతుకు జీవుడా అని పరుగు పరుగునా ఒక టాక్సీ లంకించుకొని Bronx లో ఉన్న తన ఇంట్లో గల బెడ్ మీద వాలిపోయాడు.మరి కొన్ని రోజులదాకా తన అద్దె ఇళ్ళవేపు తిరిగిచూడలేదు.

*   *  *  *
Vito Corleone అనే ఈ వ్యక్తికి సిసిలీ లో ఉన్న మాఫియా తో కూడా సంబంధాలు ఉన్నాయని జనాలు నమ్మసాగారు.

ఆ ఏరియాలో పేకాట నడిపే  ఓ వ్యాపారి ఓసారి Vito దగ్గరకి వచ్చి ఓ కోరిక కోరాడు.తన క్లబ్ లో కి వారానికి ఒకటి ,రెండు సార్లు వచ్చి అలా అయిదు నిమిషాలు కూర్చొని వెళ్ళమని ..! దానికి గాను అతను ఠంచన్ గా వారానికి 20 డాలర్లు చెల్లించేవాడు.ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇతర స్టోర్లు నడిపే వ్యాపారులు కూడా వారి షాపులకి రమ్మని పిలిచేవారు దానివల్ల అల్లరిమూకలు వారి దగ్గరకి రావడానికి వెనుకంజ వేస్తారని.ఆ వ్యాపారాలన్నిటికి తన ప్రొటెక్షన్ ఉన్నదని ఆ విధంగా అతను ప్రకటించేవాడు.ఇప్పుడు వారానికి వంద డాలర్లదాకా ప్రతి షాపు యజమాని Vito కి ముట్టజెపుతున్నారు.

వచ్చే డబ్బుల్లో కొంత భాగం Clemenza,Tessio లకి కూడా అడగకుండానే ఇచ్చేవాడు Vito Corleone.అలా కొంత కాలం గడిచిన తర్వాత ఆలివ్ ఆయిల్ ని దిగుమతి చేసుకొని అమెరికా లో అమ్మే వ్యాపారం లోకి ప్రవేశించాడు ..!Genco Abbandando యొక్క కిరాణా దుకాణం లోనే స్టాక్ మొత్తాన్ని ఉంచేవారు.దానికి పెట్టుబడి Vito పెట్టేవాడు.ఇప్పుడు Clemenza,Tessio లు ఇద్దరూ సేల్స్ మేనేజర్లు గా మారిపోయారు.Manhattan,Bronx,Brooklyn ఇట్లా ప్రతి ఏరియాకి వెళ్ళి అక్కడ దుకాణదారులు తమ బ్రాండ్ 'ఆలివ్ ఆయిల్ ' ని కొనేట్లు ఒప్పించేవారు.ఎవరైనా స్టాక్ పెట్టడానికి నిరాకరిస్తే Vito Corleone రంగం లోకి దిగి వారి మీద వత్తిడి పెంచేవాడు.కొన్ని ఏళ్ళ లోనే మంచి లాభాలు వచ్చాయి.కుటుంబానికి సమయం ఎక్కువ కేటాయించలేకపోతున్నాడిపుడు.మరో ఇద్దరు పిల్లలు Connie,Michael జన్మించారు.Vito Corleone యొక్క ఆయిల్ ప్రోడక్ట్ పేరు Genco pura oil. తన పేరు మీద ప్రోడక్ట్ ఉండటం కూడా అతనికి నచ్చదు.అమెరికా లో నెంబర్ వన్ ఆయిల్ గా ప్రసిద్ది చెందింది.తన పేరు ప్రచారం కావడం కంటే తమ ఉత్పత్తి యొక్క క్వాలిటీ బాగుండటమే అతను కోరుకునేది.అప్పుడు మౌత్ పబ్లిసిటి దానంతట అదే జరుగుతుంది.ఎవరూ ఆపలేరు దాన్ని.

కొన్నాళ్ళు గడిచిన తర్వాత Vito Corleone కి అర్ధమయింది.ఎవరకివాళ్ళు ఇష్టం వచ్చినట్లు బిజినెస్ చేయడం వల్ల అనవసరమైన పోటీ పెరగడం తప్ప పెద్ద లాభాలు ఉండవని.కాబట్టి మోనోపలీ ని సాధించాలి.అమెరికా వాణిజ్య చరిత్ర లో Vito Corleone యొక్క విజన్ కొత్త శకానికి నాంది పలికింది.మిగతా వ్యాపారులని అంతా పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు..ప్రతి ఒక్కరకి నష్టాలు రాని పద్ధతుల గురించి వివరించి..దానికి గాను తనకి సహకరించవలసిందిగా కోరాడు.అయితే Brooklyn లో  ఉన్న ఒక తలపొగరు హోల్ సేలర్ మాత్రం సర్వవిధాలా చెప్పినా వినలేదు.గత్యంతరం లేని పరిస్థితి లో అతని పై వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు.ఆ హోల్ సేలర్ కి సంబందించిన గిడ్డంగుల్ని తగలబెట్టించాడు.ట్రక్కుల కొద్దీ అతని ఆయిల్ ని రోడ్ల మీద మడుగుల్లా ఒంపివేశారు.ఇది మిగతావారిలో భయోత్పాతం కలిగించింది.ఇతనికి సహకరించి పోలిస్ కంప్లైంట్ ఇచ్చిన ఇంకో వ్యాపారిని మాయం చేశాడు ..శాశ్వతంగా..!ఆ ఘట్టం విజయవంతంగా అలా పూర్తయింది.

అమెరికా లో మద్యపాన నిషేధం వచ్చినపుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు Vito.ఇంకా ప్రమాదభరితమైన రంగం లో కి..నేర సామ్రాజ్య ప్రపంచం లోకి ప్రవేశించాడు.ఒక వ్యాపారుస్తుని స్థాయి నుంచి డాన్ గా పరిణామం చెందాడు.ఇది ఒక రోజులోనో..ఒక సంవత్సరం లోనో ..జరిగింది కాదు.కొన్ని సంవత్సరాల క్రమం లో సంభవించిన మార్పు ఇది.

గ్రేట్ డిప్రెషన్ కాలం లోనే అతను డాన్ గా ,గాడ్ ఫాదర్ గా పరిణామం చెందాడు.కొంతమంది Bootleggers సంప్రదించారు.. కెనడా నుంచి అమెరికా కి ఆల్కహాల్ స్మగ్లింగ్ చేయడానికి తమకు  సహకరించమని..!వారికి తన ప్రొటెక్షన్ కల్పించి తన ట్రక్కుల్ని వాడుకునే వీలుకల్పించాడు.

ఈ పనులు చేయడం లో అతనికి కేవలం ధనం మాత్రమే రాలేదు.అంతకు మించిన వ్యవహార జ్ఞానం,పరిచయాలు,అనుభవం ఇవన్నీ సమకూరాయి.

పోలిస్ శాఖ లోను,జ్యుడీషియరీ లోను మంచి కాంటాక్ట్స్ కలిగిన లాయర్ల ని తన వద్ద సలహాదారులు గా నియమించుకున్నాడు.ప్రతి కీలకమైన ఉద్యోగి కి ప్రతి నెలా క్రమం తప్పకుండా మామూలు ముట్టజెప్పే ఒక లిస్ట్ ని తయారు జేశాడు.' ఇంతమందికి ఎందుకు అనవసరంగా ఇవ్వడం అనేవారూ అతని సలహాదారులు. వెంటనే వాళ్ళు మనకి ఏ సహాయం చేయకపోవచ్చు..కాని అవసరం పడినపుడు వాళ్ళే చేస్తారు.నా మిత్రత్వాన్ని వాళ్ళకి తెలపడం కోసమైనా..వాళ్ళు పొందేది పొందనిద్దాం ..ఆ కృతజ్ఞత ఎటూపోదు అనేవాడు Don Vito Corleone..!

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాం) --KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ముప్ఫై ఏడవ భాగం)

కాలం గడుస్తున్నకొద్దీ Vito Corleone యొక్క సామ్రాజ్యం విస్తరించింది.ఇప్పుడు అనేక ట్రక్కులు ..ఇంకా ' Sheet' లో ఉండే మనుషులు కూడా పెరిగారు.ప్రతి పనిని సాధ్యమైనంత నిర్మాణాత్మక దృష్టితో చేయాలనేది Vito Corleone యొక్క కాంక్ష.ఒక ఆర్గనైజేషన్ మాదిరిగా తన సామ్రాజ్యాన్ని పద్ధతి ప్రకారం విభజించాడు.మళ్ళీ వాటి పగ్గాలు తన చేతిలో ఉండే విధంగా రూపుదిద్దాడు.

Clemenza కి Bronx ప్రాంతాన్ని,Tessio కి Brooklyn ప్రాంతాన్ని ఒప్పజెప్పాడు.వాళ్ళకి Caporegime (Captain) అనే టైటిల్ ని ఇచ్చాడు.ఆ ప్రాంతం లో జరిగే కార్యకలాపాల్ని వీరి ఆధీనం లో ఉంచుకుంటారు.అంటే బాధ్యత వహిస్తారు. మళ్ళీ వీరి ఇరువురి కింద చాలామంది మనుషులు పని చేస్తుంటారు.వారినే Soldiers అంటారు.ఇకపోతే Genco Abbandando ని తన వద్ద Consigliere గా నియమించుకున్నాడు.అంటే వ్యక్తిగత సహాయకుడు లేదా సలహాదారుడు లాగ నన్నమాట.చాలా నమ్మకస్తులైన వారినే సిసిలీ సంప్రదాయ మాఫియా లో కూడా ఆ పోష్ట్ లో నియమించుకుంటారు.ఎందుకంటే డాన్ మీద కుట్ర అంటూ జరిగితే వీరి ప్రమేయం లేకుండా జరగదు. ( ఇంచుమించు వెయ్యేళ్ళ సిసిలీ మాఫియా చరిత్ర లో ఒక్క Consigliere కూడా ఆ విధమైన నమ్మక ద్రోహిగా మారలేదని Mario Puzo చెబుతాడు.అంటే ప్రతి జాతి కి తమదైన ఒక ఆత్మ ఉన్నది.అది అర్ధం చేసుకోలేకనే ఒకరి గుణగణాల్ని ఒకరం ఎంచుకుంటూ ఉంటాం అనిపిస్తుంది.వివేకానందస్వామి The East and West  లో అన్న ఓ మాట కూడా ఈ గాడ్ ఫాదర్ చదివినపుడు గుర్తుకొచ్చేది."The ideal of the west is kshtriya,the sword...but the ideal of India is Brahmana,the meek and sacrificing" అనేది.)

సరే...Tessio కి ఇచ్చినంత వ్యవహార స్వేచ్చ..డాన్ ఈ Clemenza కి ఇవ్వలేదు.ఎందుకంటే ఇతను బయటకి నవ్వుతాలు మనిషిగా కనబడతాడు గాని చాలా క్రూరమైన,ధైర్యస్తుడైన మనిషి.ఎవరిని లెక్కచేయనితనం కూడా ఎక్కువ.అందు చేత అతని వ్యవహారాలు పూర్తి గా తన కనుసన్నల్లో పెట్టుకున్నాడు.తనకి తెలియకుండా వీళ్ళు ఇద్దరు కలుసుకోకూడదనే మెసేజ్ ని కూడా పరోక్షంగా ఇస్తాడు.ఎందుకంటే ఎలాంటి కుట్ర భవిష్యత్ లో జరగకుండా ఇదో ఏర్పాటు.

గ్రేట్ డిప్రెషన్ నాటి పరిస్థితులు  Corleone ప్రపంచానికి వరం లా మారి మరింత శక్తిమంతం అయ్యేలా చేశాయి.Don Corleone గా తను పిలబడింది కూడా ఆ కాలం నుంచే.ఆ సమయం లో నిజాయితీ పరులకి పని ఇచ్చే నాధుడు లేడు.గర్వంగా తల యెత్తుకు తిరిగిన వాళ్ళంతా ప్రభుత్వ సాయం కోసం అంగలార్చారు.కాని Don Corleone దగ్గర పని చేసే వాళ్ళంతా హాయిగా ఉన్నారు.అన్ని రకాలుగా వారి కుటుంబాలు సుఖంగా ఉన్నాయి.డబ్బులు కోసం వాళ్ళు ఎవరిని బిచ్చమెత్తలేదు.Don Corleone తన కోసం ఎవరైనా జైలు కి వెళితే వారి కుటుంబాన్ని పూర్తి గా ఆదుకునేవాడు. చాలామంది తన పోటీదారులతో పోలిస్తే తాను చక్కగా తన ప్రపంచాన్ని చూసుకుంటున్నాని అర్ధం అయింది.

ఆ విధంగా అతను చేసే దాతృత్వం ..ఆ నోటా ఈ నోటా పాకి చాలామంది నిస్సహాయ ఇటాలియన్ లు డాన్ దగ్గరకి వచ్చేవారు..ఏదో సాయం పొందుదామని.కొంత మంది ఉద్యోగం ఇప్పించమని,మరికొంతమంది ధన సాయం చేయమని,ఇంకొంతమంది జైలుకెళ్ళిన తమవారికి సాయం చేయమని..ఇట్లా..!వాళ్ళకి కొన్ని మంచి మాటలు చెప్పి..చేతనైన సాయం చేసేవాడు.అట్లానే పోను..పోను..చాలామంది ..స్టేట్ లెజిస్లేచర్ ఎన్నికల్లో,స్థానిక ఎన్నికల్లో..ఇంక ఇతరత్రా ఎవరకి ఓటు చేయాలో అడిగేవారు.ఆ విధంగా క్రమంగా డాన్ రాజకీయశక్తి గా సైతం పరిణామం చెందాడు.అయితే దాన్ని చాలా దూరదృష్టి గల రాజనీతిజ్ఞునిలా వాడుకున్నాడు తప్ప చిన్న విషయాలకి పరిమితం చేయలేదు.ప్రతి పార్టి యొక్క ప్రధాన నేతలు Don Corleone యొక్క గృహాన్ని సందర్శించడం ఒక రివాజుగా మారింది..ముఖ్యంగా ఎన్నికలప్పుడు మరీనూ..!

చదువుకోవడానికి ఇబ్బంది పడే పేద విధ్యార్థులను కాలేజ్ లో చేర్పించి ధనసాయం చేసేవాడు.ఇలాంటి వాటి వెనుక కూడా డాన్ కి ముందు చూపు ఉన్నది.భవిష్యత్ లో వీరే పోలీస్ అధికారులు,జడ్జ్ లు,ఇతర ప్రముఖులు అవుతారు.అప్పుడు తన సామ్రాజ్యం లో వీరూ ఓ భాగం అవుతారు. ఆ విధంగా ఒక జాతీయ నాయకుని లా డాన్ ఆలోచించాడు.

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాం)  --KVVS Murthy  

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (ముప్ఫై ఎనిమిదవ భాగం)

లిక్కర్ ప్రొహిబిషన్ ప్రభుత్వం ఎత్తి వేయడం తో Don Corleone కొత్త రంగాల వైపు తన దృష్టిని సారించాడు.అది 1933.రెండవ ప్రపంచ యుద్ధానికి భూమిక మెల్లిగా తయారవుతున్న కాలం.

తన దూతల్ని Maranzano దగ్గరకి పంపాడు.గేంబ్లింగ్,క్రేప్ గేంస్,బుక్ మేకింగ్,పోకర్ గేంస్, ఇట్లాంటి సమస్త ఇల్లిసిట్ బిజినెస్ లు ఈ వ్యక్తి ఆధ్వర్యం లో నడుస్తుంటాయి. ఇతని పూర్తి పేరు Salvatore Maranzano. న్యూయార్క్ లో ఆనాటికున్న పెద్ద అండర్ వరల్డ్ బాస్ ఇతగాడేనని చెప్పాలి.అయితే Don Corleone ఇతని దగ్గరకి కొన్ని ప్రపోజల్స్ పంపుతాడు.తనకి గల శక్తి  సామర్ద్యాలతో Bronx లోనూ,Brooklyn లోనూ బిజినెస్ ని విస్తరించుతానని ,తనకి స్నేహ హస్తం అందిస్తే అందరం కలసి మంచి లాభాలు పొందవచ్చునని చెప్పిపంపుతాడు.

Maranzano ససేమిరా అంగీకరించకపోగా కయ్యానికి కాలుదువ్వుతాడు.ఈ Maranzano కి చికాగో లోని Al Capone అనే ఇంకో పెద్ద డాన్ అండ ఉంటుంది.దాన్ని చూసుకొని Corleone ని తృణీకరిస్తాడు.చివరకి చిలికి చిలికి పెద్దదై 1933 మాఫియా వార్ కి దారి తీస్తుంది.అది న్యూయార్క్ మహా నగరం లోని అండర్ వరల్డ్ కార్యకలాపాల యొక్క రూపాన్ని సమూలంగా మార్చివేసింది.

ప్రారంభ స్థితి లో Don Corleone యొక్క బలం Maranzano శక్తి తో పోలిస్తే ఏ పరంగానైనా కొంత తక్కువ అనే చెప్పాలి.సరైన సమయం లో వేగంగా రియాక్ట్ కావడం,శత్రువు యొక్క బలహీనత ని సరిగ్గా అంచనా వేసి దెబ్బతీయడం అనేవి  Don Corleone విజేత గా నిలబడటానికి తోడ్పడ్డాయి.Maranzano కి Al Capone తోనే కాకుండా..న్యూయార్క్ లో ప్రాస్టిట్యూషన్ బిజినెస్ లో ముఖ్య పాత్ర వహించే Tattagliya Family తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి.జ్యూయిష్ యూనియన్ లు,గార్మెంట్ ఇండస్ట్రీ ని,ఇటాలియన్ రియల్టర్స్ ని కూడా ఈ Maranzano తన కంట్రోల్ లో ఉంచుకున్నాడు.

అయితే అతనికున్న  లోపం ఏమిటంటే వివిధ శక్తుల్ని ఆర్గనైజ్ చేయడం లో గొప్ప తెలివితేటలేమీ లేవు.నిజం చెప్పాలంటే అతని శక్తి సామర్ధ్యాలు ఏమిటో అతనికే సరిగా తెలియవు.ఒకే ఒక్క Master stroke తో అతని భావ,భౌతిక ప్రపంచాల్ని నిర్వీర్యపరిచాడు Don Corleone.

Maranzano ఎలాగైనాసరే..Don Corleone ని అంతమొందించాలని ప్రణాళిక వేయసాగాడు.ఎప్పుడూ తగినంత మంది బాడీ గార్డ్స్ Corleone చుట్టూతా ఉంటారు.కాబట్టి మంచి షార్ప్ షూటర్స్ ని రప్పించి వారి ద్వారా పని పూర్తిచేయాలని తలచి చికాగో లోని Al Capone కి కబురు పెడతాడు.అతను ఇద్దరు షూటర్లని పంపిస్తాడు.అయితే చికాగో లోని వేగులు Don Corleone కి ఫోన్ చేస్తారు ఈ విషయాన్ని..!

వీరిద్దరి సంగతి చూడవలసిందిగా Luca Brasi కి పురమాయిస్తాడు Don Corleone..!ఈ షార్ప్ షూటర్లు ఏ రైలు లో వస్తున్నారు అనేది ఆరా తీసి ..తన మనుషుల్ని స్టేషన్ దగ్గర పోర్టర్లుగా ,టాక్సీ డ్రైవర్లు గా ఉంచుతాడు.వాళ్ళు షార్ప్ షూటర్లని ఏమార్చి ఒక పాడుబడిన గిడ్డంగి దగ్గరకి తీసుకొస్తారు.ఇద్దరు షూటర్ల యొక్క కాళ్ళు చేతులు తాళ్ళతో కట్టివేస్తాడు Luca Brasi.ఆ తరువాత తాపీ గా ఒక గొడ్డలి తీసుకుని ఒకడిని పాదాలు దాకా నరుకుతాడు.గిల గిల లాడుతుండగా ఆ పిమ్మట మోకాళ్ళ దాకా నరుకుతాడు.ఆ తరవాత తొడల దాకా నరుకుతాడు.అప్పటికే కింద పైనుంచి పడవలసిన సరంజామా అంతా పడిపోయింది.అప్పటికే రక్తం కూడా బాగా పోయి చచ్చి ఊరుకున్నాడు.అరవకుండా ఇద్దరి నోళ్ళ లో టవల్స్ కుక్కారు కదా ..మొదటి వాడి భీకర స్థితి చూసి ఈ రెండో షార్ప్ షూటర్ భయం తో నోట్లో ఉన్న టవల్ ని మింగివేశాడు.సరే..ఆతర్వాత వాడికీ అదే గతి..పట్టింది!

కొన్ని రోజులతర్వాత Al Capone కి ఓ ఉత్తరం అందింది.అది Don Corleone రాసినటువంటిది.దాని సారాంశమిది..! " నీకు అర్ధమయింది కదా..నా శత్రువు పట్ల నేను ఎలా వ్యవహరిస్తానో..నీవు ఒక సిసిలీ బిడ్డవి..నేనొక సిసిలీ బిడ్డని..అది ఆలోచించడం మానేసి మధ్యలో ఈ కొత్త బిచ్చగాళ్ళను నా మీదకి ఎందుకు పంపావు..?నీవు నా స్నేహాన్ని అంగీకరించినట్లయితే ,నన్ను డిమాండ్ చేసి నువ్వు పని చేయించుకోవచ్చు..నీ కింద పనిచేసే Maranzano..నీ అవసరం లేకపోయినా ఈ న్యూయార్క్ లో పనిచేయగల నేను..ఎవరితో ఉంటే నీకు మంచిదో నువ్వే ఆలోచించుకో...నువ్వు నా కోరిక మన్నించకపోతే కూడా ఏమీ ఫర్వాలేదు..ఆ చికాగో నుంచి మాత్రం ఇక్కడకి రాకు..ఎందుకంటే ఇక్కడ  వాతావరణం నీకు సరిపడకపోవచ్చు...నేలంతా చిత్తడి చిత్తడి గా ఉంది...వాన వచ్చి..!"

Don Corleone కి తెలుసు ..Al Capone యొక్క పవర్ చికాగో సరిహద్దులవరకే పనిచేస్తుందని..!అలాగని ఇంకా ఎక్కువ దూరం తాను పోదల్చుకోలేదు.కొన్ని రోజులతర్వాత Al Capone మెసెజ్ పంపాడు...తాను ఇక మీదట నీ వ్యవహారాల్లో కలగజేసుకోనని..!

Al Capone యొక్క రక్షణ Maranzano కి ఇపుడు లేదుకదా..!ఇక ఇతనికి సంబందించిన అన్ని చీకటి వ్యాపారాల్ని Don Corleone ఆక్రమించడం మొదలుపెట్టాడు.గార్మెంట్ బిజినెస్ కి సంబందించిన ఇండస్ట్రీలు..మిగతా యునియన్ లు అన్నిటిని చూసుకునే బాధ్యత Clemenza కి అప్పగించాడు.రమారమి ఆరు నెలల కాలం లో Maranzano కి సంబందించిన అన్ని దందాల్ని వశపరుచుకున్నాడు.Tessio కి Maranzano ని చంపే పనిని అప్పగించాడు.అతను ఒక పద్దతి ప్రకారం Maranzano మనుషుల్ని తమ వైపు తిప్పుకుని ఒక రెస్టారెంట్ లో ఉండగా అతన్ని మట్టుబెడతారు. అలా ఈ జైత్ర యాత్ర ముగిసింది.అయితే డాన్ ఇంట్లో ఇప్పుడు ఓ చిన్న సమస్య వచ్చి పడింది..అది ఏమిటంటే...?

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాం)--KVVS Murthy  


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా ( ముప్ఫై తొమ్మిదవ భాగం)

Santino Corleone అదే Sonny ...ఇప్పుడతనికి పదహారేళ్ళ ప్రాయం.వెడల్పయిన భుజాలతో ఆరడుగుల మనిషిగా అయినాడు.మొహం గుండ్రంగా ఉంటుంది.రెండవ వాడు Fredo...కొద్దిగా నెమ్మది.Michael  ది ఇంకా ప్రాయం.Sonny స్కూల్ లో కూడా దుందుడుకుగా వ్యవహరించడం డాన్ కి సూచాయగా తెలుసు.Clemenza ఒకరోజు Don Corleone కి చెప్పిన వషయాలు..ఆయనలో మునుపెన్నడూ లేని ఉద్రేకాన్ని కలిగించాయి.Sonny  కొంతమంది కుర్రాళ్ళతో కలసి ఒక దోపిడి కి పాల్పడ్డాడు.డాన్ కోపంగా పెద్ద కొడుకు ని పిలిచాడు.చెడా మడా తిట్టాడు.అదీ సిసిలియన్ డయలెక్ట్ లో.. ఎందుకంటే అతి సహజంగా..తన ఆవేశం చల్లారేలా తిట్టగలిగేది తాను ఆ భాషలోనే..!

" అలాంటి దోపిడికి పాల్పడడానికి ..సిగ్గుగా లేదూ..!ఎవరిచ్చారు నీకా హక్కు..?అట్లా చేసి ఎంత ధనం సంపాదించావేం..?" మండిపోతూ అడిగాడు Don Corleone.

Sonny ఏం మాట్లాడకుండా నిలబడ్డాడు..!

" యూ స్టుపిడ్ ..ఒక రాత్రి ఖర్చుకా ..నువ్వు అంత తెగించింది..ఎంత సంపాదించావ్..నలభై డాలర్లా..ఇరవై డాలర్లా.."  మళ్ళీ డాన్ ప్రశ్నించాడు.

" ఆ రాత్రి ..అదే నువ్వు Fanucci ని చంపడం నాకు తెలుసు.అప్పుడు నువ్వు తుపాకి ధ్వంసం చేయడం..వాలెట్ ని తెరవడం ..డ్రెస్ మార్చుకోవడం నేను చూశాను.లోపల జరిగేదాన్ని చూసిరమ్మని అమ్మ చెప్పగా ఆ దృశ్యాన్ని చూశాను." చెప్పాడు Sonny.

" అంటే నీ ఉద్దేశ్యం ఏమిటి..స్కూల్ చదువు కూడా పూర్తి చేయవా..?నీకు ఒక లాయర్ కావాలని లేదా...Lawyers can steal money with a brief case than a thousand men with guns and masks" చెప్పాడు డాన్.

Sonny కిసుక్కున నవ్వి తమాయించుకున్నాడు." ఫేమిలీ బిజినెస్ లోకి రావాలని నా కోరిక" చెప్పాడు Sonny.

"Every man has one destiny  రేపు ఉదయం తొమ్మిది గంటలకి Genco  ని కలువు.ఏమి చెయ్యాలో అతను నీకు చెపుతాడు." అని చెప్పి Sonny ని పంపించివేశాడు.Fanucci గురించి ఒక్కమాట కూడా ప్రస్తావించలేదు Don.

Genco Abbandando నిజమైన Consigliere కి ఉండవలసిన అన్ని లక్షణాలూ ఉన్న వ్యక్తి.వెంటనే Don Corleone మనసు లోని భావాన్ని ఇట్టే గ్రహించాడు.Sonny ని Don Corleone కి బాడీగార్డ్ గా నియమించాడు. దానివల్ల అంటిపెట్టుకొని ఉంటూ తన తండ్రి యొక్క సూక్ష్మ వ్యవహార శైలి ని గమనించే వీలు కలుగుతుంది.ఒక డాన్ గా ఉండటానికి కావలసిన లక్షణాలు కాలక్రమేణా అతను నేర్చుకుంటాడు.అందరికీ తెలిసేలా బెదిరింపులు ఇవ్వడం,కానిది..అయినది ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఇల్లాంటివి డాన్ చేయకూడని పనులు. తన క్రమశిక్షణ లోని లోతుపాతులు కూడా డాన్ తన ప్రవర్తన ద్వారా వెల్లడించేవాడు.నీ శత్రువు ఎప్పుడూ నిన్ను తక్కువ అంచనా వేస్తేనే నీకు మంచిది.ఎంత శక్తి కలిగివున్నవనేది ఎదుటి వారికి ఎప్పుడూ తెలియనివ్వరాదు ..అది Don Corleone  నుంచి ప్రధానంగా తెలుసుకున్నది.

అంతేకాక Sonny గన్ పేల్చే విధానాల్ని Clemenza నుంచి నేర్చుకున్నాడు.తండ్రి ఎక్కడికి వెళ్ళినా కారు డ్రైవర్ గా Sonny నే ఉండేవాడు.అలా రెండు ఏళ్ళు గడిచాయి.Tom Hagen ..అదే Corleone కుటుంబం లోకి దత్తపుత్రుని గా వచ్చిన అనాధ యువకుడు..అతనిప్పుడు కాలేజ్ లో ఉన్నాడు.Michael ఏమో స్కూల్ లో ఉన్నాడు.Connie ఇంకా చిన్నపిల్ల.

సరే..ఇప్పటిదాకా Bronx లోని ఓ అపార్ట్మెంట్  లో ఉన్న Don Corleone ముందు చూపు తో తనకంటూ ఓ రక్షిత ప్రదేశం ఉండాలని Long Island లో ఓ ఇంటిని కొన్నాడు.అది ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉంది.తమ వ్యాపార స్వభావాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని డాన్ గుర్తించాడు.న్యూయార్క్ లోని మిగతా బలమైన మాఫియా ఫేమిలీ లతో శాంతికరమైన వాతావరణం సృషించాలని సంప్రదింపులు మొదలెట్టాడు.

(మిగతాది తర్వాత భాగం లో చూద్దాం) __ KVVS Murthy  

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (నలభైయవ భాగం)

చిన్నా చితకా వాళ్ళు పోగా..అయిదు నుంచి ఆరు మాఫియా ఫేమిలీ లు బలంగా ఉన్నాయి న్యూయార్క్ లో.మూడేళ్ళలో ..వారిలో చాలామంది తో చర్చలు జరిపి ఓ ఆర్గనైజేషన్ లా చేశాడు డాన్..!అయితే ఒక Irish గ్యాంగ్ కి చెందినవాడు మాత్రం డాన్ మీద వ్యతిరేకిస్తూ కాల్పులు జరిపాడు.బుల్లెట్ వెళ్ళి ఓ బాడీ గార్డ్ కి తగిలి నేలకొరిగాడు. ఆ గ్యాంగ్ ని సమూలంగా Sonny ఆధ్వర్యం లోని సైనికులు మట్టుబెట్టారు.Sonny కూడా సొంతగా ఒక ట్రూప్ తయారుచేసుకొని మరో Caporegime ని ఏర్పాటుచేసుకున్నాడు. చాలా పరీక్షా సమయాల్లో వైరి పక్షాల్లో గుబులు పుట్టించి Corleone సామ్రాజ్యాన్ని బలపరచడంలో సాయపడ్డాడు.అయితే Luca brasi ప్రతిష్ట ముందు అతని వెలుగు సన్నగా కనిపించేది.

1937 ప్రాంతం లో న్యూయార్క్ లో మాఫియా గ్యాంగ్ ల మధ్య వీధి పోరాటాలు.. కాల్పులు వంటివి చాలాదాకా తగ్గాయి.

ప్రపంచం లోని అన్ని ముఖ్య పరిణామాల్ని డాన్ గమనిస్తున్నాడు.హిట్లర్ పైకి లేచాడు.స్పెయిన్ ప్రతిష్ట మసకబారింది.జర్మన్ లు మ్యూనిచ్ లో బ్రిటన్ సైన్యాల పై దెబ్బ తీశారు.ఇట్లా ప్రపంచం మారుతున్నది.ఈ సంఘటనల్ని ఎలా తమకి అనుకూలంగా మార్చుకోవాలి అని Don Corleone వేచి చూస్తున్నాడు.ఇలాంటి స్థితి లో కలసికట్టు గా సొమ్ముచేసుకోవాలంటే ముందు వివిధ మాఫియా పెద్దల మద్య శాంతి నెలకొనాలి.

లాస్ ఏంజిల్స్,శాన్ ఫ్రాన్సిస్కో,క్లీవ్ లాండ్,చికాగో,ఫిలడెల్ఫియా,మియామి,బోష్టన్ ఇట్లా ప్రతి చోటనున్న ముఖ్య మాఫియా నేతల్ని అందర్నీ పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు.అందరి మధ్య అగ్రిమెంట్లు కుదిరాయి.కలసికట్టుగా వ్యవహరిస్తూ యుద్ధ పరిస్థితుల్ని తమకి అనుకూలంగా మార్చుకోవడానికి..!

రెండవ ప్రపంచ యుద్ధం 1939 లో మొదలయింది.1941 లో అమెరికా యుద్ధం లో దిగింది.Don ఇంకా మిగతా వాళ్ళు రంగం లోకి దిగారు.బ్లాక్ మార్కెట్ OPA Food stamps ,gasoline stamps,ఇతర బ్లాక్ మార్కెట్ మెటీరియల్స్ అన్నీ సప్లయ్ చేశారు.వార్ కాంట్రాక్ట్ లు దక్కించుకున్నారు.యుద్ధరంగానికి వెళ్ళబోయే యువకుల్ని ఆకట్టుకొని తమ కార్యకలాపాలకి వాడుకున్నారు.అయితే Michael అమెరికా కోసం సైన్యం లో పనిచేస్తానని చేరాడు.కొన్ని రోజులతర్వాత డాక్టర్ల సిఫారసు మేరకు అతడిని ఆర్మీ నుంచి రిలీవ్ చేశారు.అయితే అది తన తండ్రి చేయించిన పని అని Michael కి చివరదాకా తెలియదు.

రెండవ ప్రపంచయుద్ధం అయిపోయింది.ప్రపంచం లోని దేశాలు తమ విధానాలు మార్చుకొంటున్నాయి.లీగల్ గా వ్యాపారం చేస్తూనే వ్యాపారవేత్తలు ఎలా రాజ్యానికి దొరక్కుండా,చట్టపరిధి లోనే దోచుకోవచ్చునో దానికి ప్రభుత్వాల్ని సైతం ఎలా వాడుకోవచ్చునో Don Corleone గ్రహిస్తాడు.Nazaraine కి జరిగిన ఓ సంఘటన ద్వారా..!

సరే..Sonny కి Sandra అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అవుతుంది.త్వరలో పెళ్ళి.ఎందుకనో సబర్బన్ జీవితం మీద గాలి మళ్ళి Long Beach ఏరియా లో Mall property కొన్నాడు డాన్.ఆ ప్రాంగణం లో అందరికీ ఇళ్ళు నిర్మించాడు.Genco కి,Sonny కి తనకీ ఇంకా ఇతర భవిష్యత్ అవసరాలకి సరిపోయేట్లు భవన నిర్మాణాలు చేశాడు.ఒక రక్షిత ప్రదేశం లా తయారైందది.

ఓ రోజు సాయంత్రం Don ,అతని భార్య,Sonny అంతా గార్డెన్ లో కూర్చుని సముద్రాన్ని చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు.ఇంతలో బాడీ గార్డ్స్ వచ్చి ముగ్గురు కొత్త వ్యక్తులు ఎవరో కలవడానికి వచ్చారని చెప్పగా డాన్ వెళతాడు.ఆ అపరిచితులు తాము ఇళ్ళకున్న ఫర్నెస్ లు పరిశీలించే అధికారులమని తెలిపారు.


" మీ కేమి కావాలిక్కడ" అడిగాడు డాన్.

" మీ యింటిలో నిర్మించిన ఫర్నెస్ నిభందనలకి విరుద్ధంగా ఉంది.ఇది మార్చాలి.మార్చినందుకు మాకు వంద డాలర్లు ఇవ్వాలి.లేకపోతే పైకి కంప్లైంట్ చేయవలసి ఉంటుంది" బెదిరించినట్లుగా చెప్పారు వాళ్ళు.అప్పటికే ఆ ఫర్నెస్ మెటల్ భాగాల్ని ఎక్కడికక్కడ పీకి పెట్టారు వాళ్ళు.

"సరే..ఇక్కడనే ఉండండి.. డబ్బులు తెస్తా" అని చెప్పి వెళ్ళిపోయాడు. Sonny కి పురమాయించాడు వాళ్ళని చూడమని..!అతను ఫర్నెస్ లకి సంబందించిన ఆఫీస్ కి ఫోన్ చేస్తే వీళ్ళు ఫేక్ అని తేలింది.వెంటనే వాళ్ళ ముగ్గుర్ని పిచ్చి కొట్టుడు కొట్టి ఒక ట్రక్ ఎక్కించాడు."ఇక మీదట ఎప్పుడైనా ఈ పరిసరాల్లో కనిపిస్తే మీ పిచ్చలు తీసి చెవులకి వేలాడదీస్తాను..అర్ధమైందా" అని వార్నింగ్ ఇచ్చి పంపి వేశాడు.

ఆ ఏరియాలోకి పోకిరిగాళ్ళు గాని,పనీ పాట లేకుండా రోడ్లమీద ఉంటూ జనాన్ని చికాకు చేసే వాళ్ళు గాని,చిన్న మోసాలు,దొంగతనాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు గాని రావడానికి వీల్లేదని శాసనం చేశారు Corleone లు ..!

ఆ విధంగా ఆ Long Beach ప్రాంతం గొప్ప శాంతియుత ప్రదేశంగా మారిపోయింది.అక్కడ Don Corleone తన కుటుంబీకుల తోను,మిగతా పరివారం తోనూ ఆహ్లాదంగా జీవిస్తున్నాడు..ఈ Solozzo అనేవాడు వచ్చి అతని మీద కాల్పులు జరిపి ఆసుపత్రి మంచం ఎక్కించేంతదాకా...!

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము) -- KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (నలభై ఒకటవ భాగం) (BOOK-4 Started)

ఆ New Hampshire ఊళ్ళోకి కొత్తవాళ్ళు ఎవరు వచ్చినా నిమిషాల్లో ఆ వార్త పాకిపోతుంది.కిటికీల వెనుకనుంచో,తలుపు చాటు నుంచో ఓ కన్ను వేసి ఉంచుతారు.Kay Adams కూడా అలాగే ఓ కారు తమ ఇంటిముందు ఆగుతుండటం తో కిటికీ లో నుంచి చూసింది.కారు లైసన్స్ అదీ చూస్తే న్యూయార్క్ ప్రాంతం గా నమోదైనదది.ఇద్దరు మనుషులు దిగారు.గ్యాంగ్ స్టర్స్ మాదిరిగా ఉన్నారు.కొంపదీసి Michael గాని పంపించిన మనుషులా అనుకుందామె.ఏమైనా తాను అతణ్ణి తమ పేరెంట్స్ కి పరిచయం చేసిన తర్వాత మాత్రమే ఇలాంటివన్నీ బాగుంటాయని ఆమె అభిమతం.ఎందుకంటే వాళ్ళు పాతకాలపు New England Yankees ఆమె దృష్టిలో..!

తమ ఇంటి బెల్ మోగడం తో తలుపు తీసి చూసిందామె.

" నా పేరు John Philips.న్యూయార్క్ పోలిస్ శాఖలో డిటెక్టివ్ ని.ఇతను నా సహచరుడు Siriyani." అంటూ ఓ వ్యక్తి ID Card తీసి చూపించాడు Kay Adams కి.

"మంచిది..ఇంతకీ ఏమిటి విషయం" అడిగిందామె.

" మీ పేరు Miss.Kay Adams కదూ..!Michael Corleone విషయమై మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడగాలని వచ్చాం.లోపలకి వెళ్ళి మాట్లాడదామా.." అడిగాడు డిటెక్టివ్ Philips.

ఆమె లోపలకి రమ్మన్నట్లు ప్రక్కకి తొలగింది.అంతలోనే ఆమె తండ్రి Adams వచ్చాడు. " ఏమిటి డియర్ విషయం " అంటూ అడిగాడతను.

Adams స్థానిక బాప్టిస్ట్ చర్చ్ లో పాస్టర్ గా పని చేస్తున్నాడు.అతని సర్కిల్ లో ఒక జీనియస్ గా చెప్పుకుంటారు  అతని గూర్చి.

" వీళ్ళు న్యూయార్క్ నుంచి వచ్చిన పోలీస్ డిటెక్టివ్ లు.ఏవో ప్రశ్నలడుగుదామని అడుగుదామని వచ్చారటనన్ను.." చెప్పిందామె.

సరే..నా స్టడీ రూం లో కూర్చుని మాట్లాడుకుందాము.." చెప్పాడు Adams.

" మీ అమ్మాయిని మాత్రమే ప్రశ్నిస్తాము మేము...మీ అవసరం లేదనుకుంటాను.." అన్నాడు డిటెక్టివ్ Philips.

" ఆ మాట చెప్పవలసింది మా అమ్మాయి...! ఆ.. Kay..నువు ఒక్కదానివే మాటాడతావా ..లేక పోతే నేను గాని మీ అమ్మ గాని పక్కనుండాలా.." అడిగాడు  ఆమె వేపు తిరిగి.

" నేను మాట్లాడతాను..సమస్య ఏమీ లేదు.." చెప్పిందామె.

" అయితే మీరు లంచ్ కి ఉంటారా.." అంటూ ప్రశ్నించాడు Adams ఆ ఇద్దరు డిటెక్టివ్ ల్ని..!

లేదు అన్నట్లుగా తలలూపారు వాళ్ళు.

వాళ్ళు ఇద్దరూ ఒక కోచ్ లో కూర్చోగా ..Kay మాత్రం ఎదరున్న ఓ కుర్చీ లో కూర్చుంది.

" Miss.Kay Adams.. గత మూడు నెలల్లో మీరు Michael ని ఎన్ని సార్లు కలవడం గాని,మాట్లాడ్డం గాని చేశారు.."  Philips అడిగాడు.

" హ్మ్మ్..వాళ్ళ నాన్నగారు..ఆసుపత్రి లో ఉన్నప్పుడు ..ఆ సమయం లో మేం కలిశాం.దాదాపు గా ఒక నెలక్రితం సంగతి అది.."

ఇంకో డిటెక్టివ్ కొంచెం రఫ్ గా మాట్లాడాడు.

" మీ ఇద్దరూ ఆ హోటల్ కి వెళ్ళడాలు..అక్కడ జరిపే కార్యక్రమాలు అన్నీ మాకు తెలుసు..ఆ తర్వాత విషయం మేము అడుగుతున్నది.." అంటూ..!

" లేదు..కలవడం జరగలేదు"

" మీకు ఎప్పుడు అతను ఇక మీదట కనిపించినా ..మాకు వెంటనే తెలియజేయాలి.చాలా ముఖ్యమైన విషయం ..లేనట్లయితే మీరు చిక్కుల్లో పడతారు.ఏ మాత్రం అతనికి సాయం చేయాలని చూసినా ప్రమాదం లో ఉన్నట్లే లెక్క.." Philips  అన్నాడు.

" మేం త్వరలో పెళ్ళిచేసుకోవాలని భావిస్తున్నాం.అలాంటప్పుడు సాయం చేయడం లో తప్పేముంది.." అన్నది Kay.

" ఎందుకా..అలా గనక చేస్తే ఒక మర్డర్ చేయడం లో మీరూ సహాయపడినట్లవుతుంది.మీ  బాయ్ ఫ్రెండ్ ..Michael ని మేము ఒక మర్డర్ కేసు లో వెతుకుతున్నాం.అతను మర్డర్ చేసింది ఒక Police Captain ని. ఇంకా ఒక ఇంఫార్మర్ ని.అర్ధమయిందా.." డిటెక్టివ్ Philips వివరణ ఇచ్చాడు.

Kay ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది.

" లేదు..నాకు తెలిసినంతవరకు అతను అలాంటి వ్యక్తి కాదు.తన ఫేమిలీ తో కూడా అంటీ ముట్టనట్టుగా ఉంటాడు.Mike మర్డర్ చేశాడంటే నమ్మలేకపోతున్నాను." చెప్పింది Kay.

" ఎంత కాలం నుంచి మీకతను తెలుసు" అడిగాడు డిటెక్టివ్ Philips.

" ఒక ఏడాదిగా తెలుసు"

" ఆ మర్చి పోయా.. అయితే మీరు తెలుసుకోవలసింది ఇంకొకటి ఉంది.ఆ రోజు ఆసుపత్రి నుంచి బయటకి వచ్చిన తర్వాత Police Captain కి Michael కి గొడవ జరిగింది.Captain కొట్టిన దెబ్బకి అతని దవడ బాగా దెబ్బ తింది.ఆ తర్వాత కొన్ని రోజులకి Police Captain హత్య కి గురయ్యాడు..Solozzo అని మరో వ్యక్తి తో కలిసి..!ఆ రోజు నుంచి Michael  కనబడకుండా పోయాడు.పక్కా సాక్ష్యాలు లేవుగాని ప్రాధమిక పరిశీలన బట్టి Michael ఈ హత్యలు చేసినట్లు తెలుస్తున్నది.సరే..ముందు ముందు అన్నీ సేకరిస్తాం..ఇంకోటి..FBI కూడా అతని కోసం గాలిస్తున్నది.అలాగే మిగతా వాళ్ళు కూడా.." డిటెక్టివ్ Philips చెప్పాడు.

" నేను నమ్మలేకపోతున్నాను.." ఒక్కసారిగా బాధ కలిగింది Mike గాయపడ్డాడని తెలిసి.

" ఇదిగో అమ్మాయ్ ..నువు ఆ హోటల్ కి వచ్చి వాడితో ..చేసే ఘనకార్యాలు మాకు తెలుసు.అవన్నీ పేపర్లకి..ఇంకా మీ ఇంట్లో పేరెంట్స్ కి ఇస్తే నీ సంగతి ఏమవుతుందో ఆలోచించు..మీ నాన్న గారిని ఇపుడే పిలుస్తాను..ఏం పిలవనా.." కరుకుగా అన్నాడు మరో డిటెక్టివ్ Siriyani.

ఆ మాట వినగానే Kay Adams కి ఒక్కసారిగా మండిపోయింది.

"ఆఫీసర్..దా చెప్పు..మా నాన్న గారిని కూడా ఇపుడే పిలుస్తాను" అని తండ్రిని కేకేసింది ఆమె.

వచ్చి ఏమిటంటూ చూశాడతను.

" Mr.Adams..మీ కూతురు యొక్క మంచి కోరి చెబుతున్నా..ఆమె ఒక గ్యాంగ్ స్టర్ తో తిరుగుతున్నది.ఆ హోటల్ లో కూడా వీళ్ళ పేర్లు దంపతుల మాదిరిగా రాశారు.పైగా Police Captain ని హత్య చేసిన మనిషి వాడు..విషయం లోని తీవ్రత మీ అమ్మాయికి అర్ధం కావడం లేదు..మీరైనా వివరించండి.." చెప్పాడు Siriyani.

సరే..అర్ధం అయింది..ఎలాంటి ఇంఫర్మేషన్ మాకు తెలిసినా మీకు తెలియజేస్తాము..మాకు ఇంట్లో లంచ్ కి టైం అవుతోంది. వాళ్ళమ్మ కూడా కిచెన్ లో వేచి చూస్తున్నది మరి" ఇక వెళ్ళమన్నట్లుగా చెప్పాడు వాళ్ళకి.

తన తండ్రి చూపిన సమ్యమనానికి ఏడుపు వచ్చినంత పనయింది ఆమెకి.ఎందుకంటే Mike తో ఆమె కి గల సంబంధాన్ని వాళ్ళు అంత ఇదిగా వెల్లడించినా ఒక్క మాట కూడా తనకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడకపోవడం ...!

సరే..కిచెన్ లో ముగ్గురూ భోంచేస్తున్నారు.

" Kay..ఇదంతా వడ్లగింజ లో బియ్యపు గింజ లాంటిది.మరీ బాధ పడక.అతను Dart mouth  లో చదువుకునే కుర్రాడు ..అలాంటి పనేం చేసిఉండడులే.."అన్నది Kay తల్లి.

" తను ఆ కాలేజ్ లో చదువుతున్నట్లు నీకెలా తెలుసు.." అడిగింది Kay తల్లిని.

" మీ యువతరం మేమే గొప్ప తెలివైన వాళ్ళం అనుకుంటారు.నువు చెప్పకపోయినా మాకు తెలుసు..నువ్వు అతనితో ప్రేమలో పడ్డావని.." చెప్పింది తల్లి.

" అదే..ఎలా .." అన్నట్లు చూసింది పేరెంట్స్ వేపు.తండ్రి నవ్వుతూ చెప్పాడు.

" నీకు వచ్చిన ఉత్తరాల్ని కొన్ని చింపి చూశాము.." అని.

తండ్రి ఆ మాట అనగానే Kay కి బాగా కోపం వచ్చింది.

" నాన్న గారు..మీరు చేసిన పని నేను చేసిన దానికంటే చాలా ఈసడించదగినది..అది తెలుసా.." అందామె.

" మై డియర్ ..ఆ లెటర్స్ చూసే ముందర మేము బాగా ఆలోచించాము.మా బిడ్డ ప్రమాదం లో ఉండేట్టు చేయడం పాపమా..లేదా ఆమె ఉత్తరాలు చూడ్డం పెద్ద పాపమా ..అని..!మాకు అప్పుడు ఉత్తరాలు తెరిచి చూడ్డమే సబబు అనిపించింది." చెప్పాడు తండ్రి.

" చూడు..Kay..! నీ వయసుకి నువు చాలా అమాయకురాలివి.ప్రమాదం ఏ వేపు నుంచి వస్తుందో తల్లిదండ్రులుగా చూసుకోవలసిన అవసరం మాకు ఉంటుంది గదా..!పైగా ఆ కుర్రాడి గురించి కూడా బాహటంగా మాకు చెప్పలేదాయే.." అంది తల్లి.

Kay కి కొంతలో కొంత స్వాంతన ఏమంటే ఉత్తరాల్లో Mike ఎక్కువగా ప్రేమ కురిపించినట్లుగా రాయడు.అది గుర్తొచ్చి హమ్మయ్య అనుకుంది.

" ఒక గ్యాంగ్ స్టర్ ఫేమిలీ అని మీరు భయపడతారని నేను ఆ సంగతి చెప్పలేదు.." చెప్పింది Kay.

" Mike మర్డర్ చేసి ఉండడని నువు అంటున్నావు..ఈ కుర్రాడు కనబడకుండా పోయాడు..ఇతనికేమైనా జరిగిఉంటుందా ..ఏమిటి" సాలోచనగా అన్నాడు Adams.

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాం) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (నలభై రెండవ భాగం)

మూడు రోజుల తర్వాత Kay Adams న్యూయార్క్ లోని Tom Hagen ని కలిసిసింది.అసలు Michael కి ఏమయిందో తెలుసుకుందామని ..!Mall లోని ఒక ఇంట్లో ఉండే అతని నివాసం లోకి వెళ్ళగానే Tom ఆమె ని సాదరంగా అహ్వానించాడు.బయట కొద్ది దూరం లో ఇద్దరు మనుషులు తిరుగాడుతున్నారు.

"Tom ..అసలు Michael కి ఏమయింది ..ఎక్కడున్నాడు.." అడిగింది Kay.

" అతను మాకు అందిన సమాచారం మేరకు సురక్షితంగా ఉన్నాడు.ఎక్కడున్నాడో నాకు కూడా తెలియదు.Police Captain మర్డర్ జరిగిన తరువాత నుంచి కనబడ్డం లేదు.బహుశా తన మీదకేమైనా వస్తుందని భయపడ్డాడేమో..కొన్ని నెలల్లో రావచ్చునేమో.." చెప్పాడు Tom.

అతను చెప్పినదానిలో కొంతవరకే నిజం ఉంది.అంతకుమించి వివరాలు ఈ దశలో ఇవ్వడం మంచిది కాదని Tom Hagen యొక్క ఉద్దేశ్యమేమో..!

" ఆ Captain కొట్టిన దెబ్బకి Michael దవడ బాగా దెబ్బ తిందని అంటున్నారు..నిజమేనా.."

" బహుశా ..నా భయం కూడా అదే.."

" Tom ఈ లెటర్ ని Michael కి అందజెయ్యి..." అంటూ ఆమె తన పర్సు లోనుంచి ఓ కాగితం తీసి అతనికి ఇవ్వబోయింది.

" ఎందుకు...కొన్ని నెలల్లో అతనే వచేస్తాడుగదా..నేను ఈ లెటర్ ని ఇప్పుడు తీసుకుంటే అతని ఉన్న ప్రదేశం నాకు తెలుసని కోర్ట్ నమ్ముతుంది.కొన్ని లీగల్ సమస్యలొస్తాయి ..అర్ధం చేసుకో Kay.." అంటూ అతను తీసుకోలేదు దాన్ని.సరే..అని వెళ్ళడానికి తయారవుతుండగా అంతలోనే Michael తల్లి అప్పుడే బయటనుంచి లోనికి వచ్చింది.Kay ని చూసి ప్రేమ గా పలకరించింది.

" అమ్మాయ్..Kay ,నువు Michael యొక్క గర్ల్ ఫ్రెండ్ వి కదూ..!బాగున్నావా..పద ..కిచెన్ లో కూర్చొని ఏవైనా తిందువు గాని " అని ఆమె చెయి పట్టుకొని లోనికి తీసుకెళ్ళింది.Kay ని కూర్చోబెట్టి ఆమె ముందు బ్రెడ్లు,సలామి,చీజ్ గట్రా పెట్టింది.కాఫీ కూడా ఇచ్చింది..!

" ఏమిటి విషయం.." అడిగింది Don భార్య.

" Michael  కి ఏమి జరిగింది..ఏమిటి ఆ విషయాలు తెలుసుకుందామని వచ్చాను" చెప్పింది Kay.

ఏం చెప్పాలి..అంతా తలరాత అన్నట్లుగా ఆమె నిర్లిప్తంగా చూసింది.

" ఏం చెప్పను Kay..మా ఆయన ముసలివాడు అవుతున్న కొద్దీ ఇంకా చాదస్తం పెరుగుతున్నది.ఇదిగో ఇలాంటివన్నీ దాని పర్యవసానాలే..Michael మళ్ళీ తిరిగిరావడానికి ఎంత కాలం పడుతుందో నేను చెప్పలేను.రెండేళ్ళు కావచ్చు..మూడేళ్ళు కావచ్చు..ఇంకా ఎక్కువైనా కావచ్చును.." చేతి తో నుదురు తాకించుకుంటూ అన్నది Michael తల్లి.

"సరే నే వస్తాను మరి.. ఈ లెటర్ ని Michael రాగానే ఇవ్వండి" అని ఆమె చేతిలో పెట్టింది.అంతలోనే Tom వచ్చి వద్దన్నాడు గాని ఆమె ఇమ్మని తీసుకుంది.

" మా అబ్బాయి కోసం ఎదురుచూస్తూ  నీ జీవితాన్ని ఎందుకు వ్యర్ధం చేసుకుంటావ్..ఎవరో ఓ మంచి వ్యక్తిని పెళ్ళాడి నువ్వైనా హాయిగా ఉండు.." ఆ అమ్మాయిని ప్రేమగా హత్తుకొని చెప్పింది Don భార్య.

ఇద్దరు మనుషుల్ని పిలిచి ఈ అమ్మాయిని వాళ్ళ ఊరైన New Hampshire లో సురక్షితంగా దింపి రండి..మళ్ళీ ఆ Train పట్టుకొని ఏం వెళుతుంది గాని అంటూ పురమాయించింది ఆ పెద్దావిడ.

(మిగతాది వచ్చే భాగంలో చూద్దాం) --KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (నలభై మూడవ భాగం)

Carlo Rizzi ..అదే Don Corleone కుమార్తె ని పెళ్ళాడిన వ్యక్తి .. అతగాడికి ..Don అంటే ఇప్పుడు కొద్దిగా మంటగా ఉంది.అల్లుడైన తనకి వాళ్ళ ఫేమిలీ బిజినెస్ లో మంచి స్థానం ఇస్తాడని ఊహించాడు.కాని అదేం జరగలేదు.ఏదో Manhattan లోని ఓ బుక్ మేకింగ్ బిజినెస్ ని అప్పగించారు.వాళ్ళ Mall లో కనీసం ఓ ఇల్లు తనకి కేటాయించనూ లేదు. ఆ కసి,కోపం అంతర్లీనంగా ఉందేమో..అదంతా తన భార్య మీద అవకాశం వచ్చినప్పుడల్లా చూపిస్తుంటాడు.

ఆమె అయితే ఘనత వహించిన Don Corleone కూతురు కావచ్చు..కాని ఇప్పుడు తన భార్య..తన ప్రాపర్టీ కింద లెక్క.Connie ఏం చేస్తున్నదా అని చూశాడు.ఆమె కాఫీ చేస్తున్నట్లుగా ఉంది.రోజు రోజు కి చాలా లావుగా ,గుండ్రంగా తయారవుతున్నది.చూడటానికే తనకి చికాకుగా ఉంది.ఈ యావరెజ్ ఇటాలియన్ అమ్మాయికి,తన లాంటి Blond hair ,మంచి పర్సనాలిటీ కలిగిన యువకుడు భర్తగా లభించడం ఆమె అదృష్టం గాని తనకివ్వవలసిన ప్రయారిటీ మాత్రం ఇవ్వడం లేదు.ఏం మనుషులో వీళ్ళు అనుకున్నాడు Carlo Rizzi.

బుక్ మేకింగ్ బిజినెస్ సెంటర్ కి వెళ్ళడానికి బయలుదేరాడతను.బేస్ బాల్,బాస్కెట్ బాల్ లాంటి వాటి మీద బెట్టింగ్ లు కాసే ఓ రకమైన వ్యాపారం అది.రకరకాల జట్ల మీద జనాలు బెట్టింగ్స్ కడుతుంటారు.ఆ ప్రాంగణం లోనే ఇతర స్టోర్ లు కూడా ఉంటాయి.Corleone కుటుంబానికున్న అనేక బిజినెస్ ల్లో అదొకటి.సాయంత్రం ఆటలు అవీ ముగిసిన తర్వాత బిజినెస్ కి సంబందించిన వివరాలన్నీ Carlo Rizzi తప్పనిసరిగా Tom Hagen కి చూపించవలసి ఉంటుంది.ఎందుకంటే Carlo ఈ వ్యవహారం లో చిలక్కొట్టుడు కొట్టి డబ్బులు నొక్కేసేవాడు.దానితో Don ఈ బిజినెస్ మీద పర్యవేక్షకునిగా Tom ని పెట్టాడు.నిజానికి ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ ల మీద Tom ని అంతగా ఉంచడు గాని Carlo యొక్క వ్యవహారాన్ని పూర్తి గమనం లోకి తీసుకోవడానికి డాన్ ఈ ఏర్పాటు చేశాడు.

Connie డ్రెస్ వేసుకుని తయారవుతుండగా Carlo అడిగాడు.

" ఎక్కడికి వెళ్ళడానికి తయారవుతున్నావు..?" అని .

" లాంగ్ బీచ్ లో ఉన్న మా నాన్న గారిని ఓసారి చూద్దామని వెళుతున్నా..అయన ఇంకా కొంచెం అనారోగ్యం గానే ఉన్నారు గదా.." అంది Connie.

" అలాగా..అయితే ప్రస్తుతం షో ఎవరు నడుపుతున్నట్లు..మీ పెద్దన్న Sonny యేనా.." ఎకసెక్కంగా అడిగాడు Carlo.

" ఏమిటా మాట..షో..ఏమిటి షో" ప్రశ్నించింది Connie

 భార్య అలా అనేసరికి Carlo Rizzi కి మండిపోయింది.

" యూ లౌజీ గినియా బిచ్ ..నీకు బాగా బలిసిందే.." అని తిడుతూ ఆమె మొహం మీద ఫెడీల్మని ఒక చరుపు చరిచాడు.అంతటితో ఊరుకోకుండా మరో మూడు దెబ్బలు మొహం మీద పీకాడు.దాంతో ఆమె చెంప వాచిపోయింది.పెదవి కూడా కొద్దిగా చిట్లి రక్తం వచ్చింది.దాంతో ఆగిపోయాడు Carlo.

(మిగతాది వచ్చే భాగంలో చూద్దాం) --KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (నలభై నాల్గవ భాగం)

అల్ల బ్లడ్ రావడం తో..ఇక ఆపేశాడు Carlo Rizzi. ఆమె బెడ్ రూం లోకి పోయి ఏడ్చుకుంటూ ఉండిపోయింది.Connie ఇపుడు గర్భవతి.ఇంకో రెండు నెలల్లో ప్రసవం అయ్యే అవకాశం ఉంది.

Carlo Rizzi తీరిగ్గా కాఫీ తాగాడు.ఆ తర్వాత బెడ్రూం కి బయటనుంచే అడిగాడు భార్యని. " ఏమిటి..ఇందాక మీ నాన్న వాళ్ళ ఇంటికి వెళతానన్నావుగదా..ఏమయింది.."

" నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళడం లేదు." జవాబు చెప్పి తలుపు దబాలున వేసుకు పడుకుంది.

" నీ ఇష్టం.." అంటూ అపార్ట్మెంట్ బయటకి వచ్చేశాడు.ఆ Book making నిజినెస్ కాంప్లెక్స్ దగ్గరకి వెళ్ళడానికి ..!ఇపుడు పెళ్ళాన్ని కొట్టినతర్వాత Carlo Rizzi కి చాలా రిలీఫ్ గా ఉంది.ఇలాంటప్పుడు తాను ఆ Don Corleone నే కొట్టినట్లుగా ఆనందిస్తుంటాడు.

పెళ్ళయిన మొదట్లో కూడా Connie తల్లిదండ్రులకి భర్త యొక్క పోకడల విషయం తెలిపింది.మాటి మాటికి చేయిచేసుకోవడం ఇదంతా.అయితే Don కూడా వెంటనే తెంపినట్లుగా మాట్లాడలేదు ఎందుచేతనో..!

" భార్యభర్తల మధ్యన వచ్చే గొడవల్లో నేను వెంటనే తలదూర్చడం బాగుండదు.ఇటలీకి రాజైనా భార్యా భర్తల వ్యవహారాల మధ్య తలదూర్చడు.ఎలా అతనితో సర్దుకుపోవాలో నువ్వే ఆలోచించుకోవాలి..నువ్వు నా కుమార్తె వే కాదు అతనికి భార్యవి కూడా కదా.." అన్నాడు Don Corleone.

" నేను వాడికి డైవర్స్ ఇవ్వడానికి కూడా రెడీ గా ఉన్నాను" ..అలాంటి వాడితో నేను వేగలేను" అంది చివరకి Connie.

" డైవర్స్ తీసుకోవడం ఎంతసేపు..కాని రేపు పుట్టబోయే పిల్లల భవిష్యత్ ఏమవుతుంది.తండ్రి లేని పిల్లల కష్టాలు ఏమిటో నీకు తెలుసా.." అడిగాడు Don.

ఈ మాటలన్నీ ఎలాగో Carlo Rizzi కి తెలిశాయి.ఇక అప్పటినుంచి అతనికి ఇంకొంచెం ధైర్యం వచ్చింది.అయితే Don పైకి అలా అన్నాడుగాని మరో వేపు Carlo Rizzi పైన నిఘా పెట్టే ఉంచాడు.ఎప్పుడేమి చేస్తున్నాడనేది..!పెళ్ళయిన కొత్తలో Connie కి వచ్చిన బహుమతుల్ని,డబ్బుని ఇతగాడు తీసుకుని ఎలా పాడుచేసేది మొత్తం తెలుసుకుంటూనే ఉన్నాడాయన.అప్పగించిన Book making బిజినెస్ లో కూడా చిలక్కొట్టుళ్ళు కొడుతూనేఉన్నాడు.అందుకనే అతనిమీద Tom Hagen నియంత్రణని ఉంచాడు డాన్.

సరే..తన బిజినెస్ కాంప్లెక్స్ కి వచ్చాడు Carlo.మంచి విశాల ప్రాంగణం లో ఉంటుందది.అసలు ఇంటికంటే అతనికి ఇక్కడ ఉండడమే ఇష్టం.ఆఫీసులో కి వచ్చిన తర్వాత కూడా తన భార్యని కొట్టిన ఉదంతాన్ని తన ఇద్దరు మేనేజర్లకి చెప్పాడు.ఆ విధంగా Don Corleone కుమార్తె అయినా సరే నేను లెక్క చేయను అని ప్రకటించుకోవడం అన్నమాట.

అయితే తన పెద్ద బావమరిది Sonny Corleone అంటే మాత్రం కొంచెం బెరుకు Carloకి..ఎంచేతనంటే..అతనికి ఓర్పు తక్కువ..సరాసరి వచ్చి కాల్చి పారేసినా దిక్కు లేదు. తన అదృష్టం కొద్దీ Connie అతని దృష్టికి విషయాలేమీ తీసుకెళ్ళలేదు.

* * * *

Sonny Corleone తమ హెడ్ క్వార్టర్స్ అయిన ఆ Mall ని వదిలి బయటకి వచ్చాడు.న్యూయార్క్ లోపలకి వచ్చే ప్రతిసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.ఇప్పుడు Lucy దగ్గరకి ..ఆమె ఉండే అపార్ట్ మెంట్ దగ్గరకి వెళుతున్నాడు.అప్పుడప్పుడు ఆమె దగ్గరకి అలా వెళుతుంటాడు.బాడి గార్డ్స్ ముందు కారు లో ఇద్దరు,వెనక కారు లో ఇద్దరూ ఉన్నారు.సరే..మధ్యలో నుంచి వచ్చే ఆపదని తాను కాచుకోగలడు..1933 మాఫియా వార్ జరిగిన తర్వాత నుంచి కొన్ని రక్షణ చర్యలు తీసుకోవడం అతనికి అలవాటైంది.ఎక్కడా లిఫ్ట్ లు కూడా ఎక్కడు..ఎన్ని ఫ్లోర్ లు అయినా మెట్లెక్కే వెళతాడు.

Lucy ఇంటిదగ్గర్నుంచి వచ్చేటప్పుడు ,ఒకసారి అలా తన సోదరి Connie దగ్గరకి కూడా వెళ్ళి ఆమె ని తల్లిదండ్రుల దగ్గరకి తన కారు లో తీసుకెళదామనుకుంటాడు.ఆమె ఇంటికి వెళ్ళి
 కాలింగ్ బెల్ నొక్కగానే తలుపు తీసింది.ఆమె మొహం మొత్తం ఏడ్చినట్లుగా ఉబ్బి పోయి ఉన్నది.చెంపల మీద కొట్టినట్లు చారికలు..ఇంకా పెదవికి గాయం కూడా అయింది.వెంటానే పరిస్థితి అర్ధమైంది Sonny కి..కోపం తో కళ్ళు ఎర్రబడ్డాయి.అతన్ని చూడగానే Carlo Rizzi కి ఆపద తలపెట్టేలా ఉన్నాడని ఊహించి ఆమె అన్నది.

" లేదు..ఏదో చిన్న గొడవ..నేను చిన్న మాట అన్నాను..అలా ఏదో జరిగింది సీరియస్ గా తీసుకోకు " అన్నదామె .

" ఇప్పుడు మరీ నాతో వస్తావా అమ్మనాన్నల వద్దకి"  అడిగాడు Sonny

" ఈ మొహం పెట్టుకొని ఇప్పుడు ఎందుకు..ఓ వారం ఆగి వస్తాలే.." అంది Connie.

వెంటనే Sonny డాక్టర్ కి కాల్ చేశాడు ఆమె ని చూపించుకోమని..!ఇక వస్తానని బయలుదేరాడు.

" ఆవేశపడకు Sonny"  అంది ఆమె  సోదరునితో..!

" నీ బిడ్డని పుట్టకముందే అనాధని చెయ్యను.కంగారు పడకు" చెప్పాడు Sonny.

సరాసరి స్పీడ్ గా కార్ ని ఆ Carlo Rizzi ఉండే ప్రాంతం వేపు దూకించాడు.వెనుక బాడీ గార్డ్లు ఫాలో అవుతున్నారు.ఆ కాంప్లెక్స్ ముందు బెట్టింగ్ దారులతో కోలాహలంగా ఉంది.చిన్న పిల్లలు కూడా పెద్ద వాళ్ళతో వచ్చారు కదా..ఏవో ఆటలు ఆడుతున్నారు. వేగంగా దుమ్ము రేపుకుంటూ కీచుమంటు వచ్చే టైర్ల చప్పుడుతో ఆగిన ఆ కార్లని చూసి బిత్తరపోయి చూస్తున్నారు అంతా.Sonny వెంటనే కారు దిగి అక్కడ దగ్గర్లో కూర్చున్న Carlo Rizzi ని షర్ట్ పట్టుకొని గుంజుకొచ్చి అందిన చోటల్లా పట్ పట్ మని కొట్టసాగాడు.చిన్నపిల్లాడిలా Carlo దెబ్బలు తగలకుండా రక్షించుకుంటున్నాడు.ఎదురుగా దొరికిన ఒక ఇనుప రైలింగ్ ని ఆలంబంగా పట్టుకొని protect  చేసుకోసాగాడు. షర్ట్ అంతా చినిగిపోయింది..! ఎదురు తిరిగితే ఇంకా ప్రమాదమని గ్రహించే Carlo Rizzi ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు.అదే అతన్ని కాపాడిందని చెప్పాలి.చివరికి కొట్టడం ఆపుజేసి Sonny వార్నింగ్ ఇచ్చాడు." ఇంకోసారి గనక మా సోదరిని కొట్టినట్లు కనిపిస్తే..నీకు నూకలు చెల్లుతాయ్..గుర్తుపెట్టుకో"  అని చెప్పి వచ్చినంత వేగంగా Sonny వెళ్ళిపోయాడు.

(మిగతాది వచ్చేభాగం లో చూద్దాం) --KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (నలభై ఐదవ భాగం)

1947 లో వెల్లువెత్తిన మాఫియా ఫేమిలీ ల మధ్య పోరాటం అటు అయిదు మాఫియా ఫేమిలీ లకు,ఇటు Corleone ఫేమిలీ కి కూడా బాగా నష్టాలు కలిగించింది.McClusky..అదే ఆ Police Captain  ని మాఫియా ఫేమిలీ ల్లో ఒకరు చంపి ఉంటారని,వారిని తమకు అప్పగించమని పోలీస్ వర్గాల నుంచి వత్తిడి వచ్చింది.ఎవరకి వారు మాకు తెలియదని అంటూ మిన్నకున్నారు.దానితో పోలీస్ వర్గాల నుంచి బాగా ప్రెజర్ వచ్చింది.అందరి అక్రమ వ్యాపారాల మీద రైడింగ్స్ చేయటం మొదలుపెట్టారు.Book makers గాని,Policy bankers గాని,Gambling గాని ,Prostitution గాని అన్ని వ్యాపారాలు దెబ్బతినడం ప్రారంభం అయ్యాయి.ఇంచు మించు అన్ని ఫేమిలీలు నష్టాల్ని చవి చూశాయి.బాగా ధనం వచ్చే ఏరియాలవి పైగా..!దానివల్ల పోలీస్ వర్గాలకి వెళ్ళే మామూళ్ళు కూడా నిలిచిపోయాయి.ఇది మరో వైపు వాళ్ళని కూడా బాధిస్తూనేఉంది.ఇదే అవకాశంగా Harlem లోని నీగ్రో వ్యాపారులు కొందరు ఈ రంగాల లోకి వచ్చారు.వీరి వెనుక ఆ మాఫియా కుటుంబాలే వెనక ఉండి వారి అవసరం నిమిత్తం ప్రోత్సహించాయి.అది ఒక తాత్కాలిక సర్దుబాటు.

క్రమేపి న్యూస్ పేపర్లలో కూడా McClusky  గురించి అసలు వస్తవాలు వెలుగుచూసినవి.అతను ఒక పోలీస్ కెప్టెన్ అయి ఉండి Solozzo లాంటి డ్రగ్ డీలర్ తో చేతులు కలడం అవన్నీ..!దానితో పోలీస్ వర్గాల్లో కూడా అతని మీద ఉన్న సానుభూతి కరిగిపోసాగింది.చివరకి మాఫియా ఫేమిలీ ల ప్రయత్నాల వల్ల పోలీస్ లు కూడా మెత్తబడి సహకారమందించడానికి సుముఖుత వ్యక్తం చేశారు.దానివల్ల వారికి కూడా ఆర్దిక వెసులుబాటు ఉంటుంది గదా..!

  ఇపుడు బిజినెస్ లు అన్నీ ప్రశాంతంగా నడుస్తున్నాయి.ఒక Social order నెలకొన్నది.మరో వేపు Don Corleone ఆరోగ్యం కూడా కొంత కుదుటబడ్డది.అతడిని ఆసుపత్రినుంచి ఇంటికి తీసుకొచ్చారు.ప్రత్యేకంగా ఒక డాక్టర్ ని,నర్స్ ని ఆయన సమ్రక్షణార్ధం ఏర్పాటు చేయడం జరిగింది.ఎవరేమి చెప్పినా తన అభిప్రాయాన్ని మెల్లిగా తెలియజేసే దిశలో అతని ఆరోగ్యం కుదుటపడుతున్నది.

అందరి కంటే చిన్నవాడైన Freddie Corleone ని Las Vegas పంపించారు.అక్కడ లగ్జరీ హోటళ్ళను,గేంబ్లింగ్ కేసినో లను నడపడం  లో తర్ఫీదు కోసం అతన్ని పంపిస్తారు.ఎందుకంటే సమీప భవిష్యత్ లో తమ ఫేమిలీ  Las Vegas లో ఆయా రంగాల్లో ప్రవేశించడానికి..!

Don Corleone ఇంకా పూర్తిగా బాధ్యతలు తీసుకోలేదు గాని Sonny,Tom లు చెప్పే జరిగిపోయిన సంగతులు వింటున్నాడు.Michel Corleone పోలీస్ కేప్టెన్ హత్య ఉదంతం విని కొద్దిగా నిట్టూర్చాడు.అయితే ఏదీ వ్యక్తం చేయలేదు.

" మళ్ళీ మనం మన ఆపరేషన్ ల లోకి యధాప్రకారం దిగిపోవలసిన సమయం వచ్చింది.పోలీస్ వర్గాల నుంచి కూడా సమ్మతి వచ్చింది.ఆ నీగ్రో వ్యాపారులనుంచి మళ్ళీ వనరులన్నిటిని వెనక్కి తీసుకోవాలి .Book making,Policy banking,Shylacking  ఇట్లాంటివాటిల్లోకి వారిని మనం తాత్కాలికంగా అనుమతించాం.ఇక అది ఎంత మాత్రం కొనసాగరాదు.ఇప్పటికే తేవలసినంత చెడ్డ పేరు తెచ్చారు.విన్నర్స్ కి డబ్బులు చెల్లించకుండా వీళ్ళ విలాసాలకు ఖర్చు పెట్టుకుంటున్నారు.వీళ్ళనిలాగే కొనసాగిస్తే ఇదే రంగాల్లో పాతుకుపోతారు.అది నాకెంతమాత్రం ఆమోదయోగ్యం కాదు" అన్నాడు Sonny.

" ఐతే ఒకటి..ఇప్పటికే Harlem లో వాళ్ళలో కొంతమంది బాగా ముదిరిపోయారు.పెద్ద ఎత్తున ధనానికి రుచి మరిగారు.అంత ఈజీ గా కదులుతారా " Tom సందేహం వ్యక్తం చేశాడు.

" ఎలా కదిలించాలో నేను చూసుకుంటాను.అలాంటి వారి పేర్లు అన్నీ లిస్ట్ రాసి Clemenza కి ఇవ్వు.He will straighten them.o.kay"

" ఇబ్బందేం లేదు..వాళ్ళని నేను చూసుకుంటా" అన్నాడు Clemenza.

"మళ్ళీ ఒక్కసారి మన పనుల్లో దిగామో..మిగతా ఫేమిలీల నుంచి మనకి వ్యతిరేకంగా కొన్ని చికాకులు కల్పించడానికి చూస్తారు ఈసారి..!ఎందుకంటే McClusky వ్యవహారం వల్ల వారికి కలిగిన ఇబ్బందికి,ఇంకా Bruno Tattagliya మర్డర్ వల్ల భంగమైన శాంతికి ..మన మీద వాళ్ళు గుర్రుగా ఉన్నారు" చెప్పాడు Tom.

" సరే..ఆ వ్యవహారాలు నేను చూసుకుంటాను.వాళ్ళకీ తెలుసు మనం తిరిగి కొట్టగలమని !ఈ మధ్యలో కొన్ని  శాంతి రాయబారాలు కూడా అవసరమైతే నడుపుదాం.Bruno కి సంబందించిన నష్టాన్ని మరో రకంగా వారికి భర్తీ చేద్దాం.."

"మరి డ్రగ్స్ కి సంబందించిన డీల్ ని ఏమిచేద్దాం"

" డాన్ దాన్ని తిరస్కరించాడు కదా..ఏదైనా మార్పు చేస్తే ఆయనే చేస్తాడు"

" మిగతా ఫేమిలీ లతో పోలిస్తే ..మనకి వచ్చే ధనం ఎక్కువగా Book making లోను,Gambling లోనూ ఉన్నది.వాటిని సమ్రక్షించుకోవాలి.Tattagliya లతో కయ్యం అంత అవసరమా ఒకసారొ ఆలోచించు.."

" Tessio,Clemenza ల వద్ద కావలసినంత బలగం ఉంది.అవసరమైతే అయిదు ఫేమిలీ లకి సమాధానం చెప్పగలం.సరే..సంప్రదింపులూ తెరిచే ఉంటాయి.మళ్ళీ మనం బిజినెస్ లోకి పోదాం.చూద్దాం ..ఏం జరుగుతుందో..అవసరమైతే Mattresses కి వెళ్ళడమే.." Sonny అన్నాడు.

Policy Banking  లోకి ఇతర బిజినెస్ లోకి తాత్కాలికంగా వచ్చిన నీగ్రో లని మళ్ళీ వెనక్కి మరలించడం పెద్ద కష్టమేం కాదు.బాగా పై స్థాయిలో ఉన్న రాజకీయ మరియు పోలీస్ అధినేతలనుంచి తమకి అనుకూలంగా పని చేయించుకోవడం అనేది ఒక నీగ్రో వ్యాపారి చేయలేడు. ఎందుకంటే దానికి జాతిపరమైన వివక్షత కూడా అడ్డంగా వస్తుంది.కాబట్టి వారికి ఆ సహకారం వారికి అందకుండా కట్ చేయాలి.ఆ విధంగా Harlem మొత్తాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చును.
కొన్ని రోజుల తర్వాత Corleone ఫేమిలీ కి కొన్ని దుశ్శకునాలు పొడసూపినవి.వారికి అనుకూలంగా ఉండే గార్మెంట్ యూనియన్ అధికారులు ఇద్దరు కాల్చివేయబడ్డారు.Corleone ప్రొటెక్షన్ కింద ఉన్న వడ్డీ వ్యాపారులు,బుక్ మేకర్స్ లాంటి వారు భయభ్రాంతులకి గురిచేయబడ్డారు.పెద్ద ఎత్తున వీధి పోరాటాలు చెలరేగాయి.ఇద్దరు Caporegimes ని Matresses కి వెళ్ళవలసిందిగా చెప్పాడు Sonny.అంటే మాఫియా ల మధ్య పోరాటాలు చెలరేగే సమయం లో దాంట్లో యుద్ధం చేసే సైనికుల కోసం వేసే సురక్షిత ప్రాంతాల్లో వేసే పరుపులన్నమాట.ఆ గదుల్లో గన్ లు,మందుగుండు సామాగ్రి,ఆహార పదార్థాలు ఇలాంటివి నిలవ చేస్తారు.వాళ్ళు కూడా అక్కడనే నిద్రిస్తారు.ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా ఇదో ఏర్పాటు.

తమ రక్షణ లో ఉన్న బిజినెస్ లన్నిటి కి రక్షణ కల్పించారు.అదనపు బాడీ గార్డులని ముఖ్యమైన వాళ్ళకి మరింత పెంచారు.అయితే రోజులు గడుస్తున్నకొద్దీ తమలోని బలహీనతలు కూడా Sonny కి తెలియసాగాయి.గతం లో తండ్రి హయాం లో Clemenza,Tessio లు ఇద్దరూ కొంత వయసులో ఉండేవారు.దాడుల్ని నిర్వహించడం లో చాలా వేగంగా ..రూత్ లెస్ గా వ్యవహరించేవారు.ఇప్పుడు వారికి వయసు మీద పడింది గదా..మరీ అంత వేగంగా దాడులు తమ సిబ్బంది తో చేయించడం లో  వెనకబడినట్లు అనిపించసాగింది.Consigliere గా కూడా ఆ రోజుల్లో Genco Abbandando ఉండేవాడు.నూటికి నూరుపాళ్ళు సిసిలియన్ అతను.యుద్ధ సమయాల్లో ఎలాంటి Cunning తో,Shrewdness తో వ్యవహరించాలో ఆరితేరినవాడు.అలాంటి ఒక నేర్పు Tom Hagen లో లేదు.అలాగని వాళ్ళందరిని తను ఉన్నట్టుండి వారి పదవులనుంచి తొలగించలేడు.అది మరింత ప్రమాదానికి దారి తీస్తుంది.ఆ విధంగా ఒక హేతుబద్ధమైన కారణాలతో అలాంటి పనిని డాన్ మాత్రమే చేయగలడు.

(మిగతాది వచ్చేభాగం లో చూద్దాం)  --KVVS Murthy



Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా ( నలభై ఆరవ భాగం)

Amerigo Bonasera కి,తన వ్యాపారాన్ని చూసి ఎవరైనా ఎగతాళి చేస్తే ససేమిరా గిట్టదు.జోక్ లేసినా ఒళ్ళు మండుతుంది.శవాన్ని చక్కగా "కాఫిన్" లో సర్దడం,అంత్యక్రియల్ని జరిపించడం,ఆ వచ్చిన వాళ్ళందరకీ ఆత్మతృప్తి కలిగించి పంపించడం..ఇది తన వ్యాపారం.ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కూడా ఉంది అతనికి..!ఏ పనైనా తన దృష్టిలో మర్యాదకరమైనదే..!

Mulberry Street లో ఉన్న ఈ భవనాన్ని ఇటీవలనే కొని,తన అవసరానికి తగినట్లుగా కొన్ని మార్పులు చేయించాడు.దేవుడి దయవల్ల వ్యాపారం బాగానే ఉంది.

ఇల్లు కూడా దగ్గరలోనే ఉంటుంది.కాసేపు అలా వెళ్ళి ఏదో తిని,విశ్రాంతి తీసుకొని మళ్ళీ వద్దాం అని చెప్పి బయలుదేరాడు.ఏడాది క్రితం ఆ దుండగులు తన కుమార్తె ని కొట్టి గాయపరిచారు గదా..ఆ తర్వాత ఆ అమ్మాయిని బోస్టన్ కి పంపించేశాడు..బంధువుల దగ్గరకి..!కాలం చేసిన గాయాలు మానాలంటే స్థలమార్పిడి కూడా కొంత అవసరం కదా..!

నిజంగా ఆ విషయం లో Don Corleon తనపట్ల చాలా దయ తో వ్యవహరించాడు.ఆ వెధవలు కూడా గాయాలు పాలయ్యేటట్లు చేశాడు.తన కూతురు ని కొట్టిన పాపం ఆ వెధవలకి ఊరికే పోతుందా మరి.Don కి అవసరమైన సమయం లో తన వంతు ఫేవర్ చేసి ఋణం తీర్చుకోవాలి తను..ఆ బాధ్యత ఉంది గదా..!

భార్య ఇచ్చిన సూప్ ని సేవించాడు.ఆ తర్వాత తనకిష్టమైన కేమెల్ సిగరెట్ తాగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు.

 " ఏమిటి ..మళ్ళీ ఈ రాత్రికి కూడా వెళ్ళాలా..పనులన్నీ అయిపోయినట్లేనా.." అడిగింది భార్య.వెళ్ళాలి ' అన్నట్లుగా తల ఊపాడు Bonasera.

పక్క రూం లో ఫోన్ మోగింది.వెళ్ళితీశాడు.అవతల కంఠం Tom Hagen ది.

" నేను Tom ని మాట్లాడుతున్నా..Don Corleone కోసం నువ్వు ఒక పని చేయాలి.దాని కోసమే కాల్ చేశాను"

" ఫర్వాలేదు..చెప్పు Tom "

"గతం లో ఆయన నీ కుమార్తె విషయంలో చేసిన సాయానికి ఋణం తీర్చుకొనే అవకాశం ఇపుడు నీకు వచ్చింది.గుర్తున్నది గదా.."

Bonasera కి ఎందుకనో ఒక్కసారిగా అసంతృప్తి గా తోచింది.ఈ మధ్య పేపర్ల లో వస్తున్నాయి..మాఫియా పోరాటాలు గురించి..ఎవరైనా వారి శత్రువు ని చంపి వేసి ఇక్కడకి గాని తీసుకొస్తున్నారా..దాని కోసమా తన సాయం అడిగేది..అలా గనక చేస్తే ఇతర మాఫియా ఫేమిలీ కి శత్రువు అవుతాడు..అంతేగాక ప్రభుత్వం దృష్టిలో నేరస్థుడు కూడా అవుతాడు..మనసు పరిపరి విధాలా పోతున్నది.చ.. కాలం ఎలాంటిది.. తన కుమార్తె గౌరవం కాపాడటం కోసం తనకి అంత సాయం చేసిన ఆ Don పట్ల నేనిలా ఆలోచిస్తున్నానేమిటి అని మళ్ళీ అనిపించింది Bonasera కి..!

  గొంతు సర్దుకుంటూ అన్నాడు Bonasera " ఆ..Tom..వింటున్నా చెప్పు"

" Bonasera ..నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు..వేరే మనుషులు కూడా ఉన్నారు ..ఈ పని చేయడానికి" కాస్త కటువుగా అనిపించింది Tom స్వరం.

" ఏమంటున్నావు..మిత్రమా..! Don కి సాయం చేయడం లో వెనక్కి తగ్గుతానని ఎందుకు అనుకుంటున్నావు..నా ఋణం నేను తీర్చుకోవాలి.అది నా బాధ్యత.చెప్పు..తయారుగా ఉన్నాను..ఏమి చేయాలి నేను" అడిగాడు Bonasera.

" ఒక గంట లోపులో Don నీ బిజినెస్ పార్లర్ దగ్గరకి వస్తారు.ఆయన నీకు చెబుతారు అన్నీ.వేరే వ్యక్తులు ఎవరూ అక్కడ లేకుండా చూడు..అంతే..అర్ధమయింది గదా.." చెప్పి ఫోన్ పెట్టేశాడు Tom Hagen.

అక్కడుండే తన అసిస్టెంట్ ని ఇంటికి వెళ్ళిపోవలసిందిగా కోరాడు Bonasera.ఆ పార్లర్ ని అంతా నీట్ గా సదిరి..ఎదురుచూస్తూ ఉన్నాడతను.కాసేపటిలో ఓ ఆంబులెన్స్ వచ్చింది.ఒక ఇద్దరు మనుషులు ,Clemenza దానిలోంచి దిగారు.నలు దిక్కులా ఓ మారు ఆ ప్రదేశాన్ని చెక్ చేసుకున్నారు.ఆ తర్వాత ఒక స్ట్రెచర్ ని దింపి మెల్లిగా Bonasera సూచన మేరకు ఓ గది లోని పెద్ద టేబుల్ దగ్గరకి శవాన్ని చేర్చారు.శవం మీద దుప్పటి కప్పి ఉంది.అది ఎవరిదో తెలియడం లేదు.

అతను,ఆ ముగ్గురు  గదిలో ఉండగానే...ఓ క్రీనీడలోనుంచి వెంటనే Don ప్రత్యక్షమయ్యాడు.మనిషి చూడటానికి కొద్దిగా బరువు తగ్గినట్టుగా అనిపించాడు.అయితే ఆయన లో సహజంగా ఉండే ఆ పర్సనల్ మాగ్నెటిజం ఏ మాత్రం తగ్గలేదు.

"Well ..old friend ..నా కోసం ఈ సర్విస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నావా.." అడిగాడు Don.

" తయారుగా ఉన్నాను.." అన్నట్టుగ నిశ్శబ్దంగా ,మర్యాదగా తల ఊపాడు Bonasera.

ఆ శవం ఉన్న స్ట్రెచర్ దగ్గరకి మెల్లిగా నడిచాడు Don. ఆ వెనకాలే అతనూ నడిచాడు.

" ఈ శవాన్ని ..ఈ విధంగా..వాళ్ళ అమ్మకి చూపడం నాకు ఇష్టం లేదు.అందుకే ఇక్కడకి తెచ్చాను.నీ వృత్తి లోని నైపుణ్యాన్ని అంతా ఉపయోగించు. ఈ బాడీ కి అంత్యక్రియలని జరిపించు..అదే నేను కోరేది.." చెప్పాడు Don.

Bonasera శవం మీది దుప్పటిని తొలగించాడు.ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు.ఎన్నో శవాల్ని చూసాడు తన వృత్తిలో గాని..ఇంత దారుణమైన శవం ని Bonasera ఎప్పుడూ చూడలేదు.బుల్లెట్ల మయంగా ఉంది మొహం అంతా..!ఎడమ కంటిలో కి ఒక బుల్లెట్ దూసుకుపోయింది.దవడలు,ముక్కుదూలాలు..ఒక్కటేమిటి..అన్నీ చిత్తడి చిత్తడిగా బులెట్ దెబ్బలతో  చితక్కొట్టినట్లుగా ఉంది శవం..!

ఇంతకీ ఆ శవం ఎవరిదా...?

Sonny Corleone ది..! Don Corleone యొక్క పెద్ద కొడుకు ది..!

Amerigo Bonasera కి ఆశ్చర్య,విభ్రమాలతో నోరు పెగల్లేదు.అతని భుజం మీద చెయ్యి వేసి Don అన్నాడు " See,how they have massacred my son.." ..!

(మిగతాది వచ్చే భాగంలో చూద్దాం)--KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (నలభై ఏడవ భాగం)

Sonny Corleone ఎంచుకున్న విచక్షణారహిత రక్తపాత విధానం చివరకి అతని జీవితాన్నే బలి తీసుకుందని చెప్పాలి.ఒక గమ్యం,ఒక లక్ష్యం అంటూ లేకుండా ఎవరకీ ఎటువంటి ప్రయోజనం చేకూర్చని అతని యొక్క విధానం మిగతా అయిదు మాఫియా ఫేమిలీలు నిరసించాయి.వారికి సంబందించిన వ్యాపార ప్రయోజనాలమీద,వారి కార్యనిర్వాహకుల మీద దాడులు ఉధృతం కావడం తో వాళ్ళు వ్యూహాత్మకంగా కొంత కాలం వెనక్కి తగ్గారు.ప్రతిఘటన కి దిగలేదు.Don గనక ఇదే పరిస్థితి లో ఉంటే అతని పోకడ వేరుగా ఉంటుంది.చాలావరకు సంప్రదింపుల ద్వారా సరిచేస్తాడు.లేదా ఒకవేళ హింసాత్మకంగా వెళ్ళినా దానిలోనూ ఒక హేతుబద్ధ వైఖరి ఉంటుంది.ఎవరకీ ప్రయోజనం చేకూర్చని మతిలేని రక్తపాతాన్ని అతను ఎన్నడూ కోరుకోడు.డాన్ యొక్క దూరదృష్టి వేరు.సరే..Sonny అవలంబించిన పోకడలవల్ల తాత్కాలికంగా కొన్ని విజయాలు చేకూరినా ..దానివల్ల Corleone లకి సంబందించిన వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి.Carlo Rizzi నడిపే బుక్ మేకింగ్ కూడా దానిలో ఒకటి.

ఇటుచూస్తే Carlo Rizzi,Connie ల మధ్య కూడా గొడవలు ముదిరాయి.Don కొద్దిగా కోలుకొంటున్నాడు.ఆయన పూర్తిగా వ్యవహారాల్ని చేతిలోకి తీసుకునేదాకా Sonny కాపాడుకోగలిగితే చాలు.అంతా గాడిలో పడుతుంది.

అయితే శత్రువులు మాత్రం ఊరికే ఉంటారా..?తాత్కాలికంగా ఎలాంటి ప్రతిఘటన చేయకుండా ఉన్నప్పటికీ ..వాళ్ళు Sonny ని మట్టుబెట్టడానికి తగు ప్రణాళికలు వేస్తూనేఉన్నారు.

 Connie ఓ రోజు ఇంట్లో ఉండగా ఎవరో ఒకామె ఫోన్ చేస్తుంది.ఆవిడ Carlo Rijji గురించి అడిగి తాను ఈ రోజు ఊరిలో ఉండటం లేదని మరొకరోజు అతన్ని రావలసిందిగా చెప్పమని అంటుంది.దాంతో ఒళ్ళుమండి Connie భర్త తో గొడవ పడుతుంది.వివాదం ముదిరి కొట్టుకుంటారు.వెంటనే తన తల్లి గారింటికి ఫోన్ చేస్తుంది Connie.ఆ ఫోన్ ని అనుకోకుండా Sonny ఎత్తాడు.

" నువు ఎవరినైనా ఇక్కడకి పంపు కారిచ్చి..ఇక్కడనుంచి నేను వెంటనే అక్కడకి రావాలనుకొంటున్నాను" అంది Conni. బావమరిది తన వ్యవహార శైలి ఇంకా మార్చుకోకుడా ఆమెని వేధిస్తున్నందుకు అతనికి ఆగ్రహం కలుగుతుంది.

" ఏమైందసలు.." అడిగాడు Sonny.

" వచ్చినతర్వాత చెబుతాను.. అవన్నీ"  ఆమె గొంతు వణుకు గా ఉన్నది.

అవతల చూస్తే Don నిద్రలో ఉన్నాడు.ఇవన్ని ఇప్పుడు ఆయనకి చెప్పి కలవరపెట్టడం ఎందుకని నిర్ణయించుకొని చెప్పాడు Sonny." సరే..నువ్వు అక్కడే ఉండు,నేనిప్పుడే బయలుదేరి వస్తున్నా " అని..!

అతని లోని కోపం విచక్షణాశక్తిని కోల్పోయేలా చేసింది.ఈ రాత్రి వేళ సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా,బయటకి వెళ్ళడం ..అదీ అవతల అయిదు మాఫియా ఫేమిలీ లు తగు సమయం కోసం చూస్తున్న ఈ తరుణంలో..!

అప్పుడే అటుగా వస్తున్న Tom Hagen చూశాడు Sonny కారు స్టార్ట్ చేస్తుండడాన్ని.అతను వెంటనే దగ్గరలోని ఇద్దరు బాడీ గార్డ్స్ ని పిలిచి Sonny వెనుక రక్షణ గా వెళ్ళవలసిందిగా పురమాయించాడు.ప్రస్తుతం మిగతా మాఫియా ఫేమిలీ లు ప్రశాంతం గానే ఉన్నారు.ఎలాంటి ప్రతిఘటనలు లేవుగదా అని కొంత ఊరట చెందాడు Tom Hagen.

 Sonny కారుని చాలా వేగంగా నడుపుతున్నాడేమో ..బాడీ గార్డ్స్ కూడా వెనకనే ఉండిపోయారు.Carlo ని ఏమి చేయాలో అతనికి స్పష్టత లేదు గాని ముందు వాడికి మళ్ళీ వార్నింగ్ ఇవ్వాలి ..అనుకున్నాడు.కారు లాంగ్ బీచ్ నుంచి పార్క్ వే మీదుగా జోన్స్ బీచ్ కి అవతలవేపుగా పోతున్నది.న్యూయార్క్ లోకి వెళ్ళడానికి ఈ దారైతే ట్రాఫిక్ తక్కువ ఉంటుందని ఎంచుకున్నాడు.ఆ రాత్రిపూట సముద్రం మీదినుంచి వచ్చే ఆ ఉప్పగాలి హాయిగా తగులుతున్నది.Sonny లోని కోపం కూడా మెల్లిగా తగ్గుతున్నది.కారు అద్దాలు పూర్తిగా దించాడు.కాజ్ వే మీద పెద్దగా లైట్లు లేవు.ఒక Toll booth కనిపించడం తో కారుని స్లో చేసుకుంటూ దానిముందు ఆపాడు.దిగి,పర్సు లోనుంచి ఓ నోటు తీసి ఆ Toll booth లో ఉన్న మనిషికి ఇచ్చాడు.చిల్లరగా కోసం చూస్తుండగా..అది కింద పడినట్లుగా అనిపించింది.ఇంతలో మరో విషయం Sonny గమనించాడు.తన కారుని బ్లాక్ చేస్తున్నట్లుగా మరో కారు వచ్చి ఆగింది.దానిలోనుంచి ఇద్దరు మనుషులు దిగారు.Sonny కి ఏం చేయాలో ఆలోచించే సమయం కూడా లేదిప్పుడు..వెనుదిరుగుతుండగా..Toll booth లో ఉన్న మనిషి వెంటనే Sonny పైకి కాల్పులు జరిపాడు.ఇంతలో ఆ ఇద్దరు మనుషులు కూడా Sonny మీదికి బుల్లెట్లు కురిపించారు.తలమీద,మెడ మీద ..బాగా బుల్లెట్లు తగిలాయి.కారులోకి అతి ప్రయత్నం మీద వెళ్ళబోయి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు Sonny.వాళ్ళంతా దగ్గరకొచ్చి ఆ శవం మొహం గుర్తు పట్టకుండా చిత్తడి చిత్తడి గా దానిమీద మళ్ళీ బుల్లెట్లు కురిపించడం చేశారు.కాసేపట్లో ఆ మనుషులందరూ అనవాలు లేకుండా మాయమైపోయారు. ఆ Toll booth తో సహా..!

కాసేపటికి బాడీ గార్డ్స్ ఆ ప్రదేశానికి చేరుకున్నారు.వెంటనే Tom Hagen కి విషయం చెప్పారు. " Sonny's dead.They got him at the Jones beach toll " అని..!

" మీరు వెంటనే..అటునుంచి అటే Clemenza దగ్గరకి వెళ్ళండి.ఏం చేయాలనేది అతను మీకు చెబుతాడు" చెప్పాడు Tom.

(మిగతాది వచ్చేభాగంలో చూద్దాం) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా..!(నలభై ఎనిమిదవ భాగం)

Don భార్య కిచెన్ లో స్నాక్స్ అవీ తయారు చేస్తున్నది.కుమార్తె Connie వస్తుంది గదా అనిచెప్పి..! Tom Hagen తోక కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు.Sonny హత్య కాబడిన వార్త ఆమెకి చెప్పాలా..వద్దా అని తటపటాయించాడు.చివరకి చెప్పకుండా ఉండటమే మంచిది..తగిన సమయం లో Don చెబుతాడులే అని నిర్ణయించుకున్నాడు.చిన్నతనం నుంచి తను,Sonny కుటుంబసభ్యుల్లాగే పెరిగారు.Tom ని కూడా Don దంపతులు ఏరోజు బయటి వ్యక్తిలా,ఒక అనాధలా ఎప్పుడూ చూడలేదు.Tom కి కూడా వారిరువురి మీద అంతే అభిమానం.Don భార్యకి ఎన్నో ఏళ్ళనుంచి అలవాటైపోయింది.తమ కుటుంబం లో ఏవైనా జరగరానిది జరిగినా ,డాన్ చెప్పేంత వరకు దాని గురించి ఆమె అడగదు.తన దైనందిన వ్యవహారాల్ని అలా నడుపుకుంటూ వెళ్ళిపోతుంది.

Tom Hagen చూడటానికి అలా ఉన్నాడే గాని..కాళ్ళలో వణుకు వస్తున్నది ..Sonny హత్య ఉదంతం తెలిసినదగ్గర్నుంచి..!తాను ఈ కుటుంబం లోకి వచ్చిందే నిజానికి Sonny వల్ల..!చిన్నప్పుడు తన క్లాస్మేట్ గా ఉండే Sonny..తల్లిదండ్రులు మరణించి..అనేక బాధల్లో ఉన్న తనను ..ఈ కుటుంబం లోకి తీసుకొచ్చి ..తనని ఇక్కడ ఓ కుటుంబ సభ్యునిగా చేశాడు.సమాజం లో ఈ రోజు తనకి గల పరపతి,హోదా,ధనం..అన్నీ ఆ విధంగా వచ్చినవే..!

తలచుకున్నకొద్దీ చాలా బాధగా అనిపించింది.ఈ Consigliere గా ఉండటానికి తాను తగనేమో..ముఖ్యంగా ఇలాంటి యుద్ధసన్నివేశాలు ఎదురైనపుడు..అని తోచిందతనికి..!మిగతా అయిదు మాఫియా ఫేమిలీలు ప్రస్తుతం ప్రశాంతంగా నే ఉన్నారు గదా అని అనుకున్నాడు తను..ఉన్నట్లుండి ఆశ్చర్యకరంగా ఇలా దెబ్బ తీస్తారని ఊహించలేకపోయాడు.అదే తన స్థానం లో Genco Abbandando ఉన్నట్లయితే తప్పకుండా Sonny విషయం లో కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉండేవాడేమో..!ప్రమాదాల్ని పసిగట్టడం లో,అతనికి గల Shrwedness గాని Cunning గాని... ఒక లెజెండరీ అని చెప్పవచ్చు.ఎందుకంటే గతం లో Don కి సిద్దించిన అనేక విజయాలు Consigliere గా అతని మేధస్సుని తెలియబరుస్తుంటాయి.

ఏదో నిర్ణయానికి వచ్చినవాడిలా అవతల రూం లోకి వెళ్ళి అక్కడనుంచి Connie కి ఫోన్ చేశాడు.ఆమె లిఫ్ట్ చేసింది.

" Connie ..నేను Tom  ని మాట్లాడుతున్నాను.నీ భర్త Carlo Rizzi ని పిలువు.అతనితో నేను మాట్లాడేపని ఉంది.." చెప్పాడు Tom.

"Tom..తను వేరే గదిలో నిద్రపోతున్నాడు.అసలే గొడవ జరిగింది గదా..మళ్ళీ ఇప్పుడు లేపితే లేస్తాడో ..లేదో.." అందామె.

" నువ్వేమి వర్రీ కాకు..అతడిని లేపి Tom లైన్ లో ఉన్నాడని చెప్పు..ఏమీ అనడు"

కాసెపున్న తర్వాత Carlo Rizzi ఫోన్ లోకి వచ్చాడు.

" Carlo..నేను చెప్పేది శ్రద్దగా విను. నువ్వు,Connie వెంటనే బయలు దేరి ఇక్కడ Mall దగ్గరకి రండి.మీకోసం ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఇంటిని స్థిరపరిచాము.నీకు కొన్ని ముఖ్య బాధ్యతలు ఇవ్వబోతున్నాము.ఈ విషయం Connie కి కూడా చెప్పు.." అన్నాడు Tom.

" అలాగే..తప్పకుండా..Tom.." Carlo Rizzi స్వరం లో సంతోషం ధ్వనించింది.

" ఆ..ఇంకొకటి..ఈ రాత్రి Sonny హత్యకి గురయ్యాడు.ఇపుడదేమి Connie కి చెప్పకు.రేపో,ఎల్లుండో ఇంట్లో ఎవరో ఒకరు ఆమె కి చెబ్తారులే.. ఆమె తో మంచిగా ఉండటానికి ప్రయత్నించు నీ భవిష్యత్ మంచిగా ఉండేలా నేను చూస్తాను "

" Tom ..నీ మాట మీద నాకు నమ్మకం ఉంది.కృతజ్ఞతలు.." చెప్పాడు Carlo Rizzi. ఫోన్ పెట్టేశాడు Tom.

Carlo Rizzi పాత్ర Sonny హత్య వెనకాల ఉందా ..అనే అనుమానం Tom కి రాకపోలేదు.కాని ఆ అనుమానం ఎక్కడా రాకుండా అతను Carlo తో మాట్లాడి తాత్కాలికంగా వ్యవహారాన్ని మెత్తబరిచాడు.ఆ రాత్రి Carlo తన భార్యతో గొడవపడటమే గదా కారణం..Sonny కోపంగా బయటకి వెళ్ళడానికి..!దీని వెనుక కొన్ని కనబడని కారణాలు ఉన్నాయి.అవి ..సరే..తగిన సమయం లో బయటబడతాయి.అదీ గాక..ఎవరనీ..ఎప్పుడూ బెదిరించవద్దు అనే Don యొక్క సూత్రాన్ని Tom ఎప్పుడూ శిరోధార్యంగా తీసుకుంటాడు..!

బయట రెండు కార్లు ఆగిన చప్పుడయింది.Tessio,Clemenza  ఇద్దరూ Caporegimes వచ్చారు.వాళ్ళకి అంతకు ముందే ఫోన్ చేశాడు రమ్మని...! ఈ పరిస్థితి లో చేయవలసిన కొన్ని పనుల గురించి.లిక్కర్ కేబినెట్ దగ్గరకి వెళ్ళి ఒక బాటిల్,కొన్ని గ్లాసులు బయటకి తీశాడు.అంతలోనే ఆశ్చర్యకరంగా Don తలుపు దగ్గర కొచ్చి నిలబడి ఉన్నాడు.Tom నివ్వెరపోయాడు.ఫుల్ సూట్ లో మామూలు గా నే ఉన్నాడు.అయితే డ్రెస్ కొద్దిగా లూజ్ అయింది.మొహం లోని ఆ తేజస్సు మాత్రం అలాగే ఉంది.ఆయన్ని ఇటీవల కాలం లో ఇలా చూడ్డం ఇదే మొదటిసారి.

టేబుల్ వెనుక ఉన్న పెద్ద లెదర్ కూర్చీ లోకి వెళ్ళి మెల్లిగా కూర్చున్నాడు." ఏదీ..నాక్కూడా కొద్దిగా ఆ Anisette ని పోసివ్వు.." అన్నాడు Don.Tom కొద్దిగా ఒంపి ఇచ్చాడు.ఆ మద్యం ఇంట్లో తయారయినదే..ఒక మిత్రుడు ప్రతి ఏటా తమ ఇంట్లో వాడకం కోసం దాన్ని తయారు చేసుకుంటూ ,ఏడాదికి ఓ సారి కొంత భాగాన్ని డాన్ కి బహుమతి గా పంపుతుంటాడు. సరే..ఆ ద్రవాన్ని నోట్లో పోసుకుని గ్లాస్ ని టేబుల్ మీద పెట్టాడు డాన్.

"కిటికీ లోనుంచి చూస్తే..నా ఇద్దరు Caporegimes వస్తున్నట్లు కనిపించింది.నా భార్య కూడా పడుకునే ముందర ఏడుస్తున్న శబ్దం అయ్యింది.నా ప్రియమైన Consigliere ,చెప్పు..అసలు విషయమేమిటి.." అడిగాడు Don.

"Mama తో నేనేమీ చెప్పలేదు.మీతో కాసేపు ఆగిన తర్వాత ప్రత్యేకంగా చెబుదామనుకున్నాను.ఇంతలో మీరే వచ్చారు.." Tom చెప్పాడు.

Don Corleone కాసేపు అలాగే నిశ్శబ్దంగా ఉండి తర్వాత అన్నాడు.

"Tom ..నీకిప్పుడు కొద్దిగా డ్రింక్ అవసరం..తీసుకో.."  అని.

ఒకరకంగా చెప్పాలంటే అది నిజమే..! తన వొంటిలో కొద్దిగా షివరింగ్ ఉన్న మాట నిజం.ఇలాంటి సమయం లో అవసరం కూడా అది.

"Sonny ని ఇందాకనే  కాజ్ వే మీద కాల్చి చంపారు వాళ్ళు.." కొద్దిగా నోట్లో ద్రవం పోసుకుంటూ చెప్పాడు Tom.

ఆ మాట విన్న వెంటనే డాన్ మొహం లో కొద్దిగా దిగ్భ్రాంతి కలిగింది.వెంటనే సర్దుకున్నాడు.రెండు అరచేతుల్ని డెస్క్ మీద ఆనించి ..సూటిగా Tom కళ్ళలోకి చూశాడు.

"అసలేమి జరిగింది చెప్పు..! ప్చ్..ఇప్పుడే వద్దు..Clemenza,Tessio లు కూడా లోపలకి రానివ్వు.అందరకీ కలిపి ఒకేసారి చెబ్దువు గాని.." అని అన్నాడాయన.అంతలోనే వాళ్ళిద్దరు లోపలకి వచ్చారు.డాన్ లేచి వారిని  ఆహ్వానించాడు.ఆ ఇద్దరు ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు.ముగ్గురు డ్రింక్స్ తీసుకున్నారు.

" నా కుమారుడు చనిపోవడం నిజమేనా.." Don అడిగాడు Clemenza వేపు చూస్తూ..!

" అవును..నిజమే..ఆ బాడీ గార్డ్స్ కూడా నమ్మదగిన వారే..నేను పెట్టినవాళ్ళే..ఎక్కడో ఓ పొరపాటు జరిగింది.అది శత్రువులు ఉపయోగించుకున్నారు.." చెప్పాడు Clemenza.కాసేపు అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాడు Don. ఒక చేయి అలా పైకెత్తి చెప్పాడాయన చివరకి.

" మీరెవరూ ఈ విషయాన్ని ఇక ముందు ఎక్కడా ప్రస్తావించవద్దు.అంతే కాదు కక్ష తీర్చుకోవడం లాంటివి కూడా చేయద్దు. అసలు ఇది మీకు సంబందించని విషయం గా చూడండి. ఎలాంటి ఎంక్వైరీలు కూడా చేయద్దు..అర్ధమయింది గదా.." అడిగాడు Don .ఆ ముగ్గురు అలాగేనన్నట్లు తలలూపారు.

మళ్ళీ చెప్పాడాయన.

" ఈ రాత్రికి మనం Sonny బాడీకి అంత్యక్రియలు జరపాలి.అది ముఖ్యం ఇపుడు.We must bury him as a Christian ..!ఆ..Clemenza ..నువు నాకు ఈ పని లో బాడీ గార్డ్ గా వుండు.ఇక ..Tessio ..నువు మన వాణిజ్య సముదాయాల్ని కాపాడే విధంగా ..నీ మనుషుల్ని నియోగించు.. ఆ Tom ..నువు వెంటనే Amerigo Bonasera కి ఫోన్ చెయ్.. గంట..రెండు గంటల్లోగా ఇది జరిగిపోవాలి.అర్ధమయింది గదా.." డాన్ సూచనలు ముగ్గురూ పైకి లేచారు.

" ఆ..Clemenza ..నీ మనుషులతో ఇంకా కొన్ని కార్లతో .. నా కోసం బయట వేచి ఉండు.కొన్ని నిమిషాల్లో వచ్చి నీతో జాయినవుతాను." డాన్ మాటలకి సరేనన్నాడతను.వాళ్ళిద్దరూ వెళ్ళినతర్వాత Tom Hagen ని దగ్గరకి పిలిచాడు డాన్.

" Tom ఓ ముఖ్య విషయం..Connie కి,Sandra కి,Mama కి ఇంకా వారి దగ్గర ఫ్రెండ్స్ అందరకీ చెప్పు..! రేపు చర్చ్ లో Sonny ఆత్మ రక్షణార్ధం జరిగే ప్రార్దన ల్లో ఫాల్గోవడానికి సిద్ధపడి ఉండమని చెప్పు.." సూచన చేశాడు డాన్.

తప్పకుండా అన్నట్లుగా తలవూపి Don వస్తున్నప్పుడు.. ఎదురుగా ఉన్న తలుపుని మర్యాదగా తీసి పట్టుకున్నాడు Tom.ఒక్క క్షణం డాన్ Tom కేసి అలానే చూసి అతన్ని ముద్దాడి కౌగలించుకున్నాడు ఉద్వేగంగా..!

"You have been a good son...You comforted me"  అన్నాడు Don తన మాతృభాష అయిన ఇటాలియన్ లో..!

ఆ తర్వాత అయన తన బెడ్ రూం లోకి వెళ్ళిపోయాడు.అదిగో..సరిగ్గా ..ఆ సమయం లోనే..Amerigo Bonasera కి Tom ఫోన్ చేశాడు .. గాడ్ ఫాదర్ కి నీ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని..!

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము) --KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా  (నలభై తొమ్మిదవ భాగం) (Book-5 Started)

Sonny Corleone హత్య ఉదంతం మాఫియా ప్రపంచం లోని ఇతర ఫేమిలీ ల మధ్య కలకలం రేపింది.Don Corleone ఆరోగ్యం కుదుటబడి వ్యవహారాల్ని చక్కదిద్దుకుంటుండడం అందరూ గమనిస్తున్నారు.పరిణామాలు ఎలా ఉండబోతాయేమోనని ఎవరి జాగ్రత్తలో వారు ఉండసాగారు.ఒకసారి దెబ్బతిన్నంత మాత్రాన డాన్ ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.అతను ఎప్పుడూ తన ప్రతి పోరబాటునుంచి ఒక గుణపాఠం నేర్చుకుండానికి సిద్ధంగా ఉంటాడు.అది వారికి బాగా తెలుసు.

అయితే అశ్చర్యకరంగా Don Corleone మిగతా శక్తివంతమైన మాఫియా ఫేమిలీ అధినేతలందరకీ శాంతి చర్చల కోసం కబురు పెట్టాడు.మతి లేని హింసాకాండ కి ఇక అంతం పలకాలని.ముఖ్యంగా న్యూయార్క్ లోని మాఫియా ఫేమిలిలు చాలా శక్తివంతమైనవి.మొత్తం అమెరికా దేశాన్ని ప్రభావితం చేయగలవవి.ఈ శాంతి చర్చల కోసం పిలిచి ఒకేచోట మాఫియా పెద్ద తలకాయలనన్ని ఒకేసారి లేపెయ్యడు గదా అని కొంతమంది అనుమానించకపోలేదు.

Bocchicchio ఫేమిలి సభ్యుల యొక్క సేవల్ని ఈ విషయం లో Don కోరడం తో ఆయన శాంతి ప్రపోజల్స్ లో నిజాయితీ ఉన్నదని అందరూ విశ్వసించారు.ఈ Bocchicchio ఫేమిలీ ..ఈ పరివారం గురించి కొంత చెప్పుకోవాలి.వీళ్ళు సిసిలీ నుంచి మూడు తరాల కిందట అమెరికా కి ప్రవాసం వచ్చినవాళ్ళు.చాలా మొరటు మనుషులు.న్యూయార్క్ నగరం లో Garbage hauling బిజినెస్ లోకి ప్రవేశించి బాగానే సంపాదించారు.వీళ్ళు సిసిలీ లోని దక్షిణప్రాంతం లో ఒకప్పుడు బాగా దందాగిరి నడిపించినవాళ్ళు.అక్కడి మిల్లులు,ఇంకా నీళ్ళ వ్యాపారం లో వీరి మోనోపలి నడిచేది.అడ్డం వచ్చినవాళ్ళని అయిపు లేకుండా చేసేవారు.చివరకి ఇటలి ప్రభుత్వానికి కూడా ఎదురు తిరిగి ప్రాజెక్ట్ పనుల్ని కానివ్వకుండా చేసేవారు.వీరి దురదృష్టం పండి ముస్సోలిని వంటి కౄర నియంత అదేసమయం లో  ఇటలీ పగ్గలు చేపట్టాడు.అదనపు బలగాల్ని పంపి దొరికిన వారిని దొరికినట్లు చంపించివేశాడు.మిగిలిన ఫేమిలీ సభ్యులంతా ఆ టార్చర్ ని భరించలేక అమెరికా కి వెళ్ళే ఓడ ఎక్కి వచ్చేశారు.ఇప్పుడిదిగో..వీరిది ఇక్కడ మూడో జనరేషన్...వెనక వాళ్ళు..ముందు వాళ్ళు అంతా కలిపి రెండు వందలమంది దాకా  ఉంటారు.భార్య మీద కంటే ఆ వంశం యొక్క  కట్టు మీదే వారికి నమ్మకం ఎక్కువ.తమ లోని ఏ ఒక్క సభ్యుడిని బయటి వారు ఎవరు చంపినా వారందరూ మూకుమ్మడిగా కలసి వాళ్ళని చంపి పాతరేసేదాకా ఊరుకోరు.ఆ ప్రయత్నం లో వారికేమైనా లెక్కచేయరు.వెన్నుపోటు పొడవడం,అబద్దాలు ఆడటం లాంటి వాటిల్లో వాళ్ళు అంత నిష్ణాతులు కారు.అంతా బాహాటం గానే ఉంటుంది.

వీళ్ళ ప్రత్యేకత ఏమిటంటే ,ఈ అమెరికా లో మాఫియా ఫేమిలీ ల మధ్య ఏవైన చర్చలు జరుపుకునేటపుడు అవతల పక్షం సేఫ్టీ కి గ్యారంటీగా వీరి కుటుంబ సభ్యుడిని పంపించుతారు.దీనికి గాను వీళ్ళకి సదరు పక్షం కొంత ఫీజు చెల్లించాలి.ఒక ఉదాహరణ చెప్పుకుందాం.

 Solozzo చర్చల కోసం Michael ని పిలిచినపుడు అతని సేఫ్టీ కి గ్యారంటీ ఇస్తూ ఒక Bocchicchio కుటుంబ సభ్యుడిని Michael ఇంటికి పంపించాడు.అంటే Solozzo గనక Michael ని చంపితే ఇవతల వీరు Bocchicchio సభ్యుడి చంపుతారు.అలా జరిగిన పక్షం లో ఆ వంశ పరివారమంతా Solozzo కి సంబందించిన ప్రతి ఒక్కరిని చంపి పారేస్తారు.అటువంటి తెగింపు ఉన్నవారు.గనక అలాంటి పిచ్చిపని ఎవరూ చేయరు.ఇప్పుడు Don కూడా ఈ Bocchicchio కుటుంబ సభ్యుడిని మాఫియా హెడ్ ల సేఫ్టీ కోసం వాళ్ళ దగ్గరకి పంపిస్తున్నాడు.కాబట్టి డాన్ ఏర్పాటుచేసే శాంతి చర్చలు నిజాయితి తో కూడుకున్నవని మిగతా అంతా విశ్వసించారు.

సమావేశం జరిపే ప్రదేశాన్ని కూడా నిర్ణయించాడు.ఒక ప్రైవేట్ బ్యాంక్ లో గల మీటింగ్ హాల్ లో జరుగుతుంది.ఆ బ్యాంక్ ప్రెసిడెంట్ Don Corleone కి చిరకాల మిత్రుడు.ఆ బ్యాంక్ షేర్లు కూడ ఓ పావు వంతు దాకా Don కి ఉన్నాయి..అయితే వాటినన్నిటిని తన పేరు మీద కాక ఆ ప్రెసిడెంట్ పేరు మీద నే ఉంచాడు. అనేకసార్లు అతను డాన్ ని కోరాడు " నీ పేరు మీదనే ఇవి మార్చేసుకో ..ఎందుకైనా మంచిది..ఎప్పుడేమి జరుగుతుందో ఎవరికి తెలుసు.." అని..! కాని డాన్ సున్నితం గా తిరస్కరించేవాడు " నిన్నే నేను నమ్మలేనట్లయితే ..ఇక ప్రపంచం లో ఎవరిని విశ్వసించలేను..మానవ జాతి మీద గల ఏ కొద్ది నమ్మకమున్నా నాలోనుంచి మాయమవుతుంది.." అంటూ విభేదించేవాడు.

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము)  --KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (యాభై వ భాగం)

న్యూయార్క్ లోని ఇంకా ఇతర ప్రధాన ప్రాంతాలకి చెందిన మాఫియా ఫేమిలీ ల హెడ్ లందరూ Don Corleone ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ కి ఒక్కొక్కరే వస్తున్నారు.ఉదయం ఇంచుమించి పది అవుతున్నది.మొదటిగా వచ్చిన వ్యక్తి Carlo Tramonti.అమెరికా లోని దక్షిణ ప్రాంతం లో అతని వ్యాపార సామ్రాజ్యం ఉన్నది.Gambling,Prostitution వంటి రంగాల్లో ఉన్నాడు.Pleasure Resorts లో కూడా అతని పెట్టుబడులు ఉన్నాయి.Cuba ఇంకా Batista వంటి ప్రాంతాల్లోనూ అతనికి లావాదేవీలు ఉన్నాయి.Carlo Tramonti ఇంకా Don Corleone సుహృద్భావం తో కరచాలనం చేసుకున్నారు.

ఆ తర్వాత Joseph Zaluchi వచ్చాడు.Detroit ప్రాంతం లో Horse racing tracks వ్యాపారం లో ప్రధానంగా ఉన్నాడతను.Gambling లో కూడా భాగస్వామ్యాలు ఉన్నాయి.అతను వచ్చీ రావడం తోనే Don Corleone ని కౌగలించుకున్నాడు.

"Only your voice could have brought me here " చెప్పాడు ఆదరంగా Joseph.అది నా భాగ్యం అన్నట్లుగా తలని బౌ చేశాడు Don Corleone.

ఆ తర్వాత Frank Falcone,Anthony Molinori లు వెస్ట్ కోస్ట్ నుంచి వచ్చారు.ఆ ప్రాంతం లో Gambling,Prostitution,Water fronts,restaurents  వంటి రంగాల్లో ఉన్నారు వాళ్ళు.Dope Smuggling లో కూడా వారి చేతులున్నవి.ఆ తర్వాత Bostan ఏరియా కి సంబందించిన Domenick Panza వచ్చాడు.మిగతా ఏరియాలతో పోల్చితే ఇక్కడ నేరాల రేటు ఎక్కువ.ఇతని ఏరియా లోని కార్యకలాపాల్ని ఆర్గనైజ్ చేయడం లో కొంత లోపం లేకపోలేదు.ఇహ వీళ్ళందరి తర్వాత ప్రధానమైన న్యూయార్క్ ఫేమిలీలు వచ్చాయి.Anthony Stracci ..న్యూజెర్సీ ప్రాంతం లోని Docks లోను,షిప్పింగ్ లోను బలంగా ఉన్నా ఫేమిలీ అతనిది.డెమొక్రాట్ ల అండ ఉన్నది ..!రోడ్ కాంట్రాక్ట్స్ లో కూడా వారి హస్తముంటుంది.ఆ పిమ్మట అప్పర్ న్యూయార్క్ స్టేట్ ని కంట్రోల్ చేసే Ottilio Cuneo వచ్చాడు.పాల ఉత్పత్తులకి సంబందించిన పరిశ్రమలున్నాయి తనకి.ఇహ Emilio Barzini .. అతనికి Bronx లో  స్పోర్ట్స్ బెట్టింగ్,బిజినెస్ ఉంది.బ్రూక్లిన్ లో గేంబ్లింగ్,ప్రాస్టిట్యూషన్ బిజినెస్ లు ఉన్నాయి.వాల్ స్ట్రీట్ లోను అతని కాలు ఉన్నది.

ఇక చివరిగా వచ్చింది Philip Tattaglia. వారి ఫేమిలీ కి Corleone ఫేమిలీ కి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.ప్రత్యక్ష శత్రువులు.నైట్ క్లబ్స్,ప్రాస్టిట్యూషన్ బిజినెస్ లో ఉన్నారు Tattaglia లు.Philip Tattagliya కొడుకు Bruno ,Don Corleone కొడుకు Sonny ఇటీవల జరిగిన అంతర్యుద్ధం లో మరణించిన విషయం తెలిసిందే.

మాఫియా డాన్ లంతా వచ్చి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు.ఒక్కొక్క డాన్ కి ఒక్కో సహాయకుడు ఉన్నారు.వాళ్ళు తమ డాన్ కి వెనకాల,ఓ పక్కగా కూర్చున్నారు.డాన్ అనుమతిస్తే తప్ప వాళ్ళు మాట్లాడరు.రక్షణ పరంగా ఓ కన్ను వేసి ఉంచుతారు.

Don Corleone పైకి లేచాడు తన చైర్ లోనుంచి. మాట్లాడుతున్నాడు.

" ఇక్కడకి ..నా పిలుపుని అందుకొని వచ్చిన మీ అందరకి కృతజ్ఞతలు.ఈ సమావేశానికి వచ్చిన మీ అందరకి నేను నిజంగా ఋణపడిఉన్నాను.

మిత్రులారా..మీతో వివాదం చేయడానికి గాని...ఒప్పించడానికి గాని నేనిక్కడకి మిమ్మల్ని పిలవలేదు.మీ అందరకీ బాగా తెలుసు.నేను మాటకి విలువనిచ్చే మనిషినని.అంత తొందరగా కూడా నేను మాట ఇవ్వను.అదీ మీకు తెలుసు.ఇక్కడ ఉన్న మనం అందరం స్వతంత్రులం..సమాజం లో గౌరవం ఉన్నవాళ్ళం..! ఒకరకి ఒకరు ష్యూరిటీలు ఇచ్చుకోవలసిన అవసరం మనకి లేదు అని నేను భావిస్తున్నాను.."

అలా అని కాసేపు Don Corleone తన మాటల్ని ఆపాడు.ఎవరైనా ఏమైనా చెబుతారేమో అని వేచి చూశాడు.అందరూ శ్రద్ధగా తనని ఆలకిస్తున్నారు.ఈ మాఫియా డాన్ లందరకి ఉన్న ఒక లక్షణం ఏమిటంటే మంచిగా వినడం.సరే..అని చెప్పి Don Corleone తన ప్రసంగాన్ని కొనసాగించాడు.

" మిత్రులారా..ఇప్పటిదాకా..మన వ్యవహారాలన్నీ ఎలా సాగాయి " అంటూ నర్మగర్భంగా నవ్వాడు.మళ్ళీ కొనసాగించాడు.

" సందేహం లేదు.కొంత మూర్ఖత్వం గానే సాగాయి.దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.నిజానికి అవి అర్ధం లేని అనవసరమైన విషయాలే."

మళ్ళీ డాన్ కాసేపు ఆగి..కొద్దిగా కూల్ డ్రింక్ ని నోట్లో పోసుకున్నాడు.

" థాంక్ గాడ్..నా ఆరోగ్యం కుదుటపడింది.వ్యవహారాలన్నీ చూసుకోగలుగుతున్నాను.అవును..నా కుమారుడు ..Sonny కొద్దిగా రాష్ గా వెళ్ళే మనిషే..కొంత తలబిరుసు కూడా ఉంది అతనికి ..కాదనను.సరే..Solozzo ఆ రోజు నా దగ్గరకి నార్కోటిక్స్ బిజినెస్ డీల్ కోసం వచ్చినపుడు..నేనతనికి చాలా మర్యాదగా చెప్పాను.దానిలో నేను వేలు పెట్టలేను.అది నా అభిరుచికి సరిపడని విషయం...అని! కాని Solozzo దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు.ఇంత రాద్ధాంతానికి కారణమయ్యాడు." డాన్ మళ్ళీ కాసేపు ఆగాడు.Tom Hagen ఇచ్చిన డ్రింక్ ని కొద్దిగా త్రాగాడు.మళ్ళీ మాట్లాడటం మొదలెట్టాడు.

" Philip Tattaglia  ..అతని కొడుకుని కోల్పోయాడు.నేనూ నా కొడుకు ని కోల్పోయాను.మంచో ..చెడో..జరిగిందేదో జరిగింది.దీన్ని ఇంతటితో వదిలేద్దాం.ఎల్లకాలం ఆ కక్షల్నే పట్టుకొని వేలాడటం ఏం సబబు..?నా కొడుకు Sonny ని చంపిన వాళ్ళు ఎవరనేది నేను ఆరా తీయదలుచుకోలేదు.నా మనుషులందరకీ చెప్పాను..ఆ విషయం లో ఎలాంటి విచారణలు చేయొద్దని..!ఈ గొడవలు ఎల్లకాలం కొనసాగడం నాకిష్టం లేదు.అదీగాక నా ఇంకొక కొడుకు Michael ప్రవాసం లో ఉన్నాడు.అతణ్ణి నేను క్షేమంగా ఇక్కడకి తీసుకురావాలి.ఆ విషయం లో మీ సహకారాన్ని నేను కోరుతున్నాను.ఇరు పక్షాలకి లాభం కలిగేలా చేయడానికి ఏది చేయమన్నా నేను సిద్ధంగా ఉన్నాను." ఆ విధంగా మాట్లాడి Don Corleone కూర్చున్నాడు.

దానికి సమాధానం చెప్పడానికా అన్నట్లు Emilio Barzini పైకి లేచి నిలబడ్డాడు.

" Solozzo గాని Tattaglia లు గాని నార్కోటిక్స్ బిజినెస్ విషయం లో Don Corleone ని సాయమడగటం తప్పుకాదు.ఆయనకి జడ్జ్ ల వద్దగాని,పోలీస్ వర్గాల వద్ద గాని పలుకుబడి ఉన్నది.దాన్ని సాటి వారి కోసం ఉపయోగిస్తే తప్పేముంది.ఒకరికొకరు సహాయం చేసుకోవడం లో అందరం వృద్ది చెందుతాం గదా..! నార్కోటిక్స్ లో పెద్ద ఎత్తున ధనం ఉంది.మనం ఊరుకున్నా దానిలోకి ఎవరో ఒకరు వస్తారు.మీరు చేసే సాయం ఊరికినే ఏమీ వద్దు.దానికి బిల్ ఇస్తే..మేము కడతాం.It's that simple."  అలా చెప్పి Barzini కూర్చున్నాడు.కొద్దిగా Tattaglia ల వేపు మద్దతు కనిపించింది అతని మాటల్లో..!

"Don Corleone లేచాడు..!

" మై ఫ్రెండ్స్..ఏ రోజయినా మీరడిగినా ఏ ఫేవర్ అయినా నేను చేయకుండా ఉన్నానా..?అది నా స్వభావం లోనే లేదు.మరయితే నార్కోటిక్స్ విషయం లో నేనెందువల్ల కాదన్నాను..మీరు అర్ధం చేసుకోలేరా దాన్ని..ఒకసారి ఆలోచించండి.డ్రగ్స్ బిజినెస్ అనేది మిగతా వాటిల్లాంటిది కాదు.గేంబ్లింగ్,ప్రాస్టిట్యూషన్,బెట్టింగ్ అవి వేరు.ఇది వేరు.ప్రజల్లో డ్రగ్స్ పట్ల అంత సానుకూలత ఉండదు.నా మిత్రులైన జడ్జ్ లు గాని,పోలీస్ అదికారులు గాని దానిని హర్షించరు.లేదు..నేను ఆ విషయం లో సాయం చేయాల్సిందే అని మీరు నన్ను కోరుతున్నట్లయితే నా వ్యవహారాల్లో నేను కొన్ని మార్పులు చేసుకోవలసి ఉంటుంది."  చెప్పాడు Don Corleone .

ఆ మీటింగ్ జరుగుతున్న గది రిలాక్స్ అయినట్లయింది.మిగతావారు తమలో తాము చర్చించుకోసాగారు. ఇలా ఉండగా Frank Falcone లేచాడు.

" Don Corleone మనకి ఇచ్చిన ఈ Concession నిజంగా హర్షించదగినది.డ్రగ్స్ లో ఉన్న ధనం ఊహించలేనిది.ఎవర్నీ దాని లోకి పోకుండా మనం ఆపలేం.అయితే ఒకటి ..ఆ రంగాన్ని కుక్కలు చింపిన విస్తరి లా మనం వదిలి వేయకూడదు.మనం దాన్ని క్రమపద్ధతి లో మానిటర్ చేయాలి.There has to be control,there has to be protection,there has to be organization ..!We can't have everybody running around doing just what they  please like a bunch of Anarchists..."

ఆ మాటల్ని సావధానంగా విన్న Don Corleone తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు.



(మిగతాది తర్వాత భాగం  లో చూద్దాము)--KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (యాభై ఒకటవ భాగం)

" తప్పకుండా మనం ఆ బిజినెస్  కంట్రోల్ లో ఉంచుకోవలసిందే.అయితే స్కూళ్ళ పక్కన గాని,పిల్లలకి గాని దూరంగా ఉండేట్లు చూడాలి.మా ఏరియా లో ఈ డ్రగ్ ట్రాఫిక్ ని నల్లజాతి ఇంకా కలర్డ్ ప్రజలకి దగ్గరగా ఉండేలా చూస్తాను.వాళ్ళే బెస్ట్ కస్టమర్స్.పెద్దగా సమస్యలు కూడా ఏమీ ఉండవు.ఎలాగు జంతు ప్రాయులే గదా వాళ్ళు.They have no respect for their wives or their families or for themselves.Let them lose their souls with drugs.We just can't let people do as they please and make trouble for everyone" ఆ విధంగా  Detroit Don తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

అతను మాట్లాడినదానికి తమ ఆమోదం ఉన్నట్లుగా మిగతావాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోసాగారు.ఆ విధంగా ఆ డాన్ లందరి కలయికవల్ల కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి.Don Corleone మిగతా వారికి డ్రగ్స్ బిజినెస్ విషయం లో తన పలుకుబడిని కొన్ని వర్గాల్లో ఉపయోగించాలి.ఆయన ప్రత్యక్షంగా ఆ బిజినెస్ లోకి రాకపోయినా ఫర్వాలేదు.ఎటువంటి పోరాటాలు లేకుండా ప్రశాంతవాతావరణాన్ని కల్పించాలి.చిన్న చిన్న తేడాలు ఏమైనా వచ్చినా ఒకరికొకరు చర్చించుకోవాలి లేదా ఈ కమిటీ ద్వారా పరిష్కరించుకోవాలి.కాని హింసాత్మక ఘటనలకి దిగరాదు...ఇలా నిర్ణయాలు తీసుకున్నారు.

అయితే Philip Tattaglia ఒక్కడు మాత్రం కొద్దిగా అసంతృప్తిగా ఉన్నాడు.Don Corleone కొడుకు హత్య కి గాను ఆయన తన మీద ప్రతీకార చర్యలు భవిష్యత్ లో చేపట్టడని గ్యారంటీ ఏముంది..అదీ అతని ఆందోళనకి కారణం...!

కాబట్టి తన సమస్యని మిగతా అందరిముందు ఉంచడానికి ఉద్యుక్తుడయ్యాడు.

" నాకు Corleone కుటుంబం నుంచి మాట కావాలి.Don యొక్క కొడుకు Sonny హత్యకి ప్రతీకారంగా ..నా మీద ఆయన పగ తీర్చుకోడని గ్యారంటీ ఏముంది..?ప్రతీ రోజు మీరంతా నా పక్కనే ఉండి కాపాడలేరుగదా..నా రక్షణ గురించి నేనూ ఆలోచించుకోవాలి గదా.." అన్నాడు Tattaglia.

ఆ మాటలకి గాను Don Corleone చెప్పిన సమాధానం ఓ గొప్ప రాజనీతిజ్ఞుని తలపించిది.ఎంతో దూర దృష్టి తో ఒక దేశ భవిష్యత్ ని తీర్చిదిద్దిన ఓ చర్చిల్ లాగా అనిపించాడు.

" ఒక Reason కి కట్టుబడి ఉండకపోతే ,Reason ని గౌరవించకపోతే మనం ఎలాంటి మనుషులం అనబడతాం..?అప్పుడు మనకి,మృగాలకి తేడా ఏముంది..మనం మనుషులమే గాని జంతువులమైతే కాదు గదా..We reason with each other..ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా.. ?

నా కొడుకు హత్య గావింపబడ్డాడు.నిజమే.నేను దాన్ని భరించాలి.తప్పదు.అలా అయింది గదాని చెప్పి నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని దుఖ మయం చేయగూడదు గదా..నేను ఇప్పటికే మాట ఇచ్చాను.దీన్ని మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నాను.నా పూర్ణ హృదయం  లోనుంచి చెబుతున్నా ..నాకు Tattaglia ల మీద కక్ష తీర్చుకునే ఉద్దేశ్యం లేదు.

ఒకసారి ఆలోచించండి.మనం అంతా ఎవరము..We are not fools..we are masters of our thoughts and actions.ఎక్కడో సిసిలీ నుంచి ఇక్కడకి వచ్చాము.ఈ అమెరికా లో ధనాన్ని,శక్తి ని ఆర్జించాము.ఆ సిసిలీ లో కొండ ప్రాంతాల నడుమ వైరి పక్షాన్ని చంపడమే ధ్యేయంగా జీవించిన మన పూర్వికుల లాగే మనమూ మిగిలిపోవాలా..అయినదానికి,కానిదానికి ఇలా తుపాకులు దూసుకుంటూ రక్త పాతం చేసుకుంటూ దిన దిన గండం గా బ్రతకడం లో అర్ధం ఏమైనా ఉందా..?ఇంకా ముందుకి వెళ్ళి ఆలోచించుదాం..జీవితం గురించి..! రోజులు మారుతున్నాయి..రాజ్య స్వభావం మారుతున్నది.దానికనుగుణం గా మన పోకడలు మార్చుకోవాలి.ఇప్పుడు చీకటి వ్యాపారాలు గా పిలువబడుతున్నవన్నీ సమీప భవిష్యత్ లో తప్పనిసరిగా రాజ్యం ఆమోదించక తప్పదు.జరుగుతున్న పరిణామాల్ని జాగ్రత్తగా గమనించండి.ఈ ప్రపంచమే గుప్పిటలో ఉంటుంది మనం కలిసిఉన్నట్లయితే..!దానికనుగుణంగా మారాలి మనం.ఇప్పటికే మీ సంతానం లో అనేకమంది గొప్ప సైంటిస్టులు గాను,సంగీతకారులుగాను,ప్రొఫెసర్లు గాను ఇంకా ఇతరులు గాను అయినారు గదా..!మన గత తరాలవారితో పోల్చితే మనం ఎంత అదృష్టవంతులం..అది ఆలోచించారా..!ఏమో ఎవరు చెప్పొచ్చారు.. రేపు మీ మనవళ్ళు గవర్నర్లు కావచ్చును..లేదా ఈ దేశ అధ్యక్షుడు కావచ్చును..కాదండానికి ఏముంది..ఈ అమెరికా లో సాధ్యం కాని విషయం ఏమైనా ఉన్నదా! ..We have to be cunning like the business people..that's not for us,for our children and our grand children.

మన ప్రపంచంలోని సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి.దీంట్లోకి వేరెవరినో రానిచ్చి వాళ్ళచేత ముగుతాడు వేయించుకోవాలా మనం..వాళ్ళ చేతుల్లో తోలుబొమ్మల్లా ఆడాలా మనం..వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చెబుతున్నా..నా కొడుకు హత్య కి సంబందించి నేను ప్రతీకారం తీర్చుకోదలచుకోలేదు.

అయితే నాకూ ఒక స్వార్ధం ఉన్నది.నా చిన్న కొడుకు Michael ఇపుడు ప్రవాసం లో ఉన్నాడు.అతడిని నేను ఇక్కడకి తెచ్చుకోవాలి.అతని నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి ఈ దేశం లో..సరే..అదంతా నా వ్యక్తిగతమైన విషయం..నేను చూసుకుంటాను.ఆ విషయానికి సంబందించి మీరు నాకు ఎక్కడా అడ్డు రాకూడదు.అంతే కాదు అతనికి ఎలాంటి ఆపద కాని ఆక్సిడెంట్ గాని జరగకూడదు.నీటిమీద గాని,భూమి మీద గాని అతనికి ఎలాంటి అపాయం జరిగినా నేను ఇక్కడున్న వారినే అనుమానించక తప్పదు.దాన్ని నేను క్షమించలేను.ఆ విధంగా జరగదనే భావిస్తున్నాను."

ఆ విధంగా Don Corleone చెబుతూ తన చైర్ లోనుంచి మెల్లిగా లేచి ..Tattaglia దగ్గరగా వచ్చాడు.అతను మర్యాదగా లేచి నిలబడ్డాడు.వెంటనే Don అతన్ని ప్రేమపూర్వకంగా ,భరోసా ఇస్తున్నట్లుగా కౌగలించుకున్నాడు.మిగతా అందరూ లేచి చప్పట్లు కొట్టారు.వారి మిత్రత్వం మళ్ళీ చిగురులు తొడగాలని అభినందనలు తెలిపారు.

(మిగతాది వచ్చే భాగంలో చూద్దాము) --KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (యాభై రెండవ భాగం)

ఇంచుమించు గా సాయంత్రం అది...! Don ఇంకా Tom లు ఇద్దరూ మాల్ లో ఉన్న ఇంటికి వచ్చేశారు.అవీ ఇవీ మాట్లాడుతున్నప్పుడు డాన్ యధాలాపంగా అన్నాడు." Tom..మన కారుని ఇందాక డ్రైవ్ చేశాడే Lampone ..అతని మీద ఓ కన్ను పెట్టి ఉంచు.అతని లో ఒక స్పార్క్ ఉంది.ఇంకా మంచి పనిని అతనికి అప్పగించవచ్చు భవిష్యత్ లో.."

Don Corleone యొక్క సునిశిత దృష్టికి ఆశ్చర్యం కలిగింది Tom కి..!ఆ మీటింగ్ హాల్ కి వెళ్ళినపుడు ..డాన్ కారు దిగుతున్నపుడు అతను కారు డోర్ తెరిచిన విధానం కాని,ఆ తర్వాత బయటనే ఉండి గార్డ్ చేసిన విధానం గాని ..మొత్తానికి Lampone లో ఏదో కనబడింది డాన్ కి.

ఆ రాత్రి పది గంటల సమయం లో Clemenza ని Tessio ని పిలిచాడు Tom Hagen ..!అంతా డాన్ దగ్గరకి వచ్చి మాట్లాడుతున్నారు.మీటింగ్ లో విశేషాల్ని వాళ్ళిద్దరకి చెప్పాడు Tom.

" నేను వాళ్ళందరకీ మాటిచ్చాను.మీరు కూడా దానికి తగినట్లు ప్రవర్తించండి.సరే..అలాగని పూర్తిగా వదిలేయకుండా మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి.ఎందుకంటే మన ఆ మిత్రులు మరీ నమ్మదగినవారేమీ కాదుగదా..!ఈ సారి ఎలాంటి పొరపాట్లకి మనం ఆస్కారం ఇవ్వగూడదు.." చెప్పాడు Don.

 మళ్ళీ Tom వేపు తిరిగి అన్నాడు.

"అన్నట్టు Bocchicchio మనిషిని వెనక్కి పంపించేశావా.."

" అక్కడ మన మీటింగ్ అయినవెంటనే ఆ పని జరిగిపోయింది.ఇబ్బంది లేదు" చెప్పాడు Tom.

ఆ నలుగురు ఒకరకంగా ఆ గది లో రిలాక్స్డ్ గా ఉన్నారు.ప్రస్తుతం కొంత ప్రశాంత వాతావరణం నెలకొన్నది.అదీ ఒకందుకు మేలే..! డాన్ లేచి కేబినెట్ దగ్గరకి వెళ్ళి అందరకి డ్రింక్స్ గ్లాసుల్లో పోసి ఇచ్చాడు.

" ఇప్పుడు నెలకొన్న శాంతి ని భగ్నం చేయడం నాకు ఇష్టం లేదు.ముఖ్యంగా Michael ఇంటికి మళ్ళీ సురక్షితంగా రావాలి.అది ముఖ్యం అన్నిటికంటే..!పోలీస్ లకి ఉన్న ఇన్ఫార్మర్స్ ద్వారా అసలు విషయం కొంత వారికి తెలిసి ఉండవచ్చు.అయితే ఇప్పుడు మనం ఓ పని చేయాలి..మన మిగతా మాఫియా ఫేమిలీల మిత్రుల యొక్క వేగుల ద్వారా భిన్న కధనాలు పోలీస్ లకి చేరేలా చేయాలి.అప్పుడు వ్యవహార తీవ్రత తగ్గుతుంది.Michael ఇక్కడకి వచ్చిన తరువాత ఆ హత్య విషయం లో ఏ ఇబ్బంది పడకుండా ఉండాలి.ఆ విషయాన్ని మీ ముగ్గురుకి అప్పగిస్తున్నాను.దానికి తగిన ప్రణాళికల్ని ఇంకా ఆలోచించండి.." చెప్పాడు డాన్.

"  మీ అల్లుడు Carlo Rizzi ని నెవడా కి పంపమంటారా...అదే  అక్కడ గేంబ్లింగ్ బిజినెస్ లో Fredie పక్కన ఉండటానికి..ఇంకా ఆ బిజినెస్ ని స్టడీ చేయడానికి.." Tom అడిగాడు.

" లేదు..నా కుమార్తె ని,అల్లుణ్ణి ఇక్కడ మాల్ లోనే ఉండమని చెప్పు.అతడికి ఇంకొంచెం మంచి పని అప్పగించు.ఆ గేంబ్లింగ్ లో కాకుండా Unions లో ఉంచు..రాత పని మాత్రమే కాకుండా మాట్లాడే పని కూడా అతను బాగా చేస్తాడు.ఎంతైనా మంచి మాటకారి గదా.." ఎందుకనో ఆ చివరి మాట పలికేటపుడు మాత్రం డాన్ కంఠం లో వ్యంగ్యం ధ్వనించింది.

Fredie ని ఇక్కడకి రమ్మని చెప్పేదా..మీకు సాయంగా ఉండానికి.." అడిగాడు Tom..!

" ఎందుకు..నా భార్య నాకు వండిపెట్టే స్థితి లోనే ఉందిగదా.." చిరాగ్గా అన్నాడు డాన్.

" సరే..అలాగే"

" చూడు..నాకు కూడా వృద్ధాప్యం వస్తున్నది గదా..కొన్ని విషయాల్లో నుంచి రిటైర్ అవ్వాలనిపిస్తున్నది.నా గార్డెన్ లో గ్రీన్ పెప్పర్స్,టమాటాలు లాంటివి పండిస్తూ శేష జీవితం గడపాలని నా కోరిక.ఇప్పుడు నా ఇల్లు ఉన్న ప్రదేశం ఒక కోట లాంటిది.ఈ చుట్టు ప్రక్కల ఉన్న అన్ని ఇళ్ళని నేను నిర్మించాను.నా బంధువులని,మిత్రులని ఉండేలా చేశాను.ఏ ఒక్కరూ నా ఇంటి తోట వేపు కూడా చూసే అవకాశం లేకుండా చేశాను.ఇంకేమిటి నాకు.." రిలాక్సింగ్ గా చెప్పాడు డాన్.

ఆ తర్వాత Clemenza,Tessio లు ఇద్దరకి కొన్ని విషయాల్లో సూచనలు ఇచ్చి డాన్ వాళ్ళని పంపించివేశాడు.Tom కి తెలుసు డాన్ తనతో ఇంకా కొన్ని విషయాలు ఏవో చెబుతాడని..! ఒక కోచ్ లో కూర్చుని ఉండిపోయాడతను.

" My Consigliere ఈ రోజు నా వ్యవహారశైలి అంతా చూశావు గదా.చెప్పు నేను చేసినదాంట్లో ఏమైనా పొరబాటు ఉన్నదా..నువ్వు వ్యతిరేకించవచ్చు..అవసరమైతే.." అడిగాడు Don.

కాసేపు అలాగే మౌనంగా ఉండి ఆ తర్వాత అన్నాడు Tom.

" మీరు ఈ రోజు నాకు ఓ చిక్కుముడిని వేసి విప్పమంటున్నారు.అయితే కొన్ని మీ పనుల్లో నాకు అర్ధం కానివి ఉన్నాయి.అదేమిటంటే Sonny ని చంపిన వారి గురించి నేను ఎంక్వైరీ చేయను ..అని అన్నారక్కడ.అలాగే శాంతి కి కూడా మొగ్గు చూపారు..ఉద్రిక్తత కంటే..దీనిలో నాకు కొంత మిస్టరీ ఉంది.." చెప్పాడు Tom.

డాన్ మొహం లో సంతృప్తి తో కూడిన చిరునవ్వు మెరిసింది.

"Tom..well my boy ,నీవు జన్మతహ సిసిలియన్ వి కాకపోయినా ,నన్ను బాగా అర్ధం చేసుకున్నావు.ఈ చిక్కుముడి తొందరలో విడిపోతుంది.అయితే దానికి ముందుగానే నీకు కొన్ని దానికి సంబందించిన క్లూ లు దూరుకుతాయి.ఆ ..ఒకటి..అన్నిటికన్నా ముఖ్యం Michael ఖేమంగా రావాడం..దానికి సంబందించి అన్ని చర్యల్ని మనం చేపట్టాలి..దేశం లోని బెస్ట్ క్రిమినల్ లాయర్స్ ని సంప్రదించు.నేను కొంతమంది జడ్జి ల పేర్లు చెబుతాను.వాళ్ళని నువు కలువు.నీతో వాళ్ళు ప్రైవేట్ గా మాట్లాడతారు.ఏది ఏమైనా చాలా ఓపికగా పనిచేయవలసిన తరుణమిది.." చెప్పాడు Don.

" సాక్ష్యాలు తారుమారు చేయడం పెద్ద విషయం కాదు.అయితే McClusky కి గల మిత్రులు ఎవరైనా సెల్ లో Michael కి ఏమైనా హాని తలపెడతారా అని యోచిస్తున్నాను.."

" అది నాలో కూడా ఉంది Tom..! అయితే మరీ ఎక్కువ కాలం కూడా ఆ సిసిలీ లో ఇప్పుడు ఉండే పరిస్థితి లేదు.అక్కడ యువత కూడా ఇదివరకటిలా పెద్ద వాళ్ళ మాట వినడంలేదు.అదీగాక Barzini కి సిసిలీ లో మిత్రులున్నారు.వాళ్ళు Michael ని అక్కడ పసిగట్టడం అంత మంచిది కాదు.." చెప్పాడు Don.

అంటే మీ అర్ధం Barzini ..ఆ Tattagliya ఇంకా Solozzo ల వెనుక ఉండి నడిపించాడంటారా..?"  ప్రశ్నించాడు Tom.

"Tattagliya లకి Sonny ని చంపే శక్తి ఎంతమాత్రం లేదు.He is a pimp.అసలు మాస్టర్ మైండ్ ఆ Barzini యే..అందుకనే నేను Sonny చావు విషయం లో ఏమీ మాట్లాడనని చెప్పింది..ఇప్పుడు మన కర్తవ్యం Michael ని సురక్షితంగా తీసుకురావడం.." Don చిక్కుముడిని కొద్దిగా విప్పినట్లు తోచింది.

ఆ తరువాత Tom వెళ్ళబోతుండగా పిలిచి చెప్పాడు డాన్.

" Tom..టెలిఫోన్ శాఖలో ఉన్న మనవాళ్ళకి ఫోన్ చేసి చెప్పు.ప్రతిరోజు Clemenza,Tessio లు ఇద్దరు వాళ్ళు చేసే ఫోన్ కాల్స్ గురించి నాకు వివరాలు పంపించమని చెప్పు.అంటే వాళ్ళు ఏదో చేస్తున్నారని కాదుగాని మన జాగ్రత్తలో మనం ఉండాలి గదా..Michel వచ్చేదాకా "

" అలాగే.." అన్నాడు Tom.ఇప్పుడు Tom కి కూడా అనిపించింది తన మీద కూడా డాన్ ఏదో రూపం లో నిఘా పెట్టే ఉంటాడని..!

(మిగతాది వచ్చే భాగంలో చూద్దాము) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (యాభై మూడవ భాగం)

Bocchicchio కుటుంబానికి చెందిన Felix అనే వ్యక్తి న్యాయస్థానం చేత ఒక మర్డర్ కేసు లో మరణశిక్షకి గురవుతాడు.ఇతడిని వృత్తిపరంగా మోసం చేసిన తోటి లాయర్ ని అతడు కాల్చి చంపడమే అతను చేసిన నేరం.దాన్ని Felix కూడా ఒప్పుకుని కోర్ట్ కి లొంగిపోతాడు.న్యాయస్థానం ఎలెక్ట్రిక్ చైర్ ద్వారా మరణశిక్షని విధిస్తూ తీర్పు చెబుతుంది.

దానితో ఆ కుటుంబానికి చెందిన పెద్ద Tom Hagen కలిసి Don ద్వారా సహాయమర్దిస్తాడు.కోర్ట్ అతనికి ఎలాగు మరణశిక్ష విధించింది.ఆ విషయం లో ఏమీ చేయలేను గాని అతని భార్యా పిల్లలకి వారి జీవితాంతం హాయిగా బ్రతకగలిగే ధన సాయం చేస్తాను అందుకు గాను ఒక ఫేవర్ చేయమంటాడు డాన్.

Michael చేసిన హత్యలు అదే Solozzo ఇంకా McClusky లని .. ఆ నేరాన్ని కోర్ట్ ముందు తానే చేసినట్లుగా ఒప్పుకోమంటాడు.దానికి Felix కూడా సమ్మతిస్తాడు.ఎందుకంటే ఒక మర్డర్ కైనా..మూడు మర్డర్ల కైనా తనకి పడేది ఒకటే మరణ శిక్ష కదా..పైగా తాను మరణించినా ఎలాంటి లోటు లేకుండా భార్యా పిల్లలకి డాన్ ధన సాయం చేస్తున్నాడు.

అలా ఆ ప్రణాళిక అమలుజరిగిపోతుంది. Michael హత్యల నేరం అలా మరుగునపడిపోతుంది.అయితే డాన్ కూడా తొందరపడకుండా Felix కి శిక్ష అమలు జరిగిన తరువాత రమారమి నాలుగు నెలల తరవాత Michael మళ్ళీ అమెరికా లో కాలు మోపే విధంగా చేస్తాడు.

(మిగతాది వచ్చేభాగం లో చూద్దాము)--KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (యాభై నాల్గవ భాగం)

"ఓహ్..Jules ..స్టాపిట్..! కనీసం డాక్టర్లయినా ఎంటో కొంత డిగ్నిటీ గా ఉంటారనుకున్నా..ఏమిటది సిల్లీగా .." అంది Lucy .స్నానం చేసి ఒళ్ళు ఆరబెట్టుకుంటుండగా ఆమె తొడ మీద నిమురుతూ ఇంకా పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న అతని వ్రేళ్ళని చూస్తూ..!

" ఏయ్..నేను Los Vegas డాక్టర్ ని..నువు అది మర్చిపోయినట్టున్నావు.." నవ్వుతూ అన్నాడు Jules Segal.

Lucy కి ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది.Sonny చనిపోవడం..తను ఆ తర్వాత పిల్స్ వేసుకోవడం..ఆసుపత్రి పాలు కావడం..Tom Hagen వచ్చి Don Corleone కుటుంబం తరపున ఆమె ని ఆదుకొని Los Vegas లో ఒక హోటల్ కం కేసినో లో రిసెప్షనిష్ట్ గా ఉద్యోగం ఇప్పించడం..ఇప్పుడు ఈ విధంగా ఇదిగో ఆ ప్రదేశం లోనే డాక్టర్ గా ఉన్న Jules Segal పరిచయం కావడం..ఇలా కాలం గడుపుతుండడం ..అంతా కలలాగా అంపిస్తున్నది.కాని ఇది నిజమే.

Jules తో ఆమె కాలం గడుపుతున్నప్పటికి సెక్స్ లో పాల్గొనడం అనేది లేదు.మిత్రుల్లాగే ఉన్నారు.అలా కలుసుకుంటూ ..మాట్లాడుకుంటూ..!అయితే Jules కి తెలుసు ఆమె కి తనంటే ఇష్టమని..కాని ఎందువల్లనో ఆమె దూరంగా ఉంటున్నదని...!

" ఈ రాత్రికి డిన్నర్ నాతో చేయకూడదూ..కేసినో లో రౌలట్ చిప్స్ కొని ఒక ఆట ఆడదాం..ఏమంటావు.." అడిగాడు Jules.

" వద్దులే Jules ..అంతిమంగా నువు ఆ డిన్నర్ తర్వాత పొందేదేమి ఉండకపోవచ్చు.ఎందుకు నిరాశ పడటం..అందుకే ముందే చెబుతున్నా.." అన్నది Lucy

సరేలెమ్మని Supper సమయం కి అలా వెళ్ళారు.తినడం,వాహ్యాళి ..అవన్నీ ముగిసిన తరవాత Jules ఆమెని దగ్గరగా తీసుకోవాలని ప్రయత్నిస్తాడు.కాని ఆమె నిరాకరిస్తుంది.ఆగిపోతాడతను.

" నేను ముందే చెప్పాగదా..నువు నిరాశ చెందవచ్చునని.." అన్నది Lucy.

" సరే..సరే..కనీసం నేను ప్రయత్నం కూడా చేయకపోతే నువు ఫీల్ అవుతావేమోనని చేశా..అంతే.." అన్నాడు Jules.

*    *   *  *   *

అయితే కొన్ని రోజుల తర్వాత ఆ తరుణం వచ్చింది.ఒకరోజు స్విమ్మింగ్ ఫూల్ లో స్నానం చేసిన తరువాత ఆరుబయట Lucy,Jules లు ఇద్దరీ విశ్రాంతి తీసుకుంటున్నారు.అతని తల ని ఆమె వొళ్ళు పెట్టుకుని నిమురుతున్నది.అతను నిద్రపోతున్నట్లుగా ఉన్నాడే గాని పోలేదు.ఆ సమయం లో అక్కడ కలిగిన ఆ సామీప్యత ఎందుకనో ఇద్దరి లోను అలజడి రేపింది.ఆ దాపునే గది లోకి వెళ్ళి  శృంగారం లో మునిగిపోయారు.Jules ఆమె లోపలకి ప్రవేశించడానికి ప్రయత్నించినపుడు ,వద్దని ఆమె అనలేదు గాని..ఏదో తనకు మాత్రమే తెలిసిన ఓ రహస్యం బహిర్గతమైనందుకు కొద్దిగా సిగ్గు గా ఫీలయింది.ఆ తర్వాత ..Jules కూడా ఆశ్చర్యచకితుడయ్యాడు.ఆమెని ఓదార్చినట్లుగా మాట్లాడాడు.

" ఓహ్ ఇందుకేనా..ఇన్నాళ్ళపాటు నువు నాకు దగ్గరవడానికి సందేహించింది..?నాకిది తెలిస్తే నేనేదో అనుకుంటానని భావించావుకదూ..నేను చెప్పేది నమ్ము..నీ పట్ల నాకు కలిగిన ప్రేమ అలాగే ఉంది.స్త్రీలలో చాలా సహజమైన సమస్య ఇది.సైన్స్ ఎంతో ముందుకెళ్ళిన యుగం ఇది.కాకపోతే నీకు అవగాహన లేకపోవడం వల్ల పెద్ద సమస్య గా భావించావు,ఇది నాకు చెప్పినట్లయితే ఎప్పుడో నీ సమస్య పరిష్కారమయ్యేది.నీకున్న ఈ సమస్య ని మెడికల్ భాష లో Pelvic Malformation అంటారు.ఒక చిన్న ఆపరేషన్ తో దీన్ని సరిదిద్దవచ్చు.లూజు గా ఉన్న ఆ భాగాన్ని టైట్ చేయవచ్చు.చాలామంది హాలీవుడ్ స్టార్స్ కూడా ఇదే సమస్య విష్యమై నా మిత్రుడైన ఒక సర్జన్ దగ్గరకి వస్తుంటారు.Los Angels  లో ఉన్న ఆ సర్జన్ ని పిలిపించి ఆపరేషన్ చేయించి అంతా సరిచేయిస్తాను.ఆ విషయం గురించి ఇక ఆలోచించకు ..ఓకే నా.." అడిగాడు Jules.

ఆమె కి కన్నీళ్ళు వచ్చాయి.మళ్ళీ సర్దుకుంది.

" దీనికి గాను ఎంత ఖర్చు అవుతుంది.." అడిగిందామె.

" ఆబార్షన్ కేసుల్లాంటివి ఉంటే ఆయన నాకు రిఫర్ చేస్తాడు.అలాగే ఇలాంటి వి ఆయనకి నేను పంపిస్తుంటాను.అదొక ప్రొఫెషనల్ సర్దుబాటులే..దాని గురించి నువ్వేమీ వర్రీ కాకు.." చెప్పాడు Jules.

" సరే..ఇందాక చెప్పావే..హాలీవుడ్ స్టార్స్ అని..ఇంతకీ వాళ్ళెవరు..ఇలాంటి గాసిప్ లంటే ఇష్టం నాకు..చెప్పు వాళ్ళెవరు..?" ఆసక్తిగా అడిగిందామె.

" ఇప్పుడు చెప్పను.డిన్నర్ తర్వాతనే ..అప్పుడు చెబుతాను" ఊరిస్తున్నట్లుగా అన్నాడు Jules.

" ప్చ్..తెలిసిందిగా నా సమస్య..అది ఇప్పుడెలా కుదురుతుంది..?" అన్నదామె.

" మరీ చెప్పకు Lucy..అదొక్కటే మార్గమా ఆ పనికి..ఇంకే పద్ధతీ లేదా.."

"ఓహ్ ..అదా.."

" ఆ ..అదే..Did you even think of doing that with your beloved Sonny " అడిగాడు Jules.

" I did everything with Sonny" ఆమె మొహం లో మోనాలిస చిరునవ్వు కనిపించింది.

(మిగతాది తర్వాత భాగం లో చూద్దాము) --KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (యాభై అయిదవ భాగం)

Jules తను చెప్పిన ప్రకారమే Lucy కి ఆపరేషన్ ఏర్పాట్లు చేశాడు.ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది.కొన్ని రోజులపాటు రెస్ట్ తీసుకోమని చెప్పాడు ఆ డాక్టర్.

ఆ తెల్లారి Lucy రూం లోకి అడుగుపెట్టిన Jules ఇద్దరు కొత్త మనుషుల్ని చూసి ఎవరా అనుకుంటాడు.బెడ్ మీద దిండుకి చేరగిలా పడుకున్న Lucy వారిద్దరిని Jules కి పరిచయం చేసింది.

" వీళ్ళు ఇద్దరూ Johnny Fontanne,Nino Valenti లు " అని..!

" మేం ఎప్పటినుంచో న్యూయార్క్ లో బాగా ఎరిగిన ఇరుగుపొరుగు వాళ్ళం.Freddie చెప్పాడు ..Lucy కి ఆపరేషన్ జరిగిందని.అందుకే బొకేలు ఇచ్చి ..మాట్లాడిపోదామని వచ్చాం" చెప్పాడు Johnny.

" ఓహో..అలాగా..నిన్ను చూస్తుంటే ఒకప్పటి హాలివుడ్ సింగర్ లా ఉన్నావు.కొద్దిగా మార్పు వచ్చినట్లుందే గొంతులో..ఏమిటి సమస్య.." అడిగాడు Jules.

" ఆ..చిన్న ప్రోబ్లం ఉందిలే..అయినా వయసుతో పాటు గొంతు మారడం కూడా సహజం గదా..!నా డాక్టర్ చెప్పిందీ అదే.." అన్నాడు Johnny.

తన గొంతు విషయం లో ఎవరైనా ఉచితసలహాలిస్తే Johnny కి నషాళానికి అంటుతుంది కోపం..!

" మీ గొంతు ని టెస్ట్ చేసే చాన్స్ ఇవ్వగూడదూ ఓసారి.."

Jules అన్న ఆ మాటకి ఇంకా రేగింది.అయినా Johnny తమాయించుకున్నాడు.

" బాబూ.. మిలియన్ డాలర్లు విలువగల గొంతు అది.నీ లాంటి వాళ్ళందరకీ మావాడు చూపించడు." Nino ఎగతాళి చేసినట్లు చెప్పాడు.

ఆ మాటకి Jules కి మండింది." నేనిక్కడకి రాకముందు ఈస్ట్ కోస్ట్ లో బ్రిలియంట్ డాక్టర్ గా పేరుతెచ్చుకున్నాను.ఆ విషయం తెలియకపోతే కనుక్కో" అన్నాడు Jules.

Lucy ఒక్క క్షణం Jules వైపు చూసి  వాళ్ళతో ఎందుకు అన్నట్లు మొహం పెట్టింది.

" అన్నట్లు Lucy కి ఏం ఆపరేషన్ జరిగింది" అడిగాడు Nino

" ఏదో స్త్రీల సమస్య లే..సాధారణ మైనదే.." చెప్పాడు Jules.

" ఆ అమ్మాయిని మంచిగా చూసుకో" చెప్పాడు Johnny పెద్ద మనిషి తరహాలో.

Jules కి ఒకటి అర్ధం అయింది.Lucy,Johnny,Nino ,,వీరందరితో Freddie Corleone కి మంచి అనుబంధం ఉందని.కనుకనే Lucy కి అయిన బిల్ ని తమ హోటల్ కి పంపిస్తే భరిస్తుందని చెప్పి వెళ్ళాడు తను..!

" Lucy ని త్వరలో పెళ్ళాడాలని అనుకుంటున్నాను" చెప్పాడు Jules.

" ఓహో..మంచిది.." Johnny సంతోషంగా తలూపాడు.

మొత్తానికి అటు ఇటు చేసి Johnny ని ఒప్పించి అతని గొంతుని పరీక్ష చేశాడు.చిన్న వార్ట్స్ లాంటివి ఉన్నాయి..తీసివేస్తే బాగుంటుందని చెప్పాడు Jules.

" మరి తీసేస్తే నేను ఇదివరకటిలా పాడగలనా.." ప్రశ్నించాడు Johnny.

"దానికి పూర్తి గేరంటీ ఏమీలేదు.. "

చీ..నీయబ్బా ..ఈమాత్రం దానికి ఎందుకురా నాకు టెస్ట్ చేసింది అనుకున్నాడు Johnny.ఇంతలోనే కాళ్ళు  చేతులు లయబద్ధంగా ఊపుకుంటూ Nino వచ్చాడు Jules కి దగ్గరగా..!

" ఏమిటి ఇంత పొద్దునే మందు వేసుకున్నావా..ఈ తరహా లో ఆల్కహాల్ కి అలవాటు పడితే..నువు అయిదు సంవత్సరాలు కూడా బ్రతకవు.." చెప్పాడు Jules ..!

" ఏమిటి ..అయిదు సంవత్సరాలా...చాలా ఎక్కువ కాలం చెప్పావు చిన్నా నువ్వు ..నేనింకా అయిదు నెలలే బతుకుతానేమోనని అనుకుంటుంటే.." నవ్వుతూ చెప్పాడు Nino.

" కొద్దిగా డాక్టర్ కి మర్యాద ఇచ్చి మాట్లాడండయ్యా బాబు.." అనేసి అవతలకి వెళ్ళిపోయాడు Jules.

* * * * *
Lucy కి ఆపరేషన్ జరిగి నెల అయిపోయింది.లాస్ వేగాస్ లోని ఓ హోటల్ లోని స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలాడి ఇద్దరూ కూర్చుని ఉన్నారు.Lucy ఒక చేత్తో కాక్ టైల్ సిప్ చేస్తూ మరో చేతితో అతన్ని నిమురుతూన్నది.

" అంతా సక్సెస్ అవుతుంది.మరీ ధైర్యం పుంజుకోవడానికి ఏమీ ప్రయత్నించనవసరం లేదు." నవ్వుతూ చెప్పాడు Jules.

"Are you sure..is it o.k.soon " అడిగిందామె.

" Tonight is the big night. నీకో విషయం తెలుసా ఆపరేషన్ లో ఫాల్గొన్న ఓ డాక్టర్..తన పేషంట్ రిజల్ట్ ని ఈ విధంగా స్వయంగా తెలుసుకోవడం బహుశా అది నాకే సాధ్యపడిందేమో..బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చెప్పి ఓ పేపర్ కూడా రాయాలని చూస్తున్నా "

ఆ మాటకి స్పందనగా ఆమె అతని తల లోని వెంట్రుకలు గట్టిగా పీకడం తో చిన్నగా మూలిగాడు.

"If you're not satisfied tonight..It's your fault"  నవ్వుతూ అన్నది Lucy.

"I guarantee my work ...we have a long night of resaerch ahead"  చెప్పాడు Jules .ఇద్దరూ కలిసి హోటల్ సూట్ లోకి ప్రవేశించారు.అక్కడ సప్పర్,షాంపేన్ సిద్ధంగా ఉన్నాయి.ఒక జ్యూయలరీ బాక్స్ లో ఒక ఎంగేజ్మెంట్ డైమండ్ రింగ్ కూడా..!

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా..!(యాభై ఆరవ భాగం) (Chapter-6 Started).

ఆ సిసిలీ లో ఆరునెలల ప్రవాస జీవితం గడిపిన తర్వాత Michaelకి అక్కడి వాతావరణం క్రమేణా అర్ధమవసాగింది.అది ఒకటి మాత్రమే కాదు.తన తండ్రి Don Vito Corleone యొక్క స్వభావం సైతం అవగతమవసాగింది.పోరాట స్వభావం లేనట్లయితే ఇక్కడ ఆయన జీవితం ఎంత దుర్భరంగా ఉండేదో అనుభవం మీద తెలుస్తున్నది.

Luca Brasi గాని,Clemenza గాని ..వాళ్ళు అలా ఎందుకున్నారో...తన తల్లి ,తండ్రి చేసే పనులేవి పట్టించుకోకుండా తన లోకం లో తాను ఎందుకుంటుందో అలాంటివి అన్నీనూ..!

"A man has only one destiny" అని తండ్రి తరచు గా ఎందుకు అంటూ ఉంటాడో ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది.చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం అంటే డాన్ కి ఎందుకని విశ్వాసం ఉండదో..Omerta నియమాన్ని ఉల్లంఘించేవారంటే ఆయనకెందుకు అంత కోపమో..ఈ సిసిలీ లో కాలం గడుపుతున్న Michael కి చక్కగా అర్ధమవుతున్నాయి.

మాసిన బట్టలతో,తల పైన ఒక కేప్ తో ఇక్కడ సిసిలీ లోని Palermo అనే పట్టణం లో దిగాడు ..ఓడలోనుంచి..!ఇది తన తండ్రి యొక్క స్వగ్రామం Corleone కి దగ్గరగానే ఉంటుంది.అక్కడ తమకి చెందిన బంధువులు ఎవరైనా ఉన్నారేమోనని ఆరాతీశాడు గాని ఎవరూ లేరని తేలింది.కొంతమంది ఇటలీకి వెళ్ళిపోవడం,మరి కొంతమంది అక్కడి అంతర్గత పోరాటాల్లో చనిపోవడం,ఇంకా కొంతమంది విదేశాలకి వెళ్ళిపోవడం జరిగిందని తెలిసింది.అయితే తండ్రి తన స్వగ్రామాన్ని మర్చిపోరాదన్న ఒక నిర్ణయం వల్ల ఈ Corleone ఊరి పేరుని తన ఇంటి పేరుగా పెట్టుకున్నాడు.

సరే..ప్రస్తుతం ఈ చిన్న పట్టణాన్ని కంట్రోల్ చేసే ఒక మాఫియా నేత తన తండ్రికి ఒక విషయం లో రుణపడిఉన్నాడు.అందుకోసమే ఇక్కడ తనని దాచడానికి ఇతను అంగీకరించాడు.ఇతని పేరు Don Tommasino.

 దాదాపుగా డభై ఏళ్ళు ఉంటాయి.ఆ ప్రాంతం లోని ధనవంతులకి గల భూములు అన్నీ అతని రక్షణలో ఉంటాయి.పేదరైతులు గాని,ఇంకెవరు గాని వాటి మీద కన్నేసి ఆక్రమించాలని చూస్తే వాళ్ళని భయపెట్టి తరిమేస్తుంటాడు.ఒక్కోసారి అవతలి వారి ప్రాణాలు కూడా పోవచ్చు.అది వేరే విషయం.అందుకు గాను అతనికి తగిన ఫీజుని ఆ భూస్వాములు ముట్టజెపుతుంటారు.ఆ ప్రాంతం లోని నీటి వ్యాపారం ఈ డాన్ చేతిలోనే ఉన్నది.అయితే అమెరికా లో లాగా ఇక్కడి మాఫియా గేంబ్లింగ్,ప్రాస్టిట్యూషన్  లాంటి బిజినెస్ ల్లోకి దిగలేదు.

Dr.Taza అని ఒక వైద్యుడు..Don Tommasino కి బంధువు.అతని ఇంట్లో Michael కి ఆశ్రయం కల్పిస్తారు.విశాలమైన పాతకాలపు పాలరాతి బంగళా ,ఇంకా దాంట్లో అందమైన ద్రాక్షా తోటలు..చుట్టూతా కోట గోడల్లాంటి ప్రాకారాలు..తన రహస్య జీవితం ఆనందకరం గానే తోస్తున్నది.

Dr.Taza పేరుకి ఆ చిన్న పట్టణంలో ఒక వైద్యుడే గాని ..అతనికి పెద్ద నైపుణ్యం ఉన్నట్లుగా ఏమీ అనిపించలేదు Michael కి..అందుకనే తన దెబ్బ తిన్న దవడ ని ఒకసారి బాగుచేస్తానన్నా ..సున్నితంగా వద్దని చెప్పేశాడు.అయితే Dr.Taza కి ఉన్న గొప్ప అలవాటు ఏమిటంటే మంచి చదువరి.ఒక్క వైద్యశాస్త్రానికి చెందినవి  తప్ప మిగతా అన్నిరకాల పుస్తకాల్ని విపరీతంగా చదువుతాడు.చదివి అంతటితో ఊరుకోడు.ఆ విశేషాలన్నీ తనదగ్గరకొచ్చే పేషంట్లకి,రైతులకి,పశువుల కాపరులకి చెబుతూ ఉంటాడు.అందుకనేనేమో ఒకసారి వచ్చినవాడు మరోసారి కనబడడు.పాపం ఆ పేదరైతులకి వీటివల్ల ఉపయోగం ఏమిటి...అది అతను ఆలోచించడు..!

ఈ సిసిలీ లోని గ్రామాలు తాను అనుకున్నంత దుర్భరంగా లేవు.అలాగని పూర్తిగా ఆధునికం గానూ లేవు.కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించబడిన భవనాలు ఉన్నాయి..అవి శిధిల దశకి చేరుకున్నాయి.ఆ చుట్టు పక్కలనున్న పర్వతాల్లోంచి రాతిని బాగానే తొలిచినట్లున్నది.తను ఉంటున్న ఆ ఊరు ప్రకృతి సౌందర్యం Michael ని బాగా ఆకట్టుకుంది.ఆరంజ్ తోటలు,బాటలకిరువేపులా పూల మొక్కలు..ఆ గుట్టలు.. గమ్మత్తుగా అనిపిస్తున్నది.కొన్ని ఇళ్ళు పెద్ద రాతి ఇటుకల్ని ,దిమ్మెల్ని ఉపయోగించి కట్టారు.

Mafia అనే సిసిలియన్ మాటకి అసలు అర్ధం Place of refuge అని.ఆ తర్వాత Secret Organisation అనే అర్ధం స్థిరపడింది.ప్రపంచ చరిత్రలో ఇతర జాతులచేత దారుణంగా అణగదొక్కబడిన ప్రాంతాల్లో సిసిలీ ఒకటి.ఆనాటి రోమన్ల దగ్గర్నుంచి ఆ జాబితాని మొదలుబెట్టవచ్చు.ఇహ ఇంక్విజిషన్ రోజుల్లోనైతే పేద,ధనిక అనేది లేకుండా అందరూ చిత్రహింసల పాలయ్యారు.కేథలిక్ చర్చ్ కి చెందిన రాజవంశాలు సామాన్యుల్ని మామూలుగా అణిచివేయలేదు.

తమలో కలిగే కోపాన్ని ఎలా బయటకి వ్యక్తం చేయకుండా ఉండాలో ఆ ప్రజలు ఆ అనుభవాలనుంచి నేర్చుకున్నారు.అధోజగత్తుకి చెందిన మాఫియా నే వారు రక్షకులుగా భావించేవారు.దానికి ఆ శక్తి ఎక్కడినుంచి వచ్చిందంటే రహస్యాల్ని దాచి ఉంచే ఆ జీవన విధానం నుంచి వచ్చింది.దానినే Omerta అంటారు.అది ఒక మతంగా ప్రజల్లో వ్యాప్తి చెందింది.అక్కడ ఏ తల్లీ తన కొడుకుని చంపిన వారెవరో ..తెలిసినా వారిపై పోలీస్ లకి కంప్లైంట్ ఇవ్వదు.అక్కడ మాఫియా ది ఒక సమ్రక్షకుని పాత్ర.దీనజన బాంధవుని పాత్ర.అక్కడ చట్టబద్ధమైన ప్రభుత్వ పాత్రని మాఫియా నే భర్తీ చేసింది.

అయితే ఇపుడు మాఫియా తన స్వరూపాన్ని మార్చుకున్నది.ధనవంతులకి దన్నుగా నిలుస్తున్నది.పోలీస్,రాజకీయ శక్తులకి సహాయకారిగా నిలుస్తున్నది.ప్రతి చిన్న వ్యాపారి మీద ఇప్పుడు మాఫియా పన్ను విధిస్తోంది.

పేదరికం,భయం,నిస్సహాయత ...ఇవన్నీ ఒక ఆత్మాభిమానం కలిగిన మనిషిని ఎంతటి పనికైనా తెగించేలా చేస్తాయేమో..ఇలాంటి ఒక సమాజం నుంచి వచ్చిన తన తండ్రి వంటి మనిషి ఒక దొంగ వలెనో,హంతకుని వలెనో కాకుండా ఇంకోలా మారితేనే ఆశ్చర్యపడాలేమో..!

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము) --KVVS Murthy

Mario Puzo నవల The God  Father సంక్షిప్తంగా (యాభై ఏడవ భాగం)

ఇపుడు Michael కి కావలసినంత సమయం దొరుకుతున్నది ఈ గ్రామసీమ లో..ఏ విషయం గురించి అయినా స్థిమితంగా ఆలోచిస్తున్నాడు.ఒక్కోసారి ఏమీ తోచనప్పుడల్లా ఆ Corleone గ్రామం నుంచి అలా నడుచుకుంటూ పక్క గ్రామాల దాకా వెళుతుంటాడు.అతనికి బాడీగార్డులు గా ఇద్దరు మనుషులుంటారు.ఒకతని పేరు Cano ఇంకోతని పేరు Fabrizzio. Cano ఎక్కువగా ఆ గ్రామం లోనే ఉండే మనిషి.పెద్దగా బయట ప్రపంచం లోకి వెళ్ళలేదు.Fabrizzio అనేవాడు మాత్రం బ్రిటిష్ నౌకా దళం లో ఏదో చిన్న ఉద్యోగం చేసి బయటికొచ్చాడు.అతను అమెరికా వెళ్ళి బాగా సంపాదించాలనే కోరిక ఉన్నవాడు.ఆ కోరికని Michael కి చెబుతుంటాడు.

వీళ్ళిద్దరూ ఆ గ్రామం లో పశువుల కాపరులుగా ఉంటూనే ,మరోవేపు Don Tommasino కి బంట్లు గా ఉంటారు.కాబట్టే ఈ డాన్ Michael ని చూసుకోవడానికి వీళ్ళిద్దర్నీ నియమించాడు.

ముస్సోలిని హయాం లో బ్రిటన్ నేతృత్వం లోని మిత్రపక్షాలు ఇటలీ మీద దాడి చేశాయి గదా..ముస్సోలిని ఎవరినైతే అప్పటిదాకా జైలు లో వేశాడో వాళ్ళందరూ మిత్రపక్షాల పుణ్యమాని డెమోక్రాట్ లుగా మారిపోయారు.మంచి పదవుల్లో నియమించబడ్డారు.దాంట్లో ఎక్కువగా లాభపడింది అంతా సిసిలీ మాఫియా కి చెందినవాళ్ళే.

రాత్రిపూట ఒక్కోసారి Michael కి ఆ దెబ్బతిన్న ఎడమ దవడ మాత్రం బాగా సలుపుతుంది.అలాంటప్పుడు కొద్దిగా Strong drink తీసుకొని పాస్తా,మాంసాహారం కొద్దిగా తిని పడుకుంటాడు.బాగా నిద్రపడుతుంది.ఒకరకంగా McClusky వల్ల ఇదొక మేలే..అతను కొట్టిన ఈ దెబ్బవల్ల మొహం లో కొద్ది భాగం అపభ్రంశంగా మారినా ..ఇది సిసిలీ లో పనికొస్తోంది.ఎందుకంటే ఇక్కడ కనిపించే చాలామంది మొహం లోనో,ఎక్కడో ఏదో అవయవం దెబ్బతిని ఉండటం సర్వసాధారణం.అలా అయినా వీళ్ళు పెద్దగా పట్టించుకోరు.అదే అమెరికా లో అయితే ఏదో కాస్మోటిక్ సర్జరీ చేయించుకొని అందంగా కనబడడానికి ప్రయత్నిస్తారు.

అప్పుడప్పుడు Kay గుర్తుకొస్తుంది.ఏం చేస్తాం..జీవితం అలా మారిపోయింది.చెప్పకుండానే సిసిలీ ఓడ ఎక్కేయవలసిన పరిస్థితి...తను చేసిన రెండు హత్యల విషయం ఆమె ఊహించే ఉంటుంది.తను ఆమె జీవితం లోకి వెళ్ళడం ఇక జరగని పనే కావచ్చు..!

ఆ రోజు ఎందుకనో Corleone గ్రామం కి కొన్ని మైళ్ళు దూరం లో ఉన్న పక్క గ్రామం కి వెళ్ళాలనిపించింది.ఇంట్లో ఎంతసేపని అలా ఊరికే ఉండటం..!అందుకని బయలుదేరాడు.అతని వెంట Cano,Fabrizzio లు కూడా బయలుదేరారు.

తను అమెరికా నుంచి వచ్చిన మనిషినని వీరిద్దరకీ తెలుసు.అయితే దాని వెనుక కారణం వీళ్ళకి తెలియదు.అది Don Tommasino కి మాత్రమే తెలుసు.రోడ్డు మీద నడిచేటపుడు కూడా ఆ Lupera లు అనబడే షాట్ గన్స్ వీళ కి ఒంటి మీద ఉండవలసిందే.బాహటంగా అందరకి కనబడేలాగానే వాటిని ధరించుతుంటారు.

రహదారి మీద దుమ్ము లేస్తూ ఉన్నది.ఆ గాడిదలు పూంచిన బండ్లు అలా వెళుతూంటే..!ఎటు చూసినా పింక్ కలర్ లో ఉన్న పూవుల మొక్కలు..ఆల్మండ్,ఆలీవ్ చెట్లు..నిమ్మతోటలు..ఆరంజ్ తోటలు ..వాటి వల్ల వచ్చే సువాసనలు ..ఆహ్లాదంగా ఉంది ఆ గ్రామం యొక్క స్వరూపం.

 Michael ముక్కుని అప్పుడప్పుడు ఒక పక్కగా చీదకతప్పడం లేదు.లోపల సైనస్ ప్రభావం వల్ల ఎడమ కన్ను కూడా కొద్దిగా నొప్పిగా అనిపిస్తోంది.ఇంచుమించు పదిహేను మైళ్ళు నడిచారో లేదో కాళ్ళు నొప్పి పెట్టాయో ..అలసటో తెలీదు గాని ఒక పచ్చని చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని ఆగారు ముగ్గురు.తెచ్చుకున్న తినుబండారాలు కూడా తినాలికదా..!

వాళ్ళు కూర్చున్న ప్రదేశానికి కొద్దిదూరం లో ఆరంజ్ తోటలు ఉన్నాయి.ఆ పక్కనే పెద్ద భవంతి ఉంది.రోమన్ల వాస్తు శైలి లో నిర్మించబడినదది.ఆ పెద్ద స్థంబాల నడుమనుంచి కిందనున్న ద్రాక్షా తోటల లోకి కొంతమంది యువతులు కేరింతలు కొట్టుకుంటూ వస్తున్నారు.వాళ్ళు అక్కడున్న పూవుల్ని కూడా తెంపుకుంటున్నారు.నిమ్మ తోటల లోనుంచి,ఆరంజ్ తోటల లోంచి వచ్చే సువాసనలు ఆహ్లాదకరంగా ఉన్నాయి.ఆ యువతులంతా బిగుతైన ఫ్రాక్స్ వేసుకుని ఉన్నారు.

ఒకమ్మాయి చేతిలో ద్రాక్షా గుత్తులు ఉన్నాయి.ఆమె పరిగెడుతుండగా వెనుక ముగ్గురు నలుగురు ఆమె ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
అలా వాళ్ళు ఆడుకుంటూ ఈ ముగ్గురు కి బాగా కనబడేంత దగ్గరకి వచ్చేశారు.ఆ ద్రాక్షాల్ని పట్టుకున్న అమ్మాయిని చూశాడు Michael. మీగడ రంగు లో ఉన్నది.చక్రాల్లాంటి  పెద్ద కళ్ళు,గుండ్రని మొహం,అన్ని విధాలుగా అపురూప లావణ్యవతి గా తోచింది.ఒక్క క్షణం అలా ఆమె..కూడా చూసింది.ఆ వెంటనే స్నేహితురాళ్ళతో కలిసి అదృశ్యమైపోయింది.ఆరంజ్,నిమ్మ,ద్రాక్షాల సుగంధ పరిమళం గాలిలో తేలుతూ అంతర్ధానమైపోయింది.

Michael తన్మయుడైనాడు.

" ఏమిటి..ఏదో పిడుగు దెబ్బ కి గురైనట్టున్నావే.." Fabrizzio నవ్వుతూ అన్నాడు Michael ని ఉద్దేశించి..!అలా తొలి వలపులో చిక్కుకుపోవడాన్ని సిసిలీ లో ఆ విధంగా వ్యవహరిస్తారు.Calo కూడా ఏదో అర్ధం అయినట్లుగా నవ్వాడు.తన భావాలు వీళ్ళిద్దరకీ అంత తేలిగ్గా తెలిసిపోవడం ఎందుకనో Michael కి చిరాగ్గా అనిపించింది.

" ఏం..మాట్లాడుతున్నారు..తిక్క తిక్క గా ..అదేం లేదు" అన్నాడు తను.తనకి ఆ అమ్మాయి పట్ల కలిగింది Adoloscent లో కలిగే crush కాదు.. ..అలాగే Kay వంటి అమ్మాయిలో ఉండే Intelligence ఇంకా Sweetness వల్ల కలిగిన ప్రేమ వంటిది కాదు.Kay గుర్తుకు వచ్చినప్పటికి ..ఆమె..తను ఇంకా కలిసే అవకాశం లేదు గదా..ఆమె దృష్టిలో తను ఒక హంతకుడే గదా ..అనిపించింది.

" పద..ఆ దగ్గరున్న గ్రామం లోకి వెళ్ళి చూద్దాం..ఆమె ఆచూకి ఏమైనా దొరుకుతుందేమో " అంటూ Fabrizzio కదిలాడు.ఇద్దరూ లేచారు.అలా కాసేపు నడవగా ఒక గ్రామం తగిలింది.ఒకటే మెయిన్ బజారు ఉంది.కొన్ని షాపులు,స్టోర్లు ఉన్నాయి.ఒక చిన్న హోటల్ కూడా ఉంది.వెళ్ళి ఆ హోటల్ లో కూర్చున్నారు.అంతలోనే హోటల్ ఓనర్ వచ్చాడు.

" ఊరికి కొత్త వారిలా ఉన్నారే..మా దగ్గరున్న వైన్ ని రుచి చూడండి..బాగుంటుంది...ఇక్కడ దొరికే ద్రాక్షాల తో మేమే స్వయంగా తయారు చేస్తాము..మొత్తం ఇటలీ కి నచ్చుతుంది.." చెప్పాడు ఆ ఓనర్.

సరే..తీసుకురమ్మనారు ముగ్గురు.నిజంగానే వైన్ రుచి చాలా బాగుంది.జగ్ లో దాన్ని మెల్లగా ఒంపుకుంటూ తాగుతున్నారు.

" అవును..ఇటువేపు కొంతమంది అమ్మాయిలు వచ్చారుగదా..వాళ్ళెవరి తాలుకు...మా మిత్రునికి దాంట్లో ఒకమ్మాయి బాగా నచ్చింది" అడిగాడు Fabrizzio ఆ హోటల్ ఓనర్ ని.

"ఒకమ్మాయికి మంచి కర్లింగ్ జుట్టు ఉంటుంది..చక్రాల్లాంటి పెద్ద కళ్ళు,మీగడ రంగు లో ఉంటుది..ఆ అమ్మాయి మీకు తెలుసా..?" అడిగాడు Michael.

ఆ ఓనర్ ఒక క్షణం సీరియస్ గా చూసి " ఏమో..నాకు తెలియదు" అని ముక్తసరిగా చెప్పి లోపలకి వెళ్ళిపోయాడు.ముగ్గురు వైన్ అంతా త్రాగేశారు.లోపలనుంచి ఆ ఓనర్ వచ్చే జాడ లేకపోవడం తో Fabrizzio ని లోపలికి వెళ్ళి పిలవమని చెప్పాడు Michael.

" నాకెందుకో ఒక అనుమానం..నువు చెప్పిన ఆ అమ్మాయి ఇతని కూతురేమోనని.." అన్నాడు Fabrizzio .అతనికేసి సీరియస్ గా చూశాడు Michael.

" అదంతా అనవసరం.. అతణ్ణి పిలుచుకు రా" అనడం తో Fabrizzio లోపలికి వెళ్ళి ఆ ఓనర్ ని తీసుకొచ్చాడు.అతను ఏమిటి అన్నట్లు చూశాడు Michael వేపు..!

"మీ మనో భావాల్ని గాయపరచడం నా ఉద్దేశ్యం కాదు.మీ అమ్మాయి గురించి వేరే కించపరిచే విధనం లో అడగలేదు.ఇక్కడ నేను కొత్తవాణ్ణి.ఈ ప్రాంత ఆచారాలు నాకు తెలియవు.అన్యధా మీరు భావించినట్లయితే..క్షమాపణలు చెపుతున్నాను.." హుందాగా చెప్పాడు Michael.

"అసలు మీరెవరు..మా అమ్మాయితో మీకేమిటి పని" అడిగాడు ఆ ఓనర్.

"నా పేరు Michael..నేను అమెరికా దేశస్తుణ్ణి..ఒక కేసువిషయంలో నన్ను అక్కడి పోలీస్ లు వెతుకుతున్నారు.ఇక్కడకి ప్రవాసం వచ్చాను.మీరు ఈ విషయాన్ని పోలీస్ లకి చెప్పి పెద్ద రివార్డ్ పొందవచ్చును.అయితే మీ అమ్మాయికి భర్త దొరికే లోపు తండ్రి మిగలకుండా పోతాడు.ఇంకో మాట..మీ అనుమతి తో ఒక్కసారి మీ అమ్మాయి తో మాట్లాడాలని అనుకొంటున్నాను.ఆమె నన్ను ఇష్టపడితే పెళ్ళి చేసుకోవాలని అనుకొంటున్నాను.ఒకవేళ నేను మీ అమ్మాయికి నచ్చకపోతే ఇంకెప్పుడూ మీ కంటికి కనిపించను.సరైన సమయం లో ..మిగతా అన్ని విషయాలు చెబుతాను" సూటిగా చెప్పాడు Michael.

"Are you a freind of freinds..?" అడిగాడు ఓనర్.

మాఫియా ని సిసిలీ ప్రాంతం లో Freinds గా వ్యవహరిస్తారు.

" No..I am a stranger in the country.." చెప్పాడు Michael.

ఆ ఓనర్ Fabrizzio,Cano ల వేపు ఓ సారి చూసి అనుకున్నాడు.అంటే ఈ వెధవలే ఇక్కడకి ఇతణ్ణి తీసుకొచ్చారన్నమాట అని.

వెంటనే ఆవేశపడటం ఎందుకని అనుకొని ఇలా అన్నాడు.

" నా పేరు Vitelli.వచ్చే ఆదివారం ఇక్కడికే రండి.మాఇల్లు కొద్ది దూరం లో ఉంటుంది.నేను  తీసుకు వెళతాను " అని.

Fabrizzio ఏదో  చెప్పబోయాడు.ఆగమన్నట్లు కళ్ళతో వారించి ..వైన్ కి సంబందించిన డబ్బుల్ని అతనికి ఇచ్చేసి బయలు దేరమని పురమాయించాడు.Michael ఆ హోటల్ యజమానికి షేక్ హేండ్ ఇచ్చి బలుదేరాడు.

Vitelli మనసులోనే అనుకున్నాడు.నాకున్న మనుషులద్వారా ఈ వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయిస్తాను.ఏమాత్రం తేడ వచ్చినా తన ఇద్దరు కొడుకులే షాట్ గన్స్ తో అతనికి సమాధానం చెబుతారు.

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము) --KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (యాభై ఎనిమిదవ భాగం)

ఆ రోజు సాయంత్రం గార్డెన్ లో కూర్చుని ఉన్నప్పుడు Dr.Taza చెప్పాడు Michael ప్రేమ ఉదంతం గురించి,Don Tommasino కి..!

"Palermo కి చెందిన వాళ్ళు ఎవరో ఆ అమ్మాయి తో పేమలో పడతారు.ఆ తర్వాత ఏవో చిక్కులూ అవీ..ఇవీ..అనుకున్నాగాని..మొత్తానికి Michael మనసుపారేసుకున్నాడా ..కానీ..అదీ మంచిదే.." Don Tommasino నిదానంగా అన్నాడు.

"ఆదివారం ఒకరోజు నన్ను ఫ్రీ గా వదిలి పెట్టండి.ఆ బాడీ గార్డులు నాతో ఉండకుండా..! ఆ అమ్మాయి కుటుంబీకులు డిన్నర్ కి ఆహ్వానించారు ఆ రోజు" చెప్పాడు Michael.

Don Tommasino కుదరదన్నట్లు తల అడ్డంగా ఊపాడు.

" మీ నాన్నగారికి నీ రక్షణ విషయంలో నేను బాధ్యత వహించాలి.నీకు ఏ ఆపద కలగకుండా చూసుకోవడానికేగదా ఇక్కడకి పంపించింది.ఆ ఒక్కటి మాత్రం నన్ను  అడగవద్దు.అదీగాక నీ పెళ్ళి వ్యవహారం కూడా మీ తండ్రి కి నేను తెలియబరుస్తాను." Don Tommasino ముందుచూపు తో అన్నాడు.

" నా పెళ్ళిని ఆయన వ్యతిరేకించరు.నా వ్యక్తిగత విషయాల్లో ఆయన కల్పించుకోరు.ఆయనకి ఇష్టం లేని పని నేను ఏదైనా చేసినా ఆయన ముభావంగా ఉండిపోతారు.ఆయనకి నచ్చే ఓ పని చేసేంతదాక మళ్ళీ మాట్లాడరు.అంతే..ఆ విషయంలో మీరు కలతపడాల్సిన పని లేదు.సరే..సెక్యూరిటీ విషయం మీ ఇష్టం..ఆ ఇద్దర్నీ పంపండి ఆ రోజున..అభ్యంతరం లేదు.."

Michael అలా అనగానే కొంచెం రిలీఫ్ గా ఫీలయ్యాడు Don Tommasino.

" మంచిది నీ అంతరంగం అర్ధమయింది.ఆ అమ్మాయి కుటుంబం నాకు బాగా తెలిసినదే.గౌరవ ప్రదమైన కుటుంబం..పెళ్ళికి నేను పూర్తిగా మద్దతిస్తున్నాను." చెప్పాడు Don Tommasino.

" నాకు కొంచెం ధనం అవసరం.ఆ అమ్మాయిని చూడటానికి వెళ్ళేప్పుడు ..వారి కుటుంబానికి కొన్ని కానుకలు ఇవ్వాలని అనుకుంటున్నాను.దాని నిమిత్తం .."

"తప్పకుండా..అలాగే తీసుకో ..రేపు ఉదయం ఇస్తాను.అదే విధంగా మీ తండ్రికి కూడా ఇక్కడి విషయాలన్నీ తెలియజేస్తాను.అది నాడ్యూటి..వద్దని చెప్పొద్దు.."

అలాగే అన్నాడు Michael.ఆ రోజు ఆదివారం..!Alfa Romeo అనే కారుని సిద్ధం చేశాడు Fabrizzio..! Michael నవ వధువు ఇంటికి వెళ్ళడానికి..!ఆ కారొ Don Tommasino కి సంబంధించినది.పక్కనున్న పట్టణం Palermo కి వెళ్ళి పిల్ల కుటుంబానికి కొన్ని కానుకలు కొనుగోలు చేశాడు.ఆ తర్వాత..Vitelli కి సంబంధించిన హోటల్ దగ్గరకి వెళ్ళారు.బాడీ గార్డులు ఇద్దరూ వెనక కూర్చున్నారు.Michael డ్రైవ్ చేస్తున్నాడు.అప్పటికే Vittelli ఆ ప్రాంతంలో ..Michael ..కోసం ఎదురు చూస్తున్నాడు.ఇద్దరు బాడీ గార్డుల్ని ఆ కారు దగ్గరే ఉండమని చెప్పి,తను ఆ పిల్ల తండ్రి తో కలిసి వారి ఇంటికి వెళ్ళాడు.ఆ ఇల్లు ఒక గుట్టమీద ఉన్నట్లుగా ఉన్నది.కొద్దిగా ఎత్తులో..!

ఆ గ్రామం లో చాలామంది తో పోలిస్తే వారిది కలిగిన కుటుంబమే అని చెప్పవచ్చు.ఇంట్లో ఓ కార్నర్ లో బాల ఏసు ని యెత్తుకొని ఉన్న మేరీ మాత విగ్రహం ఉన్నది.ఆ పాదాల దగ్గర చిన్న లైట్లు వెలుగుతూ ఆరుతూ ఉన్నవి.Vitelli ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.వాళ్ళు పొలంపనుల్లో ..దాంట్లో కష్టపడేవారవడం వల్ల అనుకుంటా తమ వయసు కంటే పెద్దగా కనిపిస్తున్నారు.భార్య కూడా అక్కడే ఉంది.ఒక మోస్తరు లావుగా ఉన్నది.ఆ అమ్మాయి మటుకు కనబడలేదు...!

అందరూ కూర్చున్నారు.Vitelli తమ కుటుంబసభ్యుల్ని పరిచయం చేశాడు.Michael తాను కొన్న "గోల్డ్ సిగార్ కట్టర్"  ని తండ్రికి ఇచ్చాడు.అలాగే పిల్ల తల్లికి కొత్త బట్టలు కొన్నాడుకదా..అవి ఇచ్చాడు.ఇంకా ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన కానుక ఒకటే మిగిలిపోయింది.

" మేము సాధారణంగా కొత్తవారిని ఎవరినీ ఇంటికి అంత త్వరగా ఆహ్వానించం.మీరు Don Tommasino కి అథితులుగా ఉన్నారని తెలుసుకున్నాను.ఆయన మాటంటే ఈ ప్రాంతం లో అందరూ గౌరవిస్తారు.అందుకనే మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించాము.అమ్మాయి తల్లిదండ్రులుగా మీ గురించి కొంత తెలుసుకోవాలనుకుంటున్నాము.మీ కుటుంబం కూడా ఇక్కడ నుంచి వెళ్ళినదే గదా..నేను అడిగిన విషయం అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను.." చెప్పాడు Vitelli.

" ఆ విషయం లో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు.మీకు కావలసినంతసమాచారం ..మీరు కోరిన సమయం లో నా గురించి చెబుతాను..సరేనా.."

Michael మాటలు తృప్తిగా అనిపించాయి వారికి..!

" Don Tommasino యొక్క అథితిగా మీరు ఎప్పుడూ ఆదరణీయులే..నేను ప్రతి దానికి చికాకు పడే వ్యక్తిని గాను.." అన్నాడు Vitelli.

అంతలోనే ఆ అమ్మాయి గది లోకి వచ్చింది.ఓరకంట Michael ని చూసి నెమ్మెదిగా వచ్చి తల్లి పక్కన కూర్చుంది.అతనికి వెంటనే ఏం మాట్లాడాలో పాలుపోలేదు.Primitive societies లో ఎందుకని భౌతికపరమైన  శీలానికి అంత విలువనిస్తారని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది.ఈమె నా సొంతం అనే భావన క్రమేణా ఈ తంతు వల్ల కలుగుతున్నది.ఈమె కోసం ఏమైనా చేయవచ్చునని కూడా అంతరాత్మలో అనిపిస్తోంది.

తన ఎడమ దవడకి తగిలిన దెబ్బవల్ల తన మొహం అంత అందంగా కనిపించకపోవచ్చునేమో.కాని ఆ అమ్మాయి కుటుంబం Don Tommasino ద్వారా తెలుసుకున్న తన మరొక పార్శ్వం తప్పక చాలా అందంగా ఉండే ఉంటుంది.న్యూయార్క్ లోని సంపన్న కుటుంబాల్లో తమదొకటనే విషయం వారికి తెలుసు.

కొద్దిగా చొరవ తీసుకొని Michael అన్నాడు ఆ అమ్మాయితో..! " అన్నట్లు..ఆరోజు నన్ను చూసి ..ఆ తోటలో ఎందుకని పారిపోయారంతా..భయం గొలిపిందా ఏమిటి" అని.దానికి ఆ అమ్మాయి మెల్లగా తల ఊపి మౌనంగా ఉండిపోయింది.

"Appolonia ..కొద్దిగా మాట్లాడు.అతను ఎంతో దూరం నుంచి నీ కోసం వచ్చాడు గదా .." చెప్పింది తల్లి ఆమెతో..!అంటే ఈ అమ్మాయి పేరు Appolonia అన్న మాట అనుకున్నాడు.గుర్తుకొచ్చి ఆ అమ్మాయికోసం తాను తెచ్చిన పాకెట్ ని ఆమె చేతికి ఇచ్చాడు.

"ఫరవాలేదు..దాన్ని తెరువు" చెప్పాడు తండ్రి.ఆమె అలాగే చూస్తూ ఉండిపోయింది బిడియం చేత.తల్లి ఆ పాకెట్ని విప్పి చూసింది..దానిలో ఒక బంగారు గొలుసు ఉన్నది.సిసిలీ సమాజం లో బంగారం అనేది లోతైన విషయం.వైవాహిక సంబంధాల ప్రస్తావనప్పుడే అలాంటి బహుమతులిస్తారు.

"Appolonia ..ఆ గొలుసు ని చూసి " బాగుంది" అని అన్నది.

కాసేపున్నతర్వాత Michael వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు.ఆ కుటుంబ సభ్యులు అందరకీ సాంప్రదాయం ప్రకారం షేక్ హాండ్ ఇచ్చాడు.ఆ అమ్మాయి చేయి చిరు వేడిగా ,అందంగా ఉంది.కొద్దిగా గరుకు గా కూడా ఉన్నది అనిపించింది. It's a peasant skin.

Vitelli వెళ్ళిపోతున్న Michael తో చెప్పాడు. " మీరు వచ్చే ఆదివారం మా ఇంటికి డిన్నర్ కి రాకూడదూ" అని..!వచ్చేవారం దాకా దేనికి..ఆ మరుసటిరోజే Michael వారి ఇంటికి వెళ్ళాడు.ఆ అమ్మాయి లో కొంత బిడియం తగ్గింది.కొద్దిగా మాటాడింది.

ఆ తర్వాత రోజు ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది.తను ఆ అమ్మాయికిచ్చిన బంగారు గొలుసు ని ఆమె మెడలో ధరించింది.అంటే ఆమె తనని ఆమోదించినట్లు సంకేతమిచ్చిందని అర్ధమైంది.ఇదివరకటి బిడియం చాలాదాకాపోయింది.ఇద్దరూ ఆ కొండల మీద ఉన్న దారుల్లో అలా నడుస్తూ మాట్లాడుకోసాగారు.అయితే వాళ్ళు ఎప్పుడు కలుసుకున్నా ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండేవారు కొద్ది దూరం లో! ..Appolonia ప్రపంచం తెలియని గ్రామీణురాలే కావచ్చును..కాని ముందు ముందు గడపబోయే జీవితం గూర్చి ఆమెకి మంచి అనురక్తి,ఇచ్చ ఉన్నవి. పెళ్ళి తేదీని కూడా ఖరారు చేశారు..మరో రెండు వారాల్లో ..స్థానికంగా ఉన్న చర్చ్ లో..!

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము)--KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (యాభై తొమ్మిదవ భాగం)

Don Tommasino ఇక్కడ ఈ Corleone గ్రామం లో పరిస్థితి ని..ఇంకా Michael పెళ్ళి విషయం ,న్యూయార్క్ లోని Don Corleone కి తెలియబరుస్తాడు.రక్షణ విషయం లో అప్రమత్తత తో మెలగవలసింది గా అక్కడనుంచి చెబుతారు.పెళ్ళి అయిన తరువాత కొన్ని రోజులు Dr.Taza ఇంట్లోనే ఉండేలా ఏర్పాటు చేస్తాడు Don Tommasino. అంతేకాదు Michael పెళ్ళికి అతని తరఫున పెద్ద లా వ్యవహరిస్తాడు.

Michael,Appolonia ల వివాహం ఆ గ్రామం లోని చర్చ్ లో స్థానిక సంప్రదాయాలననుసరించి జరుగుతుంది.అతిథులు,పెళ్ళి కుమార్తె తరఫు వారు,ఇంకా ఇతర పెద్దలు అలా నడుచుకుంటూ చర్చ్ కి వెడుతుండగా అందరూ దారి అంతటా పూల వర్షం కురిపించారు.ఇరుగుపొరుగు అందరకీ పెళ్ళి కి చేసిన తినుబండారాలు పంపిణీ చేశారు.పెళ్ళి విందు ఆ అర్ధరాత్రి దాకా సాగింది.

Michael,Appolonia ఇద్దరూ పెళ్ళి తంతు అయిపోయినతర్వాత కారు లో Corleone గ్రామం కి బయలుదేరారు.వాళ్ళిద్దరితో బాటు పెళ్ళి కుమార్తె తల్లి కూడా బయలు దేరింది.Michael ఆశ్చర్యపడుతుండగా ..వధువు తండ్రి Vitelli అన్నాడు. "ఇక్కడ సంప్రదాయం ప్రకారం మొదటి రాత్రి కార్యక్రమం లాంటివి పూర్తయ్యేంతవరకు సహాయంగా ఉండటానికి ..తగు సలహాలు ఇవ్వడానికి తల్లి కూడా వెంట రావడం జరుగుతుంది.The girl is young,virgin,a little frightened,she would need some one to talk on the morning followed by the night"  అని..!

సరేనన్నాడు Michael..! వధువు కూడా హాయిగా నిట్టూర్చింది..!

మొదటి రాత్రి ఇరువురి జీవితాల్లో ఆహ్లాదకరమైన అనుభూతుల్ని మిగిల్చింది.రోజులు ఆడుతూ పాడుతూ గడిచిపోతున్నాయి.ఒకరొజు Don Tommasino అన్నాడు." నీ పెళ్ళి జరగడం వల్ల నీ ఉనికి ఇక్కడ బాగా తెలిసింది.ఇప్పుడు నేను ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది.చుట్టుపక్కల కూడా కొంతమంది వ్యతిరేకులు తయారయ్యారు నాకు.నా మీద దాడికి ఓసారి ప్రయత్నించి విఫలమయ్యారు.కాబట్టి Dr.Taza బంగళా లోంచి కొంతకాలం పాటు బయటకి రాకు.Calo,Fabrizzio ఎప్పటిలానే నిన్ను కనిపెట్టుకొని ఉంటారు."

దానికి సరే నన్నాడు Michael.

ఇంట్లో ఉన్న ఈ తీరిక సమయాల్లో Appolonia కి ఇంగ్లీష్ నేర్పించడం,కార్ డ్రైవింగ్ నేర్పించడం లాంటివి చేస్తున్నాడతను.

ఒకరోజు ఆ ఇంట్లో వంట చేసే ముసలావిడ Michael ని చూసింది.

" అవును..నువు Don Corleone కుమారుడివా ..అందరూ అనుకుంటుంటే విన్నాను.గాడ్ ఫాదర్ నాకు బాగా తెలుసు" అంటూ మాట కలిపింది.

" మా నాన్నగారు తెలుసా..ఏ విధంగా " ఆసక్తిగా అడిగాడు Michael.

Don Tommasino మాత్రం ఆ ముసలావిడవేపు ఏవిటీ సంత అన్నట్టుగా చూశాడు.పాత విషయాలన్నీ ఏకరువు పెడుతుంది ఎప్పుడు చూసినా..!

" ఏం చెప్పాలి బాబు.. నన్ను ఒక ప్రాణాపాయం నుంచి కాపాడాడు ఆయన..అన్నట్టు నాపేరు Filomena..!" అన్నది ఆ వృద్దవనిత. ఆమె ఏదో ఓ విషయాన్ని తనతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నది అనిపించింది.Michael వైన్ ని ఒక గ్లాస్ లో పోసి ఆమెకి ఇచ్చి స్వీకరించమని కోరాడు.ఆమె కొద్దిగా త్రాగి గ్లాస్ కింద పెట్టింది.

" అవును..Luca Brasi చని పోయాడని విన్నాను.నిజమేనా.." అడిగిందామె Michael ని.

" అవును..నిజమే.Luca brasi చనిపోయాడు.అతని గూర్చి తెలిస్తే చెప్పకూడదు.మా వాళ్ళని ఎవరిని అడిగినా సరిగా చెప్పేవాళ్ళు కాదు.అతను మా తండ్రి గారికి ఎలా మిత్రుడయ్యాడు..అంతేకాదు ఓ దైవసమానుడుగా గౌరవించేవాడు.ఆ విషయాలు అవీ తెలిస్తే చెప్పండి" అడిగాడు Michael.

చెప్పడం మొదలెట్టిందామె." దాదాపుగా ముప్ఫై ఏళ్ళక్రితం నేను న్యూయార్క్ లోని పదవ అవెన్యూ లో ,ఇటాలియన్  కాలనీ లో మంత్రసాని గా పనిచేసేదాన్ని.మా ఆయన ఓ  చిన్న దుకాణం నడుపుతుండేవాడు.ఓ రోజు ఇంచుమించు తెల్లవారుతున్న సమయం లో మా యింటి తలుపులు ఎవరో కొట్టినట్టు వినబడితే లేచి తలుపు తీశాను.ఇంకెవరు Luca brasi..ఇదేమిటి ఈ వేళప్పుడొచ్చాడు..అనిపించింది. అప్పటికే అతను ఒక భయంకరమైన రౌడీ గా పేరు పొందాడు.వెంటనే నువు నాతో కారెక్కు..ఒకమ్మాయి కి డెలివరీ చేయాలి అన్నాడు.సరేనని వెళ్ళాను.ఆ అమ్మాయి చూడటానికి ఐరిష్ లా ఉన్నది.ఆమె కి డెలివెరి చేశాను.ఆడపిల్ల.ఇదిగో నేను వచ్చిన పని అయిపోయింది.ఈ పాప ని తీసుకో..నీ బిడ్డ ఏ గదా అని అడిగాను.అతని మొహం లో ఒక్కసారిగా దయ్యం పూనిందా అన్నట్లు కోపం తొంగి చూసింది.ఆ జాతి అంటేనే నాకు అసహ్యం..ఆ పుట్టిన పిల్లని  తీసుకు పోయి కింద బేస్మెంట్ దగ్గరున్న ఆ ఫర్నేస్ లో పారేయ్.నీకు కాలలసినంత డబ్బు ఇస్తా అని కొంత డబ్బుని చేతి లో కుక్కాడు.అతను ఏ ఉద్దేశ్యం తో ..ఆ జాతి అంటేనే అసహ్యం అన్నాడు..ఆ అమ్మాయి ఐరిష్ జాతి కి చెందినదనా లేక ఆమె ఒక వేశ్య గా పనిచేస్తుందనా నాకర్ధం కాలేదు. ఆ పిల్లని నిప్పుల కుంపటి లో తొయ్యడం నా వల్ల కాదన్నాను.వెంటనే నా పీక మీద కత్తి పెట్టి నువు చేయాలి అన్నాడు.ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయాను. ఆ బేబీ ఏమయిందో నాకు తెలియదు.." అలా చెబుతూ వణికిపోయినట్లయింది. చేతి తో సిలువ గుర్తు వేసుకుంది.

" మరి ఇంతకీ ఆ పాప ఏమయింది.." అసక్తి గా అడిగాడు Michael.

"ఏమో ..నాకు తెలియదు.కాని కొన్నాళ్ళ తర్వాత ఆ తల్లిని Luca brasi హత్య చేసినట్లు పేపర్లలో వచ్చింది.పొలీసులు అతన్ని అరెస్ట్ చేసి సెల్ లో వేశారు.తీవ్రమైన మానసిక వేదన తో ఒక రోజు జైలు లోనే Luca brasi ఆత్మ హత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.ఒక గాజు పెంకు తో తన గొంతు కోసుకున్నాడు..దానితో అతడిని ప్రిజన్ హాస్పిటల్ కి పంపించారు. నేను ఒకసారి ఉండబట్టలేక గాడ్ ఫాదర్ తో ఈ విషయం చెప్పాను.అప్పటికి Luca brasi మీ నాన్న గారి వద్ద పనిచేయడం లేదు.ఆయన వెంటనే Luca ని విడుదల చేయించడానికి అన్ని చర్యలు తీసుకున్నారు.ఆ విధంగా సర్వ నాశనం అయి జీవితం కోల్పోయిన దశలో ఉన్న Luca brasi ని మీ నాన్న గారు ఆదుకున్నారు.అందుకనే కామోసు..అతనికి మీ నాన్న గారు అంటే విపరీతమైన భక్తి,గౌరవం.."

ఆ కధని అలా ముగించిది Filomena...! Michael ఇంకాస్త వైన్ ని పోసి ఇచ్చాడామెకి..!

" ప్రతి రోజు ప్రార్ధన లో మీ తండ్రిని గుర్తుచేసుకుంటుంటాను.ఆయనతో చెప్పు..మృత్యువు తర్వాత కూడా ఆయనకి సద్గతులే ప్రాప్తిస్తాయి" దీవెనగా అన్నదామె.

మంచి కధ.ఈ విషయమై Don Tommasino తో రేపు చర్చించాలి అనుకున్నాడు అనుకున్నాడు Michael. అయితే ఆ మరుసటి రోజు ఒక దుర్వార్త మోసుకొచ్చాడతను...Sonny హత్య చేయబడ్డాడని..!

(మిగతాది వచ్చే భాగంలో చూద్దాము)--KVVS Murthy


Mario Puzo నవల The God Father (అరవైవ భాగం)

Don Tommasino 'ఇక్కడ ఈ ఊరిలో ఉంటే నీకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది,కొద్ది దూరం లో ఉన్న Palermo పట్టణానికి పద అంటూ Michael ని బయలుదేర దీశాడు.కొత్తగా తయారవుతున్న కొన్ని కుర్ర గ్యాంగులు ఒక పద్ధతి పాడు లేకుండా తయారవుతున్నారు.బావిలో నీళ్ళన్నీ వాళ్ళే తాగేయాలనుకునే రకం.నన్ను లొంగదీయడం వాళ్ళతరం కాదులే గాని.. ఈ మధ్యలో నీకు ఏ అపాయం వాటిల్లకూడదు.అది నాకు ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ రోజు ఉదయం నుంచే ప్రయాణ సన్నాహాలు మొదలెట్టాడు Michael.భార్య Apollonia కూడా కొన్ని రోజులు వాళ్ళ తల్లి గారింట్లో ఉండి వస్తానన్నది గనక..ఆమెని ఆ ఊరిలో దింపేసి తాను బాడీ గార్డ్స్ తో కలిసి Palermo వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాడు.భార్య ఇపుడు గర్భవతి కూడా.కాబట్టి కొన్ని రోజులు పుట్టింట్లో ఉంటానంటే వెంటనే ఒప్పుకున్నాడు.

బ్యాగులో తన బట్టలన్నిటినీ సర్దుకున్నాడు.ఇంతలో Fabrizzio కనిపిస్తే పిలిచి చెప్పాడు." కారుని వెంటనే సిద్ధం చెయ్యి.కొన్ని నిమిషాల్లో ఇక్కడ్నుంచి బయలుదేరి వెళ్ళాలి. అన్నట్టు Calo ఎక్కడ..కనిపించడం లేదు.." అని.

" Calo కాఫీ తాగుతున్నాడు కిచెన్ లో. సరే..కారుని సిద్ధం చేస్తా " అని చెప్పి వెళ్ళిపోయాడు Fabrizzio.ఈ మధ్య ఎందుకనో అతను Apollonia కి దగ్గర గా మసలాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది.అలాగని అతను ఎక్కువ చొరవ కూడా ఆమె విషయంలో తీసుకున్నట్లు చెప్పడానికి లేదు.ఎందుకంటే అది మృత్యువు కి చాలా దగ్గర దారి.అదీ Don Tommasino ఇంటిలో..!

అంతలోనే Filomena కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది Michael కి..!" నేను న్యూయార్క్ వెళ్ళగానే నాన్న గారికి మీ గురించి గుర్తు చేస్తాను." చెప్పాడు అతను ఆమెతో.మంచిది అన్నట్లు తలూపింది.

" కారు సిద్ధంగా ఉంది.మీ బ్యాగులవీ తీసుకెళ్ళనా" అడిగాడు Calo.

" లేదులే..నేను తీసుకొస్తా..అన్నట్లు Apollonia ఎక్కడ.." Michael అటూ ఇటూ చూస్తూ అన్నాడు.

" ఆమె కారు లో కూర్చుని తయారుగా ఉంది.డ్రైవింగ్ చేస్తుందట.. మొత్తానికి సిసిలీ అమ్మాయిని అమెరికా అమ్మాయిగా మార్చేశారే.." నవ్వుతూ అన్నాడు Calo

" సరే..Fabrizzio ని కూడా రెడీ అవమను తొందరగా..ఇదిగో వస్తున్నా నేను" అంటూ కిచెన్ లో నుంచే ఆ కాంపౌండ్ లో ఉన్న కారు ని గమనించాడు Michael.చిన్న పిల్ల మాదిరిగా ఆ వీల్ మీద చేయి పెట్టి తిప్పుతున్నది ఆమె.ఇంతకీ ..Fabrizzio ఎక్కడ..కనబడడం లేదు..ఈ టైం లో ఎక్కడకి  పోయాడబ్బా అనుకున్నాడు.కొద్దిగా కోపం కూడా వచ్చింది.

అంతలోనే యేదో అనుమానం వచ్చింది.గబాలున లోపల్నుంచి బయటకి వస్తూ చెయ్యి ఊపుతూ కారు లో ఉన్న భార్య కి సైగ చేశాడు. ఆ కారు ని స్టార్ట్ చెయ్యవద్దని.ఆమె కి అది ఇంకోలా అర్ధమయిందో ఏమో వెంటనే ఇగ్నీషన్ మీద చెయ్యి వేసి నొక్కింది.ఏమయిందో అర్ధం కాలేదు...ధడేలుమని పెద్ద బాంబు లాంటి శబ్దం ..ఆ ఇల్లు లోని కొంత భాగం కూడానాశనమయింది.కారు తునాతునకలయ్యింది. కొన్ని ఇంటి కున్న రాళ్ళు కూడా Michael శరీరం మీద పడ్డాయి.వెంటనే కిందపడి స్పృహ కోల్పోయాడు.

మళ్ళీ వంటికి తెలివి వచ్చేసరికల్లా ఒక చీకటి రూం లో ఉన్నాడు.ఏవో మాటలు..సరిగా వినబడడం లేదు..మగతగా ఉంది.తన మంచం దగ్గరగా Don Tommasino కూర్చుని ఉన్నాడు.Dr.Taza పరీక్షించి ప్రాణాపాయం లేదని చెప్పాడు.

"Michael..ఇప్పుడెలా ఉంది..మాట్లాడగలవా ..రెస్ట్ తీసుకుంటావా.." Don Tommasino అడిగాడు.ఓపిక లేనట్టుగా ఓసారి అలా కళ్ళుమూసుకుని చేతితో ఒకవేపు చూపించి సైగ చేశాడు.

" ఓహో..Fabrizzio నా..ఆ గారేజ్ నుంచి కారు తీసింది.. వాడు కనబడడం లేదు.మాయమయ్యాడు.మీ నాన్నగారికి ఈ వార్త అందిస్తాను.సాధ్యమైనంత త్వరగా అమెరికా లో ప్రవేశించడానికి ఏర్పాట్లు చేయమని చెబుతాను.ఆ కుర్ర గ్యాంగులు కూడా నువు చనిపోయావని భావించి నాతో సంధి చేసుకున్నారు.కొన్ని వారాలు ఇక్కడే ఉండు.రెస్ట్ తీసుకో.." చెప్పాడు Don Tommasino .

Michael ఎందుకనో ముభావంగా నవ్వాడు.Apollonia,Calo లు ఇద్దరూ ఈ ప్రమాదం లో మరణించారు.అది అర్ధమైంది.

" నాకు భవిష్యత్ లో ఎవరు Fabrizzio ని పట్టి అప్పగించినా వారికి సిసిలీ లోని అతి విలువైన భూముల్ని బహుమతిగా ఇస్తాను.ఈ మాట మీ దగ్గర పనిచేసే వాళ్ళదరకీ చెప్పండి" Michael నెమ్మదిగా అన్నాడు Don Tomassino తో.

అలాగే అన్నట్లుగా తల ఊపాడతను.

"మా నాన్న గారికి వార్త పంపించండి..నన్ను ఇంటికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయమని..ఆయన కొరకు ఇక మీదట నేను పనిచేయాలనుకుంటున్నాని.."

Don Tommasino రిలీఫ్ గా ఫీలయ్యాడు ఆ మాటలు విని.సరే..Michael గాయాలు తగ్గడానికి ఒక నెల పట్టింది.ఆ తర్వాత ఏర్పాట్లు చేయడానికి మరో రెండు నెలలు పట్టింది,రోం చేరుకొని...అక్కడనుంచి..న్యూయార్క్ చేరుకోవడానికి..! ఈ మధ్య కాలం లో ఎప్పుడూ Fabrizzio తనకి తారసపడలేదు.

(మిగతాది వచ్చే భాగంలో చూద్దాము) --KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (అరవై ఒకటవ భాగం)

Kay Adams తన డిగ్ర్రీ చదువు అయిపోయిన తర్వాత వెంటనే ..వాళ్ళ వూరు New hampshire లోనే ఒక గ్రేడ్ స్కూల్ లో టీచర్ గా పనిచేయడం మొదలెట్టింది.ఎప్పుడైనా Michael  తల్లి కి ఫోన్ చేసేది,అతను గురించి ఏదైనా వార్త తెలిసిందా అని..!

" మా వాడి రాక ఎప్పుడో అది మాకే తెలియదు.నువ్వెందుకు నీ జీవితాన్ని అతని కోసం వ్యర్ధం చేసుకుంటావు ..ఎవరో ఒక మంచి కుర్రాడిని చూసి పెళ్ళి చేసుకో" అనేది ఆ తల్లి. ఆమె లోని ప్రేమ భావం ని Kay అర్ధం చేసుకునేది.కాబట్టి మరోలా ఫీలయ్యేది కాదు.

తను పని చేసే స్కూల్ కి ఫస్ట్ టెర్మ్ హాలి డేస్ ఇచ్చినపుడు న్యూయార్క్ కి వెళ్ళాలనిపించింది.పాత మిత్రురాల్ని కలవడానికి,షాపింగ్ చేయడానికి..ఇంకా ఏదైనా ఆసక్తికరంగా ఉండే జాబ్ వెదుక్కుందామని ..అలా..!

Michael నుంచి దూరమైన ఈ రెండేళ్ళలో తను ఒంటరిగానే ఉందని చెప్పాలి.పుస్తకాలు చదవడం,పాత కాలేజీ మిత్రురాళ్ళకి ఫోన్ చేయడం..ఇంకా స్కూల్ లో బోధించడం ..వీటితోనే సరిపోతున్నది.డేటింగ్ లాంటివి కూడా ఏమీ లేవు.డేట్స్ ఎవరైనా అడిగినా ఆసక్తి లేక నిరాకరించేది.

Michael నుంచి ఎలాంటి కబురు లేదు.ఈ విషయం లో అతని మీద కోపం గా ఉన్నా,ఏదో క్లిష్ట పరిస్థితి లో అతను ఉండి ఉంటాడని అనుకునేది.
Kay Adams న్యూయార్క్ కి వెళ్ళి ఒక హోటల్ లో దిగింది.కొంతమంది పాత మిత్రురాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంది.ఆ తర్వాత చివరిగా Michael తల్లికి ఫోన్ చేసింది.

" హలో..Mrs.Corleone నేను..Kay Adams ని ..గుర్తున్నానా" అడిగింది తను .

" ఏమిటి ..ఈ మధ్య అసలు ఫోన్ చేలేదు.ఎవరినైనా వివాహమాడావా..ఏమిటి" అన్నదామె.

" అదేం లేదు..చిన్న పని మీద న్యూయార్క్ కి వచ్చాను.Michael గురించి ఏమైనా తెలిసిందా..కనుక్కుందామని కాల్ చేశాను..అంతే.."

అవతలవేపు కాసేపు నిశ్శబ్దం..! ఆ తరవాత Michel తల్లి అన్నది.

" Michael ఇంటికి వచ్చి ఆరు నెలలు అవుతోంది గదా.. నీకు ఇంతదాక ఫోన్ చేయలేదా.."

" లేదు.." చెప్పింది Kay Adams.

Michael వచ్చి కూడా తనకి ఫోన్ చేయలేదు.అది తలచుకునేసరికి Kay Adams కి కొద్దిగా మండింది.అసలు ఈ ఇటాలియన్ మనుషులకి మర్యాద అన్నదే తెలియదా..?అంటే ఇతను ఫోన్ చేయకపోతే తాను భగ్న హృదయిని లా అయిపోయి ఆత్మహత్య చేసుకోవాలా లేక సగటు ఇటాలియాన్ యువతి లా అవివాహిత లా మిగిలిపోవాలా..అసలేమిటి అతని ఉద్దేశం..? ఎక్కడో కాలిందామెకి..!వెంటనే ఫోన్ కట్ చేయాలనిపించింది Kay Adams కి..!

సరే..తను మాట్లాడుతున్నది అతని తల్లి తో గదా అని తమాయించుకున్నది.

" ఓహ్..అలాగా..మంచిది..నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను" అని ఫో కట్ చేయబోయింది Kay.

" అమ్మాయ్..ఒక్కసారి ఇక్కడికి రాకూడదూ..నువ్వే వచ్చి Michael కి వచ్చి ఓ సర్ ప్రైజ్ ఇవ్వవచ్చుగా.."

" ప్చ్..నాతో మాట్లాడటానికే అతనికి సమయం లేదు.అలాంటప్పుడు నేనెందుకు రావడం.."

" అట్లాగని ఎందుకు అనుకుంటావ్..నీకు మంచి కాళ్ళు అయితే ఉన్నాయి గాని మెదడు లేదమ్మాయ్..Michael కోసమే ఎందుకు..ఏం నా కోసం రాకూడదా.. నువు టాక్సీ పట్టుకుని లాంగ్ బీచ్ లో ఉన్న మాల్ కి వచ్చేయ్..ఆ చార్జ్ కూడా మా గేట్ దగ్గరున్న వాళ్ళు ఇస్తారు..సరేనా" అడిగింది Michael తల్లి.

"సరే" చెప్పింది Kay Adams.

హోటల్ లో ఉన్న అద్దం లో తనని తాను చూసుకుంది.కొద్దిగా మేకప్ సరి చేసుకుంది.రెండేళ్ళకీ ఇప్పటికి తను కొద్దిగా ఒళ్ళు చేసింది.పిరుదులు కొంచెం లావు అయ్యాయి.వక్షోజాలు కూడా ..! సగటు ఇటాలియన్ కి నచ్చే అంశాలే ఇవి.ఇబ్బంది లేదు.

తను ఇంటికి వెళ్ళేసరికి Michael తల్లి కౌగలించుకుని సాదరంగా ఆహ్వానించింది.కిచెన్ లోకి తీసుకెళ్ళి చాలా తినుబండారాలు పెట్టింది.కాఫీ కూడా ఇచ్చింది.

పిచ్చాపాటి మాట్లాడుతుండగా Michael వచ్చిన కారు కిటికీ లోంచి కనిపించింది.బాడీగార్డు లనుకుంటా ఇద్దరు దిగిన తరువాత తనూ దిగాడు.

అతని ఎడమ దవడ బాగా దెబ్బ తిన్నట్లు కనిపించింది.Kay Adams యొక్క మనసు కొంచెం కరిగినట్లు అయింది.Michael ఇంటిలోపలకి వచ్చి  తల్లిని.Kay Adams ని చూసి అలాగే ఉండిపోయాడు.ఏ భావమూ వెంటనే వ్యక్తం చేయలేదు.కాసేపున్నతరువాత Kay ని తనతో పాటు రావలసిందిగా Michael కోరడం తో ..అదే కారు లో ఎక్కి మాట్లాడుకోవడం మొదలెట్టారు..ముందుకి సాగుతూ..!

" నీ దవడ కి దెబ్బ తగిలిందని తెలుసు..కాని ఇంతలా గాయమైందని నేను ఊహించలేదు.." అంది Kay Adams.

" ఇంటికి వచ్చేశాను గదా..దాన్ని సరిచేయించుకుంటాను..అదెంత పని.నేను దూర ప్రదేశాలకి నీకు చెప్పకుండా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది.అన్నిటికన్నా ముందు నా విషయం లో నువ్వు అది  అర్ధం చేసుకోవాలి..అదే నా కోరిక.." చెప్పాడు Michael.

"సరే..దానిదేముంది"

" ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళి భోజనం చేద్దామా"

" నాకు అంతగా ఆకలిగా లేదు"

" అన్నట్లు నీ డిగ్రీ పూర్తి అయిందా.."

" ఆ..అయిపోయింది..మా వూరి లోని ఓ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నా..అన్నట్లు ఆ పోలిస్ కేప్టెన్ ని చంపిన వాళ్ళు దొరికారా " అడిగిందామె.

" ఆ ..దొరికారు..ఈ మధ్యలో పేపర్లో కూడా చూసి ఉండాలే.."

" నేను చూడడం పడలేదు.నాకే అది తెలిస్తే ఎప్పుడో మీ ఇంటికి ఫోన్ చేసేదాన్ని. ఆ సంఘటనకి నువ్వు మాత్రమే బాధ్యుడవని ఇన్నాళ్ళు అనుకున్నాను. ఇప్పుడే మీ అమ్మ గారు చెప్పారు..ఇంకో మనిషి ఎవరో ఒప్పుకున్నారని ఆ మర్డర్ చేసినట్లు"

" ఏవరు నమ్మినా నమ్మకపోయినా నేను తప్పు చేశానంటే మొదట నమ్మేది మా అమ్మ మాత్రమే..."

" ఎందుకని అలా.."

" Mothers are like cops.They always believe the worst"  Michael నవ్వుతూ చెప్పాడు.

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము) __ KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (అరవై రెండవ భాగం)

Mulberry Street కి కారు ని పోనిచ్చి అక్కడ ఓ గారేజి లో పార్క్ చేశాడు Michael.దాని వెనుక ఉన్న ఓ ఇంటికి పరిచితుని వలెనె వెళ్ళి కీ తీసి దానితో డోర్ ఓపెన్ చేసి Kay Adams ని లోపలకి ఆహ్వానించాడు.అతని ఫేమిలీ కి ఉన్న ఇళ్ళలో అది ఒకటి అని ఆమెకి అర్ధమయింది.లోన చాల విశాలంగా ఉన్నాయి గదులు.పూర్తి ఫర్నీచర్ తో కూడుకున్న నివాసమది.

ఇద్దరూ ఓ గది లోని సోఫా మీద కూర్చున్నారు.కాసేపు ఆగిన తర్వాత ఆ గది లో గల బార్ లోనుంచి ఒక బాటిల్ తీసి ఇద్దరకి డ్రింక్స్ ఫిక్స్ చేశాడు.ఒకటి Kay కి ఇచ్చి ..తను ఒకటి తీసుకున్నాడు.ఏదో పిచ్చాపాటి అయినాక శృంగార లోకం లో తేలియాడారు.

" కనీసం నువు నాకు ఓ ఉత్తరమైనా రాసి ఉండవలసింది.నీ విషయాలు ఆ మాత్రం రహస్యంగా నేను మాత్రం ఉంచలేనా..Yankees are pretty closemouthed too ..you know..? అన్నది Kay Adams ఆ మంచం పై అలానే పడుకొని.

" ఇంతకాలం నా కోసం వేచి ఉంటావని నేను ఊహించలేదు .." చెప్పాడు Michael.

" ఆ ఇద్దరి హత్యలో నీ చేయి ఉందని నేను నమ్మడం లేదు.ఇప్పటికి కూడా..నా నమ్మకం అదే..నీ గురించి నాకు తెలియదా ఏమిటి"

" ఆ పని చేసింది నేనా కాదా అనేది ఒక విషయం కాకూడదు మన మధ్యన.."

" నువ్వు ఏదో దాస్తున్నావు..ఏం నాతో కూడా చెప్పకూడదా.." అంది Kay.

" హ్మ్...అంటే మన పెళ్ళి కావాలంటే ఈ విషయం పూర్తిగా నేను చెప్పి తీరవలసిందేనా.." అడిగాడు Michael.

" ప్చ్..అదేం లేదు.మన మధ్య ప్రేమకి దానికి సంబంధం ఏమీ లేదు.ఎందుకని నాతో నిజం చెప్పడానికి భయపడుతున్నావు..అదే నాకు అర్ధం కావడం లా.."

" నా ప్రవాస జీవితం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ..ఎందుకనో ఎవరిని చూసినా కలగని ఓ సంతోషం నిన్ను చూసిన తర్వాత కలిగింది.దీన్నే ప్రేమ అనుకోవాలా..ఏమో.."

" నీ నుంచి ఆ మాత్రం ప్రేమ చాలు నాకు.."

ఆమె బెడ్ మీద ఉండగా దాని ముందు ఉన్న కుర్చీ లో ఉన్నాడు అతను.

" సరే..కాసేపు సీరియస్ గా ఆలోచిద్దాం..నాతో వివాహ జీవితం ఎలా ఉండాలని నువు ఆశిస్తున్నావు.." ప్రశ్నించాడు Michael.

ఆ మాటకి Kay Adams నవ్వి ఊరుకున్నది.

" చూడు..Kay..నేను ఉన్నది ఉన్నట్లు చెబుతున్నాను.ఆ తర్వాత నిర్ణయం తీసుకోవలసింది నీవే.పెళ్ళి అయిన తరవాత కూడా నేను నీతో అన్నీ విషయాలు చెప్పలేను.ప్రస్తుతం నేను మా నాన్నగారి వద్ద ఆలివ్ ఆయిల్ బిజినెస్ కి సంబందించి తర్ఫీదు పొందుతున్నాను.You know my family has enemies.My father has enemies.నువు నన్ను పెళ్ళాడినా కాలం కలిసిరాకపోతే చాలా త్వరగానే నువు విడో వి అయ్యే అవకాశం ఉంది.నా దైనందిన వ్యవహారాల్లో జరిగే అన్నిటిని నేన్నీతో చెప్పడం వీలుపడదు. నా బిజినెస్ గూర్చిన వివరాలు పూర్తిగా నేన్నీకు వివరించలేను.." చెప్పాడు Michael.

Kay Adams బెడ్ మీది నుంచి లేచి కూర్చొని ..ప్రక్కనే ఉన్న Table lamp స్విచ్ వేసింది.ఆ తర్వాత ఆమె సిగరెట్ వెలిగించుకొని అలాగే త్రాగుతూ దిండుకి జారగిల కూర్చుని సాలోచనగా అన్నది.

" అంటే దానర్ధం ఏమిటి..నీవొక గ్యాంగ్ స్టర్ వని నాతో చెబుతున్నావు కదూ..నీ చర్యలేవీ నేను ప్రశ్నించకూడదు..అంతేనా..ఏదో హారర్ సినిమా లో లా భయపెడుతున్నావు మొత్తానికి.."

ఆ మాటకి Michael వెక్కిరిస్తున్నట్లుగా తన దెబ్బతిన్న దవడ భాగాన్ని ఆమె వేపు చూపించాడు.'ఇంత భయంకరంగానా' అన్నట్లుగా..!

" ఓ...Mike ..దాని గురించి నేను ఆలోచించడమే లేదు.." విసుగ్గా అందామె.

" హ్మ్..ముక్కునుచి కారేప్పుడు తప్ప నేనూ దాని గురించి పెద్దగా పట్టించుకోను.." నవ్వుతూ అన్నాడతను.

" నేను సీరియస్ గా అడుగుతున్నాను చెప్పు..అంటే వివాహానంతరం నేను ఎలా ఉండాలని నువు భావిస్తున్నావు.ఇంటిదగ్గర పిల్లల్ని చూసుకుంటూ ..మీ అమ్మగారి మాదిరిగా ఉండాలా..? ఏదో జరగరానిది జరిగి నువు జైల్లో పడ్డావే అనుకో..అప్పుడు నా పరిస్థితి ఏమిటి.." అడిగింది Kay Adams.

" అలా జరిగే అవకాశమే లేదు.అయితే గియితే నేను చంపబడవచ్చు.కాని జైల్లోకి వెళ్ళడం మాత్రం జరగదు.Killed,Yes;Jail,No"

Michael నమ్మకానికి ఆమె కి నవ్వు వచ్చింది.కొంచెం గర్వంగానూ అనిపించింది.

" అలా అని అంత గ్యారంటీగా ఎలా చెప్పగలవు.." అడిగిందామె.

" ఇలాంటి విషయాలే ..నేను నీతో పంచుకోలేనని చెప్పేది.ఇవన్నీ కొన్ని సీక్రెట్స్ అంతే.." చెప్పాడు Michael

అది విని ఆమె కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది.

" నువు ప్రవాసం నుంచి వచ్చి ఇన్ని నెలలయినా ఒక్క ఫోన్ చేయలేదు ఇంతకాలం..అలాంటపుడు నేను నిన్ను ఎందుకు వివాహమాడాలి..Am I good in bed ..?"  ప్రశ్నించింది Kay.

"దాంట్లోనూ నిజం లేకపోలేదు.వివాహం అయితే ప్రతిరోజు ఒకరినొకరం చూసుకోవచ్చుగదా..సరే..ఒక పనిచెయ్..మీ పేరెంట్స్ కి విషయం చెప్పు.వాళ్ళు ఏమి చేయమంటే అది చెయ్. అందులోను మీ నాన్న గారు చాలా తెలివైన వ్యక్తి అని విన్నాను.."

" ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు నువు.."

" ఏ కోణం నుంచి చూసినా నన్ను వివాహమాడకపోవడమే మంచిదేమో..ఈ దవడ..ఈ చీదుడు వ్యవహారం నాకే చికాకు గా ఉంది.."

ప్చ్..నేనడిగిన దానికి మాత్రం దాటవేస్తున్నావు నువు.."

సరే..చెబుతున్నా విను.కొన్ని విషయాలు ఇప్పటికీ నేను సరిగా చెప్పి ఉండకపోవచ్చు.దానికీ కారణం ఉంది.అన్ని సక్రమంగా జరిగితే ఒక అయిదు ఏళ్ళ లో Corleone కుటుంబం అన్ని విషయాల్లోనూ చట్టబద్ధమైన వ్యవస్థ గా రూపు దాల్చుతుంది.దాని కోసం కొన్ని వ్యూహాలు పన్నక తప్పదు.దానిలో ఎక్కడ తప్పు జరిగినా నా ప్రాణమే పోవచ్చు.అప్పుడు నువు ఒక ధనికురాలివైన విడో అవుతావు.Well..I want you..because I want a family and kids.నేను మా నాన్నగారివల్ల ఎలా ప్రభావితం కాబడ్డానో..ఆ విధంగా నా పిల్లలు నా వల్ల ప్రభావితం కాకూడదని నా కోరిక.అంటే దాని అర్ధం మా నాన్నగారు నా చేత బలవంతంగా అన్నీ చేయించారని గాదు.నిజానికి ఆయన నన్ను ఎపుడూ ఫేమిలీ బిజినెస్ లోకి తీసుకురావాలని అనుకోలేదు.నన్ను ఒక ప్రొఫెసర్ గానో..డాక్టర్ గానో చూడాలని ఆయన అనుకునేవారు.కాని పరిస్థితులు ఎదురుతిరిగాయి.నేను నా కుటుంబం కోసం పోరాటం చేయక తప్పని పరిస్థితి లో ఉన్నాను.
అవును చేయక తప్పదు.ఎందుకంటే నేను అభిమానించే ,ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఒకరున్నారంటే అది మా నాన్నగారు మాత్రమే.అంత కంటే గౌరవించదగిన మనిషిని నేను చూడలేదు.ఆయన ఓ మంచి భర్త..మంచి తండ్రి..ఇంకా విధివక్రీకరించిన అభాగ్యుల పాలిట మంచి స్నేహితుడు.అయితే ఆయనకి ఇంకొక పార్శ్వం కూడా ఉంది.కాని ఒక కుమారునిగా అది నాకు సంబందించని విషయం.

నాకు ఒకటే కోరిక..మన బిడ్డలు నూటికి నూరుపాళ్ళు అమెరికన్ ల వలె పెరగాలి.ఏ ఒడిదుడుకులు లేకుండా..గౌరవంగా ఉండాలి.వాళ్ళో..వాళ్ళ పిల్లలో ఈ అమెరికా దేశానికి ప్రెసిడెంట్ కావాలి.దిన దినం చావు బ్రతుకులుగా ఉండే ఈ ఫేమిలీ బిజినెస్ లోకి వాళ్ళు రానవసరం ఉండదు గాక ఉండదు.ఉపాధ్యాయులు గానో,సంగీతకారులుగానో,వైద్యులు గానో వారి రంగాల్లో పేరుతెచ్చుకోవాలి.ఆ చివరి జీవితపు అంకం లో మనం ఏదో కంట్రీ క్లబ్ లో శాశ్వత సభ్యులం అవుదాం.అలా ఆహ్లాదకరమైన వాతావరణం లో అమెరికన్ పౌరులుగా జీవించుదాం.."  చెప్పాడు Michael.

అదంతా విన్న Kay ఇలా అంది..!

" అద్భుతం..చాలా బాగా చెప్పావు.అయితే ఇంకో వెర్షన్ మిస్ అయ్యావు సుమా.. అదే నేను 'విడో' గా మారితే ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయన్నది.."

" జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్న పార్ట్ నే నీకు చెప్పాను.మిగదంతా ఎందుకు..దాని గురించి ఆలోచించడం వృధా.." చెప్పాడు Michael.

(మిగతాది తర్వాత భాగం లో చూద్దాము) --KVVS Murthy

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (అరవై మూడవ భాగం)

" నేను చెప్పవలసింది చెప్పాను.ఇక ఎలాంటి వివరణలు అవసరం లేదనుకుంటాను.దీని గురించి మరీ ఎక్కువగా ఆలోచించకు.వైవాహిక జీవితం లోకి ప్రవేశించిన తర్వాత ఇవన్నీ నిరర్ధకంగా మిగులుతాయి." చెప్పాడు Michael.

Kay Adams తల ఊపింది.

" నువ్వు ఇంతదాక చెప్పిన మాటల్లో మీ కుటుంబాన్ని,మీ నాన్న గారిని ప్రేమిస్తున్నట్లు చెప్పావు తప్పా, నన్ను ప్రేమిస్తున్నట్లు ఒక్క ముక్క చెప్పావా..?నువు నన్ను విశ్వాసం లోకి తీసుకోనప్పుడు నేను భార్యగా మాత్రం ఉండాలని ఎలా అనుకుంటున్నావు..కాని నాకు ఒకటి తెలుసు..మీ నాన్న గారు మీ అమ్మగారిని పూర్తిగా విశ్వసిస్తారు ఏ విషయంలోనైనా.."

" నువు చెప్పింది నిజమే Kay..కాని దాని అర్ధం ఆయన జీవితం లోని ప్రతి చిన్న అంశాన్ని మా అమ్మకి పూస గుచ్చినట్లు చెబుతారని కాదు.ఆమెని మా నాన్న గారు విశ్వాసం లోకి తీసుకోవడంలో కూడా ఓ కారణమున్నది.దానికి అనేక సంవత్సరాల పునాది వున్నది.నలభై ఏళ్ళ వైవాహిక జీవితం లో మా నాన్నగారికి ఆమె ఎంతో ఆసరా గా నిలిచింది.అనేక కష్ట సమయాల్లో తన సేవల్ని అందించింది.ఆయన తన కుటుంబ అభివృద్ది కోసం తీరిక లేకుండా పనిచేస్తున్నప్పుడు పిల్లల,ఇంటి బాధ్యతల్ని ఆమె తీసుకున్నది.నువు కూడా నాకు అలాంటి సహకారం అందించిన రోజున,నేను కూడా నీ పట్ల అలాగే ప్రవర్తించుతాను.." చెప్పాడు Michael.

" హ్మ్మ్..అంటే మన వివాహం తర్వాత కూడా ఆ మాల్ లోనే ఉండాలా.." అడిగిందామె.

Michael అవునన్నట్లు తలాడించాడు.
" మన జీవితాలు మనవి.మా తల్లిదండ్రులు మన విషయాల్లో ఎప్పుడూ కలగజేసుకోరు.కొంత కాలం పాటు ఆ మాల్ లో ఉండక తప్పదు."చెప్పాడు Michael

" బయటకి వచ్చి నివసిస్తే నీకు డేంజర్ కదూ.." అడిగింది Kay.

ఆ మాట విన్న వెంటనే అతనికి కోపం వచ్చింది.కాని దాన్ని లోపలకే ఉంచుకున్నాడు.వ్యక్తపరచలేదు.కాని అది ఆమె గమనించింది.

" చూడు..Kay..నువు మా కుటుంబం గురించి పూర్తిగా అర్ధం చేసుకోలేదు.మొదటిసారిగా ఇంకో విషయం చెబుతున్నా విను.మా నాన్నగారు తన కుటుంబం కోసం మాత్రమే కాక తన పై ఆధారపడిన అనేక జీవితాల కోసం పనిచేస్తున్న వ్యక్తి.ఎవరయితే ఆయనకి కష్ట కాలం లో తిరిగి రుణం తీర్చుకుంటారో వారి కోసం ఏమైనా చేసే మనిషి.ఈ సమాజం విధించే రూల్స్ కి ఆయన కట్టుబడరు.తన స్వభావానికి,శక్తి కి అవి సరిపడనివిగా ఆయన భావిస్తారు.ఒక దేశం యొక్క అధ్యక్షునిగానో,లేదా అత్యున్నత స్థాయి న్యాయమూర్తి గానో తనని తాను పరిగణించుకుంటారు.ఆయన అంతిమ గమ్యం ఒకటే..ఏదో ఒకనాటికి పూర్తి సెక్యూరిటి తో చట్టబద్ధమైన జన జీవన స్రవంతి లో కలవడమే.దాని కోసం ఆయన తనదైన Code of ethics ని రూపొందించుకున్నారు.అది మనకి కనిపించే ఈ లీగల్ స్ట్రక్చర్ కంటే బలమైనది" చెప్పాడు Michael.

Kay Adams అది విని హతాశురాలైంది.

" ఏమిటి Michael నువు అనేది..హాస్యాస్పదంగా లేదూ..ప్రతి ఒక్కరు మీ నాన్నగారి లాగే భావిస్తే ఈ దేశం లోని వ్యవస్థలన్నీ ఏమవుతాయి..అరాచకం తాండవించదూ..ఈ సమాజం ఏమవుతుంది ఆలోచించావా..?"

"Kay నువు సినిమా లోని కొన్ని పాత్రల్ని ఊహించుకొని కలవరం చెందకు.మా నాన్నగారు అలాంటి మనిషి కాదు.ఆయన ప్రపంచం లో ఆయన ఎంతో బాధ్యత తో క్రమశిక్షణ తో ఉండే వ్యక్తి.కనిపించిన ప్రతివారిని కాల్చి పారేసే గేంగ్ స్టర్ కాదాయన..He is a responsible man in his own way" చెప్పాడు Michael.

" ఒకటి చెప్పు ..నువు మీ నాన్నగారి పద్ధతిని నమ్ముతున్నావా.." అడిగింది Kay.

" నా కుటుంబం లో నాకు నమ్మకమున్నది.కంటికి కనిపించే ఈ సమాజమంతా మన సంక్షేమానికి పాటుపడదు.ఇంకా రక్షణ కూడా ఇవ్వదు.నా తలరాతని ..గుప్పెడుమంది రాజకీయవేత్తల చేతిలో నేనుంచలేను.అసలు వాళ్ళకున్న అర్హత ఏమిటి..?జనాల్ని వంచించి,ఏవో కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకొని గెలవడమేగా..అంతకన్నా ఏమైనా ఉందా..?ఎవరకి ఇష్టం ఉన్నా లేకున్నా అతి త్వరలో Corleone కుటుంబం చట్టబద్ధమైన జీవన స్రవంతి లోకి ప్రవేశిస్తుంది.అన్ని హంగులతో..అన్ని శక్తులతో..పూర్తి రక్షణతో..రాబోయే మా తరాల కోసం మేము చేయబోయే కార్యమిది.."

" Mike..నువు దేశం కోసం వలంటీర్ గా యుద్ధం లో కూడా ఫాల్గొన్నావు గదా.."

" కావచ్చును.కాని ప్రభుత్వమే మనకి అన్ని సమకూర్చుతుందని భావించరాదు. మొత్తం మీద నేను చెప్పేదొకటే నేను మా నాన్నగారి కి సహాయకారి గా ఉండక తప్పదు.అది నా నిర్ణయం..ఇక నీ నిర్ణయం ఏమిటో నువు తీసుకోవచ్చును.." చెప్పాడు Michael.

" నాకిప్పుడు వివాహం గురించి ఆలోచించే తీరిక లేదు Mike.దాదాపు రెండేళ్ళు ఏ పురుషుని తోడు లేకుండా గడిపాను.ముందు పక్క మీదికి రా..ఇన్నాళ్ళ కసినంత తీర్చుకోవాలిగదా.. " అంటూ బెడ్ మీదికి పిలిచింది Kay.

లైట్లు ఆరి పోయి మసకగా ఉన్నది.అప్పుడు ఆమె నవ్వుతూ అన్నది" ఈ రెండు ఏళ్ళు నేను ఒంటరిగా ఉన్నానని నువు నమ్ముతున్నావా" అని.

" అవును.నమ్ముతున్నాను" చెప్పాడతను.

" మరయితే నీ సంగతి ఏమిటి.."

" గత ఆరునెలలుగా నేనూ అంతే.." Michael చెప్పిన దాని లో తప్పు లేదుమరి.అప్పటికి Apollonia చనిపోయి ఆరునెలలేగదా అవుతుంటా..!


(మిగతాది వచ్చే భాగం లో చూద్దాం)--KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (అరవై నాల్గవ భాగం)

Johnny Fontane,Nino లు ఇద్దరు కొన్ని రోజులనుంచి ఆ లాస్ వెగాస్ లోనే కాలం గడుపుతున్నారు.Nino మాత్రం పూర్తిగా ఆనందిస్తున్నాడు..కావలసినంత తాగడం..ఆ కేసినోల లో జూదం ఆడడం ..ఇంకా అక్కడి అమ్మాయిలతో సరదాగా కాలక్షేపం చేయడం ఇవి అతని కార్యక్రమాలు.ఓ రోజు Lucy అడిగింది.

"ఏమిటి కొన్ని రోజులబట్టి ఈ Las Vegas లోనే మకాం వేశారు.ఏదో ఊరికినే ఎంజాయ్ చేయడానికి వచ్చారా..ఇంకా ఏదైనా పని మీదనా" అని..!

" Michael మమ్మల్ని ఇద్దర్ని ఇక్కడకి రమ్మన్నాడు.ఏదో మాట్లాడాలని.నిన్ను,నీ బాయ్ ఫ్రెండ్ Jules ,అతని సోదరుడు Freddie మనలందరితో చాలా ముఖ్యమైన విష్యాలు మాట్లాడాడానికి వస్తున్నాడు" చెప్పాడు Johnny.
 ఉన్నట్లుండి ఓ రోజు Nino గేంబ్లింగ్ టేబుల్ దగ్గర పడిపోయాడు.అతన్ని హోటల్ గది లోకి చేర్చారు. ఆ తర్వాత Jules వచ్చి అన్ని పరీక్షలు చేశాడు.

" ఇతనికి లివర్ పూర్తిగా పోయింది.ఇదే తాగుడు గనక కంటిన్యూ చేస్తే బ్రతకడం ఎన్ని రోజులో ఎవరూ చెప్పలేరు" Jules చెప్పాడు.

Johnny ఆ మాట విని వాడెవడి మాట వినే రకం కాదు అన్నట్లు మొహం పెడతాడు.ఇంతలోనే Nino లేచి ఓ గ్లాస్ మందు ఇమ్మన్నట్లుగా సైగ చేస్తాడు.Johnny లేచి పోసి ఇస్తాడు.Jules ..అనుకుంటాడు..మీ చావు మీరు చావండి..మిమ్మల్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదని..!చివరకి Nino ని చూసుకోవడానికి ఆ రూం లో ఓ నర్స్ ని నియమించి బటకి వెళ్ళిపోతారు.

జీవితం కూడా కాలక్రమేణా అనేక మార్పులకి గురవుతుంది.అలాగే Johnny కీనూ..!ఇప్పుడు అతను హాలీవుడ్ లో పెద్ద నిర్మాత గా నిలదొక్కుకున్నాడు.మొదటి భార్య Ginni దగ్గరకి,పిల్లల దగ్గరకి వెళుతున్నాడు.సరే..పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు గదా..!వాళ్ళ వ్యాపకాల్లో వాళ్ళు బిజీ.

ఒకసారి Ginni అంది." మొత్తానికి ఓ సక్సెస్ ఫుల్ నిర్మాతగా నిరూపించుకున్నావు.నీలో ఇలాంటి బిజినెస్ మేన్ ఉన్నాడని నేనూహించలేదు" అని.
"నేను నిర్మాతగా ఎదిగినా..ఎందుకనో పాడాలనే కోరిక ఇప్పటికీ పోలేదు.స్వతహాగా నేను అదేగదా..అందుకనేమో.." అన్నాడు తను.

" ఎందుకు..ఇప్పుడు నీకేమిటి లోటు..అంతా బాగానే ఉందిగదా..మళ్ళీ దాంట్లో కాలెందుకు పెట్టడం " అన్నదామె.

ఏమిటో ఈ స్త్రీల కి ఎప్పుడు తనకి దగ్గరగాఉండే పురుషుడు బాగా సక్సెస్ అయి పేరు తెచ్చుకోవడం కూడా ఇష్టం ఉండదనుకుంటా అనిపించింది అతనికి.

వెంటనే ఫోన్ చేశాడు Nino కి..తాను వస్తున్నట్లు..Palm springs కి వెళ్ళడానికి సిద్ధం గా ఉండమని.పని పాట ఏమి లేదు..ఊరికినే ..ఇద్దరూ చెరో అమ్మాయితో కలిసి ..అక్కడ విహరించడం..ఇంకా స్విమ్మింగ్ ఫూల్ లో కాలక్షేపం చేయడం.పనిలో పనిగా తన గొంతుని పరీక్షించుకోవడానికి కొన్ని పాటలు కూడా పాడాడు.Nino బాగా పాడావని కితాబిచ్చాడు.వద్దన్నా మందు తాగడం ఆపేవాడు కాదు Nino.అసలు బతకడం కూడా అతనికి ఇష్టం లేదేమో అనిపించింది Johnnyకి..!

(మిగతాది తర్వాత భాగం లో చూద్దాము)--KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (అరవై అయిదవ భాగం)

Michael Corleone లాస్ వెగాస్ లో దిగేసరికి ఆ రోజు కొద్దిగా పొద్దుపోయింది.అతనితో పాటు Tom hagen  ఇంకా బాడీగార్డ్ గా ఈ మధ్యనే నియమించబడ్డ Albert Neri కూడా అతనితో పాటు వచ్చారు.Freddie వీళ్ళందరి కోసం తను ట్రైనింగ్ అవుతున్న హోటల్ లోనే ఓ మంచి సూట్ బుక్ చేశాడు.దానికి అనుసంధానంగా ఓ కేసినో కూడా ఉంది.Michael తన సోదరుడు Freddie ని చూడగానే అతనిలో వచ్చిన మార్పుని స్పష్టంగా గమనించాడు.ఓ సినిమా స్టార్ మాదిరిగా ఆధునికంగా అనిపించాడు..!హోటల్ లో కూర్చుని ఉన్నరంతా..!

" Mike..నీ దవడ కి ఆపరేషన్ చేసుకున్నాక ఇప్పుడు బాగున్నావు.బహుశా Kay బాగా వత్తిడి చేసిఉంటుంది..లేకపోతే ఇలాంటివి నువు ఓ పట్టాన పట్టించుకోవుగద..!అన్నట్టు ఆమె ని కూడా తీసుకురాకపోయావా..?వాళ్ళకీ సరదా గా ఉండేదిగద..!" అన్నాడు Freddie.

" ఇపుడు ఆమె రెండవసారి ప్రెగ్నేన్సి తో ఉంది.అయినా ఇది బిజినెస్ టూర్ గదా..మళ్ళీ రేపు రాత్రి కల్లా వెళ్ళిపోవాలి." చెప్పాడు Michael.

"నువు కలవవలసినవాళ్ళందరని రెడీ చేశాను.స్నానం చేసి ఫ్రెష్ అయితే మంచి విందు తయారుగా ఉంది.చక్కని వంటగాళ్ళు ఉన్నారిక్కడ..తయారవగానే నాకు కాల్ చెయ్ .." చెప్పాడు Freddie.

" సరే..Moe Greene ఉన్నాడుగా ..అతణ్ణి చివరిగా కలుస్తాను.Johnny Fontane ని Lucy,ఇంకా ఆమె బాయ్ ఫ్రెండ్ Jules ని వాళ్ళని కూడా మనతో డిన్నర్ చేయడానికి పిలువు.కొన్ని విషయాలు మాట్లాడాలి.ఇంకా నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా నో ప్రోబ్లం.." చెప్పాడు Michael.

Tom hagen వేపు చూసి చూడనట్లు చూశాడు Freddie.ఎందుకోగాని అతనంటే ఈ Freddie కి లోపల కొంచెం అసంతృప్తి.ముఖ్యంగా తన తండ్రి Don Corleone తన పట్ల కొద్దిగా కోపంగా ఉంటున్నాడీమధ్య.దానికి కారణం ఈ Tom నేనని ఇతని భావన.

నిజానికి దానికి కారణం వేరే ఉంది.హోటల్ బిజినెస్ నేర్చుకోడానికి Freddie ని లాస్ వెగాస్ పంపించినా Don తన కొడుకు చేసే పనుల మీద ఒక కన్ను వేసే ఉంచాడు ఇతరుల ద్వారా..!ఇతను ఆ కేసినో లో పనిచేసే అమ్మాయిలతో విచ్చలవిడిగా తిరగడం ,,స్త్రీ లోలుడిగా అయి ఒక సందర్భం లో Moe Greene చేతిలో చెంపదెబ్బ తినడం ఇదంతా డాన్ తెలుసుకొని చాలా కోపగించుకుంటాడు.అయితే మందలించడు గాని Freddie చేసే కాల్స్ ని డాన్ ఎత్తేవాడు గాదు.Tom చేతనే జవాబు చెప్పించేవాడు.

తన తర్వాత ఫేమిలీ బిజినెస్ ని నిర్వహించే వ్యక్తి విషయవాంచలకి లోనయ్యి బాధ్యతల్ని విస్మరించే వానిగా ఉండరాదనేది డాన్ యొక్క కోరిక.

ఇంచుమించు అర్ధరాత్రి కావస్తోంది.ఆ వేళప్పుడు అంతా డిన్నర్ కి వచ్చారు.Lucy వచ్చీరాగానే ఆదరంగా Michael ని చుంబించింది.ఆ తర్వాత అందరితో మంచీ చెడు అయినాక డిన్నర్ కి ఉపక్రమించారు.

Michael మాట్లాడే పద్ధతి,హావ భావాలు Don ని పోలిఉండడం మిగతా వాళ్ళు స్పష్టంగా గమనించారు.ఇంచుమించు అదే రకమైన గౌరవాన్ని అతను పొందడం కూడా గమ్మత్తుగానే అనిపించింది.

Michael యొక్క బాడీగార్డ్ Albert Neri మాత్రం తనకి ఆకలిగా లేదని చెప్పి ఆ గది ముందు డోర్ వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్నాడు..ఏదో పేపర్ చూసుకుంటూ..!

Johnny Fontane తో మాట కలుపుతూ అన్నాడు Michael..!

" ఏమిటి ఇప్పుడు నీ గొంతు బాగయినట్లుగా ఉందే..గుడ్..నీ అభిమానులంతా మళ్ళీ నీ వెంట వచ్చేస్తారులే.."

" థాంక్స్ ..Mike"

" చూడండి..ఓ ముఖ్య విషయం..మా Corleone ఫేమిలీ ఇకపైన న్యూయార్క్ లో ఉన్న అన్ని బిజినెస్ ల్ని ఇంకా ఇతర ప్రాపర్టీల్ని అమ్మేసి ఇక్కడ ఈ లాస్ వేగాస్ నే ప్రధాన కేంద్రంగా చేసుకోదలిచాం.ఇక ఈ ప్రదేశమే మన భవిష్యత్.పూర్తిగా షిఫ్ట్ అవడానికి ఒకటి ..రెండేళ్ళు పడుతుంది.ఇప్పుడు మనం ఉన్న ఈ హోటల్ కం కేసినో లో మా మిత్రుల పేరు మీద ఉన్న షేర్లు మాకు పునాదిగా ఉపయోగపడతాయి.దీనికి ప్రధాన షేర్ హోల్డర్ గా ఉన్న Moe Green కూడా అతని భాగాన్ని పూర్తిగా మాకు అమ్మివేస్తాడు.అప్పుడిది Corleone ఫేమిలీ సొంతమవుతుంది."  అలా చెప్పుకుపోతున్నాడు Michael .అది విని Freddie ఆశ్చర్యపడ్డాడు.

" అదేమిటి Mike ..నువు చెప్పేది నిజమేనా..మరి Moe Green ఎప్పుడు ఆ విషయం నాతో చెప్పలేదే " అడిగాడతను.

"I will make him an offer he can't refuse" ప్రశాంతంగా చెప్పాడు Michael.అది డాన్ యొక్క ఫేవరేట్ డైలాగ్.ముఖ్యంగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ..Chilling గా అనిపించే గమ్మత్తైన మాట.

ఆ తర్వాత Johnny Fontane వేపు తిరిగి చెప్పాడు.

" ఆ..Johnny ..నువు ఫేమిలీ కి సహాయం చేయవలసిన తరుణం వచ్చింది.కనీసం ఏడాదికి ఆరుసార్లు నీ మిత్ర బృందం తో కలిసి ఈ కేసినో కి రావాలి.అది ఇక్కడకొచ్చే గేంబ్లర్స్ కి మంచి వినోదం గా ఉంటుంది.మనం దీని విషయం లో కాంట్రాక్ట్ రాసుకుందాం.నీకూ కొన్ని పాయింట్లు ఉంటాయి దీంట్లో." చెప్పాడు Michael.

"Mike ..గాడ్ ఫాదర్ చెప్తే నేను కాదనగలనా..అది నేను వేరే చెప్పనవసరం లేదు నీకు.." చెప్పాడు Johnny.కాని అతని కంఠం లో ఏదో సందేహం గోచరించింది.

" సందేహించకు..నీకు రావాలసిన షేర్ నీకు వస్తుంది.నీ మిత్రులకి నువు ఎన్నో సాయాలు చేసి ఉంటావు ..ఆ మాత్రం వాళ్ళు నీకు చేలేరా.."

" ప్చ్..అది కాదు..Mike..!ఈ లాస్ వెగాస్ లో కాంపిటీషన్ బాగా ఉంది.మనం ఫీల్డ్ లోకి కొద్దిగా ఆలశ్యంగా ప్రవేశించాం..లాభాల పరిస్థితి ఎలా ఉంటుందో అని నా సందేహం"

"దాని గురించి నువు దిగులుపడకు.ఇప్పటికే Corleone ఫేమిలీ తమ మిత్రుల ద్వారా నాలుగు హోటళ్ళను ఇక్కడ కలిగి ఉంది.ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది.." చెప్పాడు Michael.

అప్పుడు Johnny కి అర్ధమయింది.చాలానాళ్ళ క్రితమే Don Corleone యొక్క హస్తం ఈ లాస్ వెగాస్ లో కనబడకుండా ఇతరుల రూపం లో ఉందని..!

" సరే..Mike ..నా పని లో నేనుంటానిక.." అన్నాడు Johnny.

ఇక ఆ తర్వాత Lucy  ఇంకా ఆమె బాయ్ ఫ్రెండ్ Jules వైపు తిరిగి చెప్పసాగాడు Michael.
"Jules ఇక్కడ నువు అబార్షన్స్ చేసే పని మీద ఉన్నట్లు తెలుసు.మా కోసం నువు పని చేయాలనుకుంటే నీకొకటి చెప్పదలుచుకున్నా..ఇక్కడ త్వరలో ఓ బ్రహ్మాండమైన హాస్పిటల్ ని నిర్మించబోతున్నాం..ఈ లాస్ వేగాస్ కి దాని అవసరం చాలా ఉంది.నీ వంటి సర్జన్ లు ఈ హాస్పిటల్ కి అవసరం.. నువు నీకు తెలిసిన ఇతర డాక్టర్లనెవరినైనా సూచించవచ్చు.అదీ గాక నువు Lucy ని పెళ్ళాడబోతున్నావని తెలిసింది.."

Michael చెప్పిన ఆ మాటలకి తేలిక గా నవ్వేశాడు Jules.

" Mike..నువు నాకు ఆఫర్ చేసిన ఈ పనికి ..నేను ప్రతిగా ఇంకా ఏమైనా చేయవలసి ఉంటుందా..అంటే దీని వెనుక కనబడని రాజకీయాలు ఏమీ లేవు గదా..దానికి నేను సహకరించాలా..సరే..Lucy ని చేసుకోవడం వల్లనే నాకు భవిష్యత్ ఉందని భావిస్తున్నావా.." అదోలా నవ్వుతూ అడిగాడు Jules.

" Mike..నువు  హాస్పిటల్ కట్టకపోయినట్లయితే  వృద్ధకన్య గానే  నేను మిగిలిపోతానని అనుకుంటున్నావా.." Jules ని ఎత్తిపొడుస్తున్నట్లుగా అంది Lucy.

ఆ మాటకి Jules తప్ప అంతా నవ్వారు..!

"Jules నాకు ఇతర ఉద్దేశ్యాలు ఏమీ లేవు.అయితే ఒకటి నాకు ఎప్పుడైనా చికాకు పుడితే మాత్రం.. నిన్ను తొలగించివేస్తాను.నువు ఇంకా ఎంతో పైకి రావాలనే ఆశతో ఉన్నావని నాకు తెలుసు.నా ఉద్దేశ్యం నీకు సాయపడటమే.ఒక మంచి రిలేషన్షిప్ కొనసాగించడం వల్ల కలిగే నష్టం ఏమీ ఉండబోదు.సరే..నీ ఇష్టం..నిన్ను బలవంతపెట్టేవారు ఎవరూ లేరిక్కడ.. " చెప్పాడు Michael.

"Mike వేరేలా భావించకు..నీ మాటని నేను గౌఅరవిస్తున్నాను.మీ తండ్రి గారికి నీకు కృతజ్ఞతలు..నేను ఏమి చేయాలి చెప్పు.." పశ్చాత్తాపం తో అన్నాడు Jules.

" సరే..ఒక పని చెయ్..కొత్త హాస్పిటల్ నిర్మాణం స్టార్ట్ అయేంత వరకు ఉన్న నాలుగు హోటల్ కం కేసినో లకి మెడికల్ డైరెక్టర్ గా వ్యవహరించు..తర్వాత విషయాలు నీకే తెలుస్తాయి.." వివరించాడు Michael.

ఆ తర్వాత Lucy తో ఇలా చెప్పాడు. "నువు ఒక పనిచెయ్..కట్టబోయే నిర్మాణాల్లో ఎక్కడ ఏ షాప్ పెడితే బాగుంటుంది అనేది ప్లాన్ చేయ్..హోటల్ కం కేసినోల్లోకి కావలసిన ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకో..ఆ ఇంకోటి ఆ షాపుల్లో కూడా నీకు కొన్ని పాయింట్లు ఉంటాయి.అప్పుడు Jules నిన్ను చేసుకోకున్నా ఒక ధనికురాలైన స్త్రీగానే నువు మిగిలిపోతావు.." నవ్వుతూ అన్నాడు Michael.

Freddie కోపం గా ఓ వేపు తిరిగి సిగార్ కాల్చుతున్నాడు.

" ఏయ్..Freddie నేను డాన్ తరపున పనిచేసే ఓ కుర్రాణ్ణి మాత్రమే.నువు ఇక్కడ ఈ హోటల్ ని నడిపించే విధానానికి.. నాన్నగారు చూస్తే..ఎంత సంతోషిస్తారో...తెలుసా " చెప్పాడు Michael తన సోదరునితో...!

"ఏమిటో ..ఆయనకి ఎప్పుడూ నా మీద కోపమే..నేనెన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్తడమే లేదు..అది తెలుసా.."

" బహుశా నువు పనిచేస్తున్న ఈ హోటల్ నష్టాల్లో ఉన్నందుకు ఆయనకేమైనా అనిపించిందేమో.."

" దానికి నేనా బాధ్యుణ్ణి..? దీనికి చైర్మన్ Moe green గదా.." విసురుగా అన్నాడు Freddie.

Michael దాన్ని నిర్లక్ష్యం చేసి..ఏమిటి Nino రాలేదు అన్నట్లుగా Johnny  వైపు చూశాడు.

" Nino ఆరోగ్యం బాగా చెడిపోయింది.అతని రూం లో ఓ నర్స్ ని నియమించి ఇక్కడకి వచ్చాను " చెప్పాడు Johnny.

"Don కి ఇష్టమైన చాలా కొద్దిమంది వ్యక్తుల్లో Nino ఒకడు.ఏనాడు అతను ఇంకొకరి మీద ఫిర్యాదు చేయడు..తనకి ఉన్నదానితో సంతృప్తిగా ఉంటాడు..అని అతన్ని ఎప్పుడూ తల్చుకుంటూనేఉంటాడాయన" చెప్పాడు Michael.

(మిగతాది తర్వాత భాగం లో చూద్దాము)--KVVS Murthy


Mario Puzo నవలThe God Father సంక్షిప్తంగా (అరవై ఆరవ భాగం)

" తీస్తున్న సినిమాల మీద ఇపుడు డబ్బు రావడం కూడా మొదలైంది.Nino కి మంచి భవిష్యత్ ఉండేది ఈ హాలీవుడ్ లో ..చక్కగా శ్రద్ధ పెట్టి నటనమీద కేంద్రీకరించినట్టయితే..Son of a bitch తాగి తాగి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు..ఇపుడు ఇంచుమించు చావుకి దగ్గరయి జీవిస్తున్నాడు.." అసహనంగా అన్నాడు Johnny Fontane.అతని లో మిత్రుని పట్ల బాధ కూడా ధ్వనించింది.

అంతలోనే Jules స్పందించి ఏదో అనబోయాడు.ఎవరో తలుపు కొట్టిన శబ్దం అవడం తో ఆగిపోయాడు.Tom Hagen వెళ్ళి తలుపు తెరిచాడు.ఆ వచ్చింది ఎవరో కాదు.అతను Moe Greene.అతనితో బాటు ఇద్దరు బాడీ గార్డులు కూడా ఉన్నారు.Moe Greene ఒకప్పుడు Brooklyn ప్రాంతం లో తన జీవితాన్ని ప్రారంభించినవాడు.గేంబ్లింగ్ లో అక్కడ సంపాదించాక ...తర్వాత ఈ లాస్ వెగాస్ కున్న భవిష్యత్ ని చాలా ముందుగానే ఊహించి ఇక్కడ వ్యాపార స్థావరాలు ఏర్పరచాడు.

కొన్ని మర్డర్లు కూడా చేసిన చరిత్ర అతనికుంది.మనిషి చూడటానికి మంచి హుందాగా ఉంటాడు.ఇపుడు వీళ్ళంతా కూర్చున్న ఈ హోటల్ కం కేసినో లో సిమ్హ భాగం షేర్ ఇతనికే ఉంది.ఇదే హోటల్ లో పనిచేసే Lucy గాని Jules గాని ఇతనికి సాధ్యమైన దూరంగా మసలుతుంటారు.ఎందుకంటే ఇతగాడి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు.ఓసారి Freddie ని కూడా పది మంది లో పడపడామని చెంప మీద వాయించాడు..ఏదో విషయంలో..!
Tom తలుపు తెరిచిన వెంటనే విసురుగా వచ్చి Michael ముందు వున్న కుర్చీ లో కుర్చున్నాడు Moe Greene.చాలా కోపంగా ఉన్నాడతను.అయితే కంట్రోల్ గా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు.

"Mike ..ఇపుడు నేను ఓ విష్యం నీతోమాట్లాడటానికి వచ్చాను.రేపు వేరే ప్రయాణం ఉంది నాకు..." చెప్పాడు Moe Greene .

" దానిదేముంది మిత్రమా ..తప్పకుండా మాట్లాడు " అలా అంటూనే Michael చేతితో Tom కి సజ్ణ చేశాడు.మర్యాద పూర్వకంగా ఓ డ్రింక్ ఇమ్మని.Moe Greene దాన్ని అందుకున్నాడు.కొద్దిగా సిప్ చేశాడు.తన మనుషులకి సైగ చేశాడు వీరందరికీ గేంబ్లింగ్ ఆడటటానికి తగిన చిప్స్ ఇమ్మని.మర్యాదకి మర్యాద.వాళ్ళు అలాగే ఇచ్చారు.

"థాంక్స్ Moe Greene...ఏమిటి విషయం.." అడిగాడు Michael .

" ఇందాకనే విన్నాను.ఏమిటి Corleone ఫేమిలీ ఈ నా హోటల్ లో ని షేర్లని కొనాలని ప్రయత్నిస్తున్నారట..అవసరమైతే నీను మిమ్మల్ని కొనగలను..అది గుర్తుంచుకొండి..నాతో చెలగాటం వద్దు.అది అందరకీ మంచిది." కోపాన్ని అణచుకుంటూ చెప్పాడు Moe Greene.

ఆ మాట విని Michael నిబ్బరంగా ఉన్నాడు.ఎలాంటి ఆవేశాన్ని చూపించకుండా తన భావాల్ని వెల్లడించాడు.

" చూడు Moe Greene ..ఇపుడు ఈ హోటల్ గాని,దాని లో ఉన్న కేసినో గాని నష్టాల్లో నే గా ఉన్నాయి.మేము దీన్ని ఇంకా బాగా నడిపించగలము.నువు ఒక రేటు చెప్పు..దానికే మేము కొంటాము.అంటే అది నీకు మేలు చేయడమేగా..ఆలోచించు..మరి నువు వేరేలా ఎందుకు భావిస్తున్నావు"

" You goddamn dagos ..నీ సోదరుడు Freddie నా దగ్గర హోటల్ లో ఉంచుకున్నాను...బిజినెస్ నేర్పించమని మీ తండ్రి కోరితే..!నేను చేసిన ఆ ఫేవర్ ని మరిచిపోయారా..? నాకూ కొంత మంది మిత్రులున్నారు.. నన్ను చేతగాని వాణ్ణి గా చూడవద్దు "

" ఔను..Freddie కి నీ దగ్గర ఆశ్రయం ఇచ్చిన మాట నిజమే.ఒప్పుకుంటున్నాను.కాని దానికి Corleone ఫేమిలీ నీకు కొంత ధనం కూడా సాయం చేసింది.దానితోనే గదా..ఈ హోటల్ కి మరమ్మత్తులూ అవీ చేయించావు..అదీగాక కోస్ట్ లో ఉన్న Molinary ఫేమిలీ మా సోదరుడుకి రక్షణ కల్పించడానికి అంగీకరించింది.దాని వల్లనే Freddie ఇక్కడ ఉండగలిగాడు." Michael గుర్తు చేసేడు.. !

" హా..హా..మీ శక్తిని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారేమో..Don ఇపుడు ఇంచుమించు మంచం బట్టాడు.నిన్ను న్యూయార్క్ లోని ఫేమిలీలు వెంటాడుతున్నాయి. నాకు అన్నీ తెలుసు..Mike ..నాతో పెట్టుకోవాలని చూడక.."

" ఓహో ..అందుకేనా Freddie ని జనాల ముందు కొట్టింది"  ప్రశ్నించాడు Michael.

Albert Neri లోపల జరుగుతున్న విషయాల్ని జాగ్రత్త గా పరికిస్తున్నాడు.చేయి దాటితే బాడీగార్డ్ గా అతని విధి అతను చేయావలసిందే.

ఆ మాటలకి కొద్దిగా ఫీలయ్యాడు Freddie.

" Mike దాన్ని సీరియస్ గా తీసుకోకు.. అది చాలా చిన్న విషయం..కొన్ని విషయాల్లో కంట్రోల్ లో ఉంచడానికి Moe అలా చేస్తుంటాడు.అది దారి లో పెట్టేందుకే తప్ప మరొకందుకు కాదు.." అంటూ వారించబోయాడు Freddie.

Moe Green ఈసడించినట్లుగా ఇంకోటి చెప్పాడు.

" అవును..అతని పట్ల నేను అలా ప్రవర్తించిన మాట నిజమే.ముందు తను చేసింది ఏమిటో అడుగు.బిజినెస్ చూసుకోవడం మానేసి కేసినో లో కనబడిన వెయిట్రెస్ లందరనీ వాయించడం మొదలెట్టాడు.దారిలో పెట్టడానికి గాను ఒకటి తగిలించాను..ఏం తప్పా"

Moe అలా చెప్పడంతో నిశబ్దంగా ఉండిపోయాడు Freddie.

"ఇంకా అడగవేం...The son of a bitch was taking them to bed two at a time.The old sandwich job..వాళ్ళు ఇక్కడ ఉన్నది ఎందుకు..కష్టమర్లని రంజింపజేయడానికి గదా..ఇతగాడే వాళ్ళ వెంబడపడితే ఎలా.." ఒక వికృతమైన నవ్వుతో అన్నాడు Moe Greene.

Michael కి Tom కీపుడు అర్ధం అయింది.Don ఎందుకని Freddie విషయం లో అయిష్టంగా ఉంటాడో..!Corleone ఫేమిలి కి మచ్చతెచ్చి అలా పదిమంది లో చెంప దెబ్బ తిన్నాడనే ఆయనకి Freddie అంటే అసంతృప్తి..!ఎందుకనో గాని గాని సెక్స్ విషయం లో కూడా ఆయన ఒకరికి ఒకరే అనే సూత్రాన్నే విశ్వసిస్తాడు.

Michael ఉన్నట్లుండి కుర్చీ లోనుంచి లేచాడు.ఇక సెలవు అన్నట్లుగా..!

" సరే..Moe Greene రేపు ఉదయంకల్లా నీవు చెప్పదలచుకున్న రేటు ఏమిటో చెప్పు.నేను రేపు సాయంత్రం కి న్యూయార్క్ వెళ్ళిపోవాలి " చెప్పాడు  Michael

ఆ మాట విని Freddie కొద్దిగా నెర్వస్  గా ఫీలయ్యాడు.

"Tom  ..నువు డాన్ కి Consigliere వి గదా..ఆయనతో ఈ విషయాన్ని పునరాలోచించమని చెప్పకూడదూ .." Freddie అడిగాడతన్ని.

ఆ మాట విన్న Michael కి చర్రుమన్నది.

" అందరూ వినండి.Don రిటైర్ అవడానికి సిద్ధంగా ఉన్నట్లు నాకు తెలిపారు.ప్రస్తుతం ఫేమిలీ బిజినెస్ నడుపుతున్నది నేనే.ఇంకొక సంగతి..Tom hagen ప్రస్తుతం నా వద్ద లీగల్ అడ్వైజర్ గా మాత్రమే ఉన్నాడు.Consigliere పోస్ట్ నుంచి అతడిని తొలగించడమైనది.అదీ విషయం.." ఉన్న సంగతి బద్దలు కొట్టాడు Michael. అందరూ కాసేపు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు.

ఆ తర్వాత Michael కొనసాగించాడు." Freddie...You are my older brother .I have respect for you.But don't ever take sides with anybody against the family..!Ever.. ! ఇక్కడ Corleone ఫేమిలీ చాలా పెట్టుబడి పెట్టింది.కాని దానికి తగిన ఆదాయం కనిపించడం లేదు.అది అర్ధం అయింది గదా.." అలా చెప్పి Michael విసవిసా బయటకి నడిచాడు.ఆ మాటలు Freddie,Moe Greene ల మీద ఒకే లాంటి ప్రభావాన్ని చూపాయి.ఆ తదుపరి రోజు Michael కి కబురు వచ్చింది.Moe Greene తన షేర్ ని ఎట్టి పరిస్థితి లో అమ్మడని దాని సారం.ఆ మాటవిని Michael అతనిష్టం అన్నట్లు భుజాలెగరేశాడు.

ఆ తర్వాత Nino ఉన్న సూట్ లోకి వెళ్ళాడతను.Johnny ఇంకా Jules అక్కడే ఉన్నారు.Michael షాక్ అయ్యాడు Nino ని చూసిన వెంటనే..! ఎముకుల గూడు లా అయిపోయాడతను.

" Nino..నిన్ను చాన్నాళ్ళకి చూస్తున్నందుకు సంతోషం.Don ఎప్పుడూ నీ గురించి చెప్తూ ఉంటారు.చెప్పు నీకేమైనా సహాయం చేగలమా మేము..అది ఫేమిలీ నుంచి నీకు అందుతుంది" మంచం మీద కూర్చుంటూ అడిగాడు Michael.

Nino ఓపిక లేనట్లుగా నవ్వి చెప్పాడు..!

" Tell him I am dying..!Tell him show business is more dangerous than the olive oil business ."
తాను ఒకానొకప్పుడు డాన్ కి చెందిన ఆలివ్ ఆయిల్ ట్రక్కుల మీద డ్రైవర్ గా పనిచేశాడు గదా ..అందుకని ఆ పోలిక ..!

(మిగతాది వచ్చే భాగం లో చెప్పుకుందాము) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (అరవై ఏడవ భాగం)

లాస్ వేగాస్ లో సమావేశం ముగిసిన తర్వాత Michael,న్యూయార్క్ కి బయలుదేరాడు.విమానం లో  కూర్చుని ఓ కునుకు తీయాలని ప్రయత్నించాడు గాని తన వల్ల కాలేదు.ఇక తన జీవిత కాలం లో అత్యంత ముఖ్యమైన ఘట్టం లోకి ప్రవేశించబోతున్నాడు.చాలా ప్రమాదకరమైన దశ ఇది.అన్ని ముందు జాగ్రత్తలు పగడ్బందీగా తీసుకోవడం జరిగింది.గత వారం Don తన ఆధీనం లోని Caporegimes అందరినీ పిలిచి కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించాడు. Don ..ఇక తాను పూర్తి విశ్రాంతి తీసుకోదలిచానని,ఫేమిలీ బిజినెస్ ని ఇక మీదట Michael చూసుకుంటాడని,తాను అవసరమైతే ఏదైనా సలహా మాత్రం ఇస్తానని చెప్పాడు.ఇక మీదట జరగవలసిన పనులు తన చేతి మీదుగా జరగాలనేది ఆయన అభిమతమన్నది Michael గ్రహించాడు.

అప్పుడే Michael ప్రవాసం నుంచి వచ్చి మూడేళ్ళు,Kay ని వివాహమాడి రెండేళ్ళు గడిచిపోయాయి.తని ఫేమిలీ బిజినెస్ లో తర్ఫీదు పొందడం ని గత మూడేళ్ళనుంచి కొనసాగిస్తూనేఉన్నాడు.ఈ కాలం లోనే తమ Corleone ఫేమిలి ఎంత శక్తివంతమైనది,ఇంకా ఎంత సంపన్నమైనది అనేది తెలిసివచ్చింది.

ఒక చిత్రమైన విషయం తను తర్ఫీదు పొందుతున్నప్పుడు దానిలో భాగంగా గమనించాడు.ఒక గ్రామ ఫోన్ రికార్డ్ కంపెనీ నుంచి "ఫేమిలీ" కి ఠంచను గా "ప్రొటెక్షన్ మనీ" అందుతుండేది.అంటే చాలా ఫేమస్ ఆర్టిస్ట్స్ పాడిన రికార్డులకి డూప్లికేట్స్ తయారు చేసే కంపెనీ అది.ఒక రకంగా పైరసి అనాలి.ఆ "ఒరిజినల్స్" అమ్మే వాటి నుంచి వచ్చే లాభాలకంటే ఈ "డూప్లికేట్స్" నుంచి వచ్చే లాభాలు కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉండేవి.అటు కంపెనీకి గాని..ఇటు ఆర్టిస్ట్ లకి గాని..!Johnny Fontane మంచి ఉచ్చ దశలో ఉండిన సమయం లో అతనికి ఆ డబ్బు అలా వచ్చిందే.

ఎప్పుడైతే "ఫేమిలీ"  ఈ డూప్లికేట్స్ తయారీకి రక్షణ ఇవ్వడం మానేసిందో అప్పుడే ఆర్టిస్ట్ లు కూడా డబ్బు రాక నష్టపోయేవారు.అంటే ఆ ఆర్టిస్ట్ ఎంత అద్భుతమైన ఆల్బం చేసిన అమ్ముడు పోయేవి తక్కువగా ఉండి ఆర్దిక నష్టం వాటిల్లేది.Johnny Fontane విషయం లో కూడా అలా జరిగింది.

అప్పుడు అనుమానం వచ్చి Tom Hagen ని ఒక మాట అడిగాడు Michael.

" అవును..Don కి ఎంతో అభిమానపాత్రమైన God son గా పేరున్న Johnny Fontane విషయం లో కూడా ఇది జరిగింది.కారణమేమిటి..?" అని!

" ఒకానొక దశలో అతను కూడా Don కి కొన్ని విషయాల్లో అయిష్టం కలిగేలా ప్రవర్తించాడు.ముఖ్యంగా అతను భార్యపిల్లల్ని వదిలివేసి సినిమా స్టార్ Margot Ashton ని పెళ్ళి చేసుకోవడం Don కి నచ్చలేదు.బహుశా ఆ కారణం వల్లనే Johnny కి సంబందించిన డూప్లికేట్ రికార్డ్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం మానేశాడు.దానితో పోలీసులు ఆ కంపెనీ మీద రైడ్ చేసి సీజ్ చేశారు." చెప్పాడు Tom

Michael Corleone కి ఇంకొకటి కూడా అర్ధం అయింది.ఒక్కోసారి తన అవసరం అర్ధం అయ్యేలా ఇతరులకి కొన్ని చిక్కుముళ్ళని కల్పించి వారిని తన సహాయం అడిగేలా కూడా తన తండ్రి చేస్తుంటాడు.మానవ ప్రవృత్తి లోని ద్వంద ధోరణుల్లో భాగంగా ఒకోసారి అది అవసరమేమో..!
తనకి పెళ్ళయిన తర్వాత లాంగ్ బీచ్ లో కోట లాంటి ఈ Mall లో ఒక ఇంటిని తమ కి కేటాయించడం జరిగింది.గత ఏడాది ఒక మగబిడ్డ కలిగాడు.మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సి తో ఉంది Kay.అచ్చమైన ఒక ఇటాలియన్ వనిత లా మారిపోయిందీమె కూడ..!

తను ఎయిర్పోర్ట్ లో దిగగానే Kay వచ్చి రిసీవ్ చేసుకుంది.ఎప్పుడూ అలా వస్తుందామె.ఫ్లైట్ లోనుంచి దిగగానే Albert Neri నలుదిక్కులా ఓ మారు చూశాడు.Kay ఉన్న దిక్కుని అతనే చూపించి..తను వేరే కారు లో ఫాలో అయ్యాడు.Tom hagen,Kay,Michael లు ఒకే కారు లో ఎక్కారు ఇంటివేపు వెళ్ళడానికి.అది నడుపుతున్నది Roco Lampone.

" ఈ రోజు సాయంత్రం నుంచి నాన్నగారి ఇంటికి వెళ్ళే పని ఉంది.మిగతా కొంత మంది ముఖ్యులు వస్తున్నారు.కొన్ని విషయాలు మాట్లాడాలి.లాస్ వేగాస్ లో జరిగిన సంగతుల్ని కూడా చర్చించాలి.రాత్రికి నేను రావడం కొద్దిగా ఆలశ్యం అవుతుందేమో ..డిన్నర్ కానిచ్చేసి నువు పడుకో.." చెప్పాడు Michael భార్య తో..!

" మరేం ఫర్వాలేదు..నేను వెయిట్ చేస్తుంటాను లే" అన్నదామె.

* * *

Michael తల్లి ప్రతిరోజు ఉదయం చర్చ్ కి వెళుతూంటుంది.ఆ రోజు వెళుతూ Kay దగ్గరకొచ్చిందామె..ఓసారి చూసి పోదామని.

" ఎందుకని మీరు ప్రతిరోజు చర్చ్ కి వెళతారు.కేథలిక్స్ అందరూ అలా చేయరు గదా " అంది Kay అత్త గారితో. Kay ప్రొటెస్టంట్ కుటుంబం నుంచి వచ్చింది.అత్తగారు అడుగుతూ ఉంటుంది.." నువు కూడా మా కేథలిక్ చర్చ్ లోకి మారకూడదూ" అని.అయితే మరీ ప్రెస్ చేయదు..ఆమె లోని సుగుణం అది.

" బాగా చెప్పావమ్మా..కేథలిక్స్ సాధారణంగా ఆదివారాలు ఇంకా ఈస్టర్ ,క్రిస్మస్ లాంటి రోజుల్లోనే చర్చ్ కి వెళతారు.అయితే నా సంగతి వేరులే.." అన్నది అత్తగారు.

"ఏం ఎందుకని రోజూ వెళతారు మీరు"

" హ్మ్..ఎందుకు అడుగుతావులే..నేను రోజు అక్కడికెళ్ళి ప్రార్దించేది మా ఆయన ఆత్మ రక్షణ కోసమే..ఆ విధంగా అయినా ఆయన మా ఆయన పాప భారం తగ్గుతుంది గదా..ఏదో నా ఆశ.." నిట్టుర్చుతూ అంది అత్తగారు.

" ఇప్పుడు డాన్ ఎలా ఉన్నారు" అడిగింది Kay.

" మనిషి ఇప్పుడు చాలా మారిపోయాడమ్మా.చాలా వరకు అన్నీ Michael కే అప్పజెపుతున్నారు ఏదైనా..!ఆ తోటలో కెళ్ళి పలుగు పార తీసుకోవడం..టమటాలు అవీ పండించడం..ఇప్పుడంతా రైతు తరహా లో మారిపోయాడు.." చెప్పిందామె.ఆమె లో ఒక సగ్టు భార్య లక్షణాలు స్పష్టంగా కనిపించాయి.

ఆ తెల్లారి మరదలు Connie వచ్చింది ఇంటికి.తన పిల్లల్ని వెంటతీసుకుని మరీ..!ఆమె అప్పుడప్పుడు అలా వచ్చి Kay కి కొన్ని ఇటాలియన్ వంటలు గట్రా నేర్పుతుంది.పనిలో పనిగా తన సోదరుడు Michael కి,తన భర్త Carlo మీద ఏమైనా కోపమున్నదా అని అడుతూంటుందామె.ఎందుకంటే పెద్దన్న Sonny హత్య కావించబడింది ..Carlo ఈ Connie ని తన్నిన రాత్రే గదా..!తనని రక్షించమని ఈమె ఫోన్ చేయబట్టే Sonny ఆవేశం లో సరైన జాగ్రత్త తీసుకోకుండా బయలు దేరాడు.మార్గ మధ్యం లో చంపబడ్డాడు.ఇదంతా Michael మనసు లో ఉంచుకొని సరైన సమయం లో Carlo ని ఆపదకి గురి చేస్తాడేమోనని ఈమెకి ఒక అనుమానం.

అయితే ప్రస్తుతానికి వీరి కుటుంబానికి Mall లోనే ఒక మంచి ఇల్లు కేటాయించారు.Carlo ని కూడా  ఫేమిలి కి ఉన్న బిజినెస్ ల్లోనే ఓ బాధ్య్త అప్పగించారు.అంటే మరీ పై స్థాయికాదు..యూనియన్ పనులు చూడటం లాంటివి.

ఒకసారి Kay అన్నది ఉండబట్టలేక..!
" మీ చెల్లి Connie లో ఏదో అనుమానం ఉన్నట్లుంది..ఆమె భర్త కి ఆపద కలుగుతుందని.నువు ఒకసారి అతని తో మాట్లాడి విషయాలు సరిచేసుకోవచ్చుగా" అని.

"ప్చ్..అవన్నీ ఇపుడు ఎందుకు..!Connie నా సోదరే గదా..ఆమె భర్త కి నేనెందుకు హాని తల పెడతాను..?జరిగినవి తవ్వుకోవడం అనవసరం..అయితే ఒక్కటి మాత్రం నిజం.. మా చెల్లికి తగిన భర్త మాత్రం కాదు వాడు.." ఇంకా పొడిగించటం ఇష్టం లేదన్నట్లు ఉండిపోయాడు Michael.ఆమె కూడ నిశ్శబ్దం గా ఉండిపోయింది.

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (అరవై ఎనిమిదవ భాగం)

Don Corleone ఇంట్లో...ఓ కార్నర్ లో ఉన్న లైబ్రరీ రూం లో కూర్చొని ఉన్నారు Michael,Tom Hagen,Carlo Rizzi ఇంకా Tessio మరియు Clemenza లు.అంతలోనే Don కూడా వచ్చాడు.

ఇపుడు జరిగే సమావేశం గతం లో వంటిది కాదు.Don కావడం అనేది కూడా వంశపారంపర్యంగా జరగాలని కూడా ఏమీ లేదు.ఒక మాఫియా ఫేమిలీ లో డాన్ తర్వాత  శక్తిశాలురు గా ఉన్నవారు ఆ విధంగా జరగకుండా ఆపనూగలరు.ఉదాహరణకి Tessio,Clemenza ల్లాంటి Caporegimes ఎవరైనా Don Corleone చివరి దశలో ఆయన స్థానాన్ని ఆక్రమించినా ఆశ్చర్యం ఏమీ లేదు.

అందుకే ఇపుడు Don చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నాడు.Michael తో ఆ స్థానాన్ని పూరించేందుకు..!ఇంకో అవాంతరం పొంచి ఉన్నది ఇపుడు Barzini,Tattagliya ఫేమిలీల రూపం లో..! వాళ్ళు Corleone ఫేమిలీ కి చెందిన ప్రాంతాల్లో తమ మనుషుల ద్వారా Book making బిజినెస్ లోకి దిగుతున్నారు. ఉన్న పొజిషన్ బట్టి Barzini మాఫియా ఫేమిలీ న్యూయార్క్ లో ఇపుడు శక్తి శాలిగా ఉంది.ఒకప్పుడు Corleons  అలా ఉండేవారు.

Don Corleone రిటైర్ అవడం ఆ రెండు ఫేమిలీ లకి ఆనందం గా ఉంది.ఒకవేళ Michael ఆయన స్థానాన్ని ఆక్రమించినా అంత భయపడాల్సిన పని లేదు.He could never be equal to the don in cunning and influence. ఏమో..Michael..అంటే ఏమిటో ఇంకా నిరూపించుకోవాలిగదా ..!మొదటి తరం లోనే ఒక గొప్ప చాకచక్యం తో ,పౌరుషం తో పెద్ద మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించిన Don Vito Corleone ఘనత ఇంకెవరితోనూ పోల్చడానికి లేదు.

పెద్ద కొడుకు Sonny మరణం Don కి పెద్ద నష్టం గానే చెప్పాలి.ఫేమిలీ బిజినెస్ నడిపించడం లో ఉండాల్సిన Force గాని Cunning గాని అతనికి పుష్కలంగా ఉన్నాయి.అతను తీసుకున్న ఒక పొరబాటు నిర్ణయం వల్ల తను హత్య కి గురయ్యాడు.

ఇక రెండవ కొడుకు Freddie కి అంత చాకచక్యం లేదు.స్త్రీ లోలుడు గా పేరున్నవాడు.Don కి కూడా అతని పట్ల నమ్మకం లేదు.సరే..Michael ఇపుడు రంగం లో ఉన్నాడు.Clemenza కి అంత నమ్మకం లేదు Michael లో..ఒక డాన్ కి ఉండాల్సిన టఫ్ నెస్ ఇతని లో లేదని అతడి భావన.అయితే Tessio మాత్రం Michael లో కనబడని ఒక గొప్ప పార్శ్వం ఉందని గమనించాడు.Tom hagen కైతే అతని పట్ల పూర్తి విశ్వాసం ఉంది.ఎందుకంటే Michael కి తర్ఫీదు ఇస్తున్న సమయం లో తను గ్రహించాడు..He's truly his father's son.

సరే..Michael ముందుగా తండ్రికి లాస్ వేగాస్ లో జరిగిన విషయాలన్ని వివరంగా చెప్పాడు.ఆ తర్వాత ఇద్దరు Caporegimes వైపు తిరిగి ఇలా చెప్పాడు.

"Clemenza,Tessio ల్లారా..మీరు ఇద్దరు ఒక ఏడాదిపాటు నన్ను ఎలాంటి ప్రశ్నలడగకుండా నేను చెప్పే పనుల్ని చెయ్యండి.చాలు.ఆ తర్వాత మీరు ఇద్దరు స్వతంత్రులవుతారు.మీరు అప్పుడు ఎవరి ఫేమిలీని వారు నిర్మించుకోవచ్చు.మీకు మీరే బాస్ లు అప్పుడు.ఇప్పుడు మేము లాస్ వేగాస్ వైపు మా శక్తిని అంతటిని తరలిస్తున్నాము.ఇప్పటికే మాకు అక్కడ నాలుగు కేసినోలు ఉన్నాయి.నాకు తెలుసు.Barzini,Tattagliya ఫేమిలీల నుంచి మీకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని..కొద్దిగా ఓపిక పట్టండి.అన్నిటిని చర్చించి కుదుట పరుస్తాము.." చెప్పాడు Michael.

అందుకు Clemenza కొద్దిగా అసంతృప్తి ఫీలయ్యాడు.

" Mike..ఇంకా కొంతమంది సైన్యాన్ని రిక్రూట్ చేసుకోవడానికి మమ్మల్ని అనుమతించు.ఆ రెండు ఫేమిలీలు మితి మీరి ఉత్సాహం చూపిస్తున్నారు..మా ఏరియాల్లో!వాళ్ళని కట్టడి చేయాలంటే ఇంకా మనుషులు కావాలి"  చెప్పాడు Clemenza.తల ఊపాడు..Michael చెబుతానన్నట్లుగా ..!
అంతలో Tessio కల్పించుకొని అన్నాడు." Moe Greene మీ తండ్రి గారితో మాట్లాడతానని అన్నాడేమో గదా..మాట్లాడనివ్వవలసిది..ఏం జరిగేదో.. చాలా విషయాల్ని Don చర్చల స్థాయిలోనే పరిష్కారం చేస్తారు గదా.."

Michael విని ఊరుకున్నాడు.అంత లో Don ఇలా చెప్పాడు.

" లేదు..లేదు.నేను ఇప్పుడు విశ్రాంతజీవితం గడపదలుచుకున్నాను.మధ్యలో నేను ఇప్పుడు తల దూరిస్తే Michael కి మర్యాదగా ఉండదుగదా.."

ఆ మాట విన్న Tessio కి ఏదో అపశకునం తోచింది.అయితే Moe Greene కధ ఇక అంతేనన్నమాట..!తన సీటులో సర్దుకు కూచున్నాడతను.

" మరి అప్పుడు న్యూయార్క్ లో ఉన్న మన బిజినెస్ లన్నీ ఏమవుతాయి..లాస్ వెగాస్ కి తరలిపోతే?" ప్రశ్నించాడు Carlo.

" చూడు Carlo..నువు "నెవడా" కి వెళ్ళాలి త్వరలో..!ఆ ప్రదేశం నీకు బాగా తెలిసిందేగదా..అక్కడినుంచి నువు నాకు కుడి భుజం లా పనిచేయాలి.అర్ధమయిందా.." చెప్పాడు Michael.అలాగేనన్నాడతను.

ఇంకా ఇలా చెప్పాడు Michael." Tom Hagen నాకు ఇక ఎంత మాత్రం Consigliere గా వ్యవహరించడు.తను నాకు లీగల్ అడ్వైజర్ గా మాత్రమే ఉంటాడు.ఒక రెండు నెలల్లో అతను లాస్ వెగాస్ లో స్థిరపడతాడు.నాకేమైనా సలహా కావాలంటే మా నాన్నగారు ఎలా ఉండనే ఉన్నారు.."

Michael అలా చెప్పగానే Clemenza,Tessio లు ఇద్దరు ఉన్నట్టుండి Tom వైపు చూశారు.అతను మొహం లో ఎలాంటి భావాన్ని వ్యక్తపరచకుండా గుంభనంగా ఉన్నాడు.

"హ్మ్..అయితే ఒక ఏడాది తర్వాత మేం మా స్వంత ఫేమిలీ లు నిర్మించుకోవచ్చునంటారు..అంతేగదా..!" Clemenza అడిగాడు Michael ని.

"తప్పకుండా.దానికి అభ్యంతరం ఏముంది.అదే సమయం లో మీరు మాతో సత్సంబంధాలూ కలిగి ఉండవచ్చు.అయితే మా Corleone ఫేమిలీ ఆ సరికి పశ్చిమం లో ఉంటుంది.అదే లాస్ వేగాస్ వేపు" చెప్పాడు Michael.

" అయితే మాకు కొత్త గా సైనికుల్ని రిక్రూట్ చేసుకునే పర్మిషన్ ఇవ్వవచ్చుగా..Barzini లాంటి వాళ్ళని నిలువరించడం చాలా అవసరం ఇప్పుడు.." మళ్ళీ అడిగాడు Clemenza.

" ఇప్పుడే కాదు.కొద్దిగా ఓపిక పట్టండి.మేము వెళ్ళే లోపు అంతా సెటిల్ చేసే వెళతాము." చెప్పాడు Michael.

Tessio ఆ మాటకి సంతృప్తి పొందలేదు.వెంటనే గాడ్ ఫాదర్ వైపు తిరిగి అన్నాడు." Don..ఎన్నో ఏళ్ళనుంచి మీతో ఉన్న చనువు తో చెబుతున్నాను.మీరు ఇక్కడి నుంచి లాస్ వెగాస్ వెళ్ళిపోతే Tattagliya ల్ని గాని Barzini ల్ని గాని మేము కంట్రోల్ చేయలేము.చివరికి మేము కూడా వాళ్ళలో కలిసిపోవలసిందే.ఈ సమయం కాకుండా షిఫ్ట్ అవడానికి మీరు మరో సమయం ఎంచుకుంటే బాగుండేమో..!అలా కాని పక్షం లో మాకు మరింత సైన్యాన్ని కూడగట్టుకునే అవకాశాన్ని ఇవ్వండి..కనీసం Staten Island నైనా మేము ఆ రకంగా దక్కించుకుంటాము" ప్రాధేపూర్వకంగా అన్నాడు Tessio.

" ఇప్పటికే నేను వాళ్ళతో శాంతి ఒప్పందం చేసుకున్నాను.దాన్ని బ్రేక్ చేయలేనిప్పుడు" చెప్పాడు డాన్.

" మీ అందరి మంచి కోసమే నేను చెబుతున్నాను.నన్ను అర్ధం చేసుకొండి"

ఆ మాటకి Michael స్పందించాడు."Tessio..నీ అంత జీవితానుభం నాకు లేదు .కాని ఒక మాట..నా తండ్రి యొక్క గైడెన్స్ నాకు ఎప్పుడూ ఉంటుంది.నన్ను నమ్ము..తప్పకుండా అందరి సమస్యల్ని పరిష్కరిస్తాన్నేను.."

ఆ తర్వాత సమావేశం ముగిసింది.Tessio,Clemenza లు సొంత ఫేమిలీలు నిర్మించుకోవడానికి అనుమతినివ్వడం జరిగింది.బ్రూక్లిన్ లోని గేంబ్లింగ్,డాక్ లు Tessio చూసుకునేట్టు,మాన్ హట్టన్ లోని గేంబ్లింగ్,లాంగ్ ఐ లాండ్ లోని రేసింగ్ ట్రాక్ ల్ని Clemenza చూసుకునేట్టు ఒప్పందం కుదిరింది.

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము)-- KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (అరవై తొమ్మిదవ భాగం)

ఇపుడు ఆ లైబ్రరీ రూం లో ముగ్గురే మిగిలారు.Tom Hagen,Michael ఇంకా Don లు..! Michael ఒక గ్లాస్ లో Anisette ని పోసి తండ్రికి ఇచ్చాడు.ఇంకో దానిలో స్కాచ్ ని పోసి Tom కి ఇచ్చాడు.తనూ ఓ డ్రింక్ తీసుకుని సిప్ చేస్తూన్నాడు.అప్పుడు Tom ఒక మాట అడిగాడు Michael ని ఉద్దేశించి..!

" ఎందుకని నన్ను అసలు రంగం లోనుంచి తప్పించావు..కారణమేమిటి..?" అని.

"Tom..నువు నాకు ఇకమీదట లాస్ వెగాస్ లో నా లాయర్ గా ఉంటావు.You're a legal man.మిగతా కొన్ని ఇతర విషయాల్లో నిన్ను ఇరికించడం నాకిష్టం లేదు.అదీ నా ఉద్దేశ్యం" బదులిచ్చాడు Michael.

" Mike..ఇంకో విషయాన్ని కూడా నేను ఇటీవల గమనించాను.Rocco Lompone కి కొత్తగా సైన్యాన్ని నిర్మించుకోవడానికి అనుమతినిచ్చావు.కాని దాన్ని రహస్యంగా ఉంచావు.అదీగాక Albert Neri కూడా అన్ని విషయాలు నీతోనే డైరక్ట్ గా డీల్ చేస్తున్నాడు..ఇవన్నీ ఏ పరిణామాలకి సంకేతం.."

" ఓహ్.. Rocco Lampone వ్యవహారం నీకు తెలిసిపోయిందా.."

" కంగారు పడకు Mike ..ఎక్కడా ఏం లీక్ జరగలేదు.నా స్థితి లో ఉన్న మనిషికి ఆ సంగతులన్ని ఈజీ గా తెలుస్తాయి.Rocco రిక్రూట్ చేసుకున్న మనుషులు వాళ్ళ పేరోల్ కి సంబందించి ఫేవర్ చేయమని నన్ను సంప్రదించినప్పుడు ఆ సంగతంతా నాకు తెలిసింది.. ఏమాటకామాట Rocco పనితనం బాగుంది..మంచివాళ్ళని నియమించుతున్నాడు.."

" నీ కు తెలిసేలా చేస్తున్నాడంటే ఏం బాగా చేసినట్టు..సరే దాని వల్ల నష్టమేమి లేదుగాని..Tom నువు యుద్ధసమయాల్లో Consigliere గా పనిచేయలేవు.ఆ కౌశలం నీకు లేదు.Sonny ఉదంతం లోనే అది అర్ధమైంది.రాబోయే రోజులు భీభత్సమైన రోజులు.నిన్ను క్షేమంగా ఉంచాలనేది నా ఆకాంక్ష .." అసలు విషయం చెప్పాడు Michael.
ఇదేమాటని Don చెప్పినట్లయితే తాను మారు మాట్లాడకుండా ఒప్పుకునేవాడేమో ..!కాని Michael చెప్పినదానికి మాత్రం Tom Hagen కి కొద్దిగా కోపం వచ్చింది. "Tessio చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను.Barzini వాళ్ళు జిత్తులమారి నక్క లాంటి వాళ్ళు.ఏ నిమిషం వాళ్ళు నీమీదబడినా మిగతా Mafia families ఏవీ నీకు అండగా రావు.అది తెలుస్తోందా Mike " అడిగాడు Tom .

ఈసారి ఆ మాటకి Don స్పందించాడు.

"Tom ..నాకు  చేయడం ఇష్టం లేని కొన్ని పనుల్ని,ఈ రిటైర్మెంట్ వయసులో Michael కి అప్పగిస్తున్నాను.అతను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక నా సలహా ఉన్నది.Rocco ని సైన్యం నిర్మించుకోమని చెప్పింది నేనే.నేనెప్పుడూ నువు ఒక Bad Consigliere వి అనలేదు...కాని Sonny మాత్రం ఒక Bad Don అనక తప్పదు.అతని ఆత్మ శాంతించు గాక.నీకు ప్రతిదీ తెలుసు..అన్నీ అర్ధం చేసుకోగలవు..నీ విషయం లో నాకు ఎప్పుడూ నమ్మకముంది.." Don చెప్పాడు.

Tom Hagen ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.అంతలో వాతావరణాన్ని తేలికచేస్తున్నట్లు Michael నవ్వుతూ అన్నాడు.

" ఏమిటి..Tom..!ఇంత చిన్న విషయాన్ని నువ్విలా భావిస్తావని అనుకోలేదు.."

"నన్నూ యాక్షన్ లో ఉంచినట్లయితే..నేను చేయగలిగేది చేసేవాణ్ణిగదా "

" You're out Tom .." ఇక పొడిగించడం ఇష్టం లేనట్లు అన్నాడు Michael.
"Mike మీ నాన్నగారి లో ని ఒక లక్షణం మాత్రం నీకు రాలేదు.." చెప్పాడు Tom.

" ఏమిటది "

"ఇతరులతో No అనేది ఎలా చెప్పాలి 'అనే విషయం"

ఆ మాటని ఒప్పుకుంటున్నట్లుగా తల ఊపాడు Michael." సరే..Tom నువు చెప్పిన ఈ విషయం గుర్తుపెట్టుకుంటాలే .."

ఆ తర్వాత Tom Hagen వెళ్ళిపోయాడు.

అప్పుడు ఇదే విషయాన్ని తండ్రితో ప్రస్తావించాడు Michael.

" మనం అభిమానించేవారికి మనం నో చెప్పినా అది ఎస్ లాగే ధ్వనిస్తుంది.లేదా ఓ పని చేయాలి.వారి నోటి నుంచే నో అనేది వచ్చేలా చేయాలి.హ్మ్..నువు ఈ తరం వాడివి గదా..నీ ఆలోచన నువు చెయి..ఇలాంటి వాటిల్లో నన్ను వినక.." చెప్పాడు డాన్.

Michael కి నవ్వాగలేదు. ఆ తర్వాత సంభాషణ సీరియేస్ విషయాల మీదకి మళ్ళింది.

" Tom,Tessio లు చెప్పిన దానిలో కూడా నిజం లేకపోలేదు.కొన్ని పనులు చేయవలసిన సమయం దగ్గరకొచ్చింది.SONNY ఇంకా APOLLONIA ల యొక్క హత్యలకి ప్రతీకారం తీర్చుకోవడం అనికాదుగాని ..ఆ విషయాల మీద ఇక దృష్టి పెట్టాల్సిన తరుణం సమీపిస్తున్నది.." చెప్పాడు Michael.
తలపంకించాడు Don..! ఆ తర్వాత ఇలా అడిగాడు Michael ని.

"Revenge is a dish that tastes best when it's cold ..! ఆ రోజున నేను ఇక్కడ Barzini ఇంకా ఫేమిలీస్ తో శాంతి ఒప్పందం చేసుకున్నాను ,నువు ఆ సిసిలీ నుంచి క్షేమంగా రావాలనే ఉద్దేశ్యం తో..! కాని అతని ప్రయత్నాల్ని సిసిలీ లో కూడా ఆపనట్టే కనిపిస్తున్నది.బహుశా అది మా మీటింగ్ కి ముందు ఏమైనా జరిగిన ప్లాన్ కావచ్చునేమో..కాని అతని మనుషులు Don Tommasino వెనుక కూడ ఉన్నట్లు నాకు ఒక అనుమానం..నీ మీద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ..అదే ఆ కారులో ..సిసిలీ లో .."

" మీరు ఊహించిన అనుమానమే నాలోనూ ఉన్నది.ఆ రోజున బాంబు పేలుడులో దెబ్బ తగిలినపుడు ..మంచం మీదినుంచే అడిగాను Fabrizzio గురించి.కాని Don Tommasino అతను కనబడకుండా పోయినట్లు చెప్పాడు.నిజానికి Fabrizzio  గేటు దూకి బయటకి వెళిపోవడాన్ని కిటికీ లోనుంచి గమనించాను.ఏమీ తెలియని వాడిలా నేను  కూడా నటించాను" చెప్పాడు Michael

"మరయితే ఈ Fabrizzio కనిపించాడా.." అడిగాడు డాన్.

"వాడు ఎక్కడో కాదు..ఈ న్యూయార్క్ లోనే ఉన్నాడు.బఫెలో ప్రాంతం లో పిజ్జా షాప్ నడుపుతున్నాడు.ఫేక్ ఐ.డి.,ఫేక్ పాస్ పోర్ట్ తో జీవిస్తున్నాడిక్కడ ..వాడి ఆనుపానులన్ని గమనిస్తూనే ఉన్నారు మన మనుషులు.." చెప్పాడు Michael.

" మరింకా దేనికి వేచిచూస్తున్నావ్..When will you start .."  నర్మగర్భంగా అడిగాడు Don.

" ఇంకొన్ని రోజుల్లోనే  పని పూర్తవుతుంది.Kay కి డెలివెరి కావడం,అలాగే Tom ని లాస్ వెగాస్ కి పంపించడం జరిగిన వెంటనే.." బదులిచ్చాడు Michael.

" అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్తలు పక్కాగా తీసుకున్నావా.."

" అన్ని తీసుకున్నాను.ప్రణాళిక ప్రకారం అంతా జరిగిపోతుంది.మీరలా చూస్తూ ఉండండి..అంతే..!" ఉద్వేగం ఒక వేపు కమ్ముతుండగా అన్నాడు Michael.
" అందుకేగదా నేను రిటైర్ అయింది. అన్నిటినీ నీకు అప్పగించింది.జీవితం లో నేను చేయవలసింది నేను చేశాను.నీ వంతు నువు చెయి ఇక.." అన్నాడు Don.



(మిగతాది వచ్చే భాగంలో చూద్దాము) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా  (డబ్భైవ భాగం)

రోజులు గడుస్తున్నాయి.Kay Adams Corleone రెండవ పిల్లవాడిని ప్రసవించింది.అందరూ మహోత్సవ వాతావరణం లో తల్లీ శిశువులను ఆహ్వానించారు.Connie ఇటలీ నుంచి ప్రత్యేకంగా చేతి తో నేయబడిన ఖరీదైన సిల్క్ వస్త్రాన్ని బహూకరించింది శిశువుకి.పనిలో పనిగా అది Carlo Rizzi తెప్పించినట్లు తెలిపింది.బహుశా ఆ విషయం Michael కి కూడా తెలియజెప్పమని కామోసు.ఆమె కి కూడా సిసిలీ మనిషి లోని గుణాలు  క్రమేణా అబ్బుతున్నట్లున్నాయి.

అదే సంవత్సరం లో ..Nino ValenTi కూడా బ్రెయిన్ హేమరేజ్ తో చనిపోయాడు.అతని గూర్చి టాబ్లయిడ్లు ఘనంగా రాశాయి.Johnny Fontanne కి అతనికి గల మిత్రత్వం గురించి ప్రస్తావించాయి.Johnny తో పాటు Lucy,Jules,Freddie అందరూ Nino అంతిమ క్రియలకి హాజరయ్యారు.అదే సమయానికి Don కి కొద్దిగా అనారోగ్యంగా ఉండడం వల్ల తన తరఫున ఒక పుష్పగుచ్చాన్ని పంపించాడు.అంతే కాకుండా Albert Neri ని ప్రత్యేకంగా Corleone ఫేమిలీ తరపున ప్రతినిధిగా పంపించారు.

Nino Valenti అంత్యక్రియలు ఘనంగా ముగిశాయి.ఆ రెండరోజునే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది.Moe Greene ..అదే కేసినో యజమాని..హాలీవుడ్ లోని అతని భార్య ఇంటిలో ఉండగా కాల్చివేయబడ్డాడు.అతను స్పాట్ లో మరణించాడు.

ఆ సంఘటన జరిగిన నెలరోజుల తర్వాత Albert Neri మళ్ళీ న్యూయార్క్ లో అడుగుబెట్టాడు.Michael అతడిని భావగర్భితమైన చిరునవ్వుతో ఆహ్వానించాడు.ఆ మరుసటి రోజునే Albert కరేబియన్ దీవులకి విహార యాత్ర కి వెళ్ళిపోయాడు.అతని జీవితం ఇప్పుడు ఒక ఊహించలేని మలుపు తీసుకోబోతున్నది.Corleone ఫేమిలీ  కి చెందిన ఈస్ట్ కోస్ట్ లోఉన్న "బుక్ మేకింగ్" బిజినెస్ లో అతనికి వాటా ఇవ్వబడుతుంది.ఇదేగాక ఇంకా కొన్ని ఆకర్షణీయమైన రాబడులు అతని కోసం సిద్ధం చేయబడుతున్నాయి.ఇపుడు Albert Neri తను నిర్వర్తించే విధులకు సరైన రివార్డ్ లనిచ్చే ప్రపంచం లో సభ్యుడయ్యాడు.చచ్చేదాకా తాను సుఖవంతమైన జీవితం గడుపుతాడిక..అది ఎంతకాలమైనగాని..!

(మిగతాది వచ్చే భాగంలో చూద్దాము) --KVVS Murthy



Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (డబ్భై ఒకటవ భాగం)

Michael తీసుకోవల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.ప్రణాళికలు గాని స్వీయ రక్షణ చర్యలు గాని అన్ని పక్కాగా సమకూర్చుకున్నాడు.తూర్పు తీరం నుంచి తమ సామ్రాజ్యాన్ని పడమటి వేపు తరలించే బృహత్తర కార్యక్రమాన్ని ఎలాంటి అవరోధం లేకుండా ముందుకు తీసుకుపోతున్నాడు.ఎన్ని యోచనలు పక్కగా చేసినా మానవ ప్రమేయం లేని కొన్ని విషయాలు కూడా జరుగుతుంటాయి.ఆసక్తికరంగా అది Don గురించినదే అయితే..!

అది ఆదివారం.ఉదయం వేళ.Don Corleone బయటకి రాగానే ఇంటి ముందర తాను పెంచుతున్న తోట చూసి సంతోషంగా ఫీలయ్యాడు.ఎంతైన తన సొంత చేతులతో పెంచుతున్నది.ఇలాంటి సుందర దృశ్యాల్ని చూసినప్పుడల్లా ఎప్పుడో అరవై ఏళ్ళ కిందటి సిసిలీ లోని స్వగ్రామం గుర్తుకొస్తుంది.అందుకే గదా ఇప్పుడు తాను ఈ తోటని పెంచే మాలి గా మారిపోయింది.

ఒక్కసారి ఆకాశం కేసి చూశాడు.సూర్యుడు తన కిరణాల వేడిని క్రమేపి పెంచుతున్నాడు.వెంటనే తన తోటమాలి యూనిఫాం ని ధరించాడు.పని లోకి దిగటానికి. చిక్కుడు పాదులు పైకి పాకడానికి చక్కగా కంచె కట్టడా ..కనులవిందుగా ఇవిగో పాకుతున్నాయి.అక్కడక్కడ చిన్నగా తెల్లని పూలు కూడా పూస్తున్నాయి.అంటే తోట కాపు కి వచ్చే తరుణం ఆసన్నమయింది.అందుకే గా..ఆవుపేడ ఎరువుని కూడా సిద్ధం చేశాడు.ఇంకా కొద్ది గా పందిళ్ళు వేసే పని పూర్తి చేసి ఆ తర్వాత ఎరువుని వేయాలి మొక్కలకి అనుకున్నాడు Don.

ఎందుకంటే ఎండ మరీ ముదరక ముందే పని కానిచ్చేయాలి.అనుకుంటాం గాని మొక్కకి నీరు ఎంత ముఖ్యమో ,వేడి అంతే ముఖ్యం.సమపాళ్ళ లో ఉంటేనే మొక్క ఎదుగుదల.

అలా ఆలోచించుకుంటూ Don తోట పనిలోకి ఉపక్రమించాడు.ముందు ఆ చివరి వరస మొక్కలకి కొద్దిగా ఆధారంగా కర్రలు కడదాం అనుకొని అటు వేపు తిరిగాడు.ఉన్నట్లుండి సూర్యుడు నడినెత్తి మీదికి..వచ్చినట్లనిపించింది.ఆ బంగారు కిరణాలు వర్తులాకారం లో తిరుగుతూ ..తన కంటిచూపుని మసక చేస్తున్నట్లుగా తోచింది.కింద పడిపోతున్నట్లుగా ..అనిపిస్తూండగా ..అల్లంత దూరాన Michael పెద్ద కొడుకు తన వేపు వస్తూన్నట్లు అనిపించి..రావద్దు ..అన్నట్లుగా చెయ్యి ఊపి దబ్బున కిందపడి పోయాడు Don Corleone.ఆ కుర్రాడు వెళ్ళి తండ్రిని తీసుకువచ్చాడు.ఇంతలో ఇంటి సెక్యూరిటి సిబ్బంది కూడ వచ్చారు.Michael మోకాళ్ళపై కూర్చుని తండ్రి చెయ్యి పట్టుకుని చూడసాగాడు.కొంతమంది వెంటనే అంబులెన్స్ కోసం వెళ్ళారు.
మొహం రంగు మారినట్టుగా అయింది.ఒక పెద్ద సుత్తెతో చాతి మీద కొట్టినట్లయింది Don కి..ప్రయత్నం మీద ఊపిరి తీసుకుంటూ ..చివరి సారిగా Michael వేపు చూసి చిన్న గా గొణిగినట్లు అన్నాడు "Life is so beautiful అని..!

అంతే..Don Corleone ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది.తను పెంచిన తోటలో ,ఎంతో ఇష్టుడైన కుమారుని చేతిలో జీవన యాత్రని అలా ముగించాడు The Great Don.

ఆయన అంత్యక్రియలు రాచమర్యాదలతో జరిగినవని చెప్పాలి.మిగతా అయిదు మాఫియా ఫేమిలీల అధినేతలు,Tessio,Clemenza లు,ఇంకా అసంఖ్యాక మిత్రులు,బంధువులు,సహాయాన్ని అందుకున్న ఇతర వ్యక్తులు ఎంతోమంది Don Corleone అంత్యక్రియలకి హాజరయ్యారు.Johnny Fontane కూడా హాజరై Don తన గాడ్ ఫాదర్ అని ప్రకటించాడు.విచిత్రంగా అనేకమంది ఆయన శత్రువులు కూడా హాజరయ్యారు.సెక్యూరిటి సిబ్బంది చాలా కష్టపడవలసి వచ్చింది.

Michael లైబ్రరీ రూం లో ఉన్నాడు.వచ్చే అథితుల సంతాప సందేశాల్ని అందుకుంటున్నాడు.మాటలో మాట గా Tessio,Clemenza లకి చెప్పాడు Michael తమ మాల్ ని దీని లోని ఇళ్ళని ఒక లాభసాటి బేరానికి అమ్మివేస్తున్నామని.తండ్రి యొక్క జీనియస్ కి ఏమాత్రం తీసిపోనివాడు Michael అనిపించింది వారికి..!

ఎందుకనో గాని Don ఎప్పుడూ మృత్యువు గురించి మాట్లాడేవాడుకాదు.దాన్ని ఎంతో గౌరవిస్తున్నట్లుగా..ఏ నిమిషమైనా దాని ఆజ్ఞ కి శిరసువంచే వానిలా ఉండేవాడు.ఆ విధంగా చావు పట్ల తన అభిప్రాయాన్ని తెలుపకనే తెలిపేవాడు.

లైబ్రరీ రూం లోని కిటికీ లోనుంచి చూశాడు Michael.The Great Don యొక్క పార్దివదేహాన్ని ఖననం చేసే సమయం ఆసన్నమయింది.తమ కుటుంబ సభ్యులు,సైనికులు,దళపతులు,ఇతర మిత్రులు అంతా ఆ ప్రదేశం వేపు కదులుతున్నారు.ఈ క్రియలన్ని చిరకాల మిత్రునికి నిర్వహించడానికి Nazoraine విచ్చేశాడు.Don దేహాన్ని ఉంచే ఆ కాఫిన్ ని అత్యంత శ్రద్ధతో తయారుచేశాడు.Michael వచ్చిన అథితులు అందరి వేపు మర్యాద నిండిన తలపుతో పరికించాడు.

(మిగతాది వచ్చే భాగంలో చూద్దాము) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (డబ్భై రెండవ భాగం)

డాన్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత ...Corleone మాఫియా ఫేమిలీ కి సంబంధించిన ముఖ్యులందరితో ఒక సమావేశం ఏర్పాటు అయింది.అది డాన్ ఇంటిలో...లైబ్రరీ రూం లో చోటు చేసుకుంది.Don Corleone మరణం ఫేమిలీ కి చాలా నష్టమనే విషయం అక్కడున్న అందరికీ తెలుసు.ఇంచుమించుగా Corleons యొక్క బలం సగానికి పడిపోయినట్లు అక్కడున్న చాలామంది భావన.Albert Neri అందరికీ మర్యాదపూర్వకంగా పానీయాలు ఏర్పాటుచేశాడు.ఆ విషయం ముగిసిన తర్వాత Michael మాట్లాడటానికుపక్రమించాడు.

"ఇక్కడకి వచ్చిన మీ అందరి గురించి నాకు తెలుసు.మా తండ్రి గారిని ఎంతో గౌరవించే మనుషులు మీరు.జరిగిన ఒక పరిణామం వల్ల ఇకమీదట కొన్ని విషయాల్లో మీ కోసం మీరే ఇక కష్టపడక తప్పకపోవచ్చు.అయితే ఒకటి..కొంతమందికి మేము మాట ఇచ్చి ఉన్నాం.అది మేము నిలబెట్టుకోవాలిగదా. ఏది ఏమైనా చివరిగా చెప్పేదేమంటే ..ముందు అనుకున్న విధంగానే ప్లాన్ అమలు జరుగుతుంది.."

ఆ మాటకి Clemenza కొద్దిగా అసహనంగా ఫీలయ్యాడు.

"Mike..ఇపుడు Barzini ల నుండి మేము కష్టాల్ని ఎదుర్కొంటున్నాము.వాళ్ళతో ఇపుడు పోరాడాలి లేదా ముడుచుకుని కూర్చోవాలి.వేరే దారి లేదు.కనీసం వాళ్ళతో సంప్రదింపులన్నా జరపాలి" Clemenza మాటవరసకన్నా Michael ని ఉద్దేశించి డాన్ అని సంబోధించలేదు.కొద్దిగా తేడా వున్నది మర్యాదలో.

"కొద్దీ రోజులు వేచి చూద్దాం,ఏం జరుగుతుందో..నెలకొన్న శాంతిని ముందు వాళ్ళనే భగ్నం చేయనీ.." సాలోచనగా అన్నాడు Michael.

"ఇంకా చేయవలసింది ఏముంది.ఈ ఉదయం బ్రూక్లిన్ లో వాళ్ళు రెండు బుక్ మేకింగ్ కేంద్రాల్ని తెరిచారు.ఇందాకనే తెలిసిన ఓ పోలిసాఫిసర్ ఫోన్ చేశాడు.కొన్ని రోజులు పోతే నా టోపీ మోపేంత స్థలం కూడా ఈ బ్రూక్లిన్ లో నాకు మిగలదేమో.." Tessio కంఠం లో అసహనం ధ్వనించింది.

" మరయితే నువు దానికి ఏం చేశావ్.." అడిగాడు Michael.

" ఏమీ చేయలేదు.మీకు మళ్ళీ అనవసరమైన సమస్యలు కల్పించకూడదని" చెప్పాడు Tessio.

"మంచిది.అలాగే ఉండు.మీ అందరకీ ఇదే చెబుతున్నాను.వాళ్ళు కవ్వించినా సరే మీరు తొందరపడవద్దు.కొన్ని వారాల సమయం  లో అన్నీ సర్దుబాటు చేస్తాను.గాలి ఎలా వీస్తుందో గమనించాకా ..దానిని అనుసరించి అందరికి మేలు కలిగేలా డీల్ కుదుర్చుతాను.ఆ తర్వాత మనకి చిట్టచివరి సమావేశం..చిట్టచివరి నిర్ణయాలు ..అంతే.." చెప్పాడు Michael .

వచ్చిన వాళ్ళంతా తిరుగుముఖం పట్టారు.Albert అందర్నీ దగ్గరుండి మరీ పంపించాడు.అప్పుడు Tom Hagen ఒక మాట అడిగాడు.

"మీ నాన్న గారికి ఉన్న పొలిటికల్ కనెక్షన్స్ అన్నీ ఇప్పుడు నీతో ఉన్నట్లేగదా " అని.

"అన్నీ అని చెప్పలేను.ఒక నాలుగు నెలలకి సరిపడా ఉన్నాయి.ఆ విషయాల మీద ఉన్నప్పుడే ఆయన పోవడం జరిగింది.అయితే ఒకటి..జడ్జిలు అందరితో సంబంధాలు కలిగి ఉన్నాను.అమెరికన్ కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది,ఇంకా న్యూయార్క్ లోని కొన్ని పార్టీల పెద్ద తలలు ..హ్మ్..అలా ..నో ప్రోబ్లం..!Corleons చాలమంది అనుకునేదానికన్నా శక్తిమంతులు..అది చెప్పగలను.కొన్ని విషయాలు నువ్వు ఎలాను తెలుసుకోగలవు గదా " నవ్వుతూ అన్నాడు Michael .

" అవేమో గాని..నువు నన్ను యాక్షన్ లోనుంచి ఎందుకు తప్పించావో అర్ధం కాలేదు.నేనిప్పుడు ఒక సిసిలియన్ లా ఆలోచిస్తుంటే తెలుస్తోంది..దానిలోనూ అర్ధముందని.."

" పెద్దాయన నిన్నేమీ తొలగించమనలేదు.కానీ నాకే నిన్ను ఈ జరగబొయే హోమం లో సమిధని చేయాలని లేదు.ఆ Tom ..ఒక పని చెయ్..వెంటనే ఇపుడు లాస్ వెగాస్ కి కాల్ చేసి నువు ఇక్కడ కొన్ని వారాలు ఉండాల్సివస్తుందని మీ ఆవిడ తో చెప్పు.నీ అవసరం ఉందిక్కడ.." చెప్పాడు Michael.

" వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తారని ఎలా ఊహిస్తున్నావు.." ఆశ్చర్యంగా అన్నాడు Tom.

" మా నాన్న గారు ఆయన మరణించడానికి కొన్ని రోజుల ముందే చెప్పారు..నాకు దగ్గరగా ఉండే కొందరు వ్యక్తుల ద్వారా Barzini నన్ను చంపడానికి ప్రయత్నించే వ్యూహం పన్నుతాడని..!"

"హ్మ్..అంటే..నా లాంటి దగ్గర గా ఉండేవాళ్ళనా అర్ధం" అడిగాడు Tom.

" You are Irish..They won't trust you " చిరునవ్వుతో చెప్పాడు Michael.

"I am German-American" Tom  నొక్కి చెప్పాడు.

" వాళ్ళ దృష్టిలో అది Irish వంటిదే..!నిన్ను ఉపయోగించరు.అలాగే Albert పోలీస్ గనక అతణ్ణీ విశ్వసించరు.అదీ గాక మీరిద్దరూ నాకు చాలా దగ్గర మనుషులు.బహుశా Rocco Lampone లాంటి వాణ్ణి ప్రయోగించవచ్చునేమో.."

"నా ఉద్దేశం లో Carlo కి ఎక్కువ చాన్స్ ఉంది.." చెప్పాడు Tom.

" సరే చూద్దాం..త్వరలోనే తేలుతుందిగా.." ఆ విషయానికి తెరదించాడు Michael.

ఆ తెల్లారి Tom Hagen,Michael లు ఇద్దరూ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. ఫోన్ రింగ్ కావడం తో వెళ్ళి Michael మాట్లాడు.ఆ తర్వాత కిచెన్ లోకి వచ్చి బ్రేక్ ఫాస్ట్ ముందు కూర్చున్నాడు.

" ఎవరది ఫోన్ చేసింది " ప్రశ్నించాడు Tom.

" మనం అనుకున్నాం గదా..నన్ను ఉచ్చు లోకి లాగే ప్రయత్నం మొదలయింది... Brazini లతో చర్చలు జరపవలసిందిగా కబురు చేశారు"
ఇద్దరకీ తెలుసు ఇప్పుడెవరైతే ఫోన్ చేశారో వారే శత్రుపక్షం తో చేయికలిపారని.

" ఇంతకీ ఎవరది"

"హ్మ్..అది ..Tessio" చెప్పలేక చెప్పాడు Michael.

" నిజంగా ఇది నేను ఊహించలేదు.ఏ Clemenza నో Carlo నో ..అవుతారనుకున్నా గాని Tessio ఇలా మారతాడనుకోలేదు"  నిట్టూర్చాడు Tom.

దానిదేముంది..ఎవరు ఎలాగైనా మారవచ్చు అన్నట్లు భుజాలెగరేశాడు Michael.

" మా నాన్న గారి ముందు చూపు చాలా అద్భుతమైనది. ఇప్పుడు అర్ధమవుతున్నదది.My father rightly understood political connections and power worth of Ten regimes. ఆయన తో ఉన్న అన్ని కనెక్షన్స్ నాకూ ఉన్నాయి.కాని అది తెలిసింది నేనొక్కడినే. త్వరలోనే ఒక రోజున వీరందరినీ వంచుతాను.కాని అప్పుడు Tessio పరిస్థితి తలుచుకుంటేనే కొద్దిగా అదోలా ఉంది.." చెప్పాడు Michael.ఎందుకంటే తన తండ్రికి కొన్ని ఏళ్ళబాటు ఇంచుమించు ఒక  కుడి భుజంగా మెలిగిన అతను ఆ నిర్ణయం తీసుకోవడం బాధ కలిగించింది.

" మరయితే మీటింగ్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.."

"బ్రూక్లిన్ లో..Tessio కి చెందిన ఇంటిలో ..గ్రౌండ్ ఫ్లోర్ లోనట.అక్కడైతే నాకు సేఫ్ అట.." గట్టిగా నవ్వాడు Michael.

" ఇకమీదట జాగ్రత్త గా ఉండటం మంచిది"

" అది నాకు ఒక Consigliere చెప్పాలా ..నాకు తెలుసు"
ఆ తర్వాత నుంచి Michael ప్రతి రోజు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాడు.మరో వారం లో Barzini లతో మీటింగ్ గదా..!ఈ మధ్యలో ఇంకో వ్యవహారం జరిగింది.Connie,Carlo ల పెద్ద కొడుకు కి కేథలిక్ సంప్రదాయం ప్రకారం ఒక  తంతు చర్చ్ లో చేయాల్సివచ్చింది. అదేమిటంటే గాడ్ ఫాదర్ ని నియమించే ఓ సిసిలియన్ తంతు.సిసిలియన్ సంప్రదాయం ప్రకారం ఈ దుర్భరమైన లోకం లో జీవించాలంటే అసలు తండ్రి తో బాటు రక్షణ గా మరో తండ్రి కూడా ఉండాలని ఓ ఆచారం ..!

Kay అడిగింది Michael ని ఆ కుర్రవానికి గాడ్ ఫాదర్ గా ఉండమని.ముందు నిరాకరించాడు గాని చివరకి Kay మాట కాదనలేక సరేనన్నాడు.అయితే చర్చ్ ప్రీస్ట్ ని ఇంటికి పిలిపించి ఆ తంతు చేయాల్సిందిగా కోరాడు.దానికి తగిన వితరణ ఇచ్చాడతను.ఆ తంతు ఘనంగా జరిగింది..! మేనల్లునికి..దానిలో భాగంగా ఒక బంగారు ఆభరణం,రిస్ట్ వాచ్ ల్ని బహూకరించాడు.ఆ సాయంత్రం చాలా కొద్ది మంది  కావలసిన వారితో విందు జరిగింది.Connie,Carlo ల సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (డబ్భై మూడవ భాగం)

Albert Neri తన పోలీస్ యూనిఫాం తీసుకొని శుబ్రం చేసుకోవడం ప్రారంభించాడు.బ్యాడ్జ్ ని,గన్ ని, ఇంకా holster ని తీసి టేబుల్ మీద పెట్టాడు.వాటిని మంచి గా తుడిచాడు.ఆ తర్వాత చక్కగా సర్ది పెట్టేశాడు.నిజంగా ఈ పని ఒక సంతృప్తి కలిగించే విషయం తనకి.భార్య Rita తన్ని వదిలి పుట్టింటికి వెళ్ళి సరిగ్గ రెండు ఏళ్ళు గడుస్తోంది.

ఆమె ఒక మంచి ఇటాలియన్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి.తన హైస్కూల్ స్వీట్ హార్ట్ కూడా..! కుటుంబ విలువల పట్ల నమ్మకమున్న మనిషే.ఇరువురికి ఒకరంటే ఒకరికి మక్కువే.కాని కొన్ని సంఘటనలు ఎందుకలా దారితీస్తాయో చెప్పలేము.అతను బయటి ప్రపంచానికి ఎంత టఫ్ కాప్ అయినా భార్యా విధేయుడి గానే ఉండేవాడు.

Albert Neri ని యూనిఫాం లేకుండా మామూలుగా చూస్తేనే మంచి బలం గా ఎత్తరి గా భయం కలిగించే మాదిరిగా ఉంటాడు.ఇక యూనిఫాం తొడిగి కళ్ళెర్ర జేస్తే ఎలాంటి వాడైనా తత్తరపోవల్సిందే..!సహజంగా నే సిసిలియన్ లో ఉండే ఆ వేగం అతనిలో ఉంది.అయితే లౌక్యం కొంత తక్కువేననాలి.తనకి ఒక విషయం నచ్చకపోతే నిశ్శబ్దం గా ఉండిపోతాడు లేదా వాదిస్తాడు.రెండే పద్ధతులు అతనివి.అది ఒకరి తో నైనా..పది మంది తోనైనా..!

న్యూయార్క్ పోలిస్ వర్గాల్లో అతనికంటూ ఓ గుర్తింపు ఉంది.రాత్రి వేళలో పోలీస్ కార్ లో పెట్రోలింగ్ కి బయలు దేరాడు ఆ రోజు.సెంట్రల్ పార్క్ వెస్ట్ ప్రాంతం అది.అక్కడ కార్నర్ లో ఆరుగురు అల్లరి మూక ..వచ్చీ పోయే పాదచారుల్ని టీజ్ చేస్తున్నారు.అంతా టీనేజ్ ప్రాయం లో ఉన్నారు చూడ్డానికి.


కాసేపు అలాగే గమనించి ఒక ఫ్లాష్ లైట్ తీసుకుని వారి దగ్గరకి వచ్చాడు Albert Neri.ఇతణ్ణి చూసి వాళ్ళు కొద్దిగా బెదిరారు.ఆ దాపునే ఉన్న గోడని ఆనుకొని నిలబడమని వాళ్ళందరకి సైగ చేశాడు.అలాగే చేశారు వాళ్ళు. Albert ఓ కుర్రాణ్ణి దగ్గరకి పిలిచాడు.

" నీ పేరు ఏమిటి.."

ఏదో Irish  పేరు చెప్పాడు ఆ కుర్రాడు.

" ఇంకోసారి గనక ఈ విధంగా రోడ్ల మీద నుంచుని నాకు కనిపించావో మక్కెలిరగదీస్తా ..ఫో..నా కెప్పుడూ కనబడకు" అంటూ చేతిలోని ఫ్లాష్ లైట్ ని కొట్టబోతున్నట్లుగా ఊపి వాడిని తరిమేశాడు.అలాగే రెండవ వాడిని కూడా..!ఇక మూడవ కుర్రాడు తన పేరు చెప్పాడు.అది ఒక ఇటాలియన్ పేరు.Albert Neri కి చర్రున కాలింది.తనూ ఇటాలియన్ వాడే గదా..!తమ జాతికి చెందిన పిల్లలు అలా పోరంబోకులా అతనికి అసలు నచ్చదు.వెంటనే ఫ్లాష్ లైట్ తో ఒక చరుపు చరిచాడు వాడిని..మరో రెండు గుద్దులు కూడా తగిలించాడు." ఒరే నీ లాంటి వాళ్ళంతా ఇటాలియన్ జాతి కే మచ్చ లా తయారవుతున్నార్రా" అని తిట్టాడు.మిగతా కుర్రాళ్ళకీ బుద్ది చెప్పి పంపివేశాడు.

ఇలాంటి కుర్రాళ్ళతో పెద్ద ప్రమాదం ఏమీ లేదు గాని అప్పుడప్పుడు పెట్రోలింగ్ లో డ్రగ్ తీసుకున్నవాళ్ళు,హార్డ్ కోర్ పంక్స్ తారసపడుతుంటారు.వాళ్ళని అదుపు చేయడానికి కొద్దిగా రిస్క్ తీసుకోవాల్సిందే.కత్తి తోనో పిస్టల్ తోనో దాడి చేయడానికి చూస్తారు. అలాంటి వాళ్ళ పట్ల ఇంకా కఠినంగా వ్యవహరిస్తాడతను..పోలీస్ లపై అసాల్ట్ చేసినట్లు కేస్ రిజిస్టర్ చేసి ఆ తర్వాత వీర ఉతుకుడు ఉతుకుతాడు.

ఉన్నట్లుండి న్యూయార్క్ లో యునైటెడ్ నేషన్స్ కార్యాలయం ఉండే పోలీస్ ఠాణా కి బదిలీ అయింది Neri కి..!అక్కడ రోడ్ల మీద చిందర వందర గా వివిధ దేశాల రాయబారుల కార్లు నిలిపేవారు.ఎన్ని సార్లు చెప్పినా వినేవారు కాదు.ఒక రోజు చికాకు పుట్టి అలాంటి కార్ల అద్దాలన్నీ ధ్వంసం చేశాడు.దానితో ఆయా దేశాల రాయబారులు, పై పోలీస్ అధికారులకి కంప్లైంట్ చేశారు.దానితో Albert Neri ని అక్కడనుంచి Harlem ఏరియాకి బదిలీ చేశారు.డ్రగ్స్,హత్యలు,వ్యభిచారం ఇలా సకల లక్షణాలతో విలసిల్లే నల్ల వారు నివసించే ప్రాంతం అది.

సరే..ఇదలా ఉండగా ,ఒక ఆదివారం తన భార్య Rita ని తీసుకుని తన అక్క గారి ఇంటికి బయలుదేరాడు.ఆమె బ్రూక్లిన్ ప్రాంతం లో ఉంటుంది.వితంతువు కూడా..!అప్పుడప్పుడు అలా వెళ్ళి ఆమె బాగోగులు చూస్తుంటాడు.ఆమె కి ఒక కొడుకు ..పేరు Thomas.సకల పోకిరి లక్షణాలు ఉన్న యువకుడు..కాకపోతే మేన మామ Albert Neri వచ్చినప్పుడు మాత్రం మంచి బాలుడి లా ఉంటూ ఉంటాడు.ఏ మాత్రం తేడా వచ్చినా వీరబాదుడు బాదుతాడనే సత్యం అనుభవపూర్వకంగా తెలుసు.

Albert కి అందరు సిసిలియన్ ల మాదిరిగానే తన సోదరి అంటే చాలా ప్రేమ.ఏ మాత్రం కష్టం కలగకుండా ఆమె ని చూడాలనేది అతని ఆకాంక్ష.అందుకే ఎన్ని పనులున్నా ఆమె మంచి చెడ్డల పట్ల నిర్లక్ష్యం వహించడు.సరే..శనివారం రాత్రి బాగా బలాదూర్ తిరిగేసి చాలా రాత్రి అయిన తర్వాత వచ్చి తన బెడ్ రూం లో పడుకుండిపోయాడు Thomas.తెల్లవారి భోజన సమయం అవుతుండగా కూడా లేవలేదు.తల్లి లేపడానికి వచ్చింది ఎదైనా తినమని  " ఏహె ..ఫో..ఇంకాస్తా నిద్ర పోనీ " అంటూ కసిరికొట్టాడు. అయితే ఆ ఆదివారం మేనమామ తమ ఇంటికి వచ్చి ఉన్నాడని వీడికి తెలియదు.వాడితో ఎందుకులే అనిచెప్పి Albert Neri,అతని భార్య,సోదరి తినడం పూర్తి చేశారు.
భోజనాలు అవీ అయిన తర్వాత తన అక్క యొక్క క్షేమ సమాచారాలు అవీ కనుక్కున్నాడు Neri.ఇంకొద్దిసేపటిలో బయలుదేరుదాం అనుకుంటున్నాడతను.ఈ లోపులో Thomas నిద్ర లేచి సరాసరి కిచెన్ లోకి వెళ్ళిపోయాడు.దాకలన్నీ చూశాడు.అన్నీ ఖాళీ !వాడికి కాలిపోయింది." ఏయ్ ..మాం ...ఇలా రావె..ఏదే నేను తినడానికి ఇక్కడ..వెంటనే నాకు వండి పెట్టు " కోపంగా అరిచాడు Thomas అక్కణ్ణుంచే.అంత లోనే తల్లి వచ్చి అన్నది." లేపినఫ్ఫుడేమో లేవలేదు..ఉన్నట్లుండి ఇప్పుడు వండమంటే ఎట్లా..కాసేపాగు" అని.

వాడికి ఇంకా కాలింది."ah..Fuck you and your nagging. నేను బయటకి పోయి తింటాలే ..నువ్వే ఏడువు" అంటూ ఓ బూతు మాట తిట్టేసి కదలబోయాడు.

వెంటనే అది విన్న Albert Neri అతడిని ఇవతలకి లాగి మొహం మీద ఫడ్ ఫడ్ మని గుద్దాడు.ఆ తర్వాత అటు ఇటు పక్కల్లో కొన్ని పంచ్ లు ఇచ్చేసరికి కూలబడ్డాడు Thomas.

" ఇంకొకసారి కనక మీ అమ్మని అలా ఇష్టం వచ్చినట్లు తిట్టావో ఈసారి నా చేతిలో నీ కున్నదే ..జాగ్రత్త" అని వార్నింగ్ ఇచ్చాడు Albert.మొహం అదీ ఉబ్బి,పెదాలు పగిలి భీకరంగా అయిపోయాడు Thomas.భయం తో వణుకుతూ తల ఊపాడు.

ఆ తర్వాత ఇంచుమించు రెండు నెలలకి Rita తన పుట్టింటికి వెళ్ళిపోయింది.బట్టలన్నీ సర్దుకుని వెళ్ళింది.ఆమె తండ్రికి ఫోన్ చేశాడు..ఆ అమ్మాయి తనంటే భయపడుతున్నదని..రావడానికి ఇష్టపడట్లేదని తెలిపాడు.ఆ తండ్రి కూడా సానుభూతి వ్యక్తం చేశాడు Neri పట్ల..! ఆమెని నేనేమీ బాధ పెట్టలేదే..ఎందుకని ఇలా చేసింది అనుకున్నాడు సరే..ఆమె తల్లి తండ్రులతో రేపు వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాడు Neri.అయితే ఆ రాత్రి జరిగిన ఒక సంఘటన అతని జీవితాన్ని మరోలా మార్చివేసింది.అది Albert Neri కూడా ఊహించనిది.ఒక్కోసారి జీవితం లో ఉండే నాటకీయత ఏ రచన లోనూ ఉండేమో..!

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము)--KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (డబ్భై నాల్గవ భాగం)

ఒక రాత్రి పెట్రోలింగ్ లో ఉండగా Albert Neri కి ఫోన్ వచ్చింది.ఇద్దరు వ్యక్తుల్ని ఒకతను కత్తి తో పొడిచాడని..దానిలో ఒక చిన్న అమ్మాయి కూడా ఉందని..! వెంటనే ఆ వేపు కార్ ని దూకించాడు అతని కొలీగ్.ఆ ప్రదేశం Harlem లోనే ఉన్నది.ఒక అపార్ట్ మెంట్ ముందు జనాలు గుమి గూడి ఉన్నారు.కారు స్లో అవుతుండగానే దానిలోనుంచి దూకాడు Albert.అక్కడే ఉన్న ఓ నీగ్రో వనిత చెప్పింది." ఈ లోపలనే..ఉన్నాడు..అతను కత్తి తో ఒకమ్మాయిని గాయపరిచాడు..గాయాలతో ఉందక్కడ మీరే కాపాడాలి" అని.

లోపలకి తొంగి చూస్తే విశాలమైన హాల్ లా కనిపించింది.ఇంకా ముందుకు వెళ్ళగానే ఓ డోర్ ఉంది,దాన్ని తెరవగానే డ్రగ్స్ సేవించినట్లుగా కళ్ళు ఉబ్బి ఉన్నాడొకడు..అతని చేతిలో కత్తి ఉంది.కింద ఇద్దరు నెత్తుటి మడుగులో పడిఉన్నారు.ఒకామెకు 25 ఏళ్ళు ఉండవచ్చు,ఇంకో అమ్మాయికి పన్నెండు ఉండవచ్చు.గాయాలతో ఉన్నారు వాళ్ళు.

అసలు వీడెవడా అని మొహాన్ని బాగా చూశాడు Albert Neri.అతను పాత నేరస్తుడే..పేరు Wax Bains.ఒకసారి అరెస్ట్ చేస్తే మళ్ళీ ఎలాగో ఆ తెల్లారి రిలీజ్ అయిపోయాడు.A notorious pimp,dope pusher and  strong arm-artist.వాడి గూర్చి క్లుప్తంగా చెప్పాలంటే అది.

" ఏయ్..ఇది నీకు సంబంధం లేని విషయం ఫో..బయటకి" అరిచాడు Wax Bains.

" మర్యాదగా ఆ కత్తి పారేసి లొంగిపో..నిన్ను అరెస్ట్ చేస్తున్నాను" ధృఢంగా చెప్పాడు Albert.


" నన్ను అరెస్ట్ చేయాలంటే నీ దగ్గర కనీసం గన్ అయినా ఉండాలి.లేదా చూశావుగా ఈ కత్తి.."

తన చేతి లోని పొడవాటి ఫ్లాష్ లైట్ ని పొజిషన్ లో పట్టుకున్నాడు Neri.


చటుక్కున వాడు కత్తి తో పొడవబోయాడు.అతి లాఘవగా ఆ కత్తి ని బ్లాక్ చేసి ఫ్లాష్ లైట్  తో వాడి నెత్తి మీద ధడేల్మని బాదాడు Neri.ఆ దెబ్బకి ఆ లైట్ కూడా బద్దలైంది.లోపలున్న బ్యాటరీలు కొంత పై నున్న రేకుని పట్టుకుని అలా ఆగాయి.ఆగకుండా వేగంగా పుర్రె మీద ఇంకా కొన్ని దెబ్బలు వేశాడు అంతే..వాడు జీవచ్చవంలా కింద పడిపోయాడు.ఆ తర్వాత రెండు రోజులకి ఆ Wax Bains ఒక హాస్పిటల్ లో మరణించాడు.

పోలీస్ డిపార్ట్ మెంట్ Albert Neri మీద కేసు పెట్టింది.తనకున్న అధికారం కంటే ఎక్కువ తీసుకుని ఒక మనిషి చావుకి కారకుడయ్యాడని.అతనికి సమాజం మీద,న్యాయవ్యవస్థ మీద పట్టరాని కోపం వచ్చింది.తాను చంపింది ఎవరిని..ఒక మృగం వంటి వాడిని..ఇద్దరు స్త్రీల ని ఇంకా ఎంతోమందిని  కత్తి తో పొడిచిన వాడినుంచి ఈ సమాజాన్ని సమ్రక్షించి మంచే చేశానుగదా..ఎందుకని నాకు జడ్జ్ కూడా శిక్ష వేయాలి అనిపించింది.

అతని మీద సానుభూతి ఉన్న కొంతమది అధికారులు మాత్రం పై వాళ్ళతో మాట్లాడదాం అన్నారు.పై మాటకి.అయితే విచిత్రంగా తనకి పిల్లనిచ్చిన మామ ఈ విషయం లో తోడ్పడ్డాడు.చేపల మార్కెట్ ని నిర్వహించడం  తప్ప అతనికి ఏం చేతకాదు అనుకునేవాడు తను.కాని ఎంత చిన్నవాడిని తీసిపారేయగూడదని Neri కి అర్ధం అయింది.చేపల మార్కెట్ కి ప్రొటెక్షన్ ఇచ్చినందుకు గాను Corleon ఫేమిలీ కి అతని మామ నెల నెలా మామూళ్ళు ఇస్తుంటాడు.ఒకసారి Albert Neri జైల్లో పడ్డ విషయాన్ని అతను Clemenza కి చేరవేశాడు.అతను తిరిగి ఈ విషయాన్ని Tom Hagen కి తెలియజేశాడు.Tom కొంతమంది పోలీస్ అధికారుల ద్వారా Albert Neri కి సంబందించిన Dossier ని తెప్పించుకుని బాగా పరిశీలించాడు.

" మనకి ఇంకొక Luca Brasi దొరికాడు.." చెప్పాడు Tom నవ్వుతూ..!

" మరయితే ఈ విషయాన్ని Michael ఫాలో చేస్తే మంచిదనుకుంటాను." అన్నాడు Clemenza. తల ఊపాడు Tom.

ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాయి.విచిత్రంగా Albert Neri తాను ఉన్న తాత్కాలిక జైలు నుంచి శాశ్వత జైలుకి వెళుతున్న రోజున జడ్జి అతని    శిక్షని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించాడు.కారణాలు ఏమిటంటే ఉన్నత అధికారులు కొన్ని కొత్త అంశాలతో కూడిన అఫిడవిట్ ని కోర్ట్ ముందు సబ్మిట్ చేశారుట.అయితే Albert అంత అమాయకుడు కాదు..బయటకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు,తన మామ యొక్క కోరిక మేరకు Corleon ఫేమిలీ ఈ మేలు తనకి చేసిందని. భార్య Rita విజ్ఞప్తి మేరకు ఆమెకి డైవర్స్ ఇచ్చాడు.బహుశా తన మామ అతనికి సాయం చేయడం లోని అంతరంగం కూడా అదేనేమో..!అయితే మామ ఉద్దేశ్యం లో ఉన్నది వేరు..Albert జైల్ కి వెళితే అక్కడ ఎవడో చేతిలో మరణించడమో లేదా ఇతను ఇంకొకణ్ణి మర్డర్ చేయడమో జరుగుతుంది.అందుకే అతను Corleone ఫేమిలీ ని ఆశ్రయించింది.

ఒకరోజు Albert Neri బయలుదేరాడు..తనకి  ఇంత సహాయం చేసిన Corleon ఫేమిలీ కి మనసారా కృతజ్ఞత చెప్పుకోవాలని..!వెళ్ళగానే Michael ఇతడిని సాదరంగా ఆహ్వానించాడు.కూర్చోబెట్టి ఓ డ్రింక్  ఇచ్చాడు.

" మీరు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు.." చెప్పాడు Albert

" భలేవాడివే..సాటి సిసిలియన్ వి ..ఆ మాత్రం నేను నీకు సాయం చేయకపోతే ఎలా..? నా దృష్టిలో నువు చేసింది నేరం కాదు.నిజానికి ప్రభుత్వం నీకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి అలాంటి మృగాన్ని చంపినందుకు..! కాని ఈ పొలిటీషియన్ లు ఉన్నారే..వాళ్ళకి పనికొచ్చే ప్రెజర్ గ్రూప్ లకి మాత్రమే చేయి విదుల్చుతారు.నీ గురించి మీ మామగారు,మీ అక్క గారు చెప్పిన విషయాలు విన్నతర్వాత నీకు సాయం చేయాల్సిందేనని తీర్మానించుకున్నాను." నవ్వుతూ చెప్పాడు Michael

" మీ ఆదరణ కి ఎప్పుడూ రుణపడి ఉంటాను..మరి నేను వెళతాను"  లేచాడు Albert .

" లంచ్ టైం అవుతోందిగా.. పదా భోంచేసి వెళుదువు గాని" అంటూ అతణ్ణి తీసుకుని డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొబెట్టాడు Michael.

అక్కడ Don కూడా ఉన్నాడు.నవ్వుతూ పలకరించి Albert Neri పూర్వీకుల గురించి అడిగాడు..సిసిలీ లో ఏ ప్రాంతం నుంచి వచ్చారని.ఇంతకీ వారి గ్రామం కూడా Don యొక్క గ్రామానికి దగ్గరగా ఉన్నదే.చాలా సంతోషించారు అంతా..!వెళ్ళబోయేముందు Neri తో చెప్పాడు Don.

" నేను బిజినెస్ నంతా త్వరలో Michael కి ఒప్పజెపుతున్నాను.నీ విషయం లో సాయం చేసేదాక నన్ను అతను విడిచిపెట్టలేదు.అన్నట్టు..ఇంకా ఏమన్నా సాయం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు"

Don చూపిన ఆదరణకి కరిగిపోయాడు Neri.

Michael కూడా చెప్పాడు ఫేమిలీ కోసం పనిచేయాలనుకున్నా లేదా వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా తనని సంప్రదించమని..!

" మరి నేను అదే జ్యూరిస్డిక్షన్ లో ఉండాలిగదా..శిక్ష సస్పెండ్ అయినపుడు" అడిగాడు Albert Neri

" అదేం వర్రీ కాకు నువు.నీకు సంబందించిన Yellow sheet ని మీ  డిపార్ట్ మెంట్ నుంచి  కోర్ట్  కి ఏ విధంగా పంపాలో మేము చూసుకుంటాం..సరేనా.."

Albert Neri కి ఒకటి బాగా అర్ధమయింది.బయట సమాజం తను చేసిన పనిని నిందించింది.దానికి గాను జైలుకి పంపింది.కాని అదే పనిని Corleone ఫేమిలీ హర్షించింది.సపోర్ట్ గా నిలిచింది అంటే తన లాంటి మనిషి సుఖంగా ఉండదగిన ప్రపంచం అదేనన్నమాట.

కొద్ది రోజుల్లోనే మళ్ళీ Michael ని కలిసి చెప్పాడతను. తాను ఇక మీదట ఫేమిలీ బిజినెస్ లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని..!Michael ఆనందించి అన్నాడు." మిత్రమా..తప్పకుండా అలాగే చెయ్.దానికి ముందు నువు కొద్దిగా సేదతీరు.మన హోటల్స్ మియామి లో ఉన్నాయి.అక్కడకి వెళ్ళి హాయిగా కొన్ని రోజులు గడుపు.బిల్లులన్నీ కూడా ఫేమిలీ చెల్లిస్తుంది.ఒక నెల జీతం అడ్వాన్స్ గా తీసుకో.."

అలాగేనని చెప్పి మియామి కి వెళ్ళిపోయాడు.అక్కడ ఇంద్ర భవనం వంటి విశాలమైన రూం లు అతనికి ఇవ్వబడ్డాయి.అక్కడి పరిచారకులు అందరూ అతణ్ణి మహారాజు లా చూసుకున్నారు.నైట్ క్లబ్ లోని అందమైన అమ్మాయిల్ని ఇతనికి పరిచయం చేశాడు అక్కడి మేనేజర్.ఒకటి ఉంది ఒకటి లేదు ..అని కాకుండా సర్వ సౌఖ్యాల్ని ఆనందించాడు.ఇలాంటి లగ్జరీ జీవితాన్ని మొదటిసారిగా పొందుతున్నాడిపుడు.అక్కడి నుంచి న్యూయార్క్ వచ్చే లోపులో జీవితం మీద అతనికి గల అభిప్రాయం చాలా మారిపోయింది.


(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము) --KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (డబ్భై అయిదవ భాగం)

ఇపుడు Albert Neri, ఫేమిలీ కి చెందిన Clemenza దళం లో చేర్చబడ్డాడు.అతని పని విధానాన్ని కొన్ని రోజులు పరీక్షించడం జరిగింది.సంవత్సరం తిరగకుండానే He made his bones.ఇక అక్కణ్ణుంచి వెనక్కి చూసుకోవలసిన పని లేకుండా పోయింది.నిజానికి Albert యొక్క కో ఆర్డినేషన్ Luca Brasi కన్నా మిన్నగా ఉందని Clemenza కితాబు ఇచ్చాడు.అతడిని నేరుగా Michael కి రిపోర్ట్ చేసేలా నియమించారు.అంటే ఇక తను Michael కి మాత్రమే జవాబుదారుడు.ఎల్లవేళలా బాడీ గార్డ్ గా ఉంటూ కాచుకోవడం కూడా అతని పనే..!

ఒకసారి Tom Hagen అన్నాడు సరదాగా..!

"Mike..నీకు ఒక Luca Brasi దొరికాడు ఎట్టకేలకు" అని.

ఆ మాటకి Michael  నవ్వి ఊరుకున్నాడు.

ఒకసారి తండ్రి తో మాట్లాడుతున్నపుడు అడిగాడు తను." అవును..Luca Brasi వంటి అతి ప్రమాదకరమైన వ్యక్తిని మీరు ఎలా కంట్రోల్ చేయగలిగారు ..?"

దానికి Don ఇలా చెప్పాడు." చూడు..ఈ ప్రపంచంలో కొంతమంది మనుషులుంటారు.వాళ్ళకి వాళ్ళ చావు అంటే ఇష్టం.నన్ను చంపు..నన్ను చంపు..అన్నట్లుగా ప్రపంచంలో నిర్భీతిగా తిరుగుతుంటారు.నువ్వు చూసే ఉంటావు.గేంబ్లింగ్ లాంటి ఆటలు సాగే దగ్గర...ఎవరితోనో తగాదా పడుతూ కనిపిస్తుంటారు.ఒక్కొసారి వాళ్ళ వాహనానికి ఎవరైన చిన్న గీత తగిలినట్లు చేసినా ఆవేశంగా అవతల వాడిని కొట్టడానికి ఉరికి వస్తుంటారు.ఇలాంటి చోటంతా వీళ్ళు కనబడుతుంటారు.నిజానికి వీళ్ళ సామర్ధ్యం ఏమిటో వీళ్ళకి తెలియదు. నేను ఒకమారు ఒక వ్యక్తిని చూశాను..అతను ఒక పెద్ద భయంకరమైన గుంపుని బెదిరించగలగడాన్ని..అతనికి ముందూ వెనకా కూడా ఏమీ లేదు  మళ్ళీ.నిజానికి అతను నా దృష్టిలో మూర్ఖుడే..ఎందుకంటే పరిస్థితి ఏమాత్రం వికటించినా అతని ప్రాణాలు పోతాయి.కాని అలాంటి మూర్ఖులు ఈ భూమి మీద ఉన్నారు.వాళ్ళు తమ చావుని గుండెలమీద రాసుకుని తిరుగుతుంటారు.ఆ టైం వస్తే ఎవడో ఒకడు వేసేస్తాడు.అది వేరే విషయం.అదిగో Luca Brasi అలాంటి వాడే.

అలాంటి వ్యక్తులు తమని చంపమని కసితో సమాజాన్ని కవ్విస్తుంటారు.చావుని సదా ఆహ్వానిస్తుంటారు.అక్కడ నువు చేయవలసినదేమంటే నీ ఒక్కడి చేతిలో మాత్రం అతను చావడానికి ఇష్టపడకూడదు.ఆ రకంగా నువు అతన్ని తీర్చిదిద్దాలి.ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం లో అతను చావకూడదు అని కోరుకునే వ్యక్తివి నువ్వు ఒక్కడివే అయి ఉంటావు.అప్పుడతను పూర్తిగా నీ మనిషి అవుతాడు."

Don Corleone చెప్పిన ఈ జీవిత పాఠాన్ని Michael వర్తింపజేశాడు Albert Neri మీద..!అది సక్సెస్ అయింది.అపుడు Luca Brasi తండ్రికి ఎలానో ఇపుడు Albert Neri అలా తనకు.

సరే....ఇక్కడ Bronx లో గల ఒక అపార్ట్ మెంట్ లో Albert తన పోలీస్ యూని ఫాం ని సిద్దం చేసుకున్నాడు. షూని కూడ నిగనిగ లాడేలా తుడుచుకున్నాడు.తన నిజ ప్రపంచాన్ని తాను కనుగొన్నాడు.దానిలో ఇక వెనకడుగు లేదు.అవును..ఈ రోజు Michael తనకి చాలా ముఖ్యమైన ఆపరేషన్ ని ఒప్పజెప్పాడు.అదిగో ..దాని కోసమే అతనిప్పుడు తయారై వెళుతున్నాడు.

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము)--KVVS Murthy



   Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (డబ్భై ఆరవ భాగం)

ఆ ఆదివారం రెండు లిమోసిన్ కార్లు లాంగ్ బీచ్ లోని మాల్ ముందు ఆపి ఉన్నాయి.ఒకదానిలో Connie,ఆమె పిల్లలు,తల్లి ఎక్కారు.వాళ్ళంతా లాస్ వెగాస్ కి వెకేషన్ నిమిత్తం వెళుతున్నారు.అలాగే మరో దానిలో Kay ఇంకా ఆమె పిల్లలు ఎక్కారు.వీళ్ళు Newhampshire  కి వెళుతున్నారు.పేరెంట్స్ ని చూడటానికి.Michael మాత్రం కొన్ని రోజులు ఆ మాల్ లోనే ఉండవలసిన అవసరం ఉంది.Barzini లతో మీటింగ్ కి సమయం దగ్గరవుతున్నదిగదా..అందుకే మెల్లగా ఒక్కొక్కరిని కుటుంబసభ్యుల్ని బయటకి తరలించడం జరుగుతోంది.అయితే ఈ సంగతి Michael వీళ్ళెవరకీ చెప్పలేదు.

"Carlo..నీతో ఓ రెండు రోజులు పని ఉంది.ఆ తర్వాత వెళుదువుగాని ఉండు.." అడిగాడు Michael.

"సరే.." అన్నాడు తను.

కారు కదులుతున్నపుడు Connie అడిగింది." నువు కూడా వస్తే బాగుంటుంది గదా..ఇక్కడేమిటి చేసేది" అని.

" లేదు..Michael రెండు రోజులు ఇక్కడ ఉండమన్నాడు నన్ను.." చెప్పాడు Carlo.ఆమె ఏదో అపశకునం గా భావించింది.

" ఏం పని అట.."

" నాకూ తెలియదు.బహుశా ఆ మధ్య ఓసారి నాకు ఓ పెద్ద డీల్ ఇస్తానన్నాడు గదా ..దాని గురించి మాట్లాడటానికేమో" చెప్పాడు Carlo.

"సరే..సాధ్యమైనంత త్వరలో వచ్చేయ్..లేకపోతే మేమే వెనక్కి వచ్చేస్తాం.."

" అదేం లేదు..తొందరగా వచ్చేస్తా" అని చెప్పి టాటా చెప్పాడు అందరికి.రెండు కార్లు అలా న్యూయార్క్ నగరం దాటి వెళ్ళిపోయాయి.

" సారీ..Carlo నిన్ను ఉంచవలసి వచ్చింది.కొన్ని బిజీ పనులు ఉన్నాయి.మనం ఒక దానిమీద కూర్చోవాలి.ఇంట్లో ఫోన్ కి దగ్గరలో ఉండు.సమయం చూసుకొని నేను కాల్ చేస్తా " అన్నాడు Michael.

సరే అని వెళ్ళిపోయాడు Carlo.

ప్రస్తుతం ఇంట్లో భార్యా పిల్లలు లేరు గదా..ఆ మాల్ లో ఉన్న ఇళ్ళు అన్నీ అలా చూసుకుంటూ తిరుగుతున్నాడు Carlo.ఇంతలో Clemenza వచ్చాడు.Michael ఉన్న గది లోకి వెళ్ళి ఏదో మాట్లాడి బయటకి వెళ్ళిపోయాడు.ఆ తర్వాత Tessio  వచ్చాడు.అయితే అతను మళ్ళీ బయటకి రావడం కనబడలేదు.ఇదంతా దూరం నుంచే పరిశీలిస్తున్నాడు Carlo.

మాల్ కి చుట్టూ కొన్ని ఎకరాల వైశాల్యం లో ఫెన్సింగ్ ,ఇంకా గోడ దిట్టంగా ఉంటాయి.దాంట్లో డాన్ కుటుంబం కి చెందిన ఇళ్ళు అన్నీ ఉంటాయి.సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎప్పుడూ ఉంటారు.వాళ్ళు అంతా ఇంచుమించు తనకి తెలిసినవాళ్ళే.వారితో ఏదైనా మాట్లాడదాం అనుకొని వెళ్ళి చూస్తే..అక్కడంతా కొత్త మొహాలు ఉన్నాయి..వీరంతా ఎవరబ్బా అనుకుంటూండగా మెయిన్ గేట్ దగ్గర Rocco Lampone నిల్చుని ఉన్నాడు.నిజానికి ఇలాంటి పనులు అతనికి చెప్పరు.ఏమిటి విషయం అని అతణ్ణి కదిపాడు గాని అతనూ పూర్తి సమాచారం ఇవ్వలేదు..ఏదో కప్పదాటుడు సమాధానం ఇచ్చాడు.

*   *
Michael  తన ఇంటి పైనుంచి ఓ కిటికీ గుండా Carlo నే గమనిస్తున్నాడు.ఇంతలో Tom Hagen ఒక డ్రింక్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు.Michael థాంక్స్ చెప్పి సిప్ చేయసాగాడు.

"Mike.. ఇక సమయం దగ్గర పడింది.ఒక్కొక్కటి కదపడం మంచిదేమో.." అడిగాడు Tom.

" ఇంత త్వరగా ఈ రోజు వస్తుందని అనుకోలేదు.మనతో పాటు ఈ రోజు నాన్నగారు కూడా ఉంటే బాగుండేది.."

" నాకు నమ్మకం ఉంది.నువు అన్ని విషయాలు చక్కగా సెట్ చేశావు. ఇక పని ప్రారంభించడమే తరువాయి.మీ నాన్నగారికి నువ్వు ఏ మాత్రం తీసిపోవు.." చెప్పాడు Tom.

"సరే..చూద్దాం,ఏం జరుగుతుందో..అన్నట్లు Clemenza,Tessio లు వచ్చారా.ముందు Clemenza ని నా గది లోకి పంపించు.అతనికి కొన్ని రహస్యంగా చెప్పాలి.అవి Tessio వినడం నాకిష్టం  లేదు.మరో అరగంటలో Barzini లతో మీటింగ్ ఉందిగదా ..ఈ లోపులో తయారవుతాను" చెప్పాడు Michael .

" మరయితే Tessio ని బిగించక తప్పదంటావా ..వేరే దారి లేదా" అడిగాడు Tom.

" లేదు.." ముక్తసరిగా జవాబిచ్చాడు Michael.

*  *

న్యూయార్క్ లోని బఫెలో అనే ప్రాంతం అది.అక్కడ ఉన్న ఓ పిజ్జా షాపులో ఆ దుకాణదారుడు మిగిలిపోయిన ముక్కలన్నిటిని ఓవెన్ లో వేసి వేడి చేస్తున్నాడు. జనాలు కూడా ఎవరూ లేరు..లంచ్ వేళ కూడా దాటిపోయింది.ఆ వేళప్పుడు ఒక కష్టమర్ వచ్చాడు.చూడ్డానికి కొద్దిగా రఫ్ గా ఉన్నాడు.

" ఒక పిజ్జా కావాలి..ఇస్తావా " అడిగాడా కష్టమర్ .

సరే అన్నట్టుగా అలాగే వేడి చేస్తూ ఓ పిజ్జా ని పేపర్ ప్లేట్ లో వేసి ఆ కష్టమర్ కి అందించాడు దుకాణదారుడు.దాన్ని తీసుకున్న ఆ కష్టమర్ నవ్వుతూ అడిగాడు." అవునూ..నీ చెస్ట్ మీద ఏదో టాటూ ఉన్నట్లుంది.కొద్దిగా కనబడిందిలే. షర్ట్ బటన్ విప్పి ఆ మిగతాది చూపించవా నాకు.."

" అదేం లేదు.నైట్ షిఫ్ట్ చేసే వాడికి ఉండి ఉంటుంది." అని తత్తరపడుతూ దూరం జరగబోయాడు దుకాణదారుడు.ఇంతలో ఆ కష్టమర్ కౌంటర్ మరుగు నుంచి తన చేయి లేపాడు.దానిలో తుపాకి ఉంది.రెండు బుల్లెట్లని దుకాణదారుని బాడీ లోకి దింపాడు.దెబ్బతో కూలబడ్డాడు వాడు.అయితే కొస ప్రాణం ఉంది.ఆ కష్టమర్ దగ్గరకొచ్చి దుకాణదారుని షర్ట్ బటన్స్ ని ఊడదీశాడు..! ఇద్దరు ప్రేమికులు..వాళ్ళని వెనకనుంచి పొడుస్తున్న ఒక వ్యక్తి..ఆ టాటూ వేసి ఉంది.వెంటనే ఆ కష్టమర్ చిరునవ్వుతో అన్నాడు." ఏయ్..Fabrizzio , నీకు Michael శుభాకాంక్షలు తెలుపమన్నాడు..ఇందా తీసుకో"

అలా అంటూనే ఒక బుల్లెట్ ని Fabrizzio పుర్రెలోకి దింపాడు ఆ కష్టమర్.ప్రాణం లేని మాసంపు ముద్ద లా పడిపోయాడు Fabrizzio .

*  *
గేట్ దగ్గరున్న Rocco Lampone ఫోన్ రింగవడం తో ఎత్తాడు.అవతలనుంచి ఓ కంఠం వినిపించింది." నీ పేకేజి సిద్ధంగా ఉంది" అని.వెంటనే ఆ సిగ్నల్ ని గ్రహించాడు Rocco.ఆలశ్యం చేయకుండా వేగంగా వెళ్ళి తన కారు లో కూర్చుని ముందుకు దూకించాడతను. సరిగ్గా Jones Beach causeway  దగ్గరకి రాగానే అక్కడ తన కారుని పార్క్ చేశాడు.అక్కడేగదా Sonny ని హత్య చేసింది..! ఆసరికే అక్కడ ఉన్న ఇంకో కారు లోకి జంప్ చేశాడు.దానిలో తమ మనుషులు ఇద్దరు ఉన్నారు.ఆ కారు Sunrise highway మీదుగా వెళ్ళి ఓ మోటల్ దగ్గర ఆగింది.లోపలకి వెళితే ఓ Chalet-type బంగ్లా కనబడింది.దాని డోర్ ని లాఘవంగా తీశాడు Rocco.లోపల Philip Tattaglia నగ్నంగా ..మరో అమ్మాయితో..శయ్య మీద..! అతగాడు బిత్తరపోయి లేచినుంచున్నాడు.Rocco ఒక్క సెకను కూడా వేస్ట్ చెయ్యకుండా నాలుగు బుల్లెట్ లను Phillip కడుపులోకి దింపాడు.అంతే.అతని కధ ముగిసిపోయింది.

మళ్ళీ వచ్చినంత వేగంగా Rocco తన కారు పార్క్ చేసిన చోటకి వచ్చి దానిలోకి ఎక్కి మాల్ వేపు  సాగిపోయాడు.మరో  పది నిమిషాల్లో Rocco మాట్లాడుతూ కనిపించాడు Michael తో..!

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము) __KVVS Murthy


  Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (డబ్భై ఏడవ భాగం)

Albert Neri తన పోలీస్ యూనిఫాం ని ధరించాడు.చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ డ్రెస్ లో తనని తాను చూసుకుని ఎక్జయిటింగ్ గా ఫీలయ్యాడు.తను సస్పెండ్ అయినపుడు గన్ ని డిపార్ట్మెంట్ కి సరెండర్ చేశాడు.కాని మిగతావి కొన్ని అలా తన దగ్గరనే ఉండిపోయాయి.పరిపాలనా పరమైన అజాగ్రత్త వల్ల అలా జరిగిపోయింది.

Clemenza ఇపుడు ఒక గన్ ని తన కోసం సమకూర్చాడు.అది తేలిగ్గ Dress  లో దాయగలిగేలా ఉండే పాయింట్ థర్టీ ఎయిట్.దాన్ని విప్పదీశాడు Albert ..లోపల భాగాలకి ఆయిల్ పెట్టాడు.హేమర్ ని చెక్ చేశాడు.మళ్ళీ వాటి భాగాల్ని చక్కగా అమర్చి ట్రిగ్గర్ ని కూడా చెక్ చేశాడు.ఆ తర్వాత వాటి సిలిండర్స్ లో బుల్లెట్ లను నింపాడు.

తన పోలీస్ కేప్ ని ఓ పేపర్ బ్యాగ్ లో చుట్టి పట్టుకున్నాడు.యూనిఫాం మీద మళ్ళీ ఓ ఓవర్ కోట్ వేసుకున్నాడు.బయటకి వచ్చి నాలుగడుగులు నడిచేసరికి తనని పికప్ చేసుకునే కారు వచ్చింది.దాంట్లోకి జంప్ చేశాడు.ఓవర్ కోట్ ని విప్పి లోపల సీట్ మీద పెట్టాడు.పోలీస్ కేప్ ని తీసి తలకి పెట్టుకున్నాడు Albert Neri.

కారు అలా దూసుకు వెళ్తూ..కాసేపాగి ఓ చోట ఆగింది.5 వ అవెన్యూ లో 55 వ స్ట్రీట్ అది. వెంటనే దిగిపోయి నడవసాగాడు.ఎన్నోసార్లు ఈ వీధుల్లో తాను పెట్రోలింగ్ చేశాడు గతంలో..ఇప్పుడు అది తలచుకుంటే గమ్మత్తుగా ఉంది.రాక్ ఫెల్లర్ సెంటర్ దగ్గరకి వచ్చి ఆగాడు.అక్కడకి పక్కగా ఉన్న సెయింట్ పేట్రిక్ కేధడ్రల్ వీధి మలుపు దగ్గరకి చేరుకున్నాడు.తాను దేనికోసమైతే చూస్తున్నాడో ఆ లిమోసిన్ కారు అక్కడనే కనిపించింది.

ఆ కారు ని మళ్ళీ పరిశీలించాడు.అవునదే ..సందేహం లేదు.అయితే ఆ కారు నో పార్కింగ్ జోన్ లో ఉంది.అక్కడనుంచి కారు తీయవలసిందిగా డ్రైవర్ కి సైగ చేశాడు Albert.దానికి ప్రతిగా అతగాడు ఖాతరు చేయను అన్నట్లు పొగరు గా చూశాడు.

" ఏం పిచ్చి పిచ్చిగా ఉందా..చెబుతుంటే నీకు కాదా..?కారు పక్కకి తియ్" అంటూ Albert జేబులోనుంచి సమన్స్ బుక్ ని బయటకి తీశాడు.

" ఈ ఏరియా కి కొత్తగా వచ్చిన పోలీస్ వా ..ఏమిటి ? నీ పై అధికారిని అడుగు..ఈ కారు ఎవరిదో చెప్తాడు" గీరగా జాబిచ్చాడు డ్రైవర్.

" మర్యాదగా తీస్తావా...లేదా బొక్కలిరగగొట్టేదా " హుంకరించాడు Albert Neri.

" సరే..సరే..! నీకంత  బాధగా ఫైన్ రాయి,కడతాను." అంటూ ఆ డ్రైవర్ ఓ పది డాలర్ల నోటుని Albert జేబులో పెట్టబోయాడు.దాన్ని తప్పించుకుంటు అవతలకి తిరిగి ..మళ్ళీ అడిగాడు Albert.

" ఏయ్ నీ లైసన్స్ కాగితాలు అవీ చూపించు "

తీసి ఇచ్చాడు డ్రైవర్.వాటిని చూస్తూనే..అల్లంత దూరాన ఉన్న ముగ్గురు మనుషుల్ని జాగ్రత్త గా చూశాడు.వాళ్ళిటే నడుచుకుంటూ వస్తున్నారు.దానిలో ఒకడు Barzini.మిగతా ఇద్దరు అతని బాడీ గార్డులు.బహుశా Michael తో జరిగే మీటింగ్ కే వెళుతున్నట్లుగా ఉంది.ఒక బాడీ గార్డ్ దగ్గరకొచ్చి ఏమిటి గొడవ అని అడిగాడు.ఆ డ్రవర్ ఏదో సర్ది జెపుతున్నాడు.ఇంతలోనే Barzini ఇంకో బాడీ గార్డ్ ని వెంటబెట్టుకొని దగ్గరకొచ్చి ఏయ్ ..ఏమిటి న్యూసెన్స్ అని బెదిరించినట్లుగా అన్నాడు.Albert Neri ఒక్క క్షణం కూడా ఆలశ్యం చేయకుండా వెంటనే సమన్స్ బుక్ ని జేబులో పెడుతూనే ,గన్ ని బయటకి తీసి Barzini చాతి మీద మూడు సార్లు కాల్చాడు.మూడు బుల్లెట్లు గురి తప్పలేదు. నెత్తుటి మడుగులో కూలిపోయాడు Barzini.మిగతా ముగ్గురు బెదిరిపోయి వాళ్ళని కవర్ చేసుకోడానికి తలా ఒక దిక్కు పరిగెత్తారు.ఇదే అదనుగా గుంపులో కలిసిపోయి అంతర్ధానమైపోయాడు Albert Neri.కొన్ని సెకన్లలో Albert  ని తీసుకెళ్ళే కారు ప్రత్యక్షమయ్యింది.దానిలోకి ఎక్కేశాడు.అది చెల్సియా పార్క్ దగ్గర ఆగింది.తన యూని ఫాం ని,గన్ ని ఆ కారులోనే విడిచిపెట్టాడు.సిద్ధంగా ఉన్న మరో కారులో ఎక్కి కాసేప్టిలో మాల్ కి చేరుకున్నాడు.Albert Neri ఇపుడు Michael తో మాట్లాడుతున్నాడు.

*  *
Don ఒకప్పుడు నివసించిన ఆ ఇంటిలోనే ప్రస్తుతం Tessio కాఫీ తాగుతూన్నాడు తీరిగ్గా..!అలా తాగుతూ Michael నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు.ఎందుకంటే Barzini తో మీటింగ్ ని ఏర్పాటు చేసింది అతనే గదా..!

కాసేపటిలో Tom Hagen ప్రత్యక్షమయ్యాడు.

" ఆ..Tessio ,మీటింగ్ కి Michael తయారై ఉన్నాడు.మనం వస్తున్నట్లుగా ఆ Barzini కి ఫోన్ చెయ్ ఇపుడు" చెప్పాడు Tom

Tessio వెంటనే లేచి ఓ నెంబర్ కి డయల్ చేసి చెప్పాడు." బ్రూక్లిన్ కి ఇపుడు బయలుదేరుతున్నాము.సిద్ధంగా ఉండండి" అని.

Tom Hagen వేపు చిరునవ్వుతో చూశాడు Tessio.ఆ తర్వాత అన్నాడు."  ఈ రాత్రికి మీటింగ్ లో Michael  ఒక మంచి డీల్ కుదుర్చుతాడని ఆశిస్తున్నాను."

" అదే నేనూ ఆశిస్తున్నాను" బదులిచ్చాడు Tom.

ఇంతలో ఒక బాడీ గార్డ్ వచ్చి చెప్పాడు." బాస్ కాసేపాగి వస్తారట.ఈ లోపు ముందు ఓ కారు లో మిమ్మల్ని ఇద్దర్నీ వెళ్ళమంటున్నారు" అని.

అది విని Tessio హతాశుడయ్యాడు." ఇప్పుడు అలా చెపితే ఎలా ..నేను చేసిన ఏర్పాట్లన్నీ బూడిదలో పోసిన పన్నీరు కావా.." అన్నాడు ఏదో బస్ మిస్ అయినట్టుగా..!

వెంటనే కొంత మంది బాడీ గార్డ్ లు Tessio ని చుట్టుముట్టారు.ఇంకొన్ని క్షణాల్లో మరి కొంతమంది వచ్చి చేరారు అతణ్ణి బందించుతున్నట్లు.Tessio కి సీను మొత్తం క్షణం లో అర్ధమయింది.ఎక్కువగా నటించకుండా Tom ని ప్రాధేయపడ్డాడు " మనం ఎన్నో ఏళ్ళ నుంచి కలిసి పనిచేశాం,నన్ను వదిలిపెట్టమని చెప్పలేవా" అని.

" నేను చేయగలిగింది ఏమీ లేదు..Tessio.." నిర్లిప్తంగా అన్నాడు Tom Hagen.

అంతే..!బాడీగార్డ్ లు Tessio ని ఒక కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు.అంతే అతని చరిత్ర అలా ముగిసింది.

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము)--KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (డబ్భై ఎనిమిదవ భాగం)

Carlo Rizzi చాలాసేపటినుంచి వేచి చూస్తున్నాడు.Michael పిలుపు కోసం.అతని గదికి వచ్చేవాళ్ళు వస్తున్నారు.పోయేవాళ్ళు పోతున్నారు.ఏదో పెద్ద వ్యవహారమే జరుగుతున్నట్లుంది.కాకపోతే తనకే తెలియడం లేదది.Carlo కి చికాకు లేచి Michael కి ఫోన్ చేశాడు.ఇంకొద్దిగా ఓపిక పట్టు..కొన్ని అర్జంట్ పనుల్లో ఉన్నాను అన్నాడవతలనుంచి తను..!

ఈ లోపులో భార్య Connie కి ఫోన్ చేశాడు.కొద్దిగా రాత్రయినా ఏదో టైం కి వచ్చేస్తాలే అని ఆమెకి చెప్పాడు Carlo. టైం కూడా ఆదా చేసినట్లు అవుతుంది గదాని ఫ్రెషప్ అయి ఈ మధ్య లోనే ఇంకో డ్రెస్ కూడా వేసుకున్నాడు.Michael తో మాట్లాడి ఆ తర్వాత డైరెక్ట్ గా ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిపోవచ్చునని..!

ఫోన్ కి సమీపం లో నే ఉన్నాడు.ఏదో నిమిషం లో అతను కాల్ చేస్తాడని.ఇంతలో ఉన్నట్లుండి తలుపు కొట్టిన చప్పుడు అయింది.వెళ్ళి తీశాడు Carlo .వచ్చిన ముగ్గురు వ్యక్తుల్ని చూసి కొద్దిగా వళ్ళు జలదరించింది అతనికి..! Michael మనిషి కూడా ఇప్పుడు ఎందుకనో వేరేగా అనిపించాడు.Michael తో పాటు Tom Hagen,Rocco Lampone లు సైతం తన గదికి వచ్చారేమిటబ్బా అని కాళ్ళు వణికినట్లయ్యాయి.

Michael లోపలకి వచ్చి కూర్చున్నాడు.Tom,Rocco లు ఇద్దరూ గోడకి చెరో వేపున నుంచున్నారు. ఉన్నట్లుండి Michael ఒక ఊహించని ప్రశ్న అడిగాడు Carlo ని.

" Carlo..నువు ఒక ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలి. హత్య చేయబడ్డ నా అన్నగారు Sonny విష్యానికి సంభందించినది అది.."

ఆ ప్రశ్న విని Carlo తనకి ఏమీ తెలీనట్లుగా మొహం పెట్టాడు.

"నువ్వు ఆ రాత్రి Connie ని కొట్టినవెంటనే ..ఫోన్ రావడం తో Sonny ఆవేశం లో తగు జాగ్రత్త తీసుకోకుండా బయటకి వచ్చాడు .అలా అతను ఇంటినుంచి బయలుదేరిన సంగతి మా శత్రువు కి ఒకరు ఉప్పందించారు.దానివల్లనే మార్గ మద్యం లో Sonny ని కాల్చి చంపారు.చెప్పు ఎవరది..ఆ రాత్రి నిన్ను సంప్రదించింది.." సూటిగా అడిగాడు Michael.

Carlo మొహంలో నెత్తురు చుక్క లేదు.శరీరం లో కంపనలు మొదలయ్యాయి. "Mike నన్ను నమ్ము..నేనే పాపమూ ఎరగను.నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నా" తత్తరపడుతూ అన్నాడు Carlo.

"Barzini మరణించాడు.Phillip tattaglia కూడా మరణించాడు.ఈ రాత్రికి మా ఫేమిలీ కి చెందిన అన్ని అకౌంట్ లు పూర్తి చేయాలనుకుంటున్నాను.నువు నిర్దోషివని మాత్రం చెప్పకు Carlo.నిజం చెప్పు.అప్పుడే నిన్ను వదిలివేయడం జరుగుతుంది.ఈ రాత్రికే లాస్ వేగాస్ పంపించివేస్తాను నిన్ను.." తాపీ గా చెప్పాడు Michael.

Tom ఇంకా Rocco లు మాత్రం వీడితో ఇంతసేపు మాటలేమిటి అన్నట్లు చూస్తున్నారు.ఎందుకంటే ఇప్పటికే చేసిన విచారణ లో Carlo పాత్ర బయటబడింది.

కాసేపు ఆగి మళ్ళీ అన్నాడు Michael." వణికిపోకు Carlo..!నా చెల్లెల్ని విధవరాల్ని చెయ్యనులే..అలాగే ఆమె పిల్లల్ని  అనాధలుగా కూడా చెయ్యనులే.నిజం చెప్పు.నిర్దోషినని మాత్రం అనకు.ఎందుకంటే అది నా తెలివిడినే అవమానపరిచినట్లనిపిస్తుంది. ఆ సంఘటనకి ముందు నిన్ను కాంటాక్ట్ అయినవాళ్ళు ఎవరు..? Barzini నా లేక Tattglia నా చెప్పు"

ఇపుడు Carlo కి కుంచెం జీవితం మీద ఆశ కలిగింది.గుస గుస లాడుతున్నట్లుగా చెప్పాడు." ఆ రాత్రి కలిసింది Barzini " అని..!

" మంచిది.సరే..ఇక నువు వెళ్ళిపోవచ్చు" చేతి తో సైగ చేశాడు Michael.

హమ్మయ్యా ..బతికానురా దేవుడా అనుకుంటూ బయటకి వచ్చి గుమ్మం లో ఉన్న కారు లోకి ఎక్కాడు.ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిపోవడానికి.వెళ్ళి ముందు సీట్లో కూర్చున్నాడు.డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తిని చూశాడు..కొత్త వ్యక్తి. అలాగే వెనక సీట్లో ఎవరో ఉన్నట్లు అనిపించింది..కాని మొహం సరిగా కనబడలేదు.కారు మెల్లగా కదులుతూ మాల్ దగ్గరున్న ప్రధాన గేటుని సమీపించగానే Carlo వెనక్కి తిరిగి చూడబోయాడు.

అంతే. ఆ వెనుక సీట్లో కూర్చున్న Clemenza నవ్వుతూ..నిశ్శబ్దంగా Carlo మెడలో పదునుగా ఉన్న ఒక వైరుని వేసి ఉచ్చులా బిగించి గట్టిగా అలాగే నొక్కుతూ పట్టుకున్నాడు.Carlo కంఠాన్ని లోపలికంటా చీల్చుతూ ఉండగా రక్తం కస్ మంటూ చిమ్మింది.మరింతగా వత్తి ఆ తర్వాత ధృవీకరించుకున్నాక దాన్ని లూజ్ చేశాడు.చేపకొట్టుకున్నట్లు కాసేపు కొట్టుకుని ప్రాణాలు విడిచాడు Carlo. ఒక్కసారిగా  బాడీ నుంచి గుప్పుమని దుర్వాసన కొట్టగా ..దాన్ని వెళ్ళనివ్వడానికి కారు విండో అద్దాల్ని కిందికి దింపాడు Clemenza.

ఆ రకంగా Corleone ల యొక్క విజయ యాత్ర పూర్తయింది.ఇవన్నీ పూర్తయీన 24 గంటల్లో ఇంకా కొన్ని సంఘటనలు జరిగాయి.Clemenza ఇంకా Rocco Lampone లకి చెందిన దళాలు బ్రూక్లిన్ ప్రాంతం లోకి చొచ్చుకు వచ్చిన Barzini లకి చెందిన బుక్ మేకింగ్ కేంద్రాలపై విరుచుకుపడ్డాయి.వారిని అక్కడనుంచి తరిమి కొట్టారు.Barzini ఇంకా Tattagla ఫేమిలీ లకి చెందిన ప్రముఖులంతా Corleone ల వైపు ఫిరాయించారు.బెట్టు చేసి తిరగబడిన వారిని వివిధ రెస్టారెంట్ లలో ఉండగా కాల్చివేయడం జరిగింది.

అలా ఒకే ఒక్క మాస్టర్ స్ట్రోక్ తో ..Michael Corleone యొక్క పేరు సాటి మాఫియా ఫేమిలీ లలో మారు మోగింది.పోయిన ప్రాంతాల్ని వెనక్కి తీసుకోవడం తో పాటు..,మిగతా రెండు ఫేమిలీ ల బలం కూడా తోడయి Corleone ఫేమిలీ ఇపుడు న్యూయార్క్ మాఫియా ఫేమిలీల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించింది.

ఇదిలా ఉండగా -

Connie లాస్ వెగాస్ నుంచి వస్తూనే సోదరుడు Michael ని చెడా మడా తిట్టడం ప్రారంభించింది.ఆమె భర్త Carlo ని ఇన్నాళ్ళు మాల్ ఉంచుకుని నమ్మించి చంపేశారని ఆరోపించింది.Kay ఓదార్చడానికి ప్రయత్నించింది.అయినా ఆమె ఇంకా రెచ్చిపోయి తిట్టసాగింది. మా నాన్నగారు చనిపోయేంత దాకా ఆగి,నా భర్తని ఈ విధంగా Michael మట్టుబెట్టాడని ఆరోపించింది.అంతేకాదు Barzini,Tattaglia ల్లాంటి వారిని ఎంతోమందిని మట్టుబెట్టాడని ఆరోపించింది.అదంతా చాలా ఓపికగా విని బాడి గార్డ్ లతో Michael చెప్పాడు " ఆమె హిస్టీరిక్ గా ఏదో మాట్లాడుతోంది గాని ..తీసుకెళ్ళి డాక్టర్ కి చూపించండి"  అని..!

ఆ తర్వాత ప్రశాంతం గా ఉన్నప్పుడు Kay అడిగింది,Connie చెప్పింది నిజమేనా అని.

" నిజం కాదు.నన్ను నమ్ము.నా వ్యవహారాల్ని అడగటానికి ఇపుడు నీకు ఓ అవకాశం ఇచ్చాను.అలాగే దానికి జవాబూ ఇచ్చాను." అలా అనేసి నిర్లిప్తంగా ఉన్నాడు Michael.

Kay ఇంతలో డ్రింక్స్ ఫిక్స్ చేయడానికి పక్క గది లోకి వెళ్ళింది.అంతలోనే Clemenza,Albert Neri,Rocco Lampone లు వచ్చి Michael కి ఏదో విషయాన్ని నివేదిస్తున్నారు.Clemenza మాట్లాడుతున్నప్పుడు Don Michael అని సంభోదించడం స్పష్టంగా విన్నది.దైవదత్తమైన ఒక అధికారం తో సాటి మానవులపై ఆధిపత్యం వహించిన రోమన్ చక్రవరులు ..ఆ శిల్పాల రూపం లో గంభీరంగా,నిర్భయంగా రోం లో ఎలా నిలబడివున్నారో అదే విధంగా Michael నిలబడి ఉన్నట్లు ఆమెకి తోచింది.

Connie చెప్పినదంతా నిజమేనని స్పృహ కలిగి Kay బాధతో  నిట్టూర్చింది.

(మిగతాది వచ్చే భాగం లో చూకుందాము)-- KVVS Murthy


Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (డబ్భై తొమ్మిదవ భాగం)

ఆ రక్తపాతం తో కూడిన విజయం ఒక సంవత్సరం తీసుకున్నది,మళ్ళీ అన్ని రకాలుగా Corleone ఫేమిలీ కుదుటపడటానికి ..ఇంకా కొన్ని మార్పులకి గురయి కొత్త రూపు తో పుష్పించడానికి..!దానికి తగిన రాజకీయ మంత్రాంగం సాగించవలసివచ్చినది.

ఇటు న్యూయార్క్ లోని వ్యవహారాలు,అటు లాస్ వెగాస్ లోని  వ్యవహారాలకి సమానంగా సమయం కేటాయించి చూసుకుంటున్నాడు Michael.ఎట్టకేలకు న్యూయార్క్ లోని బిజినెస్ నుంచి తను తప్పుకుని లాస్ వేగాస్ కేంద్రంగా చేసుకోదలిచాడతను.Clemenza ఇపుడు స్వంతగా Family ని తయారుచేసుకున్నాడు.Rocco Lampone తమ Caporegime గా కొనసాగుతాడు.ఇక Albert Neri లాస్ వేగాస్ లోని తమ కేసినో లని అన్నిటిని చూసుకునే సెక్యూరిటి చీఫ్ గా ఉన్నాడిప్పుడు.

న్యూయార్క్ లోని ఆ మాల్ ఇంకా ఇతర ప్రాపర్టీ లని అమ్మివేయడం జరిగింది.Kay కి కూడా లాస్ వేగాస్ బాగా నచ్చింది.ఆ ఎర్రని పర్వత సానువులు,మెరిసే ఇసుక,కృత్రిమ జలాశయాలు ఆ వాతావరణం మంచిగా అనిపించింది.

కాలమే చేసిన గాయాలు మానుపుతుంది అన్నట్లుగా Connie కూడా Michael ని తాను ఆ రోజున తిట్లకి క్షమాపణ కోరింది.అలాగే Carlo మరణించిన ఏడాది తిరగకుండానే ఆమె ఇంకో మంచి ఇటాలియన్ యువకుణ్ణి వివాహమాడింది.అతని తమ ఫేమిలీ కోసం పనిచేసే ఓ ఉద్యోగి యే..!

లాస్ వేగాస్ నుంచి పూర్తిగా షిఫ్ట్ కావడానికి ముందు రోజున Kay తాను కేథలిక్ గా మారదలుచుకున్నది.అత్తగారి మాదిరిగా..!మాల్ ప్రాంగణం లోనే గల ఓ చిన్న చర్చ్ లో ఆ తంతు కి ఆమె ఆ రోజు తయారవుతున్నది.స్నానించి అప్పుడే వచ్చి.. బెడ్ మీద ఓ వారగా కూర్చుని తన Stolkings ధరించుతున్నది.ఆమె వెచ్చనైన తొడ మీద Michael చెయ్యి వేశాడు.

" ఇప్పుడదేమి జరిగేది కాదు..ఇప్పుడు నేను కేథలిక్ గా కమ్మ్యునియన్ పొందడానికి చర్చ్ కి వెళుతున్నాను " అని చెప్పింది Kay.

" ఏమో నాకయితే నా పిల్లలు ప్రొటెస్టెంట్ లుగా గా పెరగడమే ఇష్టం.ఆ జీవిత విధానం అమెరికా కి దగ్గరగా ఉంటుంది" తన అభిప్రాయం చెప్పాడు Michael.

అయితే అతనూ పూర్తిగా వ్యతిరేకించలేదు ఆమె నిర్ణయాన్ని.చర్చ్ లోనికి  అత్తగారు,ఆమె ప్రవేశించారు.అక్కడ ముందు భాగం లో ఉన్న చెక్క తో చేయబడిన ఒక రెయిలింగ్ మీద మోకరిల్లి ఉన్నది Kay .మిగతా Communion పొందడానికి వచ్చినవాళ్ళతో బాటు..!అక్కడ సిలువ మీద క్రీస్తు ,ఇంకా పరిశుద్ధులైన ఆయన అనుయాయుల విగ్రహాలు..వాటి ముందు ఎర్రని కాంతులీనుతున్న కొవ్వుత్తులు..!పవిత్ర జలాన్ని తీసుకుని ఆమె సిలువ వేసుకుని ఆపైనా ముని వేళ్ళని పెదాలకి తాకించుకున్నది.ప్రార్ధించడానికన్నట్లు తల వంచినదామె.

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము) --KVVS Murthy




Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (చివరి భాగం)

నిశ్శబ్దంగా,మంద్ర కాంతి తో నిండిన ఆ చర్చ్ లోపల ఆమె ప్రశాంతం గా కనిపిస్తున్నది గాని లోలోపల ఎన్నో భావనలు.తన భర్త యొక్క పరలోక జీవితం అందులో ఒకటి.ఏడాది క్రితం..!అదే Connie భర్త Carlo హత్యగావింపబడటం వెనుక తన భర్త Michael పాత్ర ఉన్నదని Kay అనుమానించి ,కినుకవహించి ఆమె పేరెంట్స్ ఉన్న ఊరు Newhampshire కి పిల్లల్ని తీసుకుని మరీ వచ్చేసింది.ఎందుకంటే Connie,Carlo  ల కొడుకు కి గాడ్ ఫాదర్ గా Michael నే ఉండమని చెప్పింది తనే..! దాన్ని కూడా లెక్క లోకి తీసుకోకుండా Carlo కి హాని చేసినపుడు తన మాట కి ఏం విలువ ఇచ్చినట్లు..అందుకనే చెప్పా పెట్టకుండా పుట్టింటికి వచ్చేసింది.Michael ఫోన్ చేశాడు గాని తను ఎత్తలేదు.దానితో ఒక రోజు Tom Hagen దూత గా వచ్చాడు.

" ఏమిటి Michael నిన్ను దేనికి పంపించాడు..మమ్మల్ని ఈ విధంగా బెదిరించడానికా " అడిగింది Kay  అతణ్ణి,ఎందుకంటే తగినంతమంది బాడీ గార్డ్ లతో అతను వచ్చాడు ఇక్కడికి..!అది విని Tom Hagen చాలా కోపం చెందాడు.

" నీ లాంటి అన్ని అర్ధం చేసుకోగల వాళ్ళే అలా మాట్లాడితే ఎలా చెప్పు.ఆ మాట బాగా లేదు Kay " బాధగానే అన్నాడతను.

" సరే..చెప్పు ,ఏమిటి విషయం"

" ఎందుకని నువ్వు Michael కి చెప్పా పెట్టకుండా వచ్చేశావు "

" అతను నాకిచ్చిన మాట ఏం నిలుపుకున్నాడని...Conni కొడుక్కి అతడిని గాడ్ ఫాదర్ గా ఉండమన్నాను.కాని Carlo ని లేకుండా చేశాడు..అది పద్ధతేనా చెప్పు.."

" ఏం అంటున్నావు Kay"

"Carlo Rizzi ని హత్య చేయడం గూర్చి మాట్లాడుతున్నాను"

"దానికి గల కారణాలు కొన్ని నీకు చెబుతాను..విను,అవి చాలా సహేతుకమైనవి కూడా"

"హ్మ్..మొదటిసారిగా నీలోని లాయర్ కోణాన్ని చూపెడుతున్నావు Tom,కాని అదంతా బాగా అనిపించడం లేదు.."

" సరేలే Kay..! కాని ఒకటి ఆలోచించు.Carlo  ఆ రాత్రి ..అదే అతని భార్య Connie ని కొట్టిన రాత్రి..ఆ పని ఎందుకు చేశాడో తెలుసా..కేవలం ఆమె పెద్దన్న Sonny ని బయటకి రప్పించడానికే.. ఆ విధంగా వచ్చేలా చేసి Barzini మనుషులకి ఉప్పు అందించాడు.వాళ్ళు దారి మధ్యలో ప్లాన్ గా పొంచు పెట్టి Sonny ని హత్య చేశారు.అంటే Carlo చేసిన పని ఎలాంటిది..నువ్వే ఆలోచించు.." ప్రశ్నించాడు Tom.కాసేపు నిశ్శబ్దం గా ఉండిపోయింది Kay.

" Don కి ఇవన్నీ తెలుసు.అందుకనే కొన్ని పనులు ఆయన చేతులతో చేయడం ఇష్టం లేక చివరి రోజుల్లో అన్ని వ్యవహారాలనుంచి వైదొలగి Michael కి అప్పగించింది.." Tom చెప్పుకుపోతున్నాడు.

"గల గల పారుతున్న ఒక సెలయేరు పక్కనున్న చెట్ల కింద గల పచ్చికలో కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.

" సరే..ఎప్పుడో జరిగిపోయిన విషయం గదా..ఆ విధంగా భావించి Carlo ని క్షమిస్తే పోయేది గదా.." నిర్లిప్తంగా అంది Kay.

" అది నువు చేగలవు.కాని Michael స్థానం లో ఉన్నవ్యక్తి ఆ పని చేయలేడు"
" ఏం ..ఎందుకని"

" అలా Michael గనక Carlo ని వదిలేసి ఉన్నట్టయితే ,ఈ పాటికే Michael చనిపోయి ఉండేవాడు..అది నీకు తెలుసా..?"

" ఎందుకలా ..? ఉన్నది ఉన్నట్లు చెప్పు,నువ్వయినా ! Tom నాకు తెలుసు ఆ పని Michael చేయలేడు.కాని నువు Sicilian వి కాదుగదా..ఒక స్త్రీ కి నిజం చెప్పగలవు..ఆమె కూడా నీలాంటి మనిషేనని భావించగలవు గదా.."

మళ్ళీ కాసేపు నిశ్శబ్దం...!

" నీతో అబద్ధం చెప్పాడని Michael మీద నీకు పిచ్చి కోపం వచ్చింది గదూ..అతణ్ణి నువు గాడ్ ఫాదర్ గా నియమించావు Carlo కొడుక్కి..నిజానికి అది అతనికి ఇష్టం లేదు.కాని Carlo ని నమ్మించడానికే ఆ అవకాశాన్ని Michael వాడుకున్నాడు.A classical tactical move to win victim's trust " నవ్వాడు Tom.

 ఇంకా ఆగకుండా చెప్పాడు ...!

"Kay నీతో ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా..Don చనిపోయినతర్వాత ,Michael ని చంపడానికి ఒక కుట్ర జరిగింది.దానికి రూపకర్త ఎవరో తెలుసా ..Tessio.కాబట్టే అతడిని అంతమొందించవలసిన అవసరం ఏర్పడింది.Carlo ని కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే తీసేయవలసి వచ్చింది.ఒక వేళ Michael వాళ్ళని క్షమించినా ,వాళ్ళు Michael ని క్షమించే మనుషులు కారు.

ఏదో ఓ రోజున Michael కి హాని కలిగించడానికే వాళ్ళు మొగ్గు చూపుతారు.నిజానికి Tessio అంటే కూడా అతనికి చాలా ఇష్టం.అలాగే తన సోదరి కూడా..! కాని ఆమె భర్త Carlo ని గాని అలాగే Tessio ని గాని బ్రతకనిచ్చినట్లయితే వారి చేతిలో Michael ఒక్కడికే కాదు,నీకు ..మీ పిల్లలకు కూడా ప్రాణ హానే.అంతదాకా ఎందుకు Michael మీద ఆధారపడిన మనుషులు ఎంతమంది ఉన్నారో అంతమంది అదే స్థితి లోకి నెట్టబడతారు.ఇంతమందిని సమ్రక్షించుకోవడానికే Michael వాళ్ళిద్దర్నీ చంపవలసి వచ్చింది." పూసగుచ్చినట్లుగా చెప్పాడు Tom.

"ఇదంతా Michael నాతో చెప్పమన్నాడా.." అడిగింది Kay.

" నేను ఇప్పుడు చెప్పినవన్నీ అతనికి గానీ చెపితే నేను చచ్చానే..అయితే ఒకటి ,నువు నీ పిల్లల్ని  సక్రమంగా చూసుకున్నంత కాలం నీ కిష్టమైన అన్ని పనులు నువు చేయవచ్చు.దానికి అతను అడ్డు చెప్పడు.ఒక్క మాటలో చెప్పాలంటే You're his Don. ఇది మాత్రం చెప్పమన్నాడు." నవ్వుతూ అన్నాడు Tom Hagen .

 ఆ తర్వాత అయిదు నిమిషాలకి ఆమె అడిగింది...!

" సరే..నీ కారు లో పిల్లల్ని,నన్ను న్యూయార్క్ కి తీసుకువెళతావా " అని.

" అసలు నేను వచ్చిన పనే అది గదా" చెప్పాడు Tom.

*  *
నిశ్శబ్దం ని చీల్చుతూ చర్చ్ లో గంట లయబద్ధంగా మోగింది.Kay ఇప్పుడు ఆ చర్చ్ లో మోకరిల్లి ఉన్నది.ఆమె నోటిలో ఉంచిన Papery thin wafer ని చప్పరించింది.పాప ప్రక్షాళన అనుభూతి పొందింది.ఆమె Michael యొక్క ఆత్మ రక్షణార్ధం ఇపుడు ప్రార్దించింది.ఇపుడు హృదయం అన్నిటినుంచి విముక్తి పొందినట్లుగా తోచింది Kay Adams Corleone కి..!

(సమాప్తం)-- KVVS Murthy

(Note: I sincerely dedicated this effort of translation to my Grand Father Late.Sri Bhumhyavarapu Venkata Narasaiah who made me known the real value of reading)